Thursday, August 16, 2007

కలయా!!! నిజమా!!!

ఈరోజు వింతగా 6.00 కి ఇంటికి వచ్చేశాను. నేనేనా, ఇది నిజమేనా అని నమ్మటానికి చెయ్యి చాలాసార్లు చాలాసేపు గిల్లుకున్నాను. ఇప్పుడీ గాట్లు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో.

కలయో!!! నిజమో!!! వైష్ణవమాయో!!! తెలిసీ తెలియని అయోమయములో ..... టట్టరటట్టరటట్టరటా .....

ఈరోజు ఆలూ కూర్మా. అదేంటో ఊహగా చేసినా బానే కుదిరింది. హేంటో!!! ఇదివరకు స్పూను తప్ప గరిట ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఇప్పుడు గరిటలు ఎడాపెడా తిప్పేస్తున్నాను. ఇదివరకు వంట మీద ఆసక్తి పెద్ద ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చాక ఇంటరెస్ట్ పెరిగింది అంటే కారణం ఏమై ఉంటుంది? గత్యంతరం లేకా? ఏమో!!!

2 comments:

Anonymous said...

ఆ రెసిపీ ఏదో చెబితే నేనూ చేసుకుంటా.. కూర్మా అంటే చపాతితోనే తినాలేమో కదా?
మా ఫేమిలీ వూరెళ్ళడంతో నేనూ ఓ 3వారాలుగా గరిటె తిప్పుతున్నా. :)

శంకర్

పద్మ said...

పాత పోస్టులలో మీ కామెంట్లన్నీ ఇప్పుడు చూస్తున్నాను శంకూ. ఇప్పుడింక మీకు కూర్మా రెసిపీ అక్కరలేదేమో. తీసుకొచ్చేస్తున్నారేమో కదా మీవాళ్ళని సింగపూరుకి. :)