Tuesday, January 10, 2012

విశేఖర్ గారూ, అనైతికతకి అర్థం చెప్పగలరా?

విశేఖర్ గారు అసభ్య వ్యాఖ్యలు ప్రచురించరట. మరి పెద్దలు బ్లాగ్మితృలు కాస్త ఈ కింద వ్యాఖ్యల్లో అసభ్యం ఏముందో వివరిస్తే అసభ్యం అన్న పదానికి అర్థం తెలుసుకోగలను.

---------------------------------------------------

మొదటి వ్యాఖ్య
----------------------------------
మీ వ్యాఖ్య అంగీకారం కొఱకు ఎదురుచూస్తున్నది

Padma
7:05 ఏ ఎమ్ వద్ద జనవరి 10, 2012
పద్మ గారి లాంటి వారు కూడా ప్రవీణ్ బూతుని విశేఖర్ కూడా ఉపసంహరించుకోవాలని కొరాడు గనక అది మద్దతుగా తెస్తూఎప్పుడు ఉపసంహరించుకుంటున్నావ్?’ అని ప్రవీణ్ ని కవ్వించడానికి ప్రయత్నించారే గాని, విశేఖర్ ని వ్యక్తిగతంగా దూషిస్తూ, ద్వేషిస్తూ దూషణల బ్లాగ్ తెరవడం సరికాదు అని ఒక్క మాట మర్యాదకైనా చెప్పలేకపోయారు.
——————————————————————————————–
విశేఖర్ గారూ, మిమ్మల్ని దూషిస్తూ ఒక బ్లాగ్ తెరిచారా? ఎక్కడ? ఒకవేళ మీరు ఆ మధ్య ఎప్పుడో పెట్టిన అబ్దుల్లా బ్లాగ్ గురించి అయితే సారీ, నేను అది కెబ్లాస వారిదంటే ఒప్పుకోలేను. కేవలం మిమ్మల్ని ఆ బ్లాగ్‌లో విమర్శించినంత మాత్రాన ఇక ఆ బ్లాగర్ కెబ్లాస సభ్యుడయిపోతారా? కెబ్లాస సభ్యులు తప్ప ఇంకెవరూ మిమ్మల్ని విమర్శించరు అని మీరనుకుంటున్నారా? అది తప్పకుందా ఒక భ్రమే విశేఖర్ గారు.

వీళ్లకి నచ్చిన భావాజాలాన్ని ఎవరూ విమర్శించరాదని వీరి అప్రకటిత రూలు. ”
—————————————————————————————————-
I am sorry to say Visekhar గారూ, మీరు కొంచెం ఎక్కువే ఊహించుకుంటున్నారు. ప్రకటిత రూల్సే లేవండి. ఇంక అప్రకటిత రూల్స్ ఎక్కడి నించి వస్తాయి? ప్రజాస్వామ్యాన్ని పాటిస్తే ఇదేనండి బాధ. అప్రకటిత రూల్ ప్రకటిద్దామన్నా ఉండదు. మీకు నచ్చని భావజాలాన్ని మీరు విమర్శించటంలేదా? అలాగే వారికీ ఆ హక్కు ఉండదా? సరే, ఉండకూడదు. ఆ భావజాలాన్నే విమర్శించాలి కానీ ఆ భావజాలం పైన ఒకరి అభిప్రాయాన్ని కాదంటారా? మరి అలాంటప్పుడు ప్రవీణ్ హిందుత్వమూ, హిందూ దేవుళ్ళు, వేదాలు వగైరా విషయాల మీద రాసిన ప్రతి బ్లాగ్‌లోకి వెళ్ళి అక్కడ ఎందుకండి విమర్శలు చేస్తాడు? అవి మీ కళ్ళకి కనబడవే?

