Saturday, August 11, 2007

మీరజాలగలడా .....

మీరజాలగలడా .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....

నటనసూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
నటనసూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....

మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....

సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడ తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి .....
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడ తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి .....

మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....

మధుర మధుర మురళీగానరసాస్వాదనమున ఆ ఆ ఆఆఆఆ ఆ ఆ
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
అధర సుధారస మదినే గ్రోలగ .....
అధర సుధారస మదినే గ్రోలగ .....

మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
మీరజాలగలడా .....

సినిమా : శ్రీకృష్ణ తులాభారం
సంగీతం : ఘంటసాల గారు
గానం : పి.సుశీల గారు

పి.సుశీల పాటల్లో ఒక అత్యుత్తమమైన పాట. ఆవిడ గొంతులోనే సత్యభామ మనసులో భావాలన్నీ పలికించారు. ముఖ్యంగా సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడ తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి చరణంలో ఆ గర్వం , కృష్ణుడు ఇంక పూర్తిగా తనవాడే అన్న నమ్మకం గొంతులోనే పలికించారు. జమున గారి నటన కూడా ఒక హైలైట్ ఈ పాటకి. ఎస్.వరలక్ష్మి కూడా పాడారు కానీ ఎందుకో నాకు సుశీల గారి పాటే బావుంది అనిపిస్తుంది.

4 comments:

Anonymous said...

ఈ పాటని నేను చాలా సార్లు విన్నాను. కాని, సుశీల గారు పాడారని నాకు ఇంత వరకు తెలియదు.
నేను ఇంక లీల గారు పాడి ఉంటారు అనుకొంటున్నాను. ఏందుకనగా, సుశీల గారి గొంతు శ్రావ్యముగా ఉంటుంది, అంత గంభీరముగా ఉండదు.
కాని, సుశీల గారు ఎటువంటి పాటని అయినా పాడగలరని నిరూపించారు. ఆమెకివే నా అభినందనలు.

Rajendra Devarapalli said...

ఈ మధురగీతాన్ని ఇక్కడ చూసి ఆనందించండి
http://youtube.com/watch?v=hGRkoo7L91k

పద్మ said...

అవును భానుప్రకాష్ గారు. పి.సుశీల, పి.లీలగార్లు వారికి వారే సాటి. చాలామంది పి.సుశీల గారి గొంతు కీచుగా ఉంటుంది అనగా విన్నాను. మరి వారి చెవులు డాక్టర్లకి చూపించుకోవాలేమో తెలీదు. సుశీల గారు కంఠంలో, సావిత్రిగారు కళ్ళల్లో పలికించలేని భావం ఉండదని నా అభిప్రాయం.

థాంక్స్ రాజేంద్రకుమార్ గారు. నేను ఇక్కడ రాసిన పాటలన్నింటికి లింక్స్ పెట్టమని చిన్నప్పుడెప్పుడో నిషిగంధ సూచించింది. ఆ సూచన పాటించి కొన్నింటికి పెట్టాను కూడా. తర్వాత Work is Worship అన్న పెద్దల మాట వినాలన్న మాట కూడా పాటించాల్సి వచ్చింది. దానితో నా బ్లాగ్‌కి బూజు కట్టాలన్న విషయం సాలీళ్ళకి గుర్తొచ్చింది. ఇంక ఇప్పుడు మెల్లగా బూజు దులిపి అన్ని పాటలకి లింక్స్ పెట్టాలి.

Rajendra Devarapalli said...

మంచిది పద్మ గారు,నేనూ ఈ మధ్య అచ్చంపాటలకోసమొక బ్లాగు పెట్టాను ఒక సారి చూడండి

http://movingwonder.blogspot.com/