Thursday, February 28, 2008

ఫెమినిస్టులు - పనికిమాలిన రాతలు

మొత్తానికి ఈరోజుకి తీరింది బ్లాగటానికి. ఇలా బ్లాగటం అంటుంటే వాగటం అన్నట్టు లేదు? రెంటికీ పెద్ద తేడా ఉన్నట్టు నాకైతే అనిపించదు. వాగుతున్నప్పుడు ఎదుట కూచున్న ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువమందో పాపం చెవులు మూసుకోలేక అదేదో సినిమాలో బ్రహ్మానందంలా దీనంగా మొహం పెట్టుకుని కూచునుంటారు. ఆ మొహాలు చూడలేక, చూసినా అమిత ఇష్టంగా ఇస్తున్న ఉపన్యాసరసధారని ఆపలేక వాగేవాళ్ళు కష్టాలు పడతారు. కొంతమంది ఆ మొహాలు చూసి ఆనందంతో వీరావేశంగా విజృంభిస్తారు. అది వేరే విషయం. కానీ బ్లాగేటప్పుడు ఆ కష్టాలు ఉండవు. ఇష్టం వచ్చినట్టు బ్లాగుకోవచ్చు. చదివేవాళ్ళు చదువుతారు. ఇష్టం లేనివాళ్ళు సింపుల్‌గా బ్రౌజర్ అనే పదార్ధాన్ని మూసేస్తారు. బోల్డుమంది చదివే ఉంటార్లే అన్న సంబరం బ్లాగరులదైతే, హమ్మయ్య తప్పించుకున్నాం అనే ఆనందం చదువరిది. కాకపోతే ఈ ఇష్టం వచ్చినట్టు అనే విషయం బ్లాగుల వరకే పరిమితం చేస్తే బానే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా బ్లాగ్స్ అనేవి వ్యక్తిగతమైనవి కాబట్టి. కానీ పబ్లిక్ సైట్స్ లో ఇష్టం వచ్చినట్టు రాసేసి నన్నెవ్వరూ ఏకకూడదో అంటే ఎలా కుదురుతుంది? ఈ మధ్య ఒక స్నేహితుడు చెప్తే ఎప్పుడు వెళ్ళే సైట్‌లోనే అంతగా ఎప్పుడూ వెళ్ళని ఆర్టికల్స్ సెక్షన్‌లో ఒక కవిత (అనబడే పనికిమాలిన రాత) చదివాను. కవయిత్రి అంతకుముందు రాసిన ఒక కవిత (అనబడే ఇంకో పనికిమాలిన రాత)కి వచ్చిన స్పందన భరించలేక తన ప్రతిస్పందన ఇంకో కవిత రూపంలో ఇచ్చిందన్నమాట.ఆవిడ బాధేంటంటే(లేదా గోల అనాలేమో) అసలీ భూమ్మీద ఆడదానికి వచ్చే కష్టాలన్నింటికీ కారణం మగవాడు అని. మగవాడన్న జీవి భూమ్మీద లేకపోతే స్త్రీ మహా సుఖంగా బతుకుతుంది అని ఆవిడ ఉవాచ. స్త్రీ స్వాభిమానానికి విలువ లేదని మహా దీనంగా చెప్పింది. అసలా కవితలో ఒక్క ముక్కన్నా అర్థవంతమైనది ఉంటుందేమో అని చాలా ఓపిగ్గా చివరివరకు చదివాను. చివరిలో ఆవిడ పేరు చూసి పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వచ్చింది. ఆ విషయం తర్వాత చెప్తాను. అసలు ఆవిడ వాదనలో రెండు పాయింట్లు ప్రస్ఫుటంగా కనిపించాయి.

1. స్త్రీల కష్టకారణం పురుషుడు.
2. స్త్రీ స్వాభిమానానికి విలువ లేదు.