పోనీ దీనికి జతగా ప్రవీణ్ అలా చేస్తే మేమూ ఉపసంహరించుకుంటాం అంటున్నారా? అదీ లేదు.
——————————————————————————————
భరద్వాజ మొన్న ఏమన్నారో మీరు చూడలేదనుకుంటాను. ఇది చూడండి.
http://malakpetrowdy.blogspot.com/2012/01/blog-post_06.html

దానికి ఎవరూ స్పందించలేదే?

పద్మ గారు కనీసం చిత్త శుద్ధిని కూడా కనపరచలేదు. పూర్తిగా ఏక పక్షం. ప్రవీణ్ ఊపసంహరించుకోవాలన్నదే ఆమే డిమాండ్. వారి గ్యాంగ్ పేర్లకింద బూతులు చూపండి అని తెలివిగా మాట్లాడడమే తప్ప బూతులు ఉండరాదన్న విషయంలో వారికి మాత్రం చిత్త శుద్ది కనిపించడం లేదు. ”
—————————————————————————————–
విశేఖర్ గారూ, మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రవీణ్ ఒక కుటుంబాన్ని లాగి కుటుంబ సభ్యులని బూతులు తిట్టినందుకు క్షమాపణ చెప్పాలని అడిగాను. ఉపసంహరించుకోవటం మాత్రమే కాదు. మీరు ఆ కామెంట్స్ డిలీట్ చెయ్యాలంటున్నారు. కానీ ఆ బూతు భరించలేని సభ్యసమాజంలో బ్రతికే మానవమాత్రుల కోసం ఆ బ్లాగ్ ఓనర్ ఆల్రెడీ డిలీట్ చేశారు. మీకు కావాలంటే స్క్రీన్‌షాట్స్ చూపగలరు. ఇక బ్లాగుల్లో బూతు ఉండరాదు అన్న విషయంలో నా చిత్తశుధ్ధి మీద మీకు చింత అనవసరం. మీరనే గాంగ్ పేర్ల కింద బూతులుంటే నేను వారిని అడగగలను. లేనప్పుడు ఎవరిని వెళ్ళి అడగమంటారు? ఎవరిని ఏకెయ్యమంటారు? నేను మీరనే “తెలివి”గా మాట్లాడింది మీకు అర్థం కాలేదని నాకు అర్థం అయింది సర్.

ఒత్తిడి తెచ్చి నాలాంటి వారి మద్దతు తీసుకుని ప్రవీణ్ ని రాక్షసీకరించాలన్న ప్రయత్నమే తప్ప ఇరు వైపులా బూతులు ఉండరాదు అన్న చిత్త శుద్ధి పద్మ గారు కూడా ప్రకటించలేకపోయరు. ఇది ఆమోదించలేని విషయం.”
———————————————————————————–
మీ మీద వత్తిడి తీసుకురావలసిన అవసరం ఏముందండి? మీ మీద ఒత్తిడి తీసుకువస్తే ఎవరికేం ఒరుగుతుంది? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కుటుంబాన్ని బైటికి లాగిన విషయంలో మీరు అవతలి గ్రూప్ వారు కూడా తప్పులు చేశారు అని ప్రూవ్ చెయ్యండి. నేను ఆ విషయంలో తప్పక మీకు మద్దతు ఇస్తాను. నేనేంటి, ఇప్పుడు విషయం ఇంత పెద్దది అయి ఇంతమంది ముందుకు వస్తున్నారుగా. అందరూ మీకు మద్దతిస్తారు.మునుపటి కామెంటులో చెప్పినట్టు మీరెంతసేపు అజ్ఞాత = కెబ్లాస అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారే కానీ ఆ అజ్ఞాతలు వేరే వారెందుకు కాకూడదు అని ఆలోచించరే? ఈ లెక్కన కెబ్లాసని తిట్టిన అజ్ఞాతలు ప్రవీణ్ లేక మీరు అని వాళ్ళనుకోవచ్చుగా? నేనెవరిని బూతు మాట్లాడవద్దని కోరాలంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అజ్ఞాతలనా? ఎలా అడగమంటారో కూడా చెప్పండి. తప్పకుండా బ్లాగ్లోకాన్ని కడిగేద్దాం. I am serious. At the same time, కెబ్లాస, ఇతర బ్లాగర్ల మీద అజ్ఞాతంగా వ్యాఖ్యలు రాసిన వారిని మీరు అడగండి. ఆ అజ్ఞాతలు వచ్చి క్షమాపణ చెప్పేలా చెయ్యండి. చెయ్యగలరా? కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని బాగు చేసుకుందామండి. ఊహాజనిత విషయాల మీద దృష్టి తర్వాత పెట్టవచ్చు.

