Sunday, January 27, 2008

నీ ఎదుట నేను వారెదుట నీవు

తేనె మనసుల్లో నీ ఎదుట నేను వారెదుట నీవు పాట నాకు నచ్చిన పాటల్లో ఒకటి. కొన్ని చిన్నతనంలో విన్న పాటలైనా ఎందుకో మనసుకి హత్తుకుపోతాయి. ఈ పాట అలాంటిదే. ఈ పాట సంగీతం, సాహిత్యం రెండు మంచి ముత్యాలైతే సాహిత్యం వైపు ఇంకొంచెం ఎక్కువ మొగ్గుతాను. మొదటి లైన్‌లోనే చూస్తే "నీ ఎదుట నేను వారెదుట నీవు" - నీ ఎదుట నేను అని తన విషయంలో మొదటి స్థానం చందమామకి ఇచ్చినా కాబోయే భర్త విషయం వచ్చేసరికి వారెదుట నీవు అనే అంటుంది ఆ అమ్మాయి. వారి ఎదుట నీవు అంటుంది చందమామతో. వారెదుట వీరున్నా, వీరెదుట వారున్నా, రెండూ ఒకటే అయినా భర్తకి మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాతే ఇంకెవరైనా అన్న ఆలోచన సాహిత్యంలో అంత సున్నితంగా చెప్పటం చాలా నచ్చింది నాకు. అఫ్‌కోర్స్ ఎదురుగా ఉండటం అంటే ముందు ఉండటం కదా సో చంద్రుడికే మొదటి స్థానం ఇచ్చినట్టు కదా అనచ్చు. పర్సెప్షన్ :) :p

ఎప్పటి నించో ఈ పాట కోసం వెతుకుతున్నాను. మరెందుకు ఆంధ్రావిలాస్‌లో కనిపించలేదో నాకు. :O

ఈ సినిమాలో నచ్చే ఇంకో పాట దివి నుండి భువికి. ఆ పాట సంగీతపరంగా ఇష్టం.

16 comments:

Anonymous said...

ముందు పోస్ట్లో నే చెబితే గుర్తొచ్చింది , అని చెప్పు.
ఈ క్రెడిట్ నాకూ కొంత భాగం వుంది. :)

శరత్

దీపు said...

చిన్నప్పుడు అంటే పది, పదిహేనేళ్ళు క్రితం అయి ఉంటుంది... ఇంక ఎక్కువ కూడా అయి ఉండొచు... అప్పుడు అలాంటి ఆలొచనలు ఉండటం సహజం... అవి ఇంకా గుర్తుపెట్టుకోవడం ఒక విశేషమైతే, వాటిని అందంగా స్మరించుకోవడం ఇంకో విశేషం... నాకు చాలా చక్కగా అనిపించింది మీ పోస్ట్ చూసి..

నిషిగంధ said...

నాకీ పోస్ట్ తెగ నచ్చేసింది.. ఎంత బాగా చెప్పావ్ 'వారెదుట నీవు ' గురించి!!

చూస్తుంటే ఈ శరత్ గారు నీ పోస్ట్ లు కూడా తనే రాసేటట్లున్నారు! :p

పద్మ said...

శంకూ :) ఒకరకంగా మీరే కారణం అనుకోండి. మీరడిగాక మళ్ళి ఇంకోసారి వెతుకుదాం అని ప్రయత్నించాను. నాకు పాట దొరికింది కాబట్టి క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి. నాకు ఈ క్రెడిట్లు, అరువులు వద్దు. :p

దిలీప్ గారూ, నా పోస్ట్ నచ్చినందుకు సంతోషం. :) గుర్తుంచుకోవటంలో మన గొప్పతనం ఏముందండి. ఆ పాట గానం చేసినవారిది, గొప్పగా స్వరకల్పన చేసినవారిది, పంచదార పలుకుల వంటి సాహిత్యాన్నందించినవారిది ఆ ఘనత. అంత చక్కటి టీమ్ వర్క్ కాబట్టే ఆ పాటలు ఇంకా మదిలో మెదులుతూ ఉన్నాయి.

మీ కవితలు చదివాను. కొన్నిచోట్ల పదాల అల్లిక అద్భుతంగా ఉంది. మీ కవితలని ఇక్కడ పొగడడం కరెక్ట్ కాదేమో. మీ బ్లాగులో కామెంట్స్ కోసం కాచుకోండి. :)

థాంక్స్ నిషీ :) నాకెందుకో నా భావాలకి పూర్తి అక్షరరూపం ఇవ్వలేకపోయాను అనిపించింది. ఈ పావువంతు స్పైడర్ మాన్ స్క్రీన్‌తో తంటాలు. :( ఏదో ఆత్రంగా పోస్ట్ చేసేశాను కానీ కొత్త సిస్టమ్ వచ్చాక భావవ్యక్తీకరణ ఇంకొంచెం సరిగ్గా చెయ్యాలి. :)

Radhika said...

హాయ్ మోహనా, మీ ఈ పోస్టు నాకు చాలా నచ్చేసింది. :) Thanks to you, ఒక మంచి పాట విన్నా.


btw, belated happy birthday :)

Anonymous said...

