Monday, December 26, 2011

నా ఒక్క పాయింటు ప్రశ్నకి నీహారిక గారిచ్చిన పది పాయింట్ల రిప్లై కి నా సమాధానం.

నీహారిక గారు రమణ గారి బ్లాగ్‌లో ఒక వర్ణం/వర్గం మీద కొన్ని అభియోగాలు మోపారు.

http://yaramana.blogspot.com/2011/12/blog-post_21.html

వాటి మీద నేనడిగిన కొన్ని ప్రశ్నలకి వారి గూగుల్ ప్లస్ లో సమాధానమిచ్చారు. కానీ నా దృష్టిలో ప్లస్‌లు, ఫేస్‌బుక్‌లు స్నేహితులతో మాత్రమే పంచుకోదగ్గవి కాబట్టి నాకు ఆవిడతో ఎటువంటి పరిచయం లేదు కాబట్టి, ఆవిడ లేవనెత్తిన విషయమూ, ఆవిడ చేసిన/మోపిన అభియోగాలు పబ్లిక్ డిస్కషన్‌కి తప్ప ఆవిడ పర్సనల్ స్పేస్ అయిన ప్లస్‌లో డిస్కస్ చేసేవి కాదు కాబట్టి నా బ్లాగ్‌లో సమాధానం ఇస్తున్నాను.

1. "రాజు గారి పెద్ద భార్య మంచిది అంటే మిగతా వాళ్ళు చెడ్డ వాళ్ళనా అర్ధం ?"
సందర్భాన్ని బట్టి తప్పకుండానూ. కాంక్రీట్‌గా ఇదీ అననప్పుడు, ఎవరైనా ఏదైనా ఊహించుకోవచ్చు. ఊహలల్లుకోవడనికి ఏముంది చెప్పండి. సీత ముమైత్ ఖాన్‌లా నవ్వబట్టే రావణాసురుడు సీతని ఎత్తుకెళ్ళాడు అని మీరు ఊహాలు/కథలు అల్లేశారు ఆ మధ్య. మీకు తెలియనిదా? :)

2. "పగ అన్నది ఎందుకు వాడానో తెలియాలంటే మీరు 100% లవ్ సినిమా చూడాలి. ఆ సినిమాలో ఒక రెండేళ్ళ పిల్లవాడు ముద్దుగా "రెండేళ్ళ పగక్కా" అని అంటాడు. ఆ సినిమా లో డైలాగ్స్ అవి... వాటికి ట్రూ మీనింగ్ తీసుకోనవసరం లేదు. పైన రెండు కమెంట్స్ రమణ గారికి.. మూడవది లేఖిని గారికి వ్రాసినది. నా నుండి జనాలు అటువంటి కమెంట్స్ ఆశిస్తారు కాబట్టి ఆ తరహా కమెంట్స్ చేయవలసి వచ్చింది. "

మీరో, మరొకరో, ఇంకొకరో ఏది ఎందుకు అన్నారో తెలుసుకోవటానికి రిలీజ్ అయిన అడ్డమైన సినిమా చూడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ట్రూ మీనింగ్ తీసుకోకూడదు అని మీరనుకున్నప్పుడు ఒక డిస్క్లైమర్ పెట్టాలి. ప్రతీ గడ్డీ గాదం సినిమాలు చూడని నాలాంటివాళ్ళకి కాస్త తెలుస్తుంది.
ఒక వర్ణాన్ని పట్టుకుని అంత తీవ్రంగా పగ తీర్చుకుంటాను, చిన్నపిల్లలు కూడా ఇలా పగ తీర్చుకోవచ్చు అని తెలుసుకునేలా పగ తీర్చుకుంటాను అని స్టేట్మెంట్స్ ఇచ్చి చివరికి అబ్బే తూచ్ జనాలు నా నించి అటువంటివి ఆశిస్తారు కాబట్టి ఆ తరహా కామెంట్స్ చేయవలసి వచ్చింది అని అనటం మీకు కరెక్ట్ అనిపిస్తోందా అసలు? మీ నించి అంత చీప్ కామెంట్స్ ఆశిస్తారా జనాలు? సీరియస్లీ?

"3. నా తెలివితేటలు, ధైర్యం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నా కమెంట్స్, నా బ్లాగ్ చెపుతాయి, వీలుంటే చూడవచ్చు."

