Thursday, June 10, 2010

భారతీయత - నా అభిప్రాయం

Well, adding to Karthik's points అని కత్తి గారి సైట్లో కామెంట్ మొదలెట్టాను. చూస్తే ఒక పోస్ట్ సైజ్ కి పెరగటంతో అక్కడ కామెంట్ పెట్టటం కన్నా ఇక్కడ పోస్ట్ వెయ్యటం బావుంటుందనిపించి, ఇదిగో ఇలా.

భారతీయత - నా అభిప్రాయం

ఇక్కడ అనగా అమెరికాలో, in fact in all the countries I lived or visited so far except for India, high school అవగానే పిల్లలు బైటికి వెళ్ళిపోతారు. అప్పటి నించి వాళ్ళ కష్టాలు వాళ్ళే పడతారు. అందుకే ఇక్కడి విద్యాధికుల సంఖ్య కూడా తక్కువ ఎందుకంటే ఆ వయసుకి సరైన నిర్ణయాలు తీసుకునే వయసు, అనుభవం వాళ్ళకి ఉండవు. ప్రభుత్వపు ఫ్రీ చదువు ఉండదు. 17 యేళ్ళ తర్వాత తల్లితండ్రుల దగ్గర ఉండటం అవమానంగా భావిస్తారు ఇక్కడి పిల్లలు. ఇక్కడ స్థిరపడ్డ మాకు తెలిసిన భారతీయ కుటుంబంలో ఆడపిల్ల తనని అలా వెళ్ళనివ్వలేదని ఈ మధ్యే రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది కూడా. కానీ భారత దేశంలో పిల్లలు చదువుకుని స్థిరపడేవరకు తల్లితండ్రులు వారితోనే ఉంటారు. వారి మంచీ, చెడ్డా చూస్తారు. మరి ఈ కొత్త జనరేషన్ తల్లితండ్రులు ఠాఠ్, నాకీ భారతీయ విలువలు అనవసరం, నువ్వు నీ ఏడుపేదో ఏడు, మాతో ఉండొద్దంతే అని పిల్లల్ని తన్ని తగలేస్తే తప్ప. :)

ఇక కుటుంబ వ్యవస్థ విషయానికి వస్తే వీళ్ళకి కుటుంబ విలువలు తెలీవు అన్నది ఎంత అబధ్ధమో వీళ్ళు వ్యవస్థని భారతీయుల్లా గట్టి పునాది వేసుకుని నిలబెట్టుకుంటారనటం కూడా అబధ్ధం. వీళ్ళు కుటుంబానికి విలువ ఇస్తారు, తల్లితండ్రులని, అక్కచెళ్ళెళ్ళని ప్రేమిస్తారు. కానీ ఎవరైనా, ఏదైనా వారికి వారి తర్వాతే. భార్యైనా, భర్తైనా, పిల్లలైనా ఎవరైనా "తమ" తర్వాతే. భారత దేశంలో పిల్లలు పుట్టిన తరువాత విడాకులు తీసుకునేవారి సంఖ్య ఎంతుండొచ్చు? పిల్లలు పెరిగి పెద్దవారైన తరువాత విడాకులు తీసుకునేవారి సంఖ్య ఎంతుండొచ్చు? ఒకసారి పెళ్ళి అయ్యాక భార్య, భర్త ఇద్దరూ సద్దుకుపోతూ సంసారాన్ని ముందుకు లాగాలనే చూస్తారు కానీ విడిపోయి ఏదో సాధిద్దాం అనుకోరు. కనీసం అది భారతీయ తత్వం కాదు. కానీ ఇక్కడ? ఉదాహరణకి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన Al Gore, ఆయన భార్య 40 ఏళ్ళ వైవాహిక జీవితం అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇంక ఆయన పిల్లలు ఇద్దరూ అదే దారిలో నడిచారంటే వింతేమీ కాదు కదా. భారతదేశంలో నలభైయేళ్ళ వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోవటం అన్నది ఊహలోకి కూడా రాదు ఎవరికీ. అది మంచేనా లేక చెడా, ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితాంతం సద్దుకుపోవాలా అన్న విషయం ఇక్కడ అప్రస్తుతం. కానీ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశం కూడా పటిష్టంగా మనగలుగుతుంది. పిల్లలు ఎలా పెరుగుతారు, వాళ్ళ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటారు అనేది తల్లితండ్రుల మీద చాలా ఆధారపడి ఉంటుంది. పిల్లలకి సాధారణంగా తల్లితండ్రులే రోల్ మోడల్స్ అవుతారు దేశంలోనైనా. వారు చిన్నప్పటినించి చూసిన ప్రవర్తనే వారికి ఆచరణీయం అనిపిస్తుంది సాధారణంగా. అది తల్లితండ్రులని కావిట్లో మోసి పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణుడికైనా, మీనాన్నకి నువ్వు తీసిన గొయ్యి రేపు నీకు తియ్యాలి కదయ్యా అనే పిల్లవాడికైనా. అందుకే భారతదేశంలో కుటుంబవ్యవస్థకి అంత విలువ, అందుకే అది అంత పటిష్టమైన పునాది మీద నిలబడగలిగింది.

