Saturday, September 22, 2007

సఖియా వివరించవే .....

ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆ

సఖియా వివరించవే .....

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా

సఖియా వివరించవే .....

నిన్ను జూచి కనులు చెదరి .....
కన్నె మనసు కానుక జేసి .....
నిన్ను జూచి కనులు చెదరి
కన్నె మనసు కానుక జేసి
మరువలేక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని

సఖియా వివరించవే .....

మల్లెపూలా మనసు దోచి

పిల్లగాలి వీచేవేళా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెపూలా మనసు దోచి
పిల్లగాలి వీచేవేళా
కలువరేని వెలుగులోన
సరసాల సరదాలు తీరేననీ

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే .....

సినిమా : నర్తనశాల
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తిగారు
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య గారు
గానం : పి.సుశీల గారు

నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఈ పాటకి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. ఈ పాటలో సావిత్రి, ఎస్వీ.రంగారావు గార్ల హావభావాలు నభూతోనభవిష్యతి.

2 comments:

Sri Chandra said...

Hi ,
Mee blog chala chala bagundi
ee songs chusthunte vadanna emotional avuthunanu and at the same time proud feel avuthunanu, telugu lo intha adbuthamina paatalu unanduku .Naakistamina paatalu chala vatiki meeru lyrics post chesaru.Thanks a lot .
At the same time small request , ee lyrics ki print kosam edina unte baguntundi.Direct ga telugu lo print teesu kovachu kada.

Ok mari untanu
Deeps

పద్మ said...

థాంక్స్ దీపగారు, నా బ్లాగ్ నచ్చినందుకు. :) ఇంత చక్కటి తియ్యటి తేట తెలుగు భాష మన సొంతం అవటం, ఆ భాషలో ఆణిముత్యాల వంటి పద్యాలు, పదాలు, పాటలు మన కోసం అలవోకగా రాసి, బాణీలు కట్టి, మధురంగా పాడి కనులకి, వీనులకి విందు చేసి హృదయానికి ఆనందం కలిగించేవారెందరో మహానుభావులందరు మనవారవటం నిజంగా మన అదృష్టం.

ఇక ప్రింట్ అంటారా, ఫైల్ -> ప్రింట్ ఆప్షన్ పని చెయ్యదా? లేక వేరే ఏ ఫ్రేమ్స్ రాకుండా పాట సాహిత్యం ఉన్న సెక్షన్ ప్రింట్ అవ్వాలనా? మొదటిది పని చేస్తుంది. రెండోది నాకు తెలీదు. :(