నిషీ జీ , నాకంత టాలంట్ వుంటేనా... ఈపాటికి మీ కవితలూ , పద్మ పోస్టులూ మిమిక్ చేసేసే వాడిని :))

శరత్

పద్మ said...

శంకూ :O మరీ మిమిక్ చెయ్యలేనంత క్లిష్టమైనవా నా భావాలు అక పోస్టులు? మరీ అంత అర్థం కానివంటారా నా ఆలోచనలు? :)

పద్మ said...

థాంక్స్ రాధికా :) ఈ మధ్య ఏవీ సరాగాలు? మీరు, శంకూ ఇద్దరు ఆ దారాన్ని పట్టించుకోవటం లేదు. కాస్త బూజు దులపండి. :)

దీపు said...

థాంక్స్ అండి... మీ కామెంట్ల కోసం కళ్ళు కాయలుకాచేట్టు ఎదురుచూస్తుంటాను.. :-)
అవునండి నా పేరు దిలీప్ అని మీకు ఎల తెలిసిపోయింది?!!

పద్మ said...

సింపుల్ అండి. మీ పేరు మీద మౌస్ పెట్టి కళ్ళు మూసుకుని అబ్రకదబ్ర అబ్రకదబ్ర అబ్రకదబ్ర అన్నాను. అంతే. :p

మీ ప్రొఫైల్ లో మేల్ అని ఉంది. మేల్ నేమ్స్ దీపుతో ఏం ఉంటాయి చెప్పండి,సో దిలీప్ అని చీకట్లో బాణం వేశాను. తగిలిందంటారైతే.

దీపు said...

మీరు మరీను... ప్రదీప్ ఉంది, సందీప్ ఉంది, దీపక్ ఉంది... చిన్నప్పుడు నా పేరు గుర్తుంచుకోకుండా చుట్టుపక్కల వాళ్ళు ఆ మూడు పేర్లలో ఎదొకదానితో పిలిచేవాళ్ళు.. పైగా అప్పట్లో నన్ను ఎవరూ దిలీప్ అని పిలిచేవాళ్ళే కాదు... మీరేమొ విచిత్రంగా చెప్పేసారు :-)

Anonymous said...

లాభం లేదు.., మరోసారి చీకట్లో బాణం భుజంలో దిగబడేలా వేయమ్మీ .. :)) :))

శరత్

పద్మ said...

దిలీప్ గారూ, దీపూ అని అన్ని పేర్లవాళ్ళని పిలవచ్చని నాకు మీ పోస్ట్ చదివే వరకు తెలియలేదు. :p

నిఝంగా నిజం చెప్పాలంటే దీపు అనగానే పేరు దీపిక అయి ఉంటుందని అనుకున్నాను, మీ ప్రొఫైల్ చూసేవరకు. చూసాక దీపిక కాదని తెలిసిందనుకోండి. ఇక దిలీప్ అని ఎలా తెలిసిందంటే, మీ ఊరెళ్ళొచ్చాను చదివాక. :)

శంకూ, బాణాల స్టాక్ అయిపోయింది. :p

Radhika said...

అసలు టీపీయే బూజు పట్టిపోయింది మోహనా!

సరాగాలూ...ఈ మధ్య సంగీత కచ్చోరీలూ ఇంకో చోట జరుగుతున్నాయి. మీరూ ఓ కచ్చూరీ లాగించకూడదా మోహనా? :)

శరత్ గారూ, మీ మైలు యెంతకీ వెళ్ళడం లేదు. మొదటగా బూజు దులిపేపని మీదే. :)

పద్మ said...

నిజమే రాధికా, అసలీ మధ్య రెగ్యులర్స్ అందరూ మానుకున్నారు టిపికి రావటం. మరీ దారుణం అయిపోయింది కదా. :(

నా సరాగాలా? ఇంకా నయం. కూనిరాగాలు తీస్తేనే జనాలు ఆమడ దూరం పరిగెడతారు. ఇంక సరాగాలే? :p

ఎవరన్నా కచోరిలు చేస్తే నేను లాగించటానికి రెడీ.

Nrahamthulla said...

చందమామా ..అందాలమామా..
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు

పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే వోరగ చూసా
వల్లమాలిన సిగ్గొచింది
కన్నుల దాకా కన్నులుపోక
మగసిరి ఎడదని చూసాను
మగసిరి ఎడదని చూసాను
తలదాచుకొనుటకది చాలన్నాను... !!నీ !!

పెళ్ళిచూపులలో బిగుసుకొని నీ పేరేమి?
చదువేమి నను ప్రేమిస్తావా వయసెంత?
అని అడిగారా ..అసలొచ్చారా?
నాలో వారు ఏం చూసారో నావారైయారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంటా.. !! నీ !!

చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరి వంటారు
ఆ వెన్నెలలోని వేడి గాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను
వయసుకు వైరివి నీవంటాను..!!నీ!!
చందమామా ..అందాల మామా..---ఆత్రేయ,కేవిమహదేవన్,సుశీల,తేనెమనసులు.