మొదటి పాయింటు నాకెప్పుడు అర్థం కాదు. ఎందుకు ఎప్పుడు ఆడవాళ్ళ కష్టాలకి మగవాళ్ళని కారణభూతం చేస్తారు? మగవాడేనా ఎప్పుడూ భూతం, దయ్యం? ఎంతమంది తాటకి, శూర్పణఖలు లేరు? ఒకప్పుడు స్త్రీ చదువుకి దూరంగా ఉండటం కానేమి కుటుంబ పరిస్థితులు కారణం కానేమి సమాజం పోకడలు కానివ్వండి ఆడది ఒక అడుగు వెనక్కే ఉండవలసి వచ్చింది. కానీ కాలం మారింది. కాలంతో పాటు సమాజమూ మారింది. సమాజంతో పాటు మనుషులు మారుతున్నారు. నేటి స్త్రీ అడుగు పెట్టని చోటేది? తన సత్తా చాటని రంగం ఏది? గగనాంగనాలింగనోత్సాహియై అన్నట్టు ఆకాశం అందుకోవటానికి ప్రయత్నిస్తున్న ఈరోజుల్లో కూడా ఇంకా ఆడది దీనావస్థలో ఉందని దానికి కారణం మగవాడని ఎందుకు పాడిందె పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు వల్లిస్తారు? స్త్రీ పరిస్థితి పూర్తిగా మారిందని నేనూ అనను. కానీ ఒకప్పుడు 70-30 ఉంటే ఇప్పుడు 30-70 అయింది. మారిన స్థితికి సంతోషిస్తూ మారని జీవితాలని మార్పు వైపుకి తీసుకెళ్ళే ప్రయత్నం చెయ్యాలి అంతే కానీ కారణాలు ఎంచుతూ కూచుంటే ఒరిగేది ఏదీ లేదు. తన కాళ్ళ మీద నిలబడగలిగి సాటి స్త్రీని కూడా పైకి తీసుకురావాలని ప్రతి స్త్రీ కోరుకుంటే ఏ మగవాడు ఏమీ చెయ్యలేడు సాయం తప్ప.

ఇక రెండో పాయింటు స్త్రీ స్వాభిమానం. :) ఈ కవితవిక రాసిన రచయిత్రి ఆఖరికి తన సొంతపేరు మీద కూడ మనగలననే నమ్మకం లేని ఆవిడ. పేరు ముందు శ్రీమతి, పేరు తర్వాత భర్త పేరు అలంకారంగా పెట్టుకున్న మహానుభావురాలు. మరి ఆవిడ స్త్రీ స్వాభిమానాన్ని గురించి ఎలా మాట్లాడగలుగుతోందో నాకైతే అర్థం కాలేదు. పెళ్ళి కావాలి. ఆ పెళ్ళితో పాటూ వచ్చే సాంఘిక భద్రత, గౌరవం కావాలి. కానీ ఆ మొగుడనే మగవాడు అక్కరలేదు. ఏంటో వీళ్ళ లెక్కలు. ఇన్ని లెక్చర్లు ఇస్తారు పోనీ ఏమైనా కాంక్రీటుగా వెలగబెడతారా అంటే ఊహూ. మిసెస్ శ్రీరాం అనో మిసెస్ గోపాల్ అనో పిలిపించుకుంటూ చీర నలక్కుండా మైకులు విరగ్గొడుతుంటారు, కలంలో సిరా అవగొడుతుంటారు లేదా కీబోర్డ్ కీస్ చెడగొడుతుంటారు. రావణాసురుడికన్నా, లంఖినికన్నా పెద్ద పిశాచాలు వీళ్ళే. ఎప్పటికి బాగుపడతారో. వీళ్ళ మీద ఉపయోగించటానికి రెయిడ్ లాంటిది ఏదైనా ఎవరైనా కనిపెడితే బావుంటుంది. సమాజం బోల్డు బోల్డు బాగుపడిపోతుంది.

15 comments:

నిషిగంధ said...

అదిరింది పో!! చాలా రోజుల తర్వాత రాసినా కత్తిలాంటి టపా రాశావు.. స్త్రీ పురుషుల్లో ఒకరు లేకపోతే ఇంకొకరికి అస్థిత్వం ఉండదని ఎప్పటికి అర్ధం అవుతుందో!! ఇంతకీ ఆ కవిత ఎక్కడ చదివావో చెవి కొరికినప్పుడు కాస్త చెప్పు :)

పద్మ said...

చెప్తా. చెప్తా. రేపోసారి గాఠ్ఠిగా కొరుకుతా చెవిని. నీకింకో విషయం కూడా చెప్పాలి. ఒకటి సాధించాలే. అది చెప్పాలి. :)

దీపు said...

కవితవిక మొదటిసారి వింటున్నా... సొంత ప్రయోగం అయితే మెచ్చుకోవాలి తెలుగులొ ఒక కొత్త పదం కనిపెట్టినందుకు...

మీరు వాగినా బ్లాగినా ఇక్కడ ఒక అభిమాని కళ్ళు చెవులు తెరుచుకుని గీతాంజలి సినెమ చూస్తున్నట్టు మీ పోస్ట్ ని చదివెస్తాడు...

ఆ కవితవిక కోసం ఎదురుచూస్తున్నాము.... :-)

పద్మ said...

