Monday, October 29, 2007

జగదభిరాముడు శ్రీరాముడే

జయ జయ రామ్ జయ రఘురామ్
జయ జయ రామ్ జయ రఘురామ్

జగదభిరాముడు శ్రీరాముడే రఘుకులసోముడు ఆ రాముడే .....
జగదభిరాముడు శ్రీరాముడే రఘుకులసోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే .....
జనకుని మాటల తలపై నిలిపి తన సుఖముల విడి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు
జగదభిరాముడు శ్రీరాముడే

కరమున ధనువు శరములు దాలిచి .....
కరమున ధనువు .....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కరమున ధనువు శరములు దాలిచి
ఇరువది చేతుల దొరనే గూలిచి సురలను గాచిన వీరాధివీరుడు

జగదభిరాముడు శ్రీరాముడే

ఆలుమగల అనురాగాలకు .....
ఆలుమగల అనురాగాలకు పోలిక సీతారాములె అనగా .....
పోలిక సీతారాములె అనగా వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు

జగదభిరాముడు శ్రీరాముడే

ఆ ఆ ఆ ఆ ఆ

నిరతము ధర్మము నెరపి నిలిపి
ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిరతము ధర్మము నెరపి నిలిపి నరులకు సురలకు తరతరాలకు ఒరవడి అయిన వర యుగపురుషుడు

జగదభిరాముడు శ్రీరాముడే

ఇనకుల మణి సరితూగే తనయుడు, అన్నయు, ప్రభువు లేనే లేడని
ఇనకుల మణి సరితూగే తనయుడు, అన్నయు, ప్రభువు లేనే లేడని
జనులు భజించే పురుషోత్తముడు

జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే

జయ జయ రామ్ జయ రఘురామ్
జయ జయ రామ్ జయ రఘురామ్
జయ జయ రామ్ జయ రఘురామ్
జయ జయ రామ్ జయ రఘురామ్

నిజంగా రాముడికి సరితూగే కొడుకు, అన్న, రాజు, భర్త ఎక్కడున్నారు? ఊహూ. అటువంటి పురుషోత్తముడు అన్ని యుగాలకి ఆయనొక్కడే.

లవకుశ

కొన్ని రోజులు హేమంతాలకి కామా పెట్టి శరత్తులని చూద్దామనుకుంటున్నాను. ఎంచక్కా నాకిష్టమైన లవకుశ పాటలు పోస్ట్ చెయ్యదలచుకున్నాను. లవకుశుల ఎంట్రీ నించి అయోధ్యలో రామాయణం కంప్లీట్ చేసేవరకు అన్ని పాటలు పోస్ట్ చేద్దామని సంకల్పం.

లవకుశ - 1963
సంగీతం : ఘంటసాల గారు
గానం : పి.లీల గారు, పి.సుశీల గారు

Saturday, October 27, 2007

నువ్వు

బాధ పెట్టేది నువ్వు
ఓదార్చేది నువ్వు
ప్రేమని కలిగించేది నువ్వు
ఆ ప్రేమకి మరణాన్ని శాసించేది నువ్వు
జీవితం మీద ఆశ కల్పించేది నువ్వు
మరుక్షణం విరక్తి కలిగించేది నువ్వే
శరత్కాలంలా వస్తావు నన్ను శిశిరాన్ని చేస్తావు
ఈ దోబూచులాట ఇక చాలు నేస్తం
నన్ను వసంతాన్ని చూడనీ

Wednesday, October 24, 2007

నిత్య నూతనం ..... నిత్య సత్యం

కలువకు చంద్రుడు ఎంతో దూరం పాటలో ప్రతీ చరణం గురించి ఒక పేరా రాయచ్చేమో. ఈ పాట రెండు పాత పాటలనించి ఇన్స్పిరేషన్ పొందినట్టనిపిస్తుంది. ఒకటి మాయాబజార్‌లో నీకోసమే నే జీవించునది పాటలో "విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా", రెండు మూగమనసులులో పాడుతా తీయగా చల్లగా. ఈ రెండు పాటల నించి ఇన్‌స్పైర్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ పాట చరణాలు నిత్యసత్యాలు.