మీ కమెంట్స్ గురించి పైన ఆల్రెడీ నా అభిప్రాయం చెప్పాను. ఇక బ్లాగ్ అంటారా. I wish I could but I am sorryమీవి కొన్ని పోస్ట్శ్ చూశాక ఇంక చూడటం అనవసరం అనిపించింది. అయినా మీరు ప్రస్తుతం మాట్లాడే విధానాన్ని బట్టి మీ గురించి ఒక అభిప్రాయానికి రాగలను కానీ మీ కామెంట్స్, బ్లాగ్ ఫాలో అయి మీ గురించి తెలుసుకోవాలంటారా? ఎవరైనా ఒక పోస్ట్ వేసినా, కామెంట్ చేసినా దాని మీద నా కామెంట్ ఉంటుంది కానీ వారి గత పోస్టులు, కామెంట్స్‌ని బట్టి కాదు.

"4.నాకున్న పరిశీలన మరియు భగవద్గీత ఆధారంగా బ్రాహ్మణులకి గ్రహణశక్తి, ధారణా శక్తి, పునశ్చరణ శక్తి ఎక్కువ గా ఉన్నట్లు నేను గమనించాను. అంత మాత్రాన అందరూ అలా ఉండాలని రూలు లేదు. అమృతం అంతా దేవతలు తాగేస్తే రాక్షసులు ఏం చేసారు? వాళ్ళకున్న ఆలోచనా శక్తితో దేవతలతో రాక్షసులు వివాహం చేసుకుని చ్రొస్స్ బ్రీదింగ్ వల్ల కొందరు రాక్షసులు దేవతలు అయ్యారు. అలాగే ఈ బ్రాహ్మణులు కూడా సత్వ గుణం తోనే ఉండాలన్న రూల్ లేదు. "

"బ్రాహ్మణులు అందరూ సత్వగుణంతో ఉండాలన్న రూల్ లేదు." అసలలాంటి రూల్ ఉందని ఎవరన్నారు? ఇది కూడా మళ్ళీ మీ ఊహ? సత్వగుణమే కాదు వీరగుణం కూడా అదే పాళ్ళల్లో చూపించగలరు అవసరం వస్తే. బ్రాహ్మణులు కూడా రజస్తమో గుణాలకి అతీతులు కారు. నేను రమణ గారి బ్లాగ్‌లో చెప్పినట్టు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన, పొందే అర్హత కలిగిన కుటుంబంలో పుడితే ఆ జ్ఞానం వృద్ధిపొందే అవకాశం ఎక్కువ ఆ జ్ఞానానికి సంబంధించిన కొన్ని శక్తులు సహజంగా అలవడతాయి. పైన మీరు చెప్పారే అలాంటివి కొన్ని. ఉపయోగించుకున్నవారు బాగు పడతారు. లేదూ, షరా మామూలే. అంతే కానీ బ్రాహ్మణుడుగా పుట్టినవాడు బై డీఫాల్ట్ గొప్పవాడని ఎవరూ అనలేదు ఏ శాస్త్రమూ చెప్పలేదు.

"5.బ్రాహ్మణులు గొప్పవారని మమ్మల్ని తక్కువ గా చూస్తున్నారని ఇక్కడే ఉన్న దళితులు కొందరు వాదించటం నేను చూస్తున్నాను. నిజానికి కొందరు ముస్లింలు, కొందరు దళితులు అని చెప్పుకునే వారు ఎంతో చక్కటి తెలుగుతో చక్కగా వ్రాస్తారు. కానీ వాళ్ళంత గా వాళ్ళు చెప్పుకుంటేనే వాళ్ళు దళితులని మనకి తెలిసింది. వాళ్ళు చెప్పకపోతే మనకి తెలిసే అవకాశమే లేదు. అటువంటప్పుడు చిన్నచూపు ఎక్కడ ??"

కదా. ఇప్పుడు ఈ మాట అంటున్నారంటే అక్కడ రమణగారి బ్లాగ్‌లో బ్రాహ్మణుల మీద మీరు చేసిన వ్యాఖ్యని మీరే ఖండించుకున్నట్టు కదా?

"6.ఎదుటి మనిషి శత్రువైనా వాళ్ళ గొప్పతనం ఒప్పుకోవడం క్షత్రియ ధర్మం , మేము క్షత్రియులమైనప్పుడు ముందు క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించిన తరువాతనే బ్రాహ్మణ ధర్మానికి వెళ్ళగలుగుతాను కానీ ముందుగా వెళ్ళలేను. అందుకే మా ఆయనని కూడా ధ్యానం వద్దు రాజకీయం ముద్దు అని పోరుతున్నాను. "

