Friday, November 9, 2007

శ్రీరామ సుగుణధామా .....

రామ సుగుణధామా రఘువంశజలధిసోమా .....
శ్రీరామ సుగుణధామా .....సీతామనోభిరామా సాకేతసార్వభౌమా .....
శ్రీరామ సుగుణధామా .....

మందస్మిత సుందర వదనారవింద రామా
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా
మందార మరందోపమ మధురమధురనామా .....
మందార మరందోపమ మధురమధురనామా

శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా .....
శ్రీరామ సుగుణధామా .....

అవతారపురుష రావణాది దైత్యవిరామా
నవనీత హృదయ ధర్మనిరతరాజలలామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా .....
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా

శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా .....
సీతామనోభిరామా ..... సాకేతసార్వభౌమా .....
సీతామనోభిరామా .....

5 comments:

Anonymous said...

నా కిష్టమైన పాట ఎప్పుడొస్తుందో ఏమో !

శంకర్

పద్మ said...

మీకిష్టమైన పాట అంటే ఏది శంకూ? పిల్లల పాటలేగా అన్నాను? రామాయణం మొదలు నించి అయోధ్యలో ముగించటం వరకు. నాలుగు పాటలే ఆ వరసలో. కానీ నాకు రామ సుగుణధామ కూడా నచ్చి పోస్ట్ చేశాను. :) మిగతావి కూడా అనుకుంటున్నాను.

మీకు కావలసిన పాట ఏంటో చెప్పండి. పోస్టుతాను.

Anonymous said...

1) ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?
2) 'సందేహింపకుమమ్మా, రఘురాము ప్రేమను సీతమ్మా'
పాటలు కన్నా , పాటల మీద వ్యాఖ్యానం ఎలా వుంటుంది అని చూస్తున్నా :)

శంకర్

Anonymous said...

navaneetha hrudaya dharma nirata raaja lalaama andi...rajalaraama kadu..
dayachesi gamaninchagalaru

పద్మ said...

అనానిమస్ గారు. సరి చేసినందుకు ధన్యవాదాలు.