Wednesday, August 8, 2007

ఫెడీఈఈఈఈఈ

నాకెందుకో దేవుడు లేడు అనేవాళ్ళని ఫెడీమని ఒక్కటిచ్చుకోవాలనిపిస్తుంది. వాళ్ళు కన్న ఇద్దరు ముగ్గురు పిల్లలనే సవ్యంగా పెంచటం చేతకాదు. కానీ ఇన్ని కోట్ల మందిని సృష్టించి పంచ భూతాల ద్వారా సహజమైన వనరులనిచ్చి ఏది ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించుకునే బుధ్ధినిచ్చి ఎంత చేసినా ఆయన ఉనికినే ప్రశ్నిస్తున్నారంటే ..... హ్మ్మ్మ్. కొంతమంది ఉంటారు. దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోరు మరి సృష్టి ఎలా నడుస్తోందయ్యా అంటే ఏదో బలీయమైన శక్తి ఉంది అంటారు. సరే. ఆ శక్తే దేవుడు అనుకోవచ్చు కదా అంటే. అబ్బెబ్బే!!! దేవుడు లేడు అంటారు. మరి ఆ బలీయమైనదేమిటయ్యా అంటే ఏదో శక్తి. సరే!!! శక్తి అంటే అమ్మవారే కదా, ఆ బలీయమైన శక్తి అమ్మవారు అనుకోవచ్చు కదా అంటే మళ్ళీ అబ్బెబ్బెబ్బే!!! మరి వాళ్ళకి దేవుడు అంటే విరక్తో దేవుడు అన్న పదం అంటే విరక్తో నాకు అర్థం కాదు. ఇదిగో ఇలాంటివాళ్లని చూస్తేనే ఫెడీమని ఒక్కటిచ్చుకో బుధ్ధి వేస్తుంది.

1 comment:

Anonymous said...

దేవుడు అనేది మనిషులను ఓ పద్ధతిలో పెట్టడానికి సొసైటీలోని మేధావులు కల్పించిన గొప్ప ఆలోచన. వున్నాడని నమ్మితే చెడేది పోయేది ఏదీ లేదు.
" I pity atheists.. ultimately when they want to thank someone, they find none" ( to accept their thanks) :))