1.) ఏ నవ్వు ఒక్కరకంగా ఉండదు, పసిపిల్లల బోసినవ్వులు తప్ప. నవ్వటం ఒక వరం అన్నారు పెద్దలు. కానీ ఎంతమందికి ఆ వరం దొరికుంటుంది? నేను కొంతమందిని చూశాను. పక్కవాళ్ళని చూసి నవ్వితే ఎక్కడ చుట్టుకుపోతారో అని ఎప్పుడు మొహం మటమటలాడించుకునేవాళ్ళని బోలెడు మందిని చూశాను. జాలేస్తుంది పాపం వాళ్ళని చూస్తే. కలిమిలేములని, కష్టసుఖాలని మరిపించి అందరినీ స్నేహితులని చేసే చిరునవ్వు విలువ తెలీదు పాపం పిచ్చిమొహాలు. :)


2.) వలపు కన్నా తలపే తీయన. ప్రేమలో పడ్డవాళ్ళందరూ కెవ్వుమనాలా ఇప్పుడు? :) కానీ నిజమే వలపులో ఉన్నవారు దూరం అవవచ్చునేమో కానీ తలపులో ఉన్నవారెప్పుడు మాసిపోరు. ఆ తలపులలో వారు నిత్య యౌవనులు.

మనిషికి రేపు మీద ఉండే ఆశ ఆ రేపుని ఎంతో తియ్యగా చేస్తుంది. నేటిలో ఉన్న దు:ఖం ఆచూకీ రేపటితో మాయం అవుతుందనీ, కన్న కలలన్నీ నిజం అవుతాయనీ, కష్టాలన్నీ తీరిపోతాయనీ మనిషి ఆ రేపు మీద పెట్టుకున్న ఆశే ఆ రేపుని మరింత తీయగా, మరీ మరీ ఎదురు చూసేలా చేస్తుంది. ఆ రేపులో అనుకున్నవి తీరకపోయినా, ఆ మరుసటిరోజు ఇంకా తీయగా కనిపిస్తుంది. అనంతకాల చక్రభ్రమణంలో మనిషి ఆశ కూడా ఆ రేపు చుట్టూ చక్రభ్రమణం చేస్తూనే ఉంటుంది.


3.) మనసు లేని మనిషి జంతువేగా. ఈ మాట కూడా తప్పేనేమో. ఎందుకంటే జంతువులకి కూడా మనసుంటుందని చాలా సంఘటనలు ఋజువు చేశాయి. కాబట్టి మనసులేని మనిషి జంతువు అని జంతువులని తక్కువ చెయ్యకూడదేమో. రాక్షసుడు అనుకుందామా? మనసు మనిషిని మనిషిగ చేస్తుంది ..... ఈ లైన్ చాలా నచ్చింది నాకు. వలపా మనసుకి అందాన్నిస్తుంది. ఎంత నిజం. ప్రేమ మనసుకి అందాన్నిస్తుంది. ఆత్మసౌందర్యం పెరగటం అంటే ఇదేనేమో. ప్రేమ అంటే ఆపోజిట్ సెక్స్ మీద ఏర్పడే ప్రేమ ఒకటే కాదు. మనిషిగా తోటి మనిషి మీద కలిగేదే ప్రేమ. ఆ ప్రేమ, మనసు లేని జీవితానికి విలువేముంది? మనసుతోటి ప్రేమ, ప్రేమతో అనుభూతి పుడతాయి. ఆ భగవంతుడిలా నిర్విచారంగా, నిర్వికారంగా, ఎటువంటి అనుభూతులు, భావావేశాలు లేని జీవితాన్ని ఊహించగలమా? ప్రేమ ఒక రసానుభూతి. ఆ అనుభవం లేని జీవితం నిస్సారం. ఆ ప్రేమ మనిషికే సొంతం కాదు. భూమి మీద ఉన్న చరాచర జీవకోటికి అనుభవమే. లేకపోతే చంద్రుడి కోసం కలువ ఎందుకు ఎదురు చూస్తుంది? సూర్యోదయం అవగానే పద్మం ఎందుకు వికసిస్తుంది? కలువకి చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం కానీ వారి మధ్య ప్రేమ నిత్య నూతనం, నిత్య సత్యం.

