Friday, September 28, 2007

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

ఏమంత అందాలు కలవనీ ..... వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి ఉంది నీకనీ ..... మురిసేను నిన్ను తలచి
చదువా ..... పదవా ..... ఏముంది నీకు
తళుకు ..... కులుకు ..... లేవమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

ఏ నోము నోచావు నీవనీ ..... దొరికేను ఆ ప్రేమఫలము
ఏ దేవుడిస్తాడు నీకనీ ..... అరుదైన అంత వరము
మనసా వినవే మహ అందగాడు కనుకా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

సినిమా : శ్రీవారికి ప్రేమలేఖ
సంగీతం : రమేష్ నాయుడు గారు
సాహిత్యం : వేటూరి సుందరరామముర్తి గారు
గానం : ఎస్.జానకి గారు

నిన్నటి తరం హాస్య సినిమాలలో ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా ఇదేనేమో. శ్రీలక్ష్మి సినిమా పిచ్చి, సంగీత వంటల పిచ్చి, సుత్తి వీరభద్రరావు తిట్ల పిచ్చి వెరసి పిచ్చి సినిమా :) కానే కాదు. ఒక మంచి ఎంటర్‌టైనర్. జంధ్యాల సినిమాల్లో పాటలన్నీ బానే ఉంటాయి. ఆయన సినిమాలు చాలా వాటికి సంగీతం అందించింది రమేష్ నాయుడు గారే. రమేష్ నాయుడు గారు బాణీలు కట్టిన పాటలు అన్నీ ఏవిధమైన రణగొణధ్వనులు లేకుండా సున్నితంగా ఉంటాయి. దేవుడు చేసిన మనుషులు, మీనా, ముద్దమందారం, నాలుగు స్తంభాలాట, స్వయంకృషి, శివరంజని ..... లిస్ట్ గోస్ ఆన్. :)

ఈ సినిమాలో వైజాగ్ బ్యాక్‌డ్రాప్ బావుంటుంది. ముఖ్యంగా సముద్రం. ఎంతెంతెంత బావుంటుందో. :) నాకెందుకంత ఇష్టం సముద్రం అంటే చెప్పలేను కానీ బోలెడంత ఇష్టం. గంటలు గంటలు గడిపెయ్యగలను అలా చూస్తూ. చెన్నై మెరీనా, బాంబే జుహు ఇంకా అమెరికా బీచ్‌లు ఎన్ని చూసినా మన తెలుగు బీచ్‌కి సాటి రావు కదా. :p సముద్రం ఒకటే అయినా దానికి ప్రాంతీయత్వం అంటగట్టేస్తున్నాను, ఏం చేస్తాం నిన్నటి అరవ వాసన ఇంకా వదల్లేదు. :))))) మొన్నా మధ్య వెళ్ళిన హంసలదీవి కూడా. కృష్ణా నది సంగమం. ఎంత బావుందో. మాటల్లో చెప్పలేను. ఒక పక్క కృష్ణ, ఒక పక్క సముద్రం ఎంత స్పష్టంగా కనిపించిందో ఆ సంగమం. కృష్ణ ఉరుకులు పరుగులతో వచ్చి సముద్రంలో కలిసింది. అక్కడ ఎంతసేపు కూర్చున్నానో. వేణుగోపాలస్వామి గుడి మూసేస్తారని అమ్మానాన్న హెచ్చరిస్తే బలవంతాన బైల్దేరాను. ఆ గుడి గురించి ఇంకోసారి.

Thursday, September 27, 2007

నీకోసం

జనవరి నించి డిసెంబర్ దాకా
గ్రీష్మం నించి శిశిరం దాకా
తుషారాల హేమంతం నించి విరబూసే వసంతం వరకు
పగటి నించి రేయి దాకా
చంద్రోదయం నించి సూర్యోదయం వరకు
ప్రతి నిమిషం అందులో ప్రతి క్షణం
నా అలకలు, ఆలోచనలు, ఊహలు, ఉల్లాసాలు, భయాలు, ఆవేశాలు, సిగ్గు పూబంతులు, రోషాల కెంపులు అన్నీ నాకోసం పుట్టిన నీకోసం.

Saturday, September 22, 2007

సఖియా వివరించవే .....

ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆ

సఖియా వివరించవే .....

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా

సఖియా వివరించవే .....

