Sunday, January 27, 2008

చందమామా ..... అందాల మామా .....

చందమామా ..... అందాల మామా .....

నీ ఎదుట నేను ..... వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు .....
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు .....

పెళ్ళిచూపులకు వారొచ్చారు

చూడాలని నే ఓరగ చూశా .....
పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలినా సిగ్గొచ్చింది
కన్నుల దాకా కన్నులు పోక
మగసిరి ఎడదనె చూశాను .....
మగసిరి ఎడదనె చూశాను
తల దాచుకొనుటకది చాలన్నాను .....

నీ ఎదుట నేను ..... వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు .....

పెళ్ళిచూపులలో బిగుసుకొని
పేరేమి చదువేమి
ప్రేమిస్తావా వయసెంతా .....
పెళ్ళిచూపులలో బిగుసుకొని
పేరేమి నీ చదువేమి నను ప్రేమిస్తావా వయసెంతా
అని అడిగారా ..... అసలొచ్చారా .....
నాలో వారు ఏం చూశారో నావారయ్యారు .....
నాలో వారు ఏం చూశారో నావారయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంటా .....

నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు .....

చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరివంటారు .....
చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరివంటారు .....
ఆ వెన్నెలలోని వేడిగాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను .....
అనుభవించి అనమంటాను
వయసుకు వైరివి నీవంటాను

నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు .....

చందమామా ..... అందాల మామా .....

సినిమా : తేనె మనసులు
సంగీతం : కె.వి.మహదేవన్ గారు
సాహిత్యం : ఆత్రేయ గారు
గానం : పి.సుశీల గారు

ఆడియో : http://www.andhravilas.com/moviedetail.asp?fid=%7C48%7C75%7C133

2 comments:

Anonymous said...

ఆ చివరన , నిప్పులు , రవ్వలూ నాకు నచ్చలేదు. కవికి ఏది ఎక్కడ రాయాలో తికమక పడినట్టున్నాడు. చంద్రునిలో నిప్పులేమిటో! ఇది రికార్డ్ లో లేదేమో కదా.

శరత్

పద్మ said...

రికార్డ్ లో లేదా? కింద లింక్ మీద క్లిక్కారా? వేరే లింక్ ఏదన్నా విన్నారా?

చంద్రుడు అజాతశత్రువు అనుకున్నారేంటి. విరహంలో ఉన్నవారందరికీ శత్రువు మరి. వారందరికీ ఏసీ కూడా రోహిణీ కార్తె ఎండల్లా అనిపించేలా చెయ్యగలడు. :p