ఇక బ్లాగుల్లో బూతులు ఉండరాదు అన్న విషయానికి నా మద్దతు నూరు శాతం ఉంటుంది. కానీ అజ్ఞాతలుగా వచ్చేవారిని మీరు నేనూ కనిపెట్టలేం కదండి. కానీ, ఇక నించి ఏ బ్లాగ్‌లో అయినా సరే అజ్ఞాత వ్యాఖ్యలైనా సరే, బూతు మాట్లాడింది కెబ్లాస సభ్యులని అని మీరు నిరూపించగలిగితే (ప్రవీణ్ అసలే నెట్వర్కింగ్ లో ఉద్దండ పండితుడు కదా. ఇది నేను చాలా వ్యంగ్యంగానే అంటున్నాను.) నేను కెబ్లాస నించి తక్షణం తప్పుకుంటాను. మీకు సమ్మతమేనా?

రెండో వ్యాఖ్య
--------------------------------------------------------
మీ వ్యాఖ్య అంగీకారం కొఱకు ఎదురుచూస్తున్నది

Padma
8:58 ఏ ఎమ్ వద్ద జనవరి 10, 2012
నేనన్నది: “మీ ఆలోచనలనీ, అభిప్రాయాలని పంచుకోవడానికికెలుకుడు బ్లాగర్ల సంఘంపెట్టారా? నచ్చలేదని హాస్యంగా చెప్పడానికి కెలకాలా? ఏం వివరణ అండీ?” అని.మీరన్నదానికీ, మీరన్నారని నేను చెబుతున్నదీ పైన ఇచ్చాను. రెండింటికీ తేడా ఉందా?”
———————————————-

ఖచ్చితంగా ఉంది. వారి ఆలోచనలనీ, అభిప్రాయాలనీ పంచుకోటానికి కాదండి. ఎప్పుడైతే ఒకరి అభిప్రాయాలు వారు ప్రచురించుకుని దాని మీద వీళ్ళ అభిప్రాయాలని వెల్లడిస్తే, ఆయ్ తప్పు అని కళ్ళెర్రజేసి నోటి మీద వేలు పెట్టుకోవాలని శాసించినపుడు మాత్రమే, అదీ వ్యంగ్యంగా. పైగా ఎంత చర్చించినా తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళంటారు కొందరు. వారి కోసం.

నచ్చని అభిప్రాయాలు ఉంటె చర్చకు దిగుతారని మాత్రమే నాకు తెలుసు. కానివిష శేఖర్అని ద్వేష పూరితంగ కెలుకుతారని మీ ద్వారా తెలుసుకుంటున్నా.”
అందులో ఇప్పుడే పోస్టు చూసాను. (ఇంతకు ముందెప్పుడూ అది చదవలేదు) నా పేరునువిష శేఖర్గా ప్రస్తావించారు. ఇది హాస్యం అని నేను నమ్మాలా? త్రాష్టుడు నా పేరు మారిస్తే దాన్ని అరువు తెచ్చుకుని మీరు (మీ బ్యాచ్) ఉదహరిస్తే అది హాస్యం అని నేను నమ్మాలి. కదండీ పద్మ గారూ?
——————————————
విశేఖర్ గారూ,ఒక్కటి చెప్పండి సూటిగా. మీరు త్రాష్టుడు అని అవతలి గుంపులో ఒక వ్యక్తిని అన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనకూడదని ఎలా అనుకోగలరు? మీది బాధ కానీ అవతలి వాళ్ళ చర్మం మటుకు మందం. How is it fair?