ఇక "వీళ్ళు ఎగేసుకెళ్ళేదీ అక్కడికే. అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదిస్తేగానీ భారతీయత వీళ్ళకు బూతద్దంలో పెట్టినట్లుకనిపించదు." విషయానికి వస్తే, మొట్టమొదట చిన్న కరెక్షన్. భూతద్దం అనుకుంటాను బూతద్దం కాదేమో. :( అర్థం దరిద్రంగా మారింది బూతద్దం అనేసరికి.

ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేది బ్రతుకుతెరువు కోసమే కదా. వెళ్ళింది అమెరికా అయినా, అమలాపురం అయినా, బెంగుళూరు అయినా చదువు కోసమో, బ్రతుకుతెరువు కోసమో తప్ప భారతీయత తెలుసుకోవటం కాదు కదా. లెక్కన, తెలుగువాళ్ళు కన్నడదేశానికి వెళ్తేనే వాళ్ళకి తెలుగుతనం, మహారాష్ట్రీయులకి పక్కన ఉన్న గుజరాత్ వెళ్తేనే శివాజి గుర్తొస్తాడు అన్నట్టుంది. :) అయినా ఇందులోనూ తప్పు లేదేమో. భారతదేశంలో ఉండి కూడా భారతీయ విలువలు తెలియకుండా ఉండటం కన్నా పరాయి దేశంలో ఉండి తెలుసుకుని ఆరాధించటం తప్పు కాదేమో.

"They have an institutional mechanism to take care of old."

I don''t think Karthik meant machine in his comment. Anyways, could you please explain what that mechanism is? కిందపడి లేవలేకపోతే మెళ్ళో ఉన్న విజిల్ ఊదితే ఎక్కడో ఉన్న కాప్స్ కి పిలుపంది వాళ్ళు వచ్చి రక్షించటం అంటారా? లేక నడవటానికి చేతకాక రకరకాల బటన్స్ ఉన్న చక్రాల బండి "కొనుక్కుని" రోజులు భారంగా గడపటం అంటారా? Do you even have an idea about how hard senior citizens here have to work to earn even at the age of 70 and above to meet their basic minimum needs? their insurance premiums?

ఇక ఆప్యాయత విషయానికి వస్తే మీరన్నది కరక్టే, ఆప్యాయతలు చాలా ఎక్కువ. సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే, ఫాదర్స్ డే అంటూ పూలు, కేక్స్ పంపించి వాళ్ళ ఆప్యాయతని చాటుకుంటారు. :)

మిడిల్ క్లాస్ అని అంత తేలిగ్గా అనేసారు మరి మీరు హై క్లాస్ వారా మిడిల్ క్లాస్ అంటే చిన్నచూపుకి? లేక లో క్లాస్ వారా మిడిల్ క్లాస్ అంటే కుళ్ళుకోవటానికి? :)

నిజమే, మనం భారతీయ విలువలతో అమెరికాని లేక ఇతర దేశాల్ని కొలవకూడదు. మరి ఇతర దేశాలకి సంబంధించిన వేటితోనైనా భారతదేశాన్ని ఎందుకు కొలవటం? అది తప్పు కాదా? ఎందుకు భారతదేశం అంటే ఇంత చులకన? అదీ దేశంలోనే ఉంటూ? కొంచెం ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటే ఇదేనేమో జరిగేది. ఎక్కడైనా, వ్యవస్థలోనైనా, దేశంలోనైనా అన్నీ అద్భుతమైనవే ఉండవు. అలా ఉంటే అది రామరాజ్యమే అవుతుంది. మంచిని తీసుకోకుండా ద్వేషాన్ని వెల్లగక్కడం వల్ల ఉపయోగం ఏముంది? మనిషి మీద ద్వేషం ఉంటే మనిషి మీద వెదజల్లండి. అది మీకు మీకు పరిమితం అవుతుంది కానీ ఒక దేశాన్ని, దేశపు విలువల్ని విమర్శించి ప్రపంచంలో తీవ్రవాదం కన్నా ప్రమాదమైనది స్వేచ్చగా మాట్లాడి, మనగలిగే ప్రజాస్వామ్యం అనిపించేలా చెయ్యకండి.
"

