Sunday, July 19, 2009

తిరుమల మందిర సుందరా ..... సుమధుర కరుణాసాగరా .....

తిరుమల మందిర సుందరా .... సుమధుర కరుణాసాగరా .....
ఏ పేరున నిను పిలిచేనురా ..... ఏ రూపముగా కొలిచేనురా .....

తిరుమల మందిర సుందరా .... సుమధుర కరుణాసాగరా .....

పాలకడలిలో శేషశెయ్య పై పవళించిన శ్రీపతివో .....
వెండికొండపై నిండుమనముతో వెలిగే గౌరీపతివో .....
ముగురమ్మలకే మూలపుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తివో .....

తిరుమల మందిర సుందరా ..... సుమధుర కరుణాసాగరా .....

కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును గడియైనా .....
కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును గడియైనా .....
నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలొక రేయైనా .....
నీ పదముల పై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైనా .....

తిరుమల మందిర సుందరా ..... సుమధుర కరుణాసాగరా .....
ఏ పేరున నిను పిలిచేనురా ..... ఏ రూపముగా కొలిచేనురా .....

తిరుమల మందిర సుందరా ..... సుమధుర కరుణాసాగరా .....

సినిమా : సినిమా పాట కాదు. ప్రైవేట్ పాట
సాహిత్యం : దాశరధి గారు
గానం : ఘంటసాల గారు

ఆడియో : http://www.chimatamusic.com/search.php?st=tirumala+mandira

13 comments:

durgeswara said...

మధురదరహాసాల స్వామికి మందారమాలలాంటి సమర్పణమీ గీతం

Bhardwaj Velamakanni said...

Ahh Welcome back!

KK said...

ఇది మేనకోడలు చిత్రం లోనిది కదా...ప్రైవేట్ పాట అంటారేమిటి?

పద్మ said...

దుర్గేశ్వర గారూ,

నిజం చెప్పారు. పాట విన్న ప్రతిసారి ఆ స్వామి దర్శనం జరుగుతుంది.

థాంక్స్ రౌడీజీ. :)

కె.కె గారూ,

మేనకోడలు సినిమాలో ఈ పాటని వాడుకున్నారు. కాని మూలం ఘంటసాల గారు పాడిన ప్రైవేట్ ఆల్బంలో పాట.

జ్యోతి said...

Welcome back .. పద్మగారు తరచూ రాస్తుండండి మరి..

te.thulika said...

ఈపాట నేనెప్పుడూ వినలేదు. వినడం మొదలుపెట్టినప్పుడు ఇంతగా కదిలిస్తుందనీ అనుకోలేదు. థాంక్స్ పద్మా!

ఏకాంతపు దిలీప్ said...

అయిబాబోయ్! ఎప్పుడొచ్చారండి మళ్ళీ... :-) నేను గమనించనే లేదు..

పద్మ said...

అవును మాలతిగారూ, భక్తి భావం ప్రతి పదంలోనూ నింపుకున్న ఈ పాట ప్రతి హృదయాన్ని తప్పకుండా కదిలిస్తుంది.

అంతేనండి దీపు గారూ. రాలేదు రాలేదు అంటారు. వస్తేనేమో వచ్చిన నాలుగు రోజులకి గానీ గమనించరు. :p

Anonymous said...

మోరా,
" ఏ చోట గాంచిన నీవుందు వందురే
ఏమిటో నీ మాయ తెలియ కున్నామయ్యా
ఈ అడవి దారిలో చేయూతనీ దేవా .. ఆ..ఆ "

ఈ పాట ప్రిస్కూల్ నే పాడగా మా అమ్మ విని తెగ సంబరపడిపోయేదట- ' మా బాబే, బంగారే , ఎంతబాగా పాడతావురా ' అని! :)

బహుకాల బ్లాగణం (దర్శనం) , ఎల్లరూ సుఖులే కదా? :)

శంకర్

పద్మ said...

శంకూ :))))))))))))))))))))))))))))) బహుకాల దర్శనం. కుశలమేనా?

వెంకన్న మీద ఘంటసాల వారు పాడిన పాటలు (ముఖ్యంగా ప్రైవేట్ పాటలు) ఆణిముత్యాలు కదా. మీరు తప్పకుండా ఈ పాటలు రికార్డ్ చేయాలి. మీ సరాగాల్లేవు ఈ మధ్య.:)

ఏడుకొండలు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవాలని తపించే వారిలో, స్వామీ ఎక్కడున్నావయా, ఈ అడవి దారిలో చేయూతనీ దేవా అని పాడని వారుంటారా? అబ్బే! నేను బస్, కారు ఎక్కి అరగంటలో కొండ మీద ఉండేవారి గురించి మాట్లాడటం లేదు. :)

Anonymous said...

అబ్బే లాభం లేదు. నా పాటలు వినడం ద్వారా రచ్చబండ జనాలు తమ పాపపరిహారం చేసుకోలేరు. వీళ్ళ పాపాలు .. హెలికాప్టర్ ఎక్కించి పావురాలగుట్టకు పంపించి, ఖండాలుగా చేయించి, బార్బిక్యూ చేయించి, ఆఖరున స్తూపం కట్టి నివాళులర్పిస్తే గాని, పాపపరిహారం కావు. అందుకే , వీళ్ళకు వీజీ మార్గం ఇవ్వకూడదనుకున్నా.. అంతే! :)))))

శంకర్

పద్మ said...

శంకూ :))))))))))

ఇప్పుడు బండ మీద పాపులే కాదు కాకులు కూడా లేవు. గుట్ట మీదకి ఎగిరెళ్ళిపోయాయి.

ఆన్ ఎ సీరియస్ నోట్ : మీరు తప్పకుండా పాడాలి.

日本ダービー said...
This comment has been removed by a blog administrator.