నిన్ను జూచి కనులు చెదరి .....
కన్నె మనసు కానుక జేసి .....
నిన్ను జూచి కనులు చెదరి
కన్నె మనసు కానుక జేసి
మరువలేక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని

సఖియా వివరించవే .....

మల్లెపూలా మనసు దోచి

పిల్లగాలి వీచేవేళా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెపూలా మనసు దోచి
పిల్లగాలి వీచేవేళా
కలువరేని వెలుగులోన
సరసాల సరదాలు తీరేననీ

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే .....

సినిమా : నర్తనశాల
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తిగారు
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య గారు
గానం : పి.సుశీల గారు

నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఈ పాటకి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. ఈ పాటలో సావిత్రి, ఎస్వీ.రంగారావు గార్ల హావభావాలు నభూతోనభవిష్యతి.

Saturday, September 15, 2007

ప్రకృతి

ప్రకృతి రంగులు మార్చుకుంటోంది. ఇక ఒక రెండు నెలలు కళ్ళకి విందు. చెట్లు రంగులు మారటం ఒక అథ్భుతం. రకరకాల రంగులు, కంటికి ఆహ్లాదంగా ..... కానీ ఏం లాభం. ఇంకో రెండు నెలల్లో ఆ అందాలన్నీ కనుమరుగవుతాయి. ఆకులన్నీ రాలిపోయి మోడులు మిగులుతాయి. ఆకులు రాలిపోయే కాలం ముందర ఇలా ఆ రాలిపోయే ఆకులనే అందంగా ఎందుకు చూపిస్తుంది ప్రకృతి? మనిషి కూడా ఎప్పటికైనా గిట్టక తప్పదు. కానీ ఆ పోయే ముందు నలుగురికి ఆహ్లాదంగా ఉండే పనులు చెయ్యటం నేర్చుకొమ్మనా? ఏమో.

ప్రకృతి రంగులు మారుతుంటే, మారుస్తుంటే ఇంత బావుంది మరి మనిషి రంగులు మారుస్తుంటే? భరించగలమా?

Sunday, September 9, 2007

34 ఏళ్ళ అమ్మాయి 64 ఏళ్ళ అబ్బాయి - చీనీ న కమ్ న జ్యాదా

ఒక మంచి సినిమా చూశాను, చీనీ కమ్. బావుంది. ఎక్కడా బోర్ కొట్టలేదు. 34 ఏళ్ళ అమ్మాయి 64 ఏళ్ళ ' అబ్బాయి ' ప్రేమలో పడటం. ఆ తర్వాత పిల్ల తండ్రిని ఒప్పించి పెళ్ళి చేస్కోవటం. ఈ కథ ముందే తెలుసు నాకు. ఫస్ట్ రివ్యూ చదివినప్పుడు అనుకున్నాను అసలెలా తీయగలరు 64 ఏళ్ళ మనిషి 34 ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో పడగలగటం అని. కానీ ఎంత సహజంగా తీసారో. ఎక్కడా విసుగు అనిపించకుండా చక్కటి స్క్రీన్ ప్లే తో బాగా తీశారు. టబు, అమితాబ్ డైలాగ్స్ చిన్నవిగా క్రిస్పీగా ఉండి బాగా పేలాయి. పరేష్ రావల్ కి తెలిసినప్పుడు ఏవో భారీ డైలాగ్స్ ఉన్నాయి అని చదివాను. కానీ అలాంటివి ఏమీ లేవు. నాకైతే తెగ నచ్చేసింది. అమితాబ్ ఈజ్ టూ రొమాంటిక్. ఈ ఏజ్ లో కూడా చెయ్యగలిగాడంటే ..... సో ఈజ్ హీ ఎ లెజెండ్ :). ఒక చిన్నపిల్ల రోల్ ఉంది అమితాబ్ ఫ్రెండ్ అన్నమాట. బాగా చేసింది ఆ పిల్ల. ట్రాజెడీ ఏంటంటే ఆ పిల్ల చచ్చిపోతుంది ఎండ్ లో కానీ కనిపించిన కాసేపు బాగా చేసింది. తన డైలాగ్స్ కూడా క్రిస్పీ వన్ లైనర్స్. ఇళయరాజా ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది. సినిమా మొత్తం బిట్స్ ఎన్ పీసెస్లో వస్తుంది ఒక పాట. ఇదెక్కడో విన్నానే అని డౌట్ వచ్చింది వినగానే. ఇంతా చేస్తే అది మౌనరాగంలో పాట. మల్లెపూల చల్లగాలి మంట రేపే సందెవేళలో పాట. నాకెందుకో ఇళయరాజా పాటలు నచ్చవు. ఒకే మూస అనిపిస్తాయి. కొన్ని సినిమాలు ఎక్సెప్షన్. సాగరసంగమం, ప్రేమ, అభినందన, ఘర్షణ, స్వర్ణకమలం, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటివి. ఆయన తెలుగు సినిమాలు డైరెక్ట్ గా తీసినవి పర్వాలేదు కానీ ఆ అరవ డబ్బింగే అన్నీ ఒకే టైప్ అనిపిస్తాయి.

