Tuesday, April 8, 2008

అవీ ..... ఇవీ ..... అన్నీ .....

మళ్ళీ బోల్డు రోజుల తర్వాత.

ఈ మధ్య రోజూ జల్సా పాటలు వింటున్నాను. మొదట విన్నప్పుడు, ఈ దేవిశ్రీప్రసాద్ ఆ బొమ్మరిల్లులో బందీ అయిపోయాడా, ఇంక బైటికి రాడా అని సందేహం వచ్చింది. ఒకే రకంగా అనిపించాయి పాటలు. తినగ తినగ వేము తీయగనుండు లాగా వినగా వినగా ఇప్పుడు ఓ మూడు పాటలు బానే ఉన్నాయనిపిస్తోంది. ఒక పాట మటుకు మొన్నటి వరకు 'హాంటింగ్' టైప్స్ లో వెంటాడింది. ఒక సందేహం అన్నమాట ఆ పాటలో. హీ ఈజ్ సైమన్ సునామీ అని పాట. అమెరికావాళ్ళు ఉప్పెనలకి కూడా అందమైన ఆడవాళ్ళ పేర్లు పెడుతుంటే మనవాళ్ళేంటి మగపేరు అదీ ఎంగిలిపీచు పేరు పెట్టారు సునామీకి అని డౌట్. సరే మనవాళ్ళకి అదో పిచ్చి అని డిసైడ్ అయ్యాను. మొన్నెందుకో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటే అర్థం అయింది. హీ ఈజ్ ఎ హ్యూమన్ సునామీట. :O ఈజ్, ఎ, హ్యూమన్ కలిప్పారేసరికి నాకట్టా వినిపించింది. :( ఈస్ అని పలికాడు పైగా. ఆ కలపటం, పలకటం వెరసి అయోమయం.

ఇలాంటిదే ఆ మధ్య ఇంకోటి.

పోకిరి సినిమాలో పాట ఇది. పెన్ దొరకగానే రారా అని పాడుతోంది పాడినావిడ. ఎన్ని సార్లు విన్నా పెన్ దొరగ్గానే రావటం ఏంటో ఒక పట్టాన అర్థం కాలేదు. సరే, దర్శక నిర్మాతలు ఎప్పుడూ చెప్తూండే ' సిట్యుయేషనల్ ' సాంగ్ అంటే ఇదేనేమో, హీరోయిన్ పెన్ పారేసుకుని, వెతికి కనబడగానే రమ్మని హీరోకి చెప్తూ పాడుతోందేమో అని ఊహించేసుకున్నాను (మన సినిమాల్లో ఇలాంటి సెన్స్ లెస్ సీన్లు చాలా మామూలు కదా అందుకే అలా ఊహించే ధైర్యం చేశా). తర్వాత అర్థం అయింది. 'పెందరకడనే రారా' అని.

వినికిడిలోపమా? ఏమో :(((((

పోకిరి అంటే ఇంకో పాట గుర్తొస్తోంది. జగడమే ..... సమరమే ట." ఆ దేవుడె దిగివస్తున్నా, ఆకసమే దిగిపడుతున్నా,బిన్ లాడెన్ ఎదుటే నిలుచున్నా " (ఇవి బానే వినిపించాయి, డౌట్లేమీ లేవు. :P కానీ .....) అర్థం ఉందా ఈ లైన్‌కి? దేవుడు దిగి రావటం, బిన్ లాడెన్ ఎదురుగా నించోవటం రెండూ ఒకటేనా? దేవుడు కనిపించకుండా సృష్టిని నడిపిస్తాడు. ఈ లాడెను ఎక్కడో దాక్కుని కనిపించకుండా అమాయకుల చేత విధ్వంసాలు చేయిస్తుంటాడు. కనిపించకపోవడం అన్నదే ఇద్దరి మధ్య కామను. అంతమాత్రాన ఈ దయ్యాన్ని తీసుకెళ్ళి దేవుడి గాటన కట్టేస్తారా? ఇద్దరూ సమానులే అన్న అర్థం వచ్చేలా రాస్తారా? నాకైతే అస్సలు నచ్చలేదు ఈ ముక్క.