నేను అమెరికానీ, దాని విదేశాంగ విధానాలనీ విమర్శిస్తాను. హిందూ, (ముస్లిం కూడా) మత దురహంకారాలని విమర్శిస్తాను. కాని వ్యక్తిగతంగా ఎవర్నీ విమర్శించను.
కెలుకుడు గ్యాంగేమో నాపైనే వ్యక్తిగత దాడి చేస్తారు. విశేఖర్ అయితేవిష శేఖర్అంటూ పచ్చి వ్యక్తిగత ద్వేషం వెళ్లగక్కుతారు.”
————————————————————————————–

వ్యక్తిగతంగా ఎవర్నీ విమర్శించరు. నమ్మమంటారా విశేఖర్ గారూ?? అలా అనుకుంటే, విదేశాల్లో ఉన్న భారతీయులు పచ్చి దుర్మార్గులు, దేశభక్తి లేని వారు, ఇక్కడి డబ్బుతో చదువుకుని దేశం వదిలి ఎగిరిపోతారు. దేశాన్ని పట్టించుకోరంటూ మీరు ఒక పెద్ద పోస్ట్ వేసారే? దాన్నేమందామండి? నేను అమెరికాలో ఉంటాను. కానీ నా దేశాన్ని నేను మర్చిపోలేదు. కానీ మీ వ్యాఖ్య నాకు వ్యక్తిగతంగా ఎంత బాధ కలిగిస్తుందనుకుంటున్నారు? అది వ్యక్తిగత దాడి కాదంటారా? మిమ్మల్ని విషశేఖర్ అన్నందుకే మీరంత బాధపడుతున్నారే, మరి మీరు విదేశాల్లో ఉండే భారతీయులందరూ “దేశద్రోహులు” అన్నట్టు మాట్లాడితే, అది ఇంకెంత తీవ్రమైన వ్యక్తిగత దాడి విశేఖర్ గారూ?

నేను అమెరికానీ, దాని విదేశాంగ విధానాలనీ విమర్శిస్తాను. హిందూ, (ముస్లిం కూడా) మత దురహంకారాలని విమర్శిస్తాను
——————————————————-

ప్రపంచంలో అమెరికా, ఇండియానే కాదండి. ఇంకా చాలా దేశాలున్నాయి. చైనా, రష్యా, క్యూబా ……. ఇంకా వేరే మతాలూ ఉన్నాయి. వాటిల్లోనూ దురహంకారాలే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. మరి వాటి గురించి రాయరే? నా ఇష్టం అంటారా? కరెక్టే మీ ఇష్టమే. కానీ చెడు ఎక్కడ ఉన్నా చెడేననీ. అది ఏ మతంలో ఉన్నా, ఏ దేశపు విధానాలలో ఉన్నా దానిని ఖండించాలనీ మీరు నమ్మకపోతే అది మీ ఇష్టం. కాకపోతే ఆ చిన్న డిస్క్లైమర్ పెట్టుకుంటే కేవలం అమెరికానో, హిందూ/ఇస్లాం మతాలనో తిడితే చదివి మురిసిపోదాం అనుకునే వారే వస్తారు. Trust me. మీరా డిస్క్లైమర్ పెట్టండి. మీ మీద ఇంకే రకంగా విష ప్రచారం జరుగుతుందో చూద్దాం. మీరు ఎగతాళి అని అనుకుంటారేమో. నేను సీరియస్‌గానే చెప్తున్నాను.