Friday, September 7, 2007

మాయాబజార్ ..... ఇంకోటింకోటింకోటి

దయచేయండి సవాములు దయచేసి రుచి చూడండి సవాములు
దయచేయండి సవాములు దయచేసి రుచి చూడండి సవాములు


స్వాములు అటు కాదు ఇటు చిత్తగించండి

గారెలు బూరెలు ఫేణీలు బోణీలు బొబ్బట్లు పాపట్లు జిలేబీలు
ఇవన్నీ భక్ష్యాలు
పులిహోర నలిహోర కలిహోర తలిహోర
ఇవన్నీ చిత్రాన్నాలు
బాదం పాయసం జీడిపప్పు పాయసం ఫలరసాలు మధురసాలు
ఇవన్నీ పానీయాలు
వంకాయ బెండకాయ బూడిద గుమ్మడికాయ
సరి సరి ఇవన్నీ కూరగాయలు

ఇంతకూ అసలు వంటకం ఏదయ్యా
ఓ అదా తెస్తాం తెస్తాం

ఆ ఆ ఆగండి ఏం తెస్తారు
అదే అదే నరమాంసం నరమాంసం
శివశివా శివశివా
మేవేమన్నా రాక్షసులమనుకున్నారటయ్యా
మరి మనుషులైతే ఏం కావాలో చెప్పండెహె
ఏమిటయ్యా చెప్పేది!!! పెళ్ళిపెద్దలంటూ సుధ్ధ మొద్దులు దొరికారు
నాగరీకుల భోజనంలో ఉండాల్సిన ముఖ్యపదార్ధమే లేదాయే

ఊరికే నస పెట్టక అదేదో చెప్పి చావండి.
ఏంటి చెప్పేది. గోంగూర శాకంబరీదేవి ప్రసాదం ఆంధ్రశాకం

ప్రభువులవారు ఇది లేనిదే ముద్దైనా ముట్టరు తెలుసా
అసలు గోంగూరంటే తెలుసా?
తెలుసు స్వాములు తెస్తాం తెస్తాం మోపులు మోపులు తెస్తాం

మాయాబజార్ ..... ఇంకోటింకోటి

ఏవిటి గురుడా ఇదంతా
విడిది గృహానికి పథకం వేస్తున్నా పథకం
మరి లోపలికి పోవటానికి దవ్వారమేది దవ్వారం?
పరవేశదవ్వారం అటు ఉండాలి

ఈ పెళ్ళివారిని తందనాలాడించడానికి తతంగమేది తతంగం?

మాయాబజార్ ..... ఇంకోటి

చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ
అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు
అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు
అటు నేనే ఇటు నేనే
అటు నేనే ఇటు నేనే
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ

చిన చేపను పెద చేప చిన మాయను పెనుమాయ
చిన చేపను పెద చేప చిన మాయను పెనుమాయ
అది స్వాహా ఇది స్వాహా
అది స్వాహా ఇది స్వాహా
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ

ఎరుగకుండ వచ్చావు ఎరుకలేక పోతావు
ఎరుగకుండ వచ్చావు ఎరుకలేక పోతావు
ఇది వేదం ఇదె వేదం
ఇది వేదం ఇదె వేదం ఇదె వేదం

ఘటోత్కచుడు : ఎయ్ తాతా నీ వేదం బానే ఉంది కానీ అసలు నువ్వెవరో చెప్పు
శ్రీకృష్ణుడు : నీకు తెలియదా నేనెవరో
ఘటోత్కచుడు : తెలియకనే కదా అడిగేది
శ్రీకృష్ణుడు : తెలియనివారికి చెప్పినా తెలియదు
శ్రీకృష్ణుడు : హోయ్ హోయ్ నా సాయం అడుగుతూ నన్నే అదిలిస్తున్నావే
ఘటోత్కచుడు : ఏనుగులు మింగావా పర్వతాలను ఫలహారం చేశావా

మాయాబజార్ - కంటిన్యూడ్ అగైన్

అనుచరులు : ఆశశర్యం ..... ఆశశర్యం

సూర్యకాంతం : ఓరీ సుపుత్రా వలదంటిని కదరా వీరిని ఎందుకిలా నిర్బంధిస్తున్నావు?