Tuesday, October 23, 2007

కలువకు చంద్రుడు ఎంతో దూరం

కలువకు చంద్రుడు ఎంతో దూరం .....
కమలానికి సూర్యుడు మరీ దూరం .....

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ పెరుగును అనురాగం .....
దూరమైన కొలదీ పెరుగును అనురాగం
విరహంలోనే ఉన్నది అనుబంధం

కలువకు చంద్రుడు ఎంతో దూరం .....
కమలానికి సూర్యుడు మరీ దూరం .....

నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది
నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది
అది కలిమిలేములను మరిపిస్తుంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం .....
కమలానికి సూర్యుడు మరీ దూరం .....

వలపు కన్నా తలపే తీయనా
కలయిక కన్నా కలలే తీయనా
చూపులకన్నా ఎదురు చూపులే తీయనా
నేటి కన్నా రేపే తీయనా

కలువకు చంద్రుడు ఎంతో దూరం .....
కమలానికి సూర్యుడు మరీ దూరం .....

మనసు మనిషిని మనిషిగ చేస్తుంది
వలపా మనసుకు అందాన్నిస్తుంది
ఈ రెండూ లేక జీవితమేముంది
ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ పెరుగును అనురాగం .....
దూరమైన కొలదీ పెరుగును అనురాగం
విరహంలోనే ఉన్నది అనుబంధం

కలువకు చంద్రుడు ఎంతో దూరం .....
కమలానికి సూర్యుడు మరీ దూరం .....

సినిమా : చిల్లరదేవుళ్ళు
సాహిత్యం : అచార్య ఆత్రేయ గారు
సంగీతం : కె.వి.మహదేవన్ గారు
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం


ఆడియో : http://chimatamusic.com/otherHeroes.php

Monday, October 15, 2007

మల్లెతీగ ..... పందిరి

ఇదివరకు ఒక పోస్ట్‌లో చెప్పాను మీనా సినిమాలో పాటలు నాకు ఇష్టం అని. చాలా అర్థవంతమైన పాటలు, ముఖ్యంగా మల్లెతీగ వంటిది పాట. ఆ పాట మొదటి చరణంలో స్త్రీకి ఎప్పుడూ ఒక తోడూ నీడ ఉండాలి అని చెప్తూనే రెండో చరణంలో ఆమె గొప్పదనం వర్ణిస్తారు. జగతికి ఆధారం స్త్రీమూర్తి అని. ఎంత నిజం కదా. :)