నేను ద్వేషం వద్దు. పద్ధతిగా, మర్యాదగా మాట్లాడండి అంటాను. విషయం చర్చించండి అంటాను.
అప్పుడు కెలుకుడు గ్యాంగ్ యాక్టివ్ గా రియాక్ట్ అవుతుంది. ఏమని? “మీకు ఇతరులని విమర్శించే హక్కు ఎలా ఉంటుందో, మాకు మిమ్మల్ని విమర్శించే హక్కు ఉంటుందిఅని. ఎవరైనానీకు నన్ను విమర్శించే హక్కు ఎలా ఉందో నాకూ నిన్ను విమర్శించే హక్కు ఉందిఅంటారు. వీళ్ళు మాత్రం ‘(మమ్మల్ని విమర్శించకపోయినా) అమెరికా విధానాల్ని, హిందూ మత దురహంకార విధానాల్ని విమర్శిస్తే మాకు నిన్ని ద్వేషిస్తూ దుష్ప్రచారం చేసే హక్కు ఆటోమెటిక్ గా వస్తుందిఅంటారు. కెలుకుడు గ్యాంగ్ కదా!
ఇది కెలుకుడు తెలివి. కెలుకుడు గ్యాంగు నాపైన ప్రయోగించిన నీచ నికృష్టకెలుకుడుతెలివి ఇది.”
——————————————————————————————————————

విశేఖర్ గారూ, మీరొక్కసారి ఈ కింద లింక్ చదవాలి. కామెంట్లతో సహా. ట్రాస్‌కాన్ విషయంలో మీ అభిప్రాయాన్ని అప్పుడు జరిగినదేంటో తెలుసుకుందామని ఉంది నాకు.
http://kalalaprapancham.wordpress.com/2012/01/08/%E0%B0%85%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82-%E0%B0%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AE%E0%B1%80/

నేను వ్యక్తిగతంగా ఏమీ రాయకపోయినా, మూకుమ్మడిగా నా పైన వ్యక్తిగత విద్వేషం వెళ్ళగక్కడం ప్రోయాక్టివ్ గా రాయడం కాదా? ”
—————————————————-

వ్యక్తిగతంగా ఏమీ రాయకపోయినా అన్నది పైన చూశాం కదండి. నేను ప్రత్యక్షంగా చూసిన చదివిన విషయం గురించే మాట్లాడుకుందాం. విదేశాల్లో నివసించే భారతీయులందరూ దేశద్రోహులు అని తేల్చేశారు. అది వ్యక్తిగతం కాదు. మీరంతటి తీవ్రమైన ఆరోపణలు చెయ్యటం తప్పు కాదు. కానీ అంతే తీవ్రమైన పదజాలంతో అవతలి వాళ్ళు మీ అభిప్రాయాలని (మీ అభిప్రాయాలని మాత్రమే) నిరశిస్తే అది వ్యక్తిగతం.

మీ లక్ష్యం ఒక భావాజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం. అందుకు మీరెంచుకున్న పద్ధతి కెలుకుడు. ”
———————————————————————–

ఒక్కటంటే ఒక్క పోస్ట్ మీరనే ఒక భావజాలానికి వ్యతిరేకంగా ప్రొయాక్టివ్‌గా పోస్ట్ చేశారో చూపించండి విశేఖర్ గారు. ఒక్కటి చాలు. అది రియాక్షన్ కాకుండా ప్రొయాక్టివ్‌గా చేసిందని చూపించండి.