ఎస్వీ రంగారావు : నిర్బంధం కాదు మాతా ఆతిధ్యం. ఈమె ఎవరనుకుంటున్నావు. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బీభత్స బాబాయి పట్టపురాణి సుభద్రాదేవి

సూర్యకాంతం : ఎన్నాళ్ళకి చూశాను ఎన్నాళ్ళకి చూశాను. వీడు నీ సుపుత్రుడా?

నాగేశ్వరరావు : అవును మాతా అవును

సూర్యకాంతం : అలమలం సుపుత్రా అలమలం

ఎస్వీ రంగారావు : హే లంబు హే జంబు ..... అస్మదీయులురా ..... అసమదీయులురా అసమదీయులు మ్రొక్కండి

Thursday, September 6, 2007

మాయాబజార్ ..... కంటిన్యూడ్

నాకు ఇష్టమైన సన్నివేశాలు, డైలాగులు .....

ఎస్వీ రంగారావు : హే లంబు హే జంబు మ్రోగించండి రణభేరి .....

రుష్యేంద్రమణి : అయ్యయ్యో అబ్బాయి విన్నట్టున్నాడే .....

సూర్యకాంతం : ఆ సుపుత్రా సుపుత్రా సుపుత్రా .....

ఎస్వీ రంగారావు : సహచరులరా మీరిక సకలాయుధాలతో సర్వసైన్యాలతో సిధ్ధపడండి మనమిప్పుడు యుధ్ధయాత్రకు వెళ్తున్నాం

అనుచరులు : హై హై నాయకా ..... వై వై నాయకా
హై హై నాయకా ..... వై వై నాయకా

నాగేశ్వరరావు : సోదరా ఎవరితో యుధ్ధానికి ..... నేనూ వస్తాను

ఎస్వీ రంగారావు : నేనుండగా నీవెందుకు సోదరా ..... సహచరులారా .....

సూర్యకాంతం : సుపుత్రా ఓ సుపుత్రా సుపుత్రా .....

ఎస్వీ రంగారావు : విన్నాను మాతా విన్నాను. ఇచ్చిన మాటను తప్పుటయే కాక తుఛ్ఛ కౌరవుల పొత్తు కలుపుకుని జగజ్జగిత పరాక్రములైన మా తండ్రులనే తూలనాడిరిగా యాదవులు
ఎంత మదమెంతకావరమెంత పొగరు
అంతకంత ప్రతీకారమాచరించి కౌరవుల యాదవుల కట్టకట్టి నేల మట్టుబెట్టని ఎడల నా మహిమ ఏల

దురహంకారమదాంధులై ఖలులు విద్రోహంబు కావించిరే
అరెరె
వారికి శృంగభంగమును చేయల్లెడొకొ లోకభీకరుడీ వీర ఘటొత్కచుండు
ఇదె ప్రతిజ్ఞన్ చేసినాడన్ తృటిన్ కురువంశంబునన్ దహించెదన్ యదుకులక్షోబంబు కావించెదన్

అనుచరులు : హై హై నాయకా ..... వై వై నాయకా
హై హై నాయకా ..... వై వై నాయకా

రుష్యేంద్రమణి : నాయనా నా అన్నతో యుధ్ధానికి నీవు వెళ్తే ఒకటి అభిమన్యుడు వెళితే ఒకటినా. అది నాకు అప్రతిష్ఠ కాదు

ఎస్వీ రంగారావు : అట్లైన మాతా నేను హస్తినాపురికి పోయి కౌరవ ఘాతకులనైన హతమార్చి వచ్చెదను

సూర్యకాంతం : వారిని నీవు చంపరాదురా సుపుత్రా మీ జనకులు ప్రతిజ్ఞలు చేశారు. వారి చేతిలో చచ్చుటకు వారు బ్రతికే ఉండాలి.

