Saturday, August 18, 2007

శ్రీరామ నామాలు శతకోటి .....

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....

శ్రీరామ నామాలు శతకోటి .....
ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి .....

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు .....
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు ..... కమనీయుడు

శ్రీరామ నామాలు శతకోటి .....
ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి .....

సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు .....
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు
కోతిమూకలతో ..... ఆ ఆ ఆ
కోతిమూకలతో లంక పై దండెత్తు కోదండరామయ్య రణధీరుడు ..... రణధీరుడు

శ్రీరామ నామాలు శతకోటి .....
ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి .....

పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు .....
పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు ..... అఖిలాత్ముడు

శ్రీరామ నామాలు శతకోటి .....
ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి .....

సినిమా : మీనా
సంగీతం : రమేష్ నాయుడు
గానం : పి.సుశీల గారు

విజయనిర్మల దర్శకత్వం వహించిన మొదటి సినిమా. సినిమా నేను చూడలేదు కానీ ఈ సినిమా తీసింది యద్దనపూడి సులోచనారాణి గారి నవల మీనా ఆధారంగా. సాధారణంగా నవలని సినిమాగా తీసేటప్పుడు చాలా మార్పులు చేస్తారు. నవల నచ్చినవారికి సాధారణంగా సినిమా నచ్చదు. కానీ ఈ సినిమాని యథాతథంగా తీసిందట విజయనిర్మల. అందుకే సినిమా కూడా బావుంటుంది అని అన్నారు. చూడాలి ఎప్పుడో.

మీనా నవల నాకు చాలా బాగా నచ్చిన నవల. ఇందుకు నచ్చింది అని చెప్పటం కష్టం. బహుశా పల్లెటూరి వాతావరణం. అందులో హీరో హీరోయిన్లు చాలా సాధారణమైనవారు కావటం, ఏమో ఇదీ అని చెప్పటం కష్టమే. కానీ నాకు ఎంత బాగా నచ్చిన నవలంటే ఇప్పటికి పదుల సంఖ్యలో చదివుంటాను. చదివీ చదివీ మా ఇంటి పుస్తక భాండాగారంలొ ఆ పుస్తకం చిరిగింది కూడా. :)

ఈ సినిమాలో పాటలు అన్నీ బావుంటాయి. ముఖ్యంగా మల్లెతీగవంటిది పాట చాలా అర్థవంతమైన పాట. దాని గురించి ఇంకోసారి.

2 comments:

నిషిగంధ said...

నేను మీనా సినిమా నవల చదివిన తర్వాతే చూశాను.. నవల్లో లాగా చిత్రికరించలేదన్న భావన ఎక్కడా కలగలేదు.. నాకెందుకో విజయనిర్మల అంతగా నచ్చదు.. కానీ 'మీనా' కి తను చేసినంత న్యాయం ఇంకే హీరోయిన్ చేయలేదనిపించింది.. కదా!

పద్మ said...

నాకూనూ. అస్సలు నచ్చదు విజయనిర్మల. ఒక్క సినిమా కూడా గుర్తు రావటంలేదు పర్వాలేదు బానే ఉంది అని అనుకోవటానికి. నోరు తెరవకుండా నుంచుంటుంది కాబట్టి పాండురంగ మహత్యంలో పర్వాలేదేమో, అదీ జయ కృష్ణా ముకుందా మురారి పాటలో. మీనా సంగతి చెప్పలేను ఎందుకంటే నేనింకా ఆ సినిమా చూడలేదుగా. కానీ, మీనా చదివినప్పుడల్లా ఇలా ఉంటుంది నిజంగా జరిగితే అని ఊహించేదాన్ని. నా ఊహలకి ఏమాత్రం న్యాయం చేసిందో చూడాలి. :)