"ఒక భావాజాలం వ్యక్తం చేస్తున్నందుకు, భావజాలం మీకు ఇష్టం లెనందుకు, మీ ఇష్టం లేని భావజాలం వ్యక్తం చేస్తున్న వారిపైన వ్యక్తిగతంగా చేస్తున్న కెలుకుడు."
———————————

ఇదే మాట మిమ్మల్ని అంటే ఏమంటారు విశేఖర్ గారూ? మీకు ఇష్టం లేని భావజాలానికి సంబంధించినవారు కాబట్టే కెబ్లాస వాళ్ళు ఏం చేసినా మీకు తప్పు గానే అనిపిస్తోందనీ, వాళ్ళ మీద దుష్ప్రచారం మీకు సబబుగా అనిపిస్తోందని అంటే మీ సమాధానం?
మీ భావజాలాన్నీ, మీవి కొన్ని (మీవి మాత్రమే) అయి (మీరు నిర్ణయించేసి ప్రజల మీదకి వదులుతున్న) అభిప్రాయాల మీద నిరసన వ్యక్తం చేసినవారికి త్రాష్టుడు, నికృష్టుడు అని బిరుదులివ్వడం మీరు పేరు పెట్టకుండా చేస్తున్న మీ స్టైల్ కెలుకుడు అంటే మీరేమంటారు?

ప్రవీణ్ బూతుల్ని ప్రశ్నిస్తున్నవారు ప్రవీణ్ అనుభవించిన మానసిక టార్చర్ ని కూడా చూడాలని కోరతాను. టార్చర్ గాళ్ళని, కెలుకుడు గాళ్లని వ్యతిరేకించకుండా ప్రవీణ్ బూతుల్ని వ్యతిరేకించడం సాధ్యంగాదని మాట సాయం చేస్తున్నా.”
————————————————————–

మీకు ముందటి కామెంటులో చెప్పాను. ప్రవీణ్ అనుభవించిన టార్చర్‌ని మాత్రమే చూసిన మీరు మీ దృష్టిని కాస్త పక్కకి తిప్పి చాలా ముందటి నించి ప్రవీణ్ టార్చర్ చేసిన వారిని కూడా చూడాలని కోరుతున్నాను.

మూడో వ్యాఖ్య
---------------------------------------
మీ వ్యాఖ్య అంగీకారం కొఱకు ఎదురుచూస్తున్నది

Padma
11:26 ఏ ఎమ్ వద్ద జనవరి 10, 2012
Btw, ఇందాక ఒకటి అడగటం మర్చిపోయాను విశేఖర్ గారూ. దయచేసి నేను కామెంట్ పెట్టినదాన్లో ఎక్కడ ఈ కింద విషయం అన్నానో కాస్త చూపించగలరు.
—————————————————-

మీరు మొత్తం సంఘంలో ఉన్నాక ఒకరి పోస్టులకు మరొకరు అటోమేటిక్ గా బాధ్యులవుతారు. ‘మేమంతా కెబ్లాసఅంటూనే ఒకరి పోస్టులకి మరొకరు బాధ్యత లేదని మీరు చెబుతున్నారు. అది సమంజసం కాదు. పైగా అందులో యాక్టివ్ గా భాగం కానందుకు ఇప్పుడు చింతిస్తున్నానని కూడా అంటున్నారు. సంఘంలో ఉంటూ అందులో ఒకరికొకరు బాధ్యత వహించకపోవడం ఏంటసలు? బ్లాగ్ లో రాసే ప్రతీ రాతా, సంఘంలో ఉండే ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. అలా బాధ్యత తీసుకోలేని పక్షంలో బైటికి వచ్చి సెపరేట్ బ్లాగ్ పెట్టుకోవచ్చు. అది చేయకుండానా బాధ్యత లేదుఅని మీరు అనలేరు. అది నైతికం కాదు.”
———————————————-

నేను యాక్టివ్‌గా పార్టిసిపేట్ చెయ్యలేదన్నాను కానీ ఒకరి పోస్టులకి మరొకరో, నేనో బాధ్యత తీసుకోమని ఎక్కడ చెప్పానండి? లేక ఇది కూడా మీరు మీ “దృష్టి కోణంలో” నించి అర్థం చేసుకున్నదా? నేను అనని మాటని నా నెత్తిన రుద్దేసి అనైతికత అంటగట్టేస్తున్నారే? భలేవాళ్ళండి.
-------------------------------------------------

చదువరులు కాస్త పై వ్యాఖ్యల్లో అసభ్యం ఎక్కడ ఉందో వివరిస్తే నా తెలుగుని సవరించుకుంటాను. వీలైతే శబ్దరత్నాకరం కూడా మార్చేద్దాం. ఏమంటారు?

