Sunday, November 4, 2007

రామకథను వినరయ్యా .....

రామకథను వినరయ్యా .....
రామకథను వినరయ్యా .....
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా

అయోధ్యా నగరానికి రాజు దశరధ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు
కౌసల్యా, సుమిత్రా, కైకేయీ
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు
రామలక్ష్మణభరతశత్రుఘ్నులు

రామకథను వినరయ్యా .....
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా

ఘడియ ఏని రఘురాముని విడచి గడుపలేని ఆ భూజాని
కౌశిక యాగము కాచి రమ్మని .....
కౌశిక యాగము కాచి రమ్మని
పలికెను నీరదశ్యాముని

రామకథను వినరయ్యా .....

తాటకి దునిమి జన్నము గాచి
తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున .....
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిధిలకు దాశరధి

రామకథను వినరయ్యా .....

మదనకోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము .....
ధరణిజ మదిలో మెరసిన మోదము
కన్నుల వెన్నెల వీచినది

రామకథను వినరయ్యా .....

హరుని విల్లు రఘునాధుడు చేగొని
ఎక్కిడ ఫెళఫెళ విరిగినది
కళకళలాడే సీతారాముల .....
కళకళలాడే సీతారాముల .....
కళకళలాడే సీతారాముల .....
కళకళలాడే సీతారాముల
కన్నులు కరములు కలిపినవి

రామకథను వినరయ్యా .....
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా

గానం : పి.లీల గారు, పి.సుశీల గారు

ఎంత చక్కటి తేట తెలుగు పదాలు. మొదట భయపడినట్టే అయింది. ఈ పాటలన్నీ ఒకటికి పదిసార్లు వింటే తప్ప కొన్ని పదాలు అర్థం కాలేదు. ఒక్క పదం కోసం 5 వెబ్ సైట్లు తిరగేసాను. ఇరవై సార్లు విన్నాను. నేనే కాదు నా స్నేహితుడిని కూడా వినేలా చేసి ఆ పదం గురించి డిస్కస్ చేసుకుని చివరికి ఫలానా అని తేల్చాము. నా ఆ స్నేహితునికి ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా కష్టం అనిపించింది. కానీ ఆ పాట ప్రతిపదార్ధంతో చక్కటి గానంతో వింటుంటే ఆ కష్టం ఒక లెఖ్ఖా అనిపించింది. ఇటువంటి వీనుల విందు కోసం ఎటువంటి కష్టం అయినా పడవచ్చునేమో.

1 comment:

Dr.Suryanarayana Vulimiri said...

పద్మ గారు, ఎంతో ఓపికగా, చక్కగా లవకుశ పాటల సాహిత్యాన్ని అందించినందుకు కృతజ్ఞతాభివందనములు. త్వరలో నా ఘంటసాల బ్లాగులో ఈ సాహిత్యాన్ని క్రోడీకరిస్తాను. www.vulimirighantasala.blogspot.com