24 comments:

దైవానిక said...

ఇంకోటి,సఖి సిన్మాలో ఒక పాట ఉంది.
"ఉల్లంచొక్క ఆరబోసె వయసే" అని.
ఎన్నాళ్ళ తరువాతో తెలిసింది. అది "wollen" చొక్క ఆరబోసే వయసట. అయినా పాటకి అర్థం సరిగా లేదు అనుకోండి..

రాధిక said...

దేవుడు వుండడం,ఆకాశం పడడం,బిన్లాడెన్ ఎదుటవుండడం ఇవన్నీ హీరోఇజాన్ని ఎలివేట్ చేసేవేనండి.దేవుడంతటివాదు వచ్చినా లెక్కలేదు,ఆకాశం పడిపోతున్నా లెక్కలేదు,భయంకరుడయిన లాడెనే వున్నా లెక్కలేదు....మనోడు అంతటి తిక్కలోడు అని చెప్పాడు కవి.అంటే ఈ లైన్స్ "నేనెంత ఎదవనో నాకే తెలీదు" అనే హీరో మేనరిజానికి పొడిగింపులు.

దైవానిక గారూ ఉల్లం చొక్కా ఆరబోసే వయసే అన్నారు.కానీ అది "ఉల్లం చక్కా ఆరబోసే".ఉల్లము అంటే మనసు,చక్కా ఆరబోసే అంటే సరిగా ఆరబోసే అని.మొత్తం అర్ధం ఏమిటంటే మనసుని సరిగా చూపించే వయసు అని.

రానారె said...

పెందరకడ అంటే ఏమిటండి?

రానారె said...

పెందలకడ or పెందలాడ pen-dala-kaḍa. (పెను+తల+కడ.) adv. Early, betimes, quickly, hastily. In the twilight. A. i. 20. ప్రొద్దుపోక మునుపు, ప్రొద్దుగలుగ.

(బ్రౌణ్యం నుంచి).

పద్మ said...

రాధిక గారూ,

నాకా లైన్‌లో నచ్చనిది లాడెన్‌ని గొప్పగా చూపించటం. లాడెన్ పరమ పిరికి వెధవ. తన భుజబలంతో యుధ్ధం చెయ్యలేడు. కనీసం బుధ్ధిబలంతో తనవారికి ఏ ఆపదా కలక్కుండా శత్రువుని దెబ్బ తీయగలడా అంటే అదీ చేతకాదూ. అటు బుధ్ధీ లేదు ఇటు కండా లేదు. ఇంక అటువంటివాడిని మన తెలుగు సినిమా 'హీరో' వేలెడంత మునిమనవడు కూడా నరికెయ్యగలడు. మన హీరో అవసరమా? ఎందుకో లాడెన్ లాంటి పిరికివాడిని దేవుడితో ఒకే గాటన కట్టెయ్యటం నాకు నచ్చలేదు, ఎంత తిక్కలోడి పాట అయినా సరే. :|

దైవానిక గారూ, రాధిక గారి వివరణ చదివాక ఆ పాటలో లోపం మన సాధనా సర్గమ్ గారి ఉచ్ఛారణేమో. అవునూ పెళ్ళయ్యాక మొగుడు రహస్యస్నేహితుడు ఎందుకవుతాడు? అసలు రహస్యస్నేహితుడంటే ఏంటి?

రానారె గారూ,

పెందరకడనే అంటే మీకు దొరికిన అర్థమే. :) పెందలకడ వాడుకలో పెందరకడ అయ్యుంటుంది. కోస్తాలో పెందరాడే అని అంటూంటారు. తెలంగాణాలో మబ్బుల అని వాడుక.

