Tuesday, November 20, 2007

నమ్మకం - విశ్వాసం

గొంతు తీగలా సాగింది అంటే ఏంటో ఈ పాట వింటే బాగా తెలుస్తుందేమో. లేరు లీలసుశీలకు సాటి సరి గాయనీమణులు ధారుణిలో అనవచ్చునేమో. :)

నాకు లవకుశలో ఇష్టమైన ఇంకో పాట. పసివాళ్ళైనా ఆ పిల్లలకి ఎంత నమ్మకం వారి మీద. తల్లి దీవెన ఉంటే ఎంతటి కష్టసాధ్యమైన పనైనా చెయ్యగలం అన్న నమ్మకం. పెద్దవారి దీవెనల మీద ఎంతమందికి ఆ నమ్మకం ఉంటుంది? ఇదివరకు ఏ పనికి బయలుదేరేముందైనా ఇంట్లో పెద్దవారికి నమస్కరించి వెళ్ళేవారట. వారి దీవెనలు ఉంటే బైల్దేరిన పని సవ్యంగా అవుతుందని నమ్మకం. ఆ నమ్మకంతోనే ఓటమెరుగని రవికులశేఖరుడిని ఓడించగలమనే విశ్వాసమేమో ఆ పసికూనలకి. పెద్దవాళ్ళ పాదాలకి నమస్కారం చెయ్యటం, అక్షింతలు వేయించుకోవటం వెనక పరమార్థం ఇదేనేమో. ఎవరి దీవెనలు ఎలా ఫలిస్తాయో, నమ్మకం ఉండాలి అంతే. :)

No comments: