Saturday, March 31, 2012

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

శ్రీరామనవమి శుభాకాంక్షలతో ......

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
మధుర మధుర తర శుభనాముడు ...... గుణధాముడు ......
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

ఎరిగినవారికి ఎదలో ఉన్నాడు ...... ఎరుగనివారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడైనాడు .....
తలచినవారికి తారకనాముడు ...... పిలిచిన పలికే చెలికాడు సైదోడు ......
కొలువై ఉన్నాడూ కోదండరాముడు ...... మనతోడుగా నీడగా రఘురాముడు

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

కరకుబోయను ఆది కవిని చేసిన పేరు ...... గరళకంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపరసాధనకు ఇహమైన పేరు ......
శబరి ఎంగిలి గంగ తానమాడిన పేరు ...... హనుమ ఎదలో భక్తి ఇనుండించిన పేరు
రామ ...... రామ ...... అంటే కామితమే తీరు ...... కలకాలమూ మము కాపాడు పేరు

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
మధుర మధుర తర శుభనాముడు ...... గుణధాముడు ......
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

చిత్రం : పంతులమ్మ
సాహిత్యం : వేటూరి గారు
సంగీతం : రాజన్-నాగేంద్ర గార్లు
గానం : పి. సుశీల గారు

ఆడియో

7 comments:

Sravya V said...

మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలండీ !

చాణక్య said...

రామ.. రామా.. ఈ పాటలేమి రామా..?

కానీ ఆ పాట మొత్తం చదివితే నా గురించే రాసినట్టు లేదూ. నేను రాముడి నక్షత్రంలోనే పుట్టానులెండి. అంచేతన్నమాట..! ;)

KumarN said...

ఓహో, మీరు పోస్ట్ వేయాలీ అంటే, పండగయినా రావాలి, లేదంటే ఎవరికయినా మూడాలీ అన్నమాట. అంతేనా?
ఇది బాలేదు. సో, అప్పుడప్పుడూ రాస్తూండండి.
బైదవే, థాంక్స్. పంతులమ్మలో సిరిమల్లెనీవే, మానసవీణా తప్ప మిగతావేవి గుర్తులేవు నాకు :-)

పద్మ said...

ధన్యవాదాలు శ్రావ్యా. :)

పద్మ said...

అయితే ఆ పాట నా గురించి కూడానేమో చాణక్యా. :)

పద్మ said...

హహ కుమార్జీ. ఎవరికో మూడితే వరకూ ఓకే కానీ ప్రతీ పండగకీ పోస్ట్ వేస్తానా? అబ్బే, మా రామయ్య పుట్టినరోజు, పెళ్ళికొడుకైన రోజూ కాబట్టి ఆయన్ని ఇలా తలచుకున్నాను. :)

పంతులమ్మలో ఇంకో మంచి పాట "ఎడారిలో కోయిలా". గుర్తుందా? :) అయినా రంగనాథ్ పాటలు మీకేం గుర్తుంటాయిలెండి. ;) :P

"పండగంటి ఎన్నెలంతా" చాలా మందికి నచ్చే పాట. కానీ నాకెందుకో అంతగా నచ్చదు.

భాస్కర్ కె said...

వినాయకచవితి శుభాకాంక్షలండి,