Friday, August 3, 2007

అర్థం కాని (లేని) తెలుగు పదాలు

ఆత్మవంచన అంటే ఇంకో పదం గుర్తొచ్చింది. నయవంచన. వంచన అంటే మోసం. బానే ఉంది. మరి నయ అంటే? నయవంచన, వంచన ఒకటే అర్థం అయితే మరి నయ అనే తోక ఎందుకు ఉన్నట్టు? నమ్మించి మోసం చెయ్యటం అనా? అంటే నయ లేదా నయం అంటే నమ్మించటం అనా అర్థం? కొత్త పదం కనుక్కున్నానోచ్. ఇది పక్కన పెడితే, మోసం చేసేది నమ్మించగలిగితేనే కదా. మరి వంచనకి నయవంచనకి తేడా ఏంటి? అచ్చ తెలుగు పదాల అర్థాలు కూడా తెలియని పరిస్థితి. :(

ఇందాక చిమటా మ్యూజిక్ లో వీక్లీ సాంగ్స్ లో పాటల్లో ఒక పదం చూసి గమ్మత్తుగా ఉందే అర్థం ఏమయ్యుంటుందో అని విన్నాను. 'హృదయంగమం' ఆ పదం. నీరాజనంలో నిను చూడక నేనుండలేను. నాకు ఒక రకంగా నచ్చని పాట. కానీ ఆ పదం ఎలా వాడారా అని విన్నాను. అర్థం లేని పదం అనిపించింది. మన ప్రతి సంగమం ఒక హృదయంగమం అంటే ఏంటో నాకేమీ అర్థం కాలేదు. పదాలని సృష్టించటం అంటే ఎడం చేత్తో ఎడా పెడా రాసి పడెయ్యటమేనా? ఏంటో! ఉన్న పదాలని చక్కగా వాడుకుంటే చాలు కదా. ఈ కొత్తవి సృష్టించాలనే తాపత్రయం ఎందుకు?

4 comments:

Anonymous said...

"మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం" అంటే మనం కలిసిన ప్రతి సారి ఒక హృద్యమైన అనుభవం అనేమో!

పద్మ said...

హృదయంగమం అంటే హృద్యమైన అనుభవం అని అర్థం ఉందంటారా లేక ఉండి ఉండచ్చు అని అంటున్నారా? అర్థం ఉంటే సరే కానీ సృష్టించి ఉంటేనే బాధంతా. అసలా పదం వినలేదు నేనెప్పుడు. నేనేదో తెలుగు కాచి వడపోశాను అనటం లేదు కానీ ఆ పదం ఎప్పుడూ వినలేదు.

Unknown said...

ఇక్కడ నయం అంటే నయం చేయలేనిది అని అనిపిస్తుంది....what do u say ??

sky said...

మనస్సు కు హత్తుకునేది అని మా తెలుగు మాస్టారు చెప్పారండి.