Sunday, November 11, 2007

ప్రేమ - స్వార్థం - అనుమానం

లవకుశలో సందేహించకుమమ్మా పాట అంటే నాకూ, మా అమ్మకి బాగా ఇష్టం. పాట సాహిత్యం, సంగీతం, ఘంటసాల గానం ఒక ఎత్తు అయితే ఆ పాటలో నమ్మకం, భక్తి ఇంకొక ఎత్తు. ఒక్కోసారి మనకి ఎదుటి మనిషి గురించి ఎంతో తెలుసు అనుకుంటాం కానీ కొన్ని సందర్భాలలో అసలు మనకేం తెలుసు అని మనలని మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఎంతో తెలిసిన మనిషిలోనే మనకి ఏమీ తెలియని మరో కోణం ఉండవచ్చు. మనం బాగా అర్థం చేసుకున్నాము అనుకున్న వ్యక్తి మనకి పూర్తిగా అర్థం కాకపోనూవచ్చు.

సీత రాముడికి అత్యంత సన్నిహితంగా మసిలిన వ్యక్తి. ఆయన సగభాగంగా ఆయన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. కానీ ఆవిడ కూడా లిప్తకాలం రాముడిని అనుమానించింది.

వాల్మీకి రాముడిని ఆయన ఊహాలోకంలో తప్ప చూడని వ్యక్తి. కానీ రాముడు ఎటువంటివాడో, ఆయన నమ్మకాలేమిటో, ఆయన వాటిని ఆచరణలో ఏ విధంగానూ తప్పడని పూర్తిగా నమ్మిన వ్యక్తి. రాముడు ఇచ్చిన మాట తప్పడనీ, ఒకసారి వదిలిన రామబాణానికి తిరుగులేదనీ, రాముడు పరస్త్రీని కన్నెత్తి చూడడనీ, ఆకాశం విరిగి మీద పడ్డా చలించడనీ, తన వ్రతానికి ఎట్టి పరిస్థితులలోనూ భంగం కలగనివ్వడనీ సంపూర్ణంగా నమ్మిన మనిషి. ఆ నమ్మకంతోనే రాముడు అశ్వమేథయాగం చేస్తున్నా ఏకపత్నీవ్రతభంగం కానివ్వడని నమ్మాడు.

కానీ సీత అనుమానించటంలో తప్పు లేదేమో. వాల్మీకికి రాముడి పట్ల ఉన్నది భక్తి, భక్తితో కలిగిన ప్రేమ. ఆ ప్రేమ విశ్వజనీనమైనది. రాముడు తనకొక్కడికే కాదు, పూర్తి జగత్తుకి చెందినవాడనీ, ఆయనని ప్రేమించే హక్కు, ఆయన ప్రేమ పొందే హక్కు అందరిదీ అని నమ్మినవాడు. కానీ సీతది విశ్వజనీనమైన ప్రేమ కాదు. ఒక భార్యగా తన భర్త తనకే సొంతం అన్న కోరిక, విశ్వాసం. స్వార్థమేనేమో కానీ భార్యభర్తల ప్రేమలో స్వార్థానికి చోటు ఉండటంలో తప్పు లేదేమో. భార్యగా, భర్తగా జీవితభాగస్వామి ప్రేమ పూర్తిగా తనకే చెందాలి అని స్వార్థపడటం తప్పు కాదేమో. ఆ స్వార్థంలో కించిత్ అనుమానం సహజమేనేమో. :)

9 comments:

Anonymous said...

ఈ సినిమాకు పెండ్యాల ఎక్కువ డబ్బు అడిగేసరికి, నిర్మాతలు ఘంటసాలను సంగీత దర్శకునిగా తీసుకున్నారట! మేస్టారు , తక్కువ డబ్బుకే , అద్భుతంగా సంగీతం సమకూర్చాడు. తను రిజెక్ట్ చేయబట్టే, ఘంటసాల ద్వారా ఇంత మంచి సంగీతం వినే అదౄష్టం అందరికీ కలిగింది ' అని పెండ్యాల స్వయంగా ఘంటసాలను ఆప్యాయంగా మెచ్చుకున్నారట, ఓ సభలో!

అడవిలోవుంటూ, రాముడు వేసే ప్రతి అడుగు మీద అంత నమ్మకంతో వున్నాడంటే, ఎంత క్షుణ్ణంగా రాముడి అంతరంగాన్ని చదివాడంటే .. సీత కూడా అంత సన్నిహితంగా వుండి వూహించలేకపోయింది ! అది ఇక్కడ గమనించాల్సిన విషయం.

" మిన్నే విరిగి పడినా.... " దగ్గర ఆ ఆలాపనలో ఘంటసాల అద్భుతంగా కళ్ళు చమర్చేలా ఈ భావాన్ని పాడాడు. దటీజ్ ఘంటసాల!

నైస్ ! థేక్స్ అమ్మీ , బాగా రాశావు.

శంకర్

పద్మ said...

థాంక్ యూ :)

పెండ్యాలగారిని మొదట సంగీత దర్శకులని అనుకున్నారని తెలీదు శంకూ. పెండ్యాలగారి సంగీతం కూడా బావుంటుంది కానీ ఘంటసాలగారు లవకుశకి ఇచ్చిన సంగీతం నిజంగా అజరామరం. ఆ సంగీతానికి పి.లీల, పి.సుశీల గార్ల గానాలాపన చెవులకి షడ్రసోపేతం అనిపించకమానదు. ఇద్దరు పోటీలు పడి మరీ పాడారేమో అనిపిస్తుంది. అప్పట్లో ఇప్పటిలాగా అధునాతనమైన పధ్ధతులు కాదు కదా. ఒకరు వారికి వీలున్నప్పుడు వచ్చి పాడి వెళ్తే ఇంకొకరు వారికి వీలున్న సమయంలో పాడటానికి. ఇద్దరు కలిసి పాడాలి. కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ మొదలు. మరి అంత కష్టమైన పాటలు అంత గొప్పగా కొంచెం కూడా శృతి తప్పకుండా ఇద్దరు కలిసి పాడారంటే ఎంత కష్టపడి ఉండాలి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుండాలి. వారిలా పాడగలిగినవారు ఇంకొకరుండరు. పుట్టరు, పాడలేరు.