మీరు చెప్పినది క్షత్రియధర్మం కాదండి. అది సనాతన ధర్మం. ఏ వర్ణానికి చెందినవాడైనా పాటించవలసిన ధర్మం. మీరు ప్రత్యేకంగా బ్రాహ్మణధర్మానికి వెళ్ళనక్కరలేదు. మీ క్షత్రియ ధర్మం సరిగ్గా నిర్వహిస్తే చాలు. ప్రజలని పాలించే అవకాశం ఉంటుందని రాజకీయాల్లోకి వెళ్ళటమే క్షత్రియ ధర్మం అని మీ ఉద్దేశమా? రాముడు రాజుగా లేకుండానే చాలా రాజధర్మాలు నిర్వహించాడు. రాముడితో పోలుస్తున్నాననుకుంటున్నారేమో. ఆ తప్పు నేనెప్పటికీ చెయ్యను. ఉదాహరణ చెప్తున్నానంతే. బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రాన బై డీఫాల్ట్ బ్రహ్మజ్ఞాని ఎలా అవరో క్షత్రియుడిగా పుట్టినంత మాత్రాన ఎవరూ రాజవరు. అవ్వాల్సిన అవసరమూ లేదు. ఆ ధర్మం నెరవేర్చాలంటే మీ చుట్టూ ఉన్నవారికి నాయకురాలవటానికి ప్రయత్నించండి. కష్మీర్లు, అయోధ్యలూ తర్వాత.

"7.నేను చెప్పింది నా ఫిలాసఫీ మాత్రమే !! సైన్స్ కాదు. సైన్స్ అయితే అందరూ ఆమోదించవలసి ఉంటుంది. ఇక్కడ నా అభిప్రాయంతో అందరూ ఏకీభవించనవసరం లేదు."

ఏకీభవించటం చాలా పై మాట. ముందు ఏకెయ్యకుండా ఉండే అభిప్రాయాలు వెలిబుచ్చండి. మీ అభిప్రాయం ఏదైనా మీరు ఒక పబ్లిక్ ప్లేస్‌లో బ్లాగ్ అవచ్చు మరోటి అవ్వచ్చు ఒక వ్యక్తిని కాక ఒక సమూహాన్ని ఒక వర్గాన్ని అనేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి. రాజు/నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఇది. మాట తూలకపోవటం.

"8.ఇస్లాం ఎడారుల్లో పుట్టింది అక్కడ ధాన్యం దొరకదు కాబట్టి జీవహింస చేయవచ్చు అన్నారు. బౌద్ధం పుట్టినచోట ధాన్యం దొరుకుతుంది కాబట్టి జీవహింస చేయరాదు అన్నారు. ఒక బ్రాహ్మణుడిని ఎడారిలోకి తీసుకెళ్ళిపోయామనుకోండి అక్కడ ఏమీ దొరక్క పోతే ఏం తింటాడు ? నేను బ్రాహ్మణుడిని కాబట్టి మాంసం తినను అంటాడా ? పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి. "

నిజంగా? పరిస్థితులని బట్టి సర్దుకుపోవాలా? శత్రువు కాలిని నాకితే ప్రాణభిక్ష పెడతాను అని పట్టుబడ్డ రాజుతో అంటే ఆ రాజేం చేస్తాడండి? శత్రువు కాళ్ళు నాకుతాడా? అదా "క్షత్రియ ధర్మం" ? నాకు తెలిసి ప్రాణం పోయినా దేశ మర్యాదనీ, పౌరుషాన్ని వదులుకోడు. క్షత్రియుల్లో కూడా రకాలున్నారా? బతికి బట్ట కడితే తర్వాత "పగ" తీర్చుకోవచ్చు అనుకుని ప్రాణం కోసం శత్రువు కాళ్ళు నాకేవాడు నా దృష్టిలో క్షత్రియుడు కాదు, నాయకుడు కాదు. కేవలం నక్కజిత్తుల వాడు. అలానే బతకటం కోసం మాత్రం ఇష్టం లేకపోయినా మాంసం తింటాను అనేవాడు బ్రాహ్మణుడు కాలేడు. బతికేది బ్రహ్మజ్ఞానం కోసమనీ, ఆ బతుకు బతకటానికి తింటాం తప్ప తినటానికి బ్రతకటం లేదని తెలియని వాడు బ్రాహ్మణుడే కాదు మనిషే కాదు.