విశేఖర్ గారూ,
చర్చని పక్కదోవ పట్టించాలని చాలా ప్రయత్నాలు చేశారు ఇన్నిరోజులు. అది కుదరలేదు. దానితో ఏకంగా "అమ్మతనాన్ని" ఉపయోగించుకుని చర్చని భూస్థాపితం చేశారు. కానీ సర్, ఈ వ్యాఖ్యలు ప్రచురించి చేసుంటే బావుండేదేమో. మీరు సమాధానాలు చెప్పాలని కాదులెండి. చెప్పలేకే కదా ఈ పని చేశారు. కానీ మీరు మోపిన అభియోగాలకి నా సమాధానాలు తెలియాలి కదండి. కానీ ఒకటి మీరు ప్రచురించి ఉంటే ఖచ్చితంగా అదొక ఫ్లాష్ న్యూస్ అయ్యేది మీ ప్రవర్తనకి భిన్నంగా వెళ్ళినందుకు. :)))

ఒక్క విషయం గుర్తుంచుకోండి విశేఖర్ గారూ. ఎదుటివారిని "అనైతికులు" అని "వ్యక్తిగత దాడి" చేసే ముందు, వారి నైతికతని ప్రశ్నిస్తూ వేలెత్తి చూపే ప్రయత్నం చేసేటప్పుడు మిగిలిన నాలుగు వేళ్ళూ మీవైపే చూపిస్తున్నాయని గ్రహించుకోండి. మీ నైతికతని పరీశీలించుకోండి.

8 comments:

Sreenu Vattipally said...

ఈ గొడవ ఆగదా?

Srikanth M said...

పద్మగారూ, కొన్ని లైన్లు మీరు రాసారా లేక విశేఖర్ రాసినవా అన్నది తెలుసుకోవడానికి ఇబ్బంది పడేలా కలిసి పోయి ఉన్నాయి. కాస్త స్పేసులు ఇవ్వడాం కానీ, లేక అతను రాసిన వాటిని బోల్డ్ చేయడం కానీ చేస్తే బావుంటుంది అని అనిపిస్తోంది. వీలైతే చూడండి.

పద్మ said...

కష్టం శ్రీను. :) స్ట్రైట్‌గా వెళ్తున్నదాన్ని ఈ విశేఖర్ గారు ఇంకా క్లిష్టం చేసి కొనితెచ్చుకున్నారు. :)

శ్రీకాంత్ గారూ, సరి చేశాను. విశేఖర్ కామెంట్స్ అన్నీ బోల్డ్ చేశాను. Btw, మీ లింక్ వాడుకున్నాను ఒక వ్యాఖ్యలో. థాంక్స్ :)

శివరామప్రసాదు కప్పగంతు said...

This man calling himself Visekhar, I presume came into blog world to propogate some foreign ism. But ultimately achieved the opposite of it. He created such nausea towards Communists and people who propogate that outdated ism that in the near future nobody will ever look at such people with respect.

Having a favour for some kind of ism is one thing and angling anything and everything to propagate that is another thing. Because of his over anxiety to propagate the ism he appear to be liking, he only achieved complete hatred for that ism due to his lack of nicety in explaining and his over enthusiasm to somehow make others believe that his ism is great.

He started to write about International News and people started to read with interest. But ultimately all news he wrote about is angled and that too forcibly angled towards what he wants to influence the gullible among the readers whom he is targetting to turn them into somebody according to his plans.

Finally what he is thinking as his great ability of argument and debating powers is nothing but his own belief and did not impress anybody least of all the people he targeted.

Sravya Vattikuti said...

