Tuesday, January 15, 2008

స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ .....

పాటలు వింటూ పడుకోవటం చాలా చెడ్డ అలవాటు. అదీ లాప్‌టాప్‌లో వింటూ పడుకోవటం చాలా చాలా చెడ్డ అలవాటు. :( లాప్‌టాప్ మానిటర్ విరక్కొట్టాక అయింది ఈ జ్ఞానోదయం. ఇంత సున్నితంగా ఉంటాయేంటో ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు. హు. మళ్ళీ ఖరీదు చూస్తే ఆకాశంలో విహారం.

పైకి కనిపించని పగులు, పోలీసు దెబ్బల్లా. :((( అసలా పగలటం కూడా కళాత్మకంగా పగిలింది. ఒక పక్క అంతా తెల్లగా మధ్యలో కోడిగుడ్డు ఆకారంలో నల్లగా ఆ నలుపు మధ్యలో పొడుగ్గా పెద్ద పగులు గీతలు కింద అడ్డంగా చిన్నవి. అచ్చం చిన్నప్పుడు టి.విలో స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ అంటూ పైనించి కిందకి దూకుతూ క్లోజప్పులో చూపించే మొహమే. (అంటే ఇప్పటి స్పైడర్ మాన్ మొహం అలా ఉండదా అంటే అలానే ఉంటుంది కానీ చిన్నప్పటి జ్ఞాపకాలే గుండెకి దగ్గర కదా సో టక్కున అవే గుర్తొస్తాయన్నమాట. ఇప్పుడు బాగా ఇష్టమైనది ఏది అంటే పిజ్జా విత్ అలపెన్యోస్ అని చెప్పే ఛాన్స్ తక్కువ కదా చిన్నప్పుడు తిన్న మినప రొట్టె విత్ ఆవకాయ అని చెప్పే కన్నా. అలాగన్నమాట.

ఏతావాతా విషయం ఏంటంటే ప్రస్తుతం స్క్రీన్‌కి ఒక పక్క ఏమవుతోందో మటుకే తెలుస్తోందన్నమాట. రెండోవైపంతా

స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ డస్ వాట్ ఎవర్ ఎ స్పైడర్ కాన్
స్పిన్స్ ఎ వెబ్, ఏని సైజ్ కాచెస్ థీవ్స్ జస్ట్ లైక్ ఫ్లైస్
లుక్ ఔట్ హియర్ కమ్స్ ద స్పైడర్ మాన్ .....

4 comments:

Anonymous said...

aahaa! super kadaa! ala variety ka viraggottadam kondarike chetanoutundi!
verasi cheppochchedi entante ... laptop lo paataloo vinachchu, vintoo padukonuvachchu kaani kaasta chetulaki/kaallaki andakunda dooranga unchite nayam, adi vaagi vaagi ade padukuntundi, marnaatiki daaniki halloween costumes kuda todakkundaa untaaru janaalu! lekapote lappyle paadu kovali ee paata 'look out, here comes....' ani :D

పద్మ said...

అవునవును. కొందరికే, కొన్నింటికే చేతనవుతుంది. :p నా లాపీ కూడా నా కళాపోషణ వంటబట్టించుకుంది మరి. :p

మరి కిలోమీటర్ దూరానికి అందేలా హెడ్ సెట్ కేబుల్ తయారు చేస్తే బానే ఉండును. కానీ ఈ తయారు చేసే కంపనీ వాళ్లందరు పీనాసివాళ్ళనుకుంటా. మీ సలహా అటు చెప్తే బోలెడుమందికి ఉపయోగం. ;)

Anonymous said...

సలహాలు బానే చెప్తున్నారే....కాకపోతే కొంచెం ఆలస్యంగా చెప్తున్నారు - అలాంటి అవసరాలకి ఎక్ష్టెన్షన్ వాడవచ్చన్న ఇంటెన్షన్ ఉంటే బానే ఉండేది! ఎక్కడ దొరుకుతుందో తెలీకపోతే అడగండి చెప్తాను.

సరే కాని, మీకు జన్మదిన హార్థిక శుభాకాంక్షలు! :-)

పద్మ said...

సలహాలు చెప్పామా లేదా అన్నది ముఖ్యం. ఎప్పుడు అన్నది కాదు.

ఓహో ఇప్పుడు తెలిసింది కాబట్టి ' ఎక్కడ ' దొరుకుతుందో చెప్తారా?

థాంక్స్ :)