Sunday, September 9, 2007

34 ఏళ్ళ అమ్మాయి 64 ఏళ్ళ అబ్బాయి - చీనీ న కమ్ న జ్యాదా

ఒక మంచి సినిమా చూశాను, చీనీ కమ్. బావుంది. ఎక్కడా బోర్ కొట్టలేదు. 34 ఏళ్ళ అమ్మాయి 64 ఏళ్ళ ' అబ్బాయి ' ప్రేమలో పడటం. ఆ తర్వాత పిల్ల తండ్రిని ఒప్పించి పెళ్ళి చేస్కోవటం. ఈ కథ ముందే తెలుసు నాకు. ఫస్ట్ రివ్యూ చదివినప్పుడు అనుకున్నాను అసలెలా తీయగలరు 64 ఏళ్ళ మనిషి 34 ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో పడగలగటం అని. కానీ ఎంత సహజంగా తీసారో. ఎక్కడా విసుగు అనిపించకుండా చక్కటి స్క్రీన్ ప్లే తో బాగా తీశారు. టబు, అమితాబ్ డైలాగ్స్ చిన్నవిగా క్రిస్పీగా ఉండి బాగా పేలాయి. పరేష్ రావల్ కి తెలిసినప్పుడు ఏవో భారీ డైలాగ్స్ ఉన్నాయి అని చదివాను. కానీ అలాంటివి ఏమీ లేవు. నాకైతే తెగ నచ్చేసింది. అమితాబ్ ఈజ్ టూ రొమాంటిక్. ఈ ఏజ్ లో కూడా చెయ్యగలిగాడంటే ..... సో ఈజ్ హీ ఎ లెజెండ్ :). ఒక చిన్నపిల్ల రోల్ ఉంది అమితాబ్ ఫ్రెండ్ అన్నమాట. బాగా చేసింది ఆ పిల్ల. ట్రాజెడీ ఏంటంటే ఆ పిల్ల చచ్చిపోతుంది ఎండ్ లో కానీ కనిపించిన కాసేపు బాగా చేసింది. తన డైలాగ్స్ కూడా క్రిస్పీ వన్ లైనర్స్. ఇళయరాజా ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది. సినిమా మొత్తం బిట్స్ ఎన్ పీసెస్లో వస్తుంది ఒక పాట. ఇదెక్కడో విన్నానే అని డౌట్ వచ్చింది వినగానే. ఇంతా చేస్తే అది మౌనరాగంలో పాట. మల్లెపూల చల్లగాలి మంట రేపే సందెవేళలో పాట. నాకెందుకో ఇళయరాజా పాటలు నచ్చవు. ఒకే మూస అనిపిస్తాయి. కొన్ని సినిమాలు ఎక్సెప్షన్. సాగరసంగమం, ప్రేమ, అభినందన, ఘర్షణ, స్వర్ణకమలం, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటివి. ఆయన తెలుగు సినిమాలు డైరెక్ట్ గా తీసినవి పర్వాలేదు కానీ ఆ అరవ డబ్బింగే అన్నీ ఒకే టైప్ అనిపిస్తాయి.

1 comment:

Anonymous said...

జాగర్స్ పార్క్ అనే హిందీ సినిమాలో విక్టర్ బెనర్జీ ది కూడా ఇలాంటి పాత్రే. పరవాలేదు, ఓ మారు చూడొచ్చు.