Monday, October 25, 2010

ఎదురుచూపు

ప్రకృతి చల్లని వెన్నెలనిచ్చే రేరాజు కోసం ఎదురు చూస్తోంది .....
నా ఎదురు చూపులు నాకోసమే వెన్నెల తెచ్చే నీ కోసం .....
ఇంకాసేపట్లో ఆరుబయలంతా పుచ్చపువ్వులాంటి పున్నమి వెన్నెల పరచుకుంటుంది
నా మనసుకి ఇంకా అమాసే
సెలయేటిలో చిరునవ్వుతో విచ్చుకున్న కలువపువ్వు
చిరుగాలి చలికి ముడుచుకుని ఉన్న నేను
పండు వెన్నెల్లో హేమంత తుషారాలలో తడుస్తూ .....
ఒడిలో అలసి సొలసిన సఖుడి కోసం మోహనాన్ని మధిస్తూ .....
మనసుని మధువుతో నింపుతూ, నింపుకుంటూ .....
జీవనరాగం ఆలపించేదెన్నడో, ఎప్పుడో?

3 comments:

pranu said...

మధువును నింపుకున్న జీవనరాగమ్ మదిలో పలికేది మమతను పంచే మది చేరువైనప్పుడే!!బావుంది పద్మా మీ కవిత!!

pranu said...

మధువును నింపుకున్న జీవనరాగం మదిలో మోగేది, మమతను పంచే మది చేరువైనప్పుడే!!

మంచి కవిత పద్మ గారు!!

పద్మ said...

పూర్ణా, మీరేనా? మీ పేరు బావుంది. మీ కామెంట్ అంతకన్నా బావుంది. అసలు మీ కామెంటే ఒక చక్కటి కవితలా ఉంది. థాంక్ యూ. :)