Friday, July 27, 2007

ఓ మైనా .....

ఓ మైనా ..... ఆ ఆ
నీ గానం నే విన్నా ఆ ..... ఆ ఆ
ఎటు ఉన్నా ..... ఆ ఆ ఆ ..... ఏటవాలు పాట వెంట రానా ..... ఆ ఆ

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ..... మరి రావే ఇకనైనా .....
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ..... కనిపించవు కాస్తైనా .....
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా .....

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ..... మరి రావే ఇకనైనా .....
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ..... కనిపించవు కాస్తైనా .....
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా .....

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ..... మరి రావే ఇకనైనా
లాల్లలలల్లల్లా లాలలాలలలల్లల్లా లలలాలాలాలాలాలా .....

ఎవరైనా ..... ఆ ఆ ఆ ..... చూశారా ఎపుడైనా ..... ఆ ఆ ఆ
ఉదయానా ..... ఆ ఆ ఆ ..... కురిసే వన్నెల వానా ..... హో
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా ..... ఆ .....
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా
నీలాకాశంలో వెండి సముద్రంలా పొంగే .....

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ..... మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ..... కనిపించవు కాస్తైనా .....

నన్నేనా .....ఆ ఆ ఆ ..... కోరుకుంది ఈ వరాల కోనా ..... హో
ఏలుకోనా ..... ఆ ఆ ఆ ..... కళ్ళ ముందు విందు ఈ క్షణానా ..... హో
సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుకా వనమంతా చూపించగా .....
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక వివరించు ఇంచక్కగా .....
సీతాకోకచిలుక తీసుకుపో నీ వెనుక వనమంతా చూపించగా .....
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక వివరించు ఇంచక్కగా .....
ఈ కారుణ్యంలో నీ రెక్కే దిక్కై రానా .....

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ..... మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ..... కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా .....

ఆహహహహ్హహ్హా ఓహోహోహోహోహ్హోహ్హో లలలాలా హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్

డూడుడుడుడుడూ ఓహోహొహొహొహొహోహో లలలాలాలాలాలాలా .....

సినిమా : అంతం (1990)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : ఆర్.డి.బర్మన్
నేపధ్యం : చిత్ర

ఈ పాట మొదట్లో నాకస్సలు నచ్చలేదు. బహుశా ఊర్మిళ కారణం అయి ఉంటుంది. కానీ తర్వాత్తర్వాత ఇష్టమైన పాటల లిస్ట్ లో చేరిపోయింది. చిత్ర చాలా హుషారుగా చక్కగా పాడింది కానీ పంటి కింద రాయిలాగా రెక్క అనాల్సిన చోట రక్క అంటుంది.

కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా ఒక్కొక్క తార చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా. ఎంత బావుంది ఈ భావన. వర్షాలు అంటే చిరాకు, ఎక్కడికీ వెళ్ళడానికి కుదరదు అంటారు చాలామంది. నిజమే కావచ్చు. అసలే ఎండిపోయిన నది పక్కన ఉన్న హైదరాబాదుకి కూడా వరదలొస్తుంటే ఇంక వర్షాకాలం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది. కానీ శ్రావణమాసంలో తెల్లవారుఝామున వర్షం పడుతుంటే ..... హ్మ్మ్ ..... బావుంటుంది :). కరిమబ్బులాంటి నడిరేయి కరిగిపోవటం అంటే సీతారామశాస్త్రిగారి ఉద్దేశ్యం ఏంటో తెలీదు కానీ నాకైతే ముందురోజు పడ్డ బాధ కానీ కష్టం నష్టం ఏదైనా కానీ రాత్రి తో అంతం అయిపోయి అవన్నీ కరిగి వానలా కురిసి అప్పటిదాకా మిణుకు మిణుకుమన్న నక్షత్రాలన్నీ తొలికాంతి కిరణాలుగా ఒక కొత్త ఉషోదయంతో కొత్త ఆశలతో సరికొత్త రోజుకి ఆహ్వానమేమో అనిపిస్తుంది.

4 comments:

Vinay Chakravarthi.Gogineni said...

atanu vennelani,suryodayanni varninchaadu andi...barshaanni.kaadu.........

నందు said...

వర్షం గురించి మీ భవాలు అమోఘం. కావచ్చు వాన మదిలో బాధలని కడిగేస్తే మరుసటిరోజుకి మీరన్నట్టే ఫ్రెష్ గా ఉంటుంది..కానీ వానదీ తనదైన అందం ప్రతీ ఒక్కరూ ఒక్కో పార్శ్వం చూస్తారు...నా బ్లాగ్ లోనూ వాన మీద రాసాను చదవండి వీలున్నప్పుడు..
http://anandoobrahma.blogspot.com/2009/06/blog-post_28.html

పద్మ said...

ధన్యవాదాలు నందుగారు. మీ పోస్ట్ చదివాను. కామెంట్ కూడా పెట్టేశాను. :)

నందు said...

ధన్యవాదాలండీ మరీన్ని కొత్త టపాలు ఆశిస్తున్నను మీ నుంచీ