"9.ఎడారుల్లో యుద్ధాలు ఎక్కువ , మగవారు ఎక్కువ సంఖ్యలో మరణిస్తారు కాబట్టి... ఒక మగవాడు ఎందరు స్త్రీలనైనా వివాహమాడవచ్చు అని ఇస్లాం లో చెప్పారు. ఒక స్త్రీ ఒకరినే వివాహమాడాలని హిందూ మతం చెపుతుంది. ఇపుడు ఒక స్త్రీ కి ఎన్ని సార్లు అయినా ప్రేమ పుట్టవచ్చు, స్నేహం కాదు ప్రేమ కాదు, మరోకటేదో ఉందని ముందు చెప్పిన సిద్ధాంతం కాదన్నారనుకోండి వళ్ళు మండుతుంది. అపుడు మత ఘర్షణలు జరుగుతాయి. బలం, బలగం ఉన్నాయనుకోండి మసీదు కూల్చేస్తారు, మా మతమే గొప్ప అని అంటారు. రాముడు చేయనిది రాముడి పేరు మీద వీళ్ళు చేస్తారు. ఎవరు నష్టపోయేది ? "

మీ లాజిక్కులు చాలా బావున్నాయి, నవ్వుకోటానికి. :) హిందూ మతం గురించి ముందు మీరు కాస్త తెలుసుకోవాలి. హిందూ మతం ఎప్పుడూ ఇలా చెయ్యాలి అలానే చెయ్యాలి అని చెప్పదండి. ఏది ఎలా ఎందుకు చేస్తే మంచిదో చెప్తుంది. అంతే. హిందూ ధర్మాన్ని పాటించేవాడు ఆ రకంగా చేస్తారు అంతే. అలానే ఒకరినే వివాహమాడాలన్న విషయం కూడా. ఎందుకంటే అలా ఒకరికి ఒక్కరే అయినప్పుడు కుటుంబం స్థిరంగా ఉంటుంది. కుటుంబ స్థిరత్వం సమాజ స్థిరత్వానికి, శ్రేయస్సుకి దోహదం చేస్తుంది. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమైనప్పుడు దేశం ఎలా ఉంటుందో చూస్తున్నాం కదా?
అయినా స్త్రీ ఒకరినే వివాహమాడాలని. లేదంటే వళ్ళు మండి మతఘర్షణలు జరుగుతాయని ఏ రకంగా లింకు పెట్టారు మీరు. శోభాడే నాకు తెలిసి ముగ్గురిని పెళ్ళి చేసుకుంది. ఎన్ని మతఘర్షణలు జరిగాయండి? ఏవైనా రెండు విషయాలు ముడిపెడుతున్నప్పుడు ఆ రెంటికీ కాస్త సామ్యం ఉండాలని మీకనిపించటం లేదు?

"10.మార్పు ఎపుడు మొదలైనా కొత్త ఆలోచనలను హేళన చేయటం, హింసాత్మకంగా ఎదురు తిరగడం, తర్కరహితంగా ప్రశ్నించడం, చివరగా తప్పదు కాబట్టి అంగీకరించడం జరుగుతాయి. కులం, గుణం, మతం ప్రాతిపదికగా కాకుండా మనిషి ఎంత కష్టపడితే అంత సుఖాన్ని కోరుకోవాలి, ఒకరి స్వేచ్చని హరించే హక్కు ఎవరికీ లేదు. సమసమాజం అంటే పైనున్న వాళ్ళని క్రిందికి లాగడం కాదు, క్రింద నున్న వారిలో productivity ని పెంచడం."

ఇదసలు పాయింట్ ఆఫ్ డిస్కషన్‌కి ఏమాత్రం సంబంధించనిది. కానీ బానే చెప్పారు. కానీ ఎందుకు చెప్పారు? ఇవన్నీ మీ సొంత స్టేట్మెంట్స్ కావు కదా? సమసమాజం స్టేట్మెంట్ తక్క? ఇంతకీ కిందవారిలో productivity పెంచితే సమసమాజం వచ్చేస్తుందా? productivityతక్కువయి కిందన ఉన్నారంటారా? ఒకవేళ కొంతమందికి ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి రానట్టు కొంతమందికి ఎంత నేర్పినా పని రాదు, వాళ్ళ productivity పెరగదు. మరి అప్పుడు? సమసమాజం అనగా పైనా కిందా తారతమ్యం లేకుండా not based on the productivity ప్రతి ఒక్కరు సమాజంలో సమమైన స్థానాన్ని పొందటం.

ఇకనించి జనాలు మీ నించి ఎటువంటి కమెంట్స్ ఆశిస్తారు అని కాకుండా కాస్త జ్ఞానవంతమైన వ్యాఖ్యలు చెయ్యగలరని ఆశిస్తున్నాను. మనిషిగా పుట్టినందుకు (ఏ వర్ణమైనా) జ్ఞానసముపార్జన ముఖ్యం కదండి మరి. :)

ఇంతకీ మీరు రమణగారి బ్లాగ్‌లో కమెంట్స్ ఎందుకు తీసేశారు నీహారిక గారూ?