21 comments:

Malakpet Rowdy said...

LOL Sammeta debba :))

ఏకాంతపు దిలీప్ said...

పద్మ గారు,
బాగా చెప్పారు. అరకొర జ్ఞానంతో సాధికారంగా వితండ వాదం చేయగలిగే వాళ్ళని పట్టించుకోక పోవడం మంచిది. మన విలువలు మన దగ్గరే ఉంటాయి.
వేగంగా వచ్చే మార్పులతో కొంత కాలం సంఘర్షణ జరిగినా సనాతన విలువలు ఎక్కడికీ పోవు. మనం చేయాల్సిందల్లా మన పూర్వీకుల చెప్పిన మంచి మీద నమ్మకం ఉంచుకోవడం.

మంచు.పల్లకీ said...

ఒక మానసిక రోగికి చెప్పేపద్దతి ఇదికాదు.

Srujana Ramanujan said...

Well said

Anonymous said...

"ఎక్కడైనా, ఏ వ్యవస్థలోనైనా, ఏ దేశంలోనైనా అన్నీ అద్భుతమైనవే ఉండవు. అలా ఉంటే అది రామరాజ్యమే అవుతుంది"

రామరాజ్యమా? అదే౦టి అ౦త బూతు మాటల౦టున్నారు? అసలు రాముడే లేదని, రామాయణమే బూటకమని, మహా అయితే ఒక కోయ రాజు కావచ్చని, అయిన కూడా ఇ౦జనీరి౦గు డిగ్రీ సర్టిఫికేటు ఉ౦టేనే నమ్ముతామని చెప్పే మాలా౦టి సాధనా, శోధనా శూరుల దగ్గరా మీ కుప్పి గ౦తులు?

ఎదో ఈ దేశ౦లో పుట్టిన౦త మాత్రాన, ఈ దేశ౦ పై భక్తి వు౦డాలనే మీలా౦టి చా౦ధసులకు వివరి౦చాల్సిన అవసర౦ లేదు. కన్న౦త మాత్రాన తల్లికీ, పుట్టిన౦త మాత్రాన దేశానికీ పవిత్రత్వ౦ ఆపాది౦చే మీలా౦టి మూర్ఖులకు ఇ౦తక౦టే తెలివిడి ఉ౦టు౦దని ఆశి౦చలే౦. విశాలభావాలతో తల్లిని కూడా మరో ఆడదానిగా చూడగలిగిన వివేక౦ ఈ సమాజానికి ఎప్పుడు అలవడుతు౦దో.

స్వర్ణమల్లిక said...

చాలా చాలా బాగా చెప్పారు. అమెరికా మాత్రమె కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో కుటుంబ వ్యవస్థ అనేది కేవలం పేరుకు మాత్రమె. ఒక అమ్మ, ఒక నాన్న, కొందరు తోబుట్టువులు... ఒకరికి ఒకరుగా కలిసి ఉండేది ఎంత కాలం? చాలా స్వల్పం. ఒకసారి విడిపడినాక ఇక మీరు అన్నట్టు ఒక అమ్మల దినం, అయ్యల దినం, ప్రేమికుల దినం... ఇలా రక రకాల సందర్భాలు వెతుక్కుని కలుస్తూ ఉంటారు.

Anonymous said...

In USA or elsewhere outside India what I have noticed about marriage is this..

The first marriage is sacred and goes for a time (5+ years). Once that ends up in divorce, second marriage is a cautious step (takes a while for committment). If that too ends, the third one on wards go in a hurry and it is fun. Marry and divorce. This can go on and on. The professor I worked with had this fun over last 5 years and is still doing it :-) His first ended in 12 years, second one in 3+ yrs and now into third.