Tuesday, September 4, 2007

కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల
కృష్ణం కలయ సఖి సుందరం

దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

నారాయణ తీర్థులవారి కృతి
రాగం: ముఖారి

శ్రీకృష్ణాష్టమి రోజు పోస్ట్ చెయ్యాలని ఆగాను. :)

Monday, September 3, 2007

హై హై నాయకా ..... వై వై నాయకా .....

ఘటోత్కచ ..... ఘటోత్కచ ..... ఘటోత్కచ ..... ఘటోత్కచ ..... ఘటోత్కచ .....

హై హై నాయకా ..... వై వై నాయకా .....
హై హై నాయకా ..... వై వై నాయకా .....

అష్ట దిక్కుంభికుంభాగ్రాలపై మన సింహధ్వజముగ్రాల చూడవలదే
గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాకె మ్రొక్కవలదె
ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదె
హై హై ఘటోత్కచ జై హే ఘటోత్కచ అని దేవ గురుడె కొండాడవలదె
ఏనె ఈ యుర్వినెల్ల శాసించవలదె
ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె
ఏనె మన బంధుహితులకు ఘనతలన్ని కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదె .....

హై హై నాయకా ..... వై వై నాయకా .....
హై హై నాయకా ..... వై వై నాయకా .....

మాయాబజార్ సినిమా మొట్టమొదటిసారి చూసినప్పటినించి నాకు బాగా నచ్చినది ఘటోత్కచుడి ఎంట్రీ. మాధవపెద్ది సత్యం గారు పాడిన పధ్ధతి, ఎస్వీ రంగారావు గారి అభినయం నభూతో నభవిష్యతి.

కనిపెట్టబడిన ఇంటరెస్టింగ్ విషయం

ఇంటరెస్టింగ్ విషయమొకటి ఇందాకే కనిపెట్టా. సత్య హరిశ్చంద్ర కన్నడలో ఉంది. కన్నడ సినిమాలో నటించింది డాక్టర్ రాజ్ కుమార్ గారు, పండరీబాయి గారు. ఇది కాదు ఇంటరెస్టింగ్ విషయం. కన్నడ సినిమాలో కూడా అదే సెట్టింగ్, అవే కాస్ట్యూమ్స్. అంటే రెండు సినిమాలు ఒకే టైమ్‌లో తీసారన్నమాట. ఇప్పుడు సినిమావాళ్ళు చెప్తూ ఉంటారుగా బహుభాషా సినిమా, ఒకేసారి పధ్నాలుగు భాషల్లో తీస్తున్నాం అని. ఇంతా చేస్తే అది ఏ డబ్బింగ్ సినిమానో అవుతుంది. అలా కాకుండా అప్పుడు నిఝంగా బహుభాషా చిత్రంగా తీసినట్టున్నారు. ఇంకో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే నమో భూతనాథా పాట కన్నడ సినిమాలో ఉంది. చరణాల్లో రెండో లైన్ తప్ప మిగతా అంతా అవే పదాలు. అది పాడింది కూడా ఘంటసాల గారు, ఎస్.వరలక్ష్మి గారు. ఘంటసాల గారు కన్నడలో పాట పాడారని నాకు తెలియదు. గుడ్ టు నో. :)

Sunday, September 2, 2007

నమో భూతనాథా నమో దేవదేవా

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే .....
స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో .....
హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే .....
భూతాధిపా ప్రమథనాథ గిరీశచాపా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....

నమో భూతనాథా .....

భవ వేదసారా సదా నిర్వికారా .....
భవ వేదసారా సదా నిర్వికారా .....
జగాలెల్ల బ్రోవా ప్రభూ నీవె కావా .....
నమో పార్వతీవల్లభా నీలకంఠా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....
నమో భూతనాథా .....

సదా సుప్రకాశా మహాపాపనాశా ..... ఆ ఆ ఆ .....
సదా సుప్రకాశా మహాపాపనాశా .....
కాశీ విశ్వనాథా దయాసింధువీవే .....
నమో పార్వతీవల్లభా నీలకంఠా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....
నమో భూతనాథా నమో దేవదేవా .....

సినిమా : సత్య హరిశ్చంద్ర
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు గారు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు గారు
గానం : ఘంటసాల గారు, ఎస్.వరలక్ష్మి గారు

ఈ పాట సినిమాపాట అంటే నమ్మటం కష్టం. :)

అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంత దూరంలో ఉండి నీకివ్వగలిగే కానుక నీకు ఇష్టం అయిన ఈ పాట. :)