పద్మ గారు :))
మొత్తానికి విశేఖర్ గారికి మీ ప్రశ్న లకి సమాధానం చెప్పకుండా తప్పికోవటానికి ఒక దారి దొరికిందన్న మాట :)))
ఈ వ్యక్తిగతం , కుటుంబం గురించి ఒకే భావజాలాన్ని బహు గట్టి గా సమర్దిస్తూ అందులోను ఆ భావజాలం కోసం చెత్త రాతలని కూడా ఒప్పుకుంటున్న విశేఖర్ , ప్రవీణ్ లకి కొంచెం difference of opinion ఉన్నట్లుంది . ఒక రెండు రోజుల కిత్రం ప్రవీణ్ శర్మ గారిని ఈ చెత్త రాతలు ఎందుకు రాస్తున్నారు అని ఆడిగితే ఒక ఆణిముత్యాన్ని జారవిడిచారు అది

"పిల్లలని సరి గా పెంచటం తల్లిదండ్రుల responsiblility అది సరిగా చేయకపోతే వాళ్ళ అమ్మా , నాన్నలని ప్రవీణ్ గారి భాష లో తిట్టొచ్చు అని " మరి ఇప్పుడు విశేఖర్ గారేమో వేరే ఏదో చెబుతున్నారు . మరి దీనికి విశేఖర్ గారి సమాధానం ఏంటో ?

వీళ్ళిద్దరూ వాళ్ళ రాతలు సమర్దించుకోవటం కోసం మాటలు మార్చే frequency తో ఒక గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుందో :D

పద్మ said...

He started to write about International News and people started to read with interest. But ultimately all news he wrote about is angled and that too forcibly angled towards what he wants to influence the gullible among the readers whom he is targetting to turn them into somebody according to his plans.

Finally what he is thinking as his great ability of argument and debating powers is nothing but his own belief and did not impress anybody least of all the people he targeted.

-----------------------------------------------------------------

బాగా చెప్పారు శివరామప్రసాదు గారు. ప్రాబ్లెం ఎక్కడ వస్తుందంటే, ఇది కరెక్ట్ కాదు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేశారు అనటం. తన భావజాలానికి వ్యతిరేకులు కాబట్టి విమర్శిస్తున్నారని అనటం.

పద్మ said...

"పిల్లలని సరి గా పెంచటం తల్లిదండ్రుల responsiblility అది సరిగా చేయకపోతే వాళ్ళ అమ్మా , నాన్నలని ప్రవీణ్ గారి భాష లో తిట్టొచ్చు అని " మరి ఇప్పుడు విశేఖర్ గారేమో వేరే ఏదో చెబుతున్నారు . మరి దీనికి విశేఖర్ గారి సమాధానం ఏంటో ?"

-------------------------------------------

సమాధానమా శ్రావ్యా? హహహ. ఏంటి వస్తుందనే? అక్కడ అమ్మా, నాన్న అన్న పదాలు ఉన్నాయి, తిట్టు అనే పదం కూడా ఉంది. అది చాలు. ప్రవీణ్ ఆ మాట అన్నారని మీరూ అంటారా? మీ విష ప్రచారం కోసం చేశారిదంతా అనేసి నేను block చేస్తున్నాను అనేస్తారు. అప్పుడు ఎంచక్కా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండదుగా.

"వీళ్ళిద్దరూ వాళ్ళ రాతలు సమర్దించుకోవటం కోసం మాటలు మార్చే frequency తో ఒక గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుందో :D"
------------------------------------------------------------

కంగనా రనౌత్ తెల్సు కదా. ఆ అమ్మాయి పాపిడి కూడా ఈ గ్రాఫ్ కన్నా స్ట్రైట్‌గా ఉంటుంది.

Anonymous said...

Btw, మీ లింక్ వాడుకున్నాను ఒక వ్యాఖ్యలో.

you are welcome .. :-)

Srikanth.M