మల్లెతీగ ..... పందిరి లేకుండా నిలవలేదు. అలాగే పందిరి కూడా. బోడి పందిరిని చూడబుధ్ధి అవుతుందా? అందుకే మల్లెతీగకి పందిరి ఆధారం, పందిరికి మల్లెతీగ అందం. రెండూ కలిసి ఉన్నచోట ఆ నీడలో ఉన్నవారికి ఆహ్లాదం. ఆడపిల్ల కూడా మల్లెతీగవంటిదే. అందుకే ఆమె జీవితానికి ఆధారం కావాలి, పందిరిలాంటి ఆధారం. ఆ ఆధారం దొరికితే అల్లుకుపోతుంది. ఎంతగా అంటే ఆ పందిరికే అందాన్నిచ్చేంత. ఆ పందిరి చిన్నతనంలో తల్లితండ్రులు, ఈడు వచ్చాక భర్త, వయసు మీరాక పిల్లలు. ఇది ఫెమినిస్టులు చదివితే కర్ర పుచ్చుకుంటారేమో. ;) అయినా సరే నేను స్త్రీ శారీరకంగా అసమాన బలవంతురాలు అని చెప్పాలనుకోవటం లేదు. స్త్రీ అక్షరాలా బలహీనురాలే, మల్లెతీగలాగానే. శారీరకంగా పురుషుడితో ఎప్పటికీ సమానురాలు కాలేదు. కరాటే గట్రా నేర్చుకుని కొంతమంది స్త్రీలు పురుషుడికన్నా బలవంతురాళ్ళు అయ్యారేమో కానీ ప్రకృతి పరంగా స్త్రీ సున్నితమైనది, సుకుమారురాలు. కానీ శారీరకంగా మాత్రమే. మానసికంగా స్త్రీ ' అసమాన బలవంతురాలు '. పురుషుడికి శారీరకమైన బలమే కానీ మానసికంగా స్త్రీకి ఉన్నంత శక్తి లేదు. అందుకే ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అన్న నానుడి వచ్చి ఉంటుంది. మగవాడే గొప్ప, ఆడదానిదే పై చేయి అని వాదనలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. స్త్రీ పురుషులు ఒకరు లేకుండా ఇంకొకరు మనగలరా? ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా సృష్టే లేదు. అలాంటప్పుడు ఇంక ఎవరు గొప్ప అన్న ప్రశ్నకి చోటెక్కడ? అందుకే భగవంతుడు ఇద్దరిలో ఏ ఒక్కరికి పరిపూర్ణత్వాన్ని ఇవ్వలేదేమో. స్త్రీ సుకుమారత్వాన్ని కాపాడటానికి అన్నివేళలా మగవాడి తోడు నీడా ఉండాలి. మగవాడి మొరటుదనాన్ని కప్పిపుచ్చటానికి స్త్రీ తోడు నీడా అన్నివేళలా ఉండాలి. ఏ ఒక్కరు లేకపోయినా రెండోవారు అసంపూర్ణులు. వారిద్దరు కలిస్తేనే వారికి పరిపూర్ణత, సృష్టికి సంపూర్ణత.

Sunday, October 14, 2007

మల్లెతీగ వంటిది మగువ జీవితం .....

మల్లెతీగ వంటిది మగువ జీవితం .....
మల్లెతీగ వంటిది మగువ జీవితం
చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను ..... అల్లుకుపోయేను .....

మల్లెతీగ వంటిది మగువ జీవితం .....

తల్లితండ్రుల ముద్దు మురిపెం చిన్నతనంలో కావాలి .....
తల్లితండ్రుల ముద్దు మురిపెం చిన్నతనంలో కావాలి
ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలము నిలవాలి .....
ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలము నిలవాలి
తల్లికి పిల్లల ఆదరణ పండు వయసులో కావాలి
ఆడవారికి అన్నివేళల తోడునీడ ఉండాలి ..... తోడూ నీడా ఉండాలి .....

మల్లెతీగ వంటిది మగువ జీవితం .....
చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను ..... అల్లుకుపోయేను .....

మల్లెతీగ వంటిది మగువ జీవితం .....

నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ .....
నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ
పిల్లల పాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి .....
పిల్లల పాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి
అనురాగంతో మనసును దోచే వనితే మమతల పంట
జన్మను ఇచ్చి జాతిని నిలిపే జననియే జగతికి ఆధారం ..... జననియే జగతికి ఆధారం .....

మల్లెతీగ వంటిది మగువ జీవితం .....
చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను ..... అల్లుకుపోయేను .....

మల్లెతీగ వంటిది మగువ జీవితం .....

సినిమా : మీనా
సాహిత్యం : తెలీదు :(
సంగీతం : రమేష్ నాయుడు గారు
గానం : పి.సుశీల గారు

Tuesday, October 2, 2007

ఎందరో వీరులు, వారేరీ?