To sum up, this is the logic, first one is sacred, second one is causion, 3+ is fun.

పద్మ said...

@రౌడీ : ఇది సమ్మెట దెబ్బో మరోటో నాకు తెలీదు కానీ ఇలా ఎవరినో సాధిద్దామని అపరిపక్వ శోధన చేసి సొంత అభిప్రాయాలని నిజాలుగా అందరి మీదా రుద్దాలనే ప్రయత్నం చాలా తప్పు.

@దీపు : ఎప్పుడో అప్పుడు పట్టించుకోవటం తప్పదేమో. మేక, కుక్క కథ విన్నారా? ఒక బీద బ్రాహ్మడు మేక పిల్లని భుజాన వేసుకు వెళ్తుంటే ఓ నలుగురు దొంగలు ఆ మేకని కాజెయ్యటం కోసమని ఒకరి తర్వాత ఒకరు వచ్చి అది మేక కాదు కుక్క అని చెప్తే మొదట నమ్మని బ్రాహ్మడు చివరికి నలుగురు చెప్పారంటే ఇది నిజమే అయ్యుంటుంది అని ఆ మేకని చక్కా వదిలేసి పోతాడు. ఎప్పుడైనా ఒక నలుగురు పాడిందె పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు అదే వల్లె వేస్తే చివరికి అదే నిజమని స్థిరపడుతుంది. మన భవిష్యత్తరాలకి మనం అందించాల్సింది ఇలాంటి అరకొర పనికిరాని శోధనలు కావు. రామాయణ, మహాభారతాలు జరిగాయా లేవా అన్నది అసలు ముఖ్యమా? వాటిలోంచి నీతిని, మంచిని తీసుకోక అవి జరిగాయా లేదా అసలు రాముడున్నాడా లేదా అన్న పనికిమాలిన వితండవాదం చేసేవారిని పట్టించుకోకపోతే వాళ్ళు చాప కింద నీరులా పాకిపోతారు.

@ మంచుపల్లకి : సామదానభేదదండోపాయాలన్నారు కదండి పెద్దలు. ఇంక ఏం పధ్ధతులున్నాయో నాకు తెలీదు. :)

పద్మ said...

@ Srujana: Thanks. :)

@Anonymous : నిజమే రామా అన్న పదం బూతు అయిపోతోంది. :( జరిగిందో లేదో మనకి అనవసరం. అందులో ఉండే మంచిని ఎందుకు తీసుకోలేకపోతున్నాం? రాముడు చేసి చూపించినదంతా మంచి, నీతే. అది పాటించటం చేతకాని వారందరు ఆయన్ని తెగడడానికి ఎందుకు ముందుకొస్తారు? ముందు ఆయన చేసిన పనుల్లో సగంలో సగంలో సగంలో సగంలో సగంలో సగంలో ఒక పావు వంతు చేసి చూపించమనండి. చెయ్యటం చేతకాకపోయినా ప్రతివాడు మాట్లాడేవాడే.

@స్వర్ణమల్లిక గారు, బాగా చెప్పారండి. ఒకరికి ఇద్దరేసి తండ్రులు, ముగ్గురేసి తల్లులు, ఎవరు ఎవరికి పుట్టారో తెలియని బోలెడంతమంది అన్నదమ్ములు, అక్కచెళ్ళెళ్ళు. ఎంతెంత పెద్ద కుటుంబాలో. నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు అనే అత్యద్భుతమైన సంస్కృతినే ఇక మనం పాటించాలి, మన ముందు తరాలకి అందించాలి.

@Anonymous : What you said is of no relevance to the point of discussion. So, I have no comment to make.

అబ్రకదబ్ర said...

>> "ఒకరికి ఇద్దరేసి తండ్రులు, ముగ్గురేసి తల్లులు, ఎవరు ఎవరికి పుట్టారో తెలియని బోలెడంతమంది అన్నదమ్ములు, అక్కచెళ్ళెళ్ళు. ఎంతెంత పెద్ద కుటుంబాలో"

మన గురించి మనం గొప్పగా అనుకోటంలో తప్పులేదు. అందుకోసం ఇతరుల పద్ధతుల్ని నిందించనవసరం లేదేమో.

Anonymous said...

Words of wisdom. But, you try to educate a human-pig!
I agree with Eknath Dilip & Manchoorian Chiken. ;)

పద్మ said...

