Thursday, September 27, 2007

నీకోసం

జనవరి నించి డిసెంబర్ దాకా
గ్రీష్మం నించి శిశిరం దాకా
తుషారాల హేమంతం నించి విరబూసే వసంతం వరకు
పగటి నించి రేయి దాకా
చంద్రోదయం నించి సూర్యోదయం వరకు
ప్రతి నిమిషం అందులో ప్రతి క్షణం
నా అలకలు, ఆలోచనలు, ఊహలు, ఉల్లాసాలు, భయాలు, ఆవేశాలు, సిగ్గు పూబంతులు, రోషాల కెంపులు అన్నీ నాకోసం పుట్టిన నీకోసం.

2 comments:

నిషిగంధ said...

నీ ఆలోచనలన్నీ ఋతువులకి పంచేసావుగా!! concept చాలా నచ్చేసింది :) మొన్న నేనెక్కడో నా రాతల్లో హేమంతపు ప్రస్థావన తీసుకొస్తే నువ్వే గుర్తొచ్చావు.. నాకు శరదృతువు ఇష్టం అని నేనంటే 'అబ్బే నాకు హేమంతమంటే ప్రాణం' అన్నావు.. చాలా బాగా రాస్తున్నావు.. చదవడమనే ఇష్తమైన పనిని మళ్ళీ మళ్ళీ చేయిస్తున్నందుకు చాలా థాంక్స్ రా :))

పద్మ said...

నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓపిగ్గా అన్నీ చదివినందుకు. :) కాన్సెప్ట్ నచ్చిందన్నావ్. థ్యాంక్ యూ సో మచ్. :) నా ఆలోచనలన్నీ హేమంతానికే మరి. హేమంతం లేకపోతే నేను లేను, నా ఆలోచనలు లేవుగా మరి. :p