Sunday, May 16, 2010

భక్తి ... ప్రేమ ... నింద ...

విక్రం హజ్రా పాడిన అచ్యుతం కేశవం నాకు బాగా నచ్చిన భజన. చిన్నప్పుడు నేర్చుకున్న అచ్యుతం కేశవం పాట వెతుకుతుంటే భజన దొరికింది. వినగానే ఒక రకమైన అలౌకిక భావన కలిగింది. భగవంతుడు మనం పిలిస్తే పలకడు అనుకుంటాం కానీ మీరాలాగా పిలుస్తున్నామా? యశోదమ్మలాగా జోల పాడుతున్నామా? రుచికరమైన పళ్ళే తినాలి అని తను రుచి చూసి తియ్యటిపళ్ళని స్వామికి అర్పించిన భక్త శబరి భక్తి మనకుందా? భగవంతుడి చేత నాట్యం చేయించిన గోపికలకున్న ప్రేమ మనకుందా? అవి లేనప్పుడు దేవుడు పలకట్లేదని నిందించగలిగే అర్హత మనకుందా? ఏమో. :)

విక్రం హజ్రా భజన పాడిన తీరు నాకు బాగా నచ్చింది. మా యశోదా కే జైసే సులాతే నహీ అన్నప్పుడు మెల్లగా మృదువుగాపాడటం; నిజంగా స్వామివారిని నిద్రపుచ్చుతూ జోల పాడుతున్నట్టు వెంటనే అచ్యుతం కేశవం అందుకున్నప్పుడు గొంతులో నవ్వుచాలా బావుంటుంది.

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మోహనుని రాగాలు సమ్మోహనంగా ఉన్నాయి.మోహనుని రూపాలకోసం మా ఇంటికి రండి,మా చిరునామా లీలామోహనం ,c/o http://vijayamohan59.blogspot.com

పద్మ said...

థాంక్స్ విజయమోహన్ గారు. మీ లీలామోహనుడి అడ్రసు నాకు తెలీకపోతే కదా ఇవ్వాలి. :) మీ బ్లాగు నాకు సుపరిచితం. మీ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ నేను రెగ్యులర్‌గా చూస్తాను. మీ చిన్ని కిట్టయ్య ఎలా ఉన్నాడు?