@చదువరులకి : అబ్రకదబ్ర గారు అన్నట్లు అది నిందావాక్యం అనిపిస్తే, please accept my sincere apologies.

@అబ్రకదబ్ర : ఈ దేశంలో ఉంటూ ఇక్కడి వారిని కించపరచటం, లేదా కొందరు ప్రబుధ్ధులలా అసలు భారతదేశానికి నాకు సంబంధం లేనట్టు ప్రవర్తించటం, భారతదేశంలో ఉంటూ ఆ దేశాన్ని తెగడటం నాకు చేతకాదు. ఆ మాటలు అనటంలో నా ఉద్దేశ్యం విలువల్లో అన్ని దేశాలు ఒక్కటే భారతదేశం పొడించింది ఏదీ లేదు అన్నమాటకి రెండు దేశాల్లో ఒకే విషయంలో ఉన్న వైరుధ్యం ఎత్తి చూపటమే. ఇక్కడివారికి, మనకి చాలా చాలా విషయాల్లో తేడాలు ఉన్నాయి. మరెందుకు మన దేశాన్ని ఎత్తి చూపటం? నిజమే, భారతీయ విలువలు అని లిస్ట్ చేసిన అయిదు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. కానీ, ఎలా ఉన్నాయి అని చూడక్కరలేదా? అల్లూరి సీతారామరాజు సినిమాలో అన్నట్టు ప్రపంచానికి నాగరికత నేర్పించిన దేశం మనది. ఈ రోజు కొందరు ప్రబుధ్ధుల మూలంగానో, మరే రకంగానో అభివృధ్ధి చెందుతున్న దేశం అవచ్చు. కొన్ని దేశాలు మనకన్నా ముందు ఉండొచ్చు. But what about our heritage? మన సంస్కృతికే విలువ లేదనటం మన దేశానికి పునాది లేదనటమే.

ఒక సాధారణమైన అమ్మాయి/అబ్బాయి తల్లి తండ్రి మధ్య ఒక కుటుంబంలో పెరగటానికి, ఇద్దరు తల్లులు, ఇద్దరు తండ్రులు కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ పెరగటంలో తేడా లేదంటారా? అది ఆ అమ్మాయి/అబ్బాయి మీద ఎఫెక్ట్ చూపించదంటారా? అలా అని వాళ్ళు చేసేది తప్పు అని నేననటం లేదు. ఇక్కడివారి జీవన శైలి వేరు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళుంటారు. అది తప్పూ కాదు. వాళ్ళకి అలవాటైన పధ్దతులు వాళ్ళవి. మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలంటారు. వాళ్ళ పధ్ధతుల్లో మంచివి ఏరుకుని మనం నేర్చుకుని, మన ముందు తరాలకి నేర్పిస్తే బానే ఉంటుంది. కానీ భారతీయ విలువలకి మిగతా దేశాల విలువలకి తేడా లేదు, మనం పొడిచింది ఏదీ లేదు అన్నప్పుడే వస్తుంది తంటా.

పద్మ said...

@Anonymous : I am not a teacher, sir/ma'am. :) I am not trying to teach anyone any lesson. బ్లాగటానికే తీరిక లేదు ఇంక జనాలని ఎడ్యుకేట్ చేసేంత తీరిక, ఓపిక అసలు లేవు. కాకపోతే హద్దులు చూపిద్దామన్న సంకల్పం ఉంది. ఎవరు దేని గురించైనా మాట్లాడొచ్చు కానీ ఒక దేశం గురించి ఆ దేశపు విలువల గురించి చులకన చెయ్యటం గర్హనీయం. ఎవరి పాపాన వారే పోతారు అని కూచుంటే మౌనం అర్ధాంగీకారం అనుకుని ఇంకా ఎక్కువ చేస్తారు. చరిత్ర తిరగరాసినా రాస్తారు. అబ్బే, నా పిల్లలు భారత దేశం గురించి తెలుసుకునేటప్పుడు వారికి రాముడు, కృష్ణుడు, సుభాష్ చంద్ర బోస్, అబుల్ కలాం ఆజాద్, వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం గురించి చదువుకోవాలనుకుంటాను. చరిత్రని ఖండఖండాలుగా పొడిచి భారతీయ విలువలని తెగ నరికే కత్తుల గురించి కాదు. :)

krishna said...