రాజశేఖర్ said...

నాకు కూడా బాగా ఇష్టమైన పాట ఇది.
సంగీత దర్శకుడిగా పెండ్యాల గారిని అనుకున్నారని నాకు కూడా తెలియదు.

gsmanyam said...

suuper song idi padma gaaru ,idae kaadu ee cinemaaloni prati paata oka animutyam laantidi . enni saarlu ee cinema chuusaano naakae teliyadu good song padma gaaru

dandaalu sankar saab :)

Murali said...

"అనుమానం ఘాటైన ప్రేమకి ధర్మామీటర్ లాంటిది" - ముళ్ళపూడికి క్షమాపణలతో

పద్మ said...

ప్రేమ ఘాటుగా ఉంటుందా? ఎటువంటి ఘాటు? పచ్చిమిర్చి ఘాటా లేక అల్లం వెల్లుల్లి మసాలా ఘాటా? :p ఈ ఘాటు కాన్సెప్ట్ నాకెప్పుడు అర్థం కాదు. అందుకేనేమో పాతాళభైరవిలో ఎంత ఘాటు ప్రేమయో పాట నాకంతగా నచ్చదు.

నషాళానికి ఎక్కే ఘాటనా ముళ్ళపూడివారు ధర్మామీటర్ అన్నారు? మరి ప్రేమ ఎక్కువై అనుమానం కూడా ఎక్కువైతే ఆ ధర్మామీటర్ బద్దలయితే? :p

అనుమానం ప్రేమకి కొలబద్ద. ఈ మాట నిజం కానీ ఆ అనుమానానికి నమ్మకం పునాది అయ్యుండాలి. అప్పుడు ఆ అనుమానాలు దూదిపింజల్లా త్వరలోనే ఎగిరిపోతాయి. కానీ నమ్మకం అనుమానం మీద బలంగా ఉండలేదు. కింద పునాదే స్థిరం కానప్పుడు నమ్మకం ఎన్నిరోజులు నిలబడగలుగుతుంది?

Murali said...

సరే మీరిన్న్ని ప్రశ్నార్థకాలు పెట్టారు కాబట్టి ఒక్క వాక్యం కంటే "కుంచెం" పెద్ద వివరణ ఇస్తా.

నమ్మకం అనేది భార్యా భర్తలు ఒకరితో ఒకరు గడిపిన quality time వల్ల ఏర్పడుతుంది. ఐతే, ఒక సారి నమ్మకం ఏర్పడ్డా అది శాశ్వతం కాదు. ఎదుటి మనిషి ప్రవర్తన బట్టి, ఆ నమ్మకం పెరగడమో లేదా సడలడమో జరుగుతూంటుంది.


పెళ్ళి/ప్రేమ లాంటి సంబంధంలో, తమ అనుబంధం ఎంతో పదిలంగా ఉన్నవారు కూడా అప్పుడప్పుడు re-assurance కోరుకుంటూ ఉంటారు. అన్ని రోజుల వియోగం తరువాత, సీతమ్మకు రామయ్య మీద ఆ మాత్రం అనుమానం రాకపోతే ఆ ప్రేమనే మనం శంకించాల్సి వస్తుంది.

ఇక పోతే నమ్మకం ఉంది కాబట్టే వాల్మీకి దగ్గర సందేహం వ్యక్తం చేసింది. Third party perspective కోసం. :) అస్సలు నమ్మకం లేకపోతే అది కూడా చేసేది కాదు.

ఇంక ఘాటు అంటారా అది ఘాటో, తీపో, పులుపో నాకు తెలీదు కాని, పీకల్లోతు ప్రేమలొ పడిన వాళ్ళ పరిస్థితి, ముఖ్యంగా తొలి వలపులో ఐతే, చాలా ఖంగాళీగా ఉంటుంది. దాన్నే ఘాటు అని వ్యవహరించారేమో పింగళి వారు...

పద్మ said...
This comment has been removed by the author.
పద్మ said...

Well, కొన్ని విషయాలలో ఏకీభవించటం కష్టం.

Re-Assurance కోరుకోవటం కరక్టే కానీ అది అనుమానించి కాదేమో. ఎంత పదిలంగా ఉన్న అనుబంధంలోనైనా జీవితభాగస్వామి నించి ప్రేమపూర్వకమైన మాటలు చేతలు కోరుకుంటారు. అదే assurance ఇస్తుంది. అంతే కానీ అనుమానించి తర్వాత నమ్మకం కలిగించుకుని ..... కాదేమో.

// ఆ ప్రేమనే మనం శంకించాల్సి వస్తుంది.//

వియోగం/విరహం/దూరం ప్రేమని పెంచుతాయని విన్నానే. పెంచేది అనుమానాలనా? అనుమానాలని కలిగించని దూరాన్ని శంకించాలంటారా అయితే? :)

//Third Party Perspective//

I din quite understand what you meant by "third party perspective". మూడో మనిషి ప్రమేయం ఎందుకు? Why does she need a third party perspective in her private and personal matter? తనకి తన భర్త మీద ఉన్న నమ్మకం విషయంలో ఆవిడకి "Third Party Perspective" ఎందుకు అవసరం? ఒప్పుకోలేను.

Strong అన్న అర్థంలో ఘాటు అన్నారేమో మరి.