ఈరోజు గాంధీ జయంతి. భారత్‌లో ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకి సెలవు. ఛ,ఒకరోజు ముందు వచ్చుంటే లాంగ్ వీకెండ్ వచ్చుండేది కదా అని అనుకోనివారెందరో వేళ్ళ మీద లెక్క పెట్టచ్చేమో. ఆగస్టు పదిహేనో తారీఖే హాలిడే కింద ట్రీట్ చేసి 'సరదా'గా టి.వి ముందో, పార్కులోనో, సినిమా హాళ్లలోనో, లేదా మందు నిషిధ్ధం కాబట్టి ముందు రోజే స్టాక్ చేసి పెట్టుకున్న బాటిల్స్ బైటికి తీసి ఖుషి ఖుషిగా గడిపే మనవాళ్ళకి అక్టోబర్ రెండు ఒక లెక్కా?

ఈ సెలవు కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. అసలు సెలవు ఎందుకివ్వాలి? ఇలా ఎంజాయ్ చెయ్యటానికా? భగత్‌సింగ్ ఎంతమందికి తెలుసు ఈ తరంలో? సుభాష్ చంద్ర బోస్ ఎంత మందికి తెలుసు? అల్లూరి సీతారామరాజు ఎంత మందికి తెలుసు? సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలిసిన వారెంతమంది? సెలవలు ఇవ్వకపోయినా కనీసం ఏ ప్రభుత్వానికయినా వీరి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? ఎప్పుడైనా ఉత్సవాలు జరిపారా? జలియన్‌వాలాబాగ్ ఉదంతం విని రగిలిపోయి తెల్లదొరల మీద కత్తి దూసి చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్ కథ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయే ఆ భగత్‌సింగ్ పుట్టినరోజు పక్కన పెడదాం, కనీసం ఆయన ఎవరో నా తరంలో ఎంతమందికి తెలుసు? కనీసం ప్రభుత్వాధికారులకి తెలుసా లేక కాలెండర్‌లో లేదు కాబట్టి వారికి కూడా తెలిసే అవకాశం లేదా? ఏ లైబ్రరీలోనో బూజు పట్టిన పుస్తకాలు వెతికితే తప్ప తెలియని విషయమా ఇది? సిగ్గుచేటు కదూ.

"ఎందరొ వీరుల త్యాగఫలం ఈనాటి స్వేఛ్చకే మూల దినం ....." చిన్నప్పుడు స్కూల్‌లో చదువుకున్న పాట. నిజమే. ఎంతోమంది వారి జీవితాలనే అర్పణ చేసి మనకోసం సంపాదించిపెట్టిన స్వాతంత్ర్యం. మనం మన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తామని, వారు లేకపోయినా వారి వారసులమైన మనం ఆ స్వేఛ్చా వాయువులని పీలుస్తూ అభివృధ్ధిని సాధిస్తామనీ కలలు కన్నారు. కానీ ఏదీ ఆ కల? మనకి ఆ మహానుభావుల పుట్టినరోజులు కాదు కదా పేర్లు కూడా తెలీవు స్మరించుకోవటానికి. నా దృష్టిలో వారు కన్న కలలు సాకారం అయ్యేవరకు ఈ పుట్టినరోజు సెలవులు ఉండకూడదు, ముఖ్యంగా ఆ సెలవు పైన చెప్పిన విధంగా ఎంజాయ్ చేసేటటువంటిదైతే. ప్రతి స్వాతంత్ర్యవీరుడిని వారి పుట్టినరోజు నాడు ప్రతి ఆఫీసులో, కాలేజీలలో, స్కూళ్ళల్లో స్మరించుకునేలా చెయ్యాలి. అంతే కానీ సెలవులిచ్చి అపహాస్యం చెయ్యకూడదు.