"చరిత్రని ఖండఖండాలుగా పొడిచి భారతీయ విలువలని తెగ నరికే కత్తుల గురించి కాదు" Well Said.

Malakpet Rowdy said...

From the KeBlaaSa dictionary:

మహిషాసుర 'మర్దిని' : మహిషాసురుడికి మర్దనా చేసేది (తలంటేది)

Alt. మహిషాసురుడిని మర్డర్ చేసేది :))

భాస్కర్ రామరాజు said...

పద్మ గారూ
నమస్తే.
మీ టపా మరియూ మీ వ్యాఖ్యలు అత్భుతంగా ఉన్నాయి. చాలా బాగా జావాబులిచ్చారు వ్యాఖ్యలకి.
ఏ సమాజంలోనైనా ఏ రాష్ట్రం దేశంలోనైనా -
మంచిని తీస్కుందాం. చెడుని వదిలేద్దాం. నిజం చెప్పారు.
కానీ మన దౌర్భాగ్యం ఇది మంచి ఇది చెడు అని వివరించి చెప్పే ఓ *లెగసి* ఓ పరంపర, ఓ అనుభవం, ఓ టచ్ మనం విచ్ఛిన్నమౌతున్న కుటుంబ మాడల్స్ వల్ల కోల్పోతున్నాం. అది చాలా బాధాకరం
ధన్యవాదాలు

పద్మ said...

@ Krishna : Thanks for the comment, sir.

@రౌడీ : మీ ఉద్దేశ్యం నాకర్థం కాలేదు. కె.బ్లా.స డిక్షనరి ఇక్కడ ఎందుకు ఓపెన్ చేసినట్టో? ఆ డెఫినెషన్ నాకు ఆపాదిస్తున్నట్టైతే, అబ్బే, తలంటటం వరకు ఓ.కె. కానీ మర్డర్లు మన వల్ల కాదు. మనకి కత్తులు, చాకులు, బాకులు గట్రా కొంచెం దూరంలో ఉండాల్సిందే. ఈ కత్తులంటే ఎంత చిరాకంటే కూరలు ఎక్కడ తరగాల్సొస్తుందో అని కట్ చేసిన ఫ్రాజెన్ కూరలు తీసుకొస్తాను. ;) :p :D

@రామరాజు గారు : నిజమేనండి. ఈ న్యూక్లియర్ కుటుంబాలతోనే ఈ అయోమయం అంతా. దానికి తోడు ఈ గ్లోబలైజేషన్ మూలంగా ఎక్కడలేని ఇంఫర్మేషన్ పెద్దలకే కాదు పిల్లలకి కూడా అందుబాటులోకి వస్తోంది. మంచిని, జ్ఞానాన్ని అందించే విషయమైతే పర్లేదు కానీ ఇదిగో ఇలాంటి దేశాలు, విలువలు లాంటి రాతలు మరింత చెడు చేస్తున్నాయి.

శ్రీవాసుకి said...

పద్మగారు

మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి. పరాయి దేశాలలో మంచి ఉంటే స్వీకరించటంలో తప్పులేదు. కాని పూర్తిగా ఏమి తెలుసుకోకుండానే విమర్శించడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కదా. వేల సంవత్సరాల ఎదురు దాడుల అటుపోట్లని తట్టుకొని నిలబడిన కర్మభూమి భరతభూమి నేడు స్వదేశీయుల అజ్ఞానానికి బలవుతోంది.

Anonymous said...

ఆయ్యా మలకుపేట మహా రౌడీ, మహిషాని మర్ధన చేసేది గొడ్లు కాసుకునే వాళ్ళు , పాలమ్ముకునే వాళ్ళు కాదా? పద్మ గారెందుకులెండి, కావాలంటే ఆ మర్ధన ఏదో మీరే చేసుకోండి.
ఇంతకూ అదసలు మహిషమే అంటారా? వూర పందోమో అని నా గట్టి అనుమానం, తేల్చుకునిగాని మర్ధన మొదలెట్టగలరని నా విన్నపం. పందికి మర్ధన నిష్ప్రయోజనం విజ్ఞులు మీకు తెలియనిది కాదు, మీ ఒంటికంటుతుందంతే! :P

Malakpet Rowdy said...

Baboi Anon,

U r scandalizing me now. Newayz its for Padma to decide

kallurisailabala said...

చాలా చాలా బాగా చెప్పారు.
http:/kallurisailabala.blogspot.com