Sunday, September 2, 2007

నమో భూతనాథా నమో దేవదేవా

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే .....
స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో .....
హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే .....
భూతాధిపా ప్రమథనాథ గిరీశచాపా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....

నమో భూతనాథా .....

భవ వేదసారా సదా నిర్వికారా .....
భవ వేదసారా సదా నిర్వికారా .....
జగాలెల్ల బ్రోవా ప్రభూ నీవె కావా .....
నమో పార్వతీవల్లభా నీలకంఠా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....
నమో భూతనాథా .....

సదా సుప్రకాశా మహాపాపనాశా ..... ఆ ఆ ఆ .....
సదా సుప్రకాశా మహాపాపనాశా .....
కాశీ విశ్వనాథా దయాసింధువీవే .....
నమో పార్వతీవల్లభా నీలకంఠా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....
నమో భూతనాథా నమో దేవదేవా .....

సినిమా : సత్య హరిశ్చంద్ర
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు గారు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు గారు
గానం : ఘంటసాల గారు, ఎస్.వరలక్ష్మి గారు

ఈ పాట సినిమాపాట అంటే నమ్మటం కష్టం. :)

అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంత దూరంలో ఉండి నీకివ్వగలిగే కానుక నీకు ఇష్టం అయిన ఈ పాట. :)

3 comments:

samurai said...

Mommieeee, Happy birthday wishes@!!!

పద్మ said...

Thanks from my Mom @samurai.

మొదట దడుచుకున్నాను. అసలు కామెంట్ పెట్టింది ఎవరా అని, అదీ విషెస్ చెప్తూ. :) నాకేం తెల్సు జపాన్ సమురాయ్ తెలుగు బ్లాగ్స్ చూస్తారని. :p

Anonymous said...

నాకూ చాలా ఇష్టమైన పాట, మోహన రాగం గారు.

భూతనాథ్