అలక

అల్లంత దూరాన నువ్వు
అడుగు దూరంలో నేను
అటు వైపు ఉప్పొంగే ప్రేమసాగరం
ఇటు వైపు ఆవేశపు అగ్నిపర్వతం
సాగరం చెలియలికట్ట దాటేదెప్పుడో
అలకలు తీరి ఆవేశం చల్లారేదెప్పుడో.

Monday, October 1, 2007

ఫనా షాయరీ

ఫనా సినిమాలో నాకు నచ్చిన షాయరీ

ఏ ఖుదా ఆజ్ యే ఫైస్లా కర్‌దే
ఉసే మేరా యా ముఝే ఉస్కా కర్‌దే
బహుత్ దుఖ్ సహే హే మైనే
కోయీ ఖుషీ అబ్ తో ముకద్దర్ కర్‌దే
బహొత్ ముష్కిల్ లగ్తా హై ఉస్సే దూర్ రెహ్‌నా
జుదాయీ కే సఫర్ కో కమ్ కర్‌దే
జిత్నా దూర్ చలే గయే వో ముజ్‌సే
ఉసే ఉత్నా కరీబ్ కర్‌దే
నహీ లిఖా అగర్ నసీబ్ మే ఉస్‌కా నామ్
తో ఖతమ్ కర్ యే జిందగి ఔర్ ముజే ఫనా కర్‌దే


---------------------------------------------------------------------------------

తేరే దిల్ మె మేరి సాసోన్ కో పనా మిల్‌జాయె
తేరే ఇష్క్ మె మేరి జాన్ ఫనా హోజాయె

---------------------------------------------------------------------------------

ఆగ్ సూరజ్ మె హోతీ హై
జల్నా ధర్తి కో పడ్‌తా హై
యే మొహబ్బత్ ఆంఖే కర్తి హై
తడప్‌నా దిల్‌కో పడ్‌తా హై

---------------------------------------------------------------------------------

ఆంఖే తో ప్యార్ మే దిల్‌కి జుబాన్ హోతి హై
సచ్చీ చాహత్ తో సదా బేజుబాన్ హోతి హై
ప్యార్ మే దర్ద్ భి మిలే తో క్యా ఘబ్‌రానా
సునా హై దర్ద్ సే చాహత్ ఔర్ జవాన్ హోతి హై

---------------------------------------------------------------------------------

దూర్ హమ్‌సే జాపావొగె కైసే
హమ్‌కో భూల్ పావొగె కైసే
హమ్ వో ఖుష్బూ జో సాన్‌సో మే ఉతర్ జాయే
ఖుద్ అప్నీ సాన్‌సో కో రోక్ పావొగె కైసే

---------------------------------------------------------------------------------

బేఖుది కీ జిందగి హమ్ జియా నహీ కర్తే
యూ కిసీకా జామ్ హమ్ పియా నహీ కర్తే
ఉన్‌సే కెహ్‌దో మొహబ్బత్ కా ఇజ్‌హార్ ఆకర్ ఖుద్ కరే

యూ కిసీకా పీఛా హమ్ నహీ కర్తే

---------------------------------------------------------------------------------
రోనేదే తూ ఆజ్ హమ్‌కోతో ఆంఖే సుజానే దే
బాహోమే లేలే ఔర్ ఖుద్ కో భీగ్ జానే దే
హే జో సీనే మే ఖైద్ దరియా వో చూట్ జాయేగా
హే ఇత్‌నా దర్ద్ కీ తెరా దామన్ భీగ్ జాయేగా

---------------------------------------------------------------------------------


తేరే దిల్ మే మేరి సాన్‌సో కో జగా మిల్‌జాయె
తేరే ఇష్క్ మే మేరి జాన్ ఫనా హోజాయె
అధూరి సాన్స్ థి ధడ్‌కన్ అధూరి థి అధూరే హమ్

మగర్ అబ్ చాంద్ పూరా హై ఫలక్ పే ఔర్ అబ్ పూరే హై హమ్