Srinivas said...

రహస్య స్నేహితుడు అంటే "ఇతడు నా స్నేహితుడు" అని బయటికీ, అందరికీ చెప్పుకోలేని స్నేహితుడు. ఇంకో గూఢార్థమేదీ తట్టలేదు నాకయితే.

పద్మ said...

చెప్పుకోలేని స్నేహం? సరే! ప్రేమలో ఉంటే బహిర్గతం చెయ్యలేని ప్రేమికుడు ఈ రహస్య స్నేహితుడు అనుకుంటే భర్త బైటికి చెప్పుకోలేని స్నేహితుడు ఎందుకవుతాడు?

Radhika said...

అంటే పెళ్ళయ్యాక భర్తని ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే 'ఇదుగో మా ఆయనా అనో, 'మా వారూ :డ్ అనో పరిచయం చేస్తాం కానీ 'ఇదుగో నా దోస్తూ అనలేం కదా. అందుకని భర్తతో స్నేహం రహస్యం అయ్యిందేమో :)))

OLED said...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the OLED, I hope you enjoy. The address is http://oled-brasil.blogspot.com. A hug.

కత్తి మహేష్ కుమార్ said...

మొత్తానికి ఇప్పటి తెలుగు సినిమాల పాటల్లొ అర్థాలు వెదికే సాహసానికి మీరు పూనుకుంటున్నారన్న మాట. ప్రయత్నించండి. అర్థమైతే మాకూ ఇలా చెబుతూ ఉండండి. లేకపోతే అసలవి పిచ్చి రాతలని డెసైడ్ అవ్వటానికి మేము ఆల్రెడీ సిద్దమై పోయాం.

Anonymous said...

బ్లాగవే మాతల్లి బంగారు బ్లాగు
బ్లాగకుంటే మాకు పొద్దెట్ల పోవు :)

ఆనంద ధార said...

తెలుగు సినిమా ట్రెండ్ మారిపోయిందండి.. అర్థం కాని పాటలే సూపర్ హిట్టు అవుతున్నాయి... మంచి ప్రయత్నం చేసారు...

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

మన లాగా సినిమా పాటల్లో సాహిత్యం, అర్ధాలు ఉండాలనుకునేవాళ్ళు తక్కువ అయిపోయారు. అర్ధవంతమయిన పాత పాటలనే ముక్కలు ముక్కలుగా విరిచేసి తుపాకి చప్పుళ్ళు, జంతువుల అరుపుల మధ్య అతికించి "రీ-మిక్స్" అని చెప్పి మన మొహాన కొడుతున్నారు. ఇంక ఇప్పటి పాటల్లో సాహిత్య విలువలు ఏం ఆశిస్తాం.

ఇప్పటి పాటల్లో అర్ధాలు వెతకడమే అర్ధం లేని పని. అయినా "పాటల పిచ్చి" కనుక పాటలు వినకా తప్పటం లేదు. ఈ లైనుకి అర్ధం ఏంటబ్బా అని ఆలోచించకా (ఆక్రోశించకా) తప్పటం లేదు.

మన లాంటి వాళ్ళందరిని "అంతరించిపోతున్న జాతి" లో చేరుస్తారేమో కనుక్కోవాలి.

పద్మ said...

బ్లాగుతాను శంకూ బ్లాగుతాను. :)

ఈ మధ్య అసలు నాకు బ్లాగ్ ఉన్న విషయం కూడా మర్చిపోయాను. :(

పద్మ said...

@ఆనంద ధార గారు,

నిజమే ట్రెండ్ మారింది. ఆ మధ్య మరీ అర్థం పర్థం లేని ముక్కలతో (కొత్త పదాలు కనిపెడుతున్నామన్న వాదన కూడాను) ద్వంద్వార్థాలతో పాటలు వచ్చి మళ్ళీ కాస్త సిరివెన్నెలతో ట్రెండ్ మారింది అనుకుంటుంటే మళ్ళీ ఇలాంటి పాటలతో ట్రెండ్ ఎటు మారుతోందో అర్థం కావట్లేదు.