కెవ్వుమని అరిచేశాను దీపుగారూ. కవితవిక అని తిట్టానండీ బాబూ అర్థం పర్థం లేనిదన్న ఉద్దేశంతో. మీరేమో నేనేదో కవితవిక రాస్తున్నాను అనుకుంటున్నారా ఏంటి కొంపతీసి. అసలు నేను రాసినవి మీకు కవితవికల్లా అనిపిస్తున్నాయా? ఇదేనా మీ అభిమానం? ఇదేనా మీ మెచ్చుకోలు. ఇదేనా, ఇదేనా, ఇదేనా??? :p

దీపు said...

@పద్మ గారు

అహో.. కట కట.. ఒక నిజమైన అభిమాని అభిమానాన్ని శంకిస్తున్నారా?!! నెను కవితవిక అని మెచ్చుకున్నది ఆ పద ప్రయోగానికి... మీరు రాసారు అని కాదు...! ఇదేనా మీరు నన్ను అర్ధం చేసుకున్నది? ఇదేనా? ఇదేనా? ఇదేనా?!!

పద్మ said...

:)

కవితవిక కోసం ఎదురు చూస్తున్నాను అనేసరికి నేను అపార్థం చేసుకున్నానల్లే ఉందిలెండి.

దీపు said...

:-)

కొత్త పాళీ said...

ఆ ఘోరమైన కవితవిక (ప్రయోగం అదిరించి .. తిరగేసి చదివినా ఈక్వల్లీ మీనింగ్లెస్సని దీనికర్ధం!) కి ఓ లంకె పడేసుంటే మేము కూడా చదివి తరించే వారము కదా! ఇప్పుటికైనా మించిపోయిందేం లేదు, దారి తీయండి.

పద్మ said...

:)

దారి చూపించి ఆ కవితవికకి పబ్లిసిటీ ఇవ్వటం అవసరమంటారా మాస్టారూ? :p మీకంత చదవాలనుంటే, ఉండండి, మీకా లంకె పంపిస్తా. చెక్కుకోండి.

Shwetha said...

Penksssssssss....nuvvu e kavita choosi aavesa padi, nochukuni, ( inkaa ilaanti padaalu anni add chesuko :PPPPPP) ee article ni aragadeesaavo key board meeda naaku telisipoyindoooocchchchchch...mundu nee article chadivi, taravaata kavita chadivi, malli nee article chadivi ( two times chadivaa :P) navvaleka chachaananuko :)))))))

Very well written raa :))))))))))))

Vinay Chakravarthi.Gogineni said...

chaala bagundandi.....nishigandha gaaru chepparu kada adi kooda......ammayya ladies lo kuda gents ni koncham understand chesukone vallu vunnaru.........lekapote entandi..evari notinundi vinna memu maga valla kante emi takkuva antaru ento............
asalu magavade oka enimy ani endukanukuntaro....
really..after reading this i am so happpy.............

Apaa said...

:) Raagam :) lol..bhale episode (adE eDupugoTTu episode ) gurtu chEsaaru..aaviDa gaaru ippaTikii saadhistOndi nenu aa maaTa annaanani..:P meeku adE anipinchinanduku taankuus :)

పద్మ said...

ఆపాజీ. :) ఆవిడని చూస్తేనే నాకెందుకో చిర్రెత్తుతుందండి. నా పేరెందుకు పెట్టుకుందో అసలావిడ. హు. x-(

సుజాత said...

మీరు, నిషి చెవులు, చేతులు కొరుక్కోవడం కాదు, అర్జెంటుగా అ కవిత లింకిలా పడేయండి. వాళ్ళాయన పేరేమిటో చూడాలి.:-)

పద్మ said...

:))))))))))))))))))))))))))))))))

సుజాత గారు, వాళ్ళాయన పేరు నా ఇష్టదైవం పేరండి. :( గట్టిగా పేరు పెట్టి తిట్టటానికి కూడా లేదు. ఆవిడ పేరేమో నాది. పక్కన వాళ్ళాయన పేరేమో నాకు ఇష్టమైన దేవుడిది.

ఇంక లింక్ అంటారా ఇన్నేళ్ళ తర్వాత ఆ లింక్ లంకె బైట పెట్టటం బావుంటుందంటారా? అనవసరంగా ఇన్నేళ్ళ తర్వాత ఆవిడని బైట పెట్టటం ఎందుకులెండి. ఎంత కెలుకుడు రౌడీ గారి ఫ్రెండ్ అయినా కెలుకుడు నా వల్ల కాదండోయ్.