పద్మ said...

@బ్రహ్మి గారూ,

:)))))))))) @అంతరించిపోతున్న జాతి. :)))))))))) నిజమేనండోయ్. అంతరించిపోతున్న జాతే. నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి కూడానూ.

వేణూ శ్రీకాంత్ said...

పద్మ గారు, నిషిగంధ గారి బ్లాగ్ లో మీ కామెంట్ చూసి అర్జంట్ గా మీ "మోహన రాగాలు" బ్లాగ్ చూసానండీ... ఈ మధ్య లాంగ్ బ్రేక్ తీసుకున్నట్లున్నారు....

మీ టపాలు అన్నీ చదవలేదు కానీ కొన్ని అక్కడక్కడా చూసాను, చాలా బాగుంది, enjoyed browsing thru it ప్రత్యేకించి ౠతురాగాలు పాట గురించి మీరు 2007 లోనే రాయటం చూసి అచ్చెరువొందాను. ఒక సారి వీలైతే నా బ్లాగ్ చూడండి.

అన్నట్లు సఖి సినిమా చూడలేదా మీరు ? అందులో హీరో హీరోయిన్ లు ఎవరికీ తెలియకుండా పెళ్ళి చేసుకుని ఎవరి అమ్మా నాన్న లతో వాళ్ళు మాములుగా ఏమీ జరగనట్లు జీవిస్తుంటారు. ఆ నేపధ్యం లో పెళ్ళయాక కూడా ఎవరికీ తెలియకుండా కలుసుకున్నపుడు వచ్చేపాట ఇది, నిజానికి రహస్య భర్త అని రాయాలేమో కాని అది అంత బాగాలేదని దాన్ని రహస్య స్నేహితుడా గా మార్చాడనుకుంటా.

రాధిక గారు నేను కూడా ఇప్పటి వరకు వుల్లన్ చొక్కా అనే పాడుకుంటున్నా అండీ మీరు చెప్పిన అర్ధం చక్క గా ఉంది.

పద్మ said...

థాంక్స్ వేణూ శ్రీకాంత్ గారూ. అవునండీ, ఈ మధ్య చాలా పెద్ద గాప్ వచ్చింది. మళ్ళీ మొదలెట్టాలి. :)

సఖి సినిమా చూశాను. రహస్య స్నేహితుడు నిజంగానే నాకు అర్థం కాలేదు. నిఝంగా చెప్పాలంటే నాకా పదం నచ్చలేదు. :| రహస్యంగా ఉంచటంతో ఆ నచ్చకపోవటం మొదలయిందనుకోండి.

మీ బ్లాగ్ తప్పకుండా చూస్తాను. ఈమధ్య కొంచెం రక్తదాన కార్యక్రమంలో బిజీలెండి ఆఫీసులో.

ఏకాంతపు దిలీప్ said...

పద్మ గారు, ఇలా అయితే కష్టం.. ముందు ఆ కంపెనీకి ఒక కాగితం రాసి పెట్టెయ్యండి... ఆ తరవాత సంగతి ఆ తరవాత! ఎలా ఉన్నారు? మరీ ఇలా నల్లపూసైపోతే ఎలా?

మంచిబాలుడు -మేడిన్ ఇన్ వైజాగ్. said...

super gaa rasarandi..padma gaaru..

పద్మ said...

దిలీప్ గారూ :)

థాంక్ యూ మంచి బాలుడు గారూ.

పద్మ said...

A very happy New Year to one and all.

Anonymous said...

Happy New Year & Sankranti

Sankar gaaru

:)

ఏకాంతపు దిలీప్ said...

:-(

ఎలా ఉన్నారు?