Tuesday, August 25, 2009

పురుషాకృతివో స్త్రీవో ..... ఎవరివో నీవెవరివో .....

తిరుమల మందిర సుందరా పాట నాకు, మా అమ్మకి చాలా ఇష్టమైన భక్తి పాటల్లో ఒకటి. రాగం, భావం అత్యద్భుతంగా ఉంటాయి ఈ పాటలో.

ఆ మధ్య ఈ పాట MP3 దొరక్క గిలగిలలాడిన నాకు తన దగ్గర ఉందని చెప్పి వెంటనే పంపించిన నిషికి బోలెడు థాంక్స్ చెప్పుకోవాలి.

తిరు వీధుల మెరిసే దేవదేవుడు అని అన్నమయ్య పాడారేమో కానీ ఇలాంటి భక్తి పాటలు వినిపించే ప్రతి ఇంట్లో పలికించే ప్రతి హృదిలో ఆ దేవదేవుడు మెరుస్తూనే ఉంటాడు.

పాలకడలిలో పవళించిన ఆ లక్ష్మీవిభుడివో తెలీదు, వెండికొండపై నిత్యం ధ్యానంలో ఉండే అర్థనారీశ్వరుడివో తెలీదు, ముగురమ్మల మూలపుటమ్మవైన త్రిజగన్మాతవో తెలీదు కానీ కాంతులు చిందిస్తూ అందర్నీ ఆకర్షించే నీ ముఖబింబము ఒక్క ఘడియ చూసినా అదే ఈ జన్మకి చాలు (అనుకుంటాం కానీ ఆయన రూపం అయస్కాంతం కాదూ, అక్కడ ఉన్న వాలంటీర్స్ తోసెయ్యకపోతే గోవింద నామస్మరణ చేస్తూ ఆ దేవదేవుడి దర్శనం చేసేవారెవరైనా అక్కడినించి కదులుతారా ఘడియలు దాటినా?) నీ గుడి వాకిట దీపమై వెలుగుతూ ఒక్క రాత్రి మనగలిగినా ఆ సేవ చాలు స్వామీ నీ పాదపద్మాలపై పువ్వునై ఒక్క క్షణం నిలిచినా నా జన్మ ధన్యత కాంచును దేవదేవా.

ఈ పాట వినప్పుడల్లా మా తాతగారు రాసిన దేవదేవ మోక్షపథము తెల్పవేమిరా అన్న పాట గుర్తొస్తుంది. ఆ పాట కూడా నీవరివో తెలీదు, అఖరికి పురుషాకృతివో, స్త్రీవో కూడా తెలీదు అని వస్తుంది. భగవంతుడు వైష్ణవుడు అనీ, శైవుడు అనీ, హిందువనీ, ముస్లిం అనీ నానా విధాలుగా తిట్టుకుంటాం కొట్టుకుంటాం. కానీ ఆఖరికి ఆ భగవత్‌స్వరూపం స్త్రీ రూపమో, పురుష రూపమో తెలీదు, ఆ స్వరూపానికి ఒక రూపం ఉందో లేదో తెలీదు కానీ నేను గొప్ప నా దేవుడు గొప్ప అని జుట్టు జుట్టు పట్టుకోటానికి తయారైపోతాము.

మా అమ్మ చెప్పే మాట నాకెప్పుడు నచ్చుతుంది. ఒక ఆర్టిస్ట్ ని అందమైన అమ్మాయి బొమ్మ గీయమంటే తన దృష్టిలో అందమైన అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించి గీస్తాడు. అదే బొమ్మ ఇంకొక కళాకారుడిని గీయమంటే అతనూ అలానే ఊహించి గీస్తాడు. ఈ రెండు బొమ్మలు రెండు కళ్ళు ముక్కు నోరు ఉండటం తప్ప ఇంకెందులోనూ కలవవు. చూడకుండా ఊహించి గీసిన బొమ్మకి, చూడకుండా మనం ఊహించి మదిలో నిల్పుకుని పూజించే దేవుడికి తేడా ఉందా? నీళ్ళు గ్లాసులో పోస్తే అదే ఆకారాన్ని సంతరించుకుంటాయి. అవే నీళ్ళు గిన్నెలో పోస్తే గిన్నె ఆకారంలోనే కనిపిస్తాయి. అంతమాత్రం చేత అవి రెండు వేరే వేరే నీళ్ళు అనగలమా? గ్లాస్‌లో మినరల్ వాటర్ , గిన్నెలో టాప్ వాటర్ అని ఎవరైనా వితండవాదం చేస్తే ఎవరేం చెయ్యలేరనుకోండి. అది వేరే విషయం.

భగవంతుడు నిరాకరస్వరూపుడు అంటారు. కానీ మనం ధ్యానం కోసం వీలుగా ఆ దేవుడికి రూపం సృష్టించుకున్నాం. ఆ రూపాన్నే పూజిస్తున్నాం. కానీ అదే ఆయన శాశ్వత రూపం అని కనిపించే ఆయన ఇంకొక రూపాన్ని తిట్టిపోస్తాం. ఏంటో. ఇలా మాట్లాడానని నన్ను నాస్తికురాలిననో, కమ్యూనిస్ట్ టైపు ఆస్తికురాలిననో అనుకోకండి. నన్ను అల్లహ్ ఓ అక్బర్ అనమన్నా అంటాను కానీ నా రాముడిని పల్లెత్తు మాట అన్నా ఊరుకోను. ఆ నాలిక చీరెయ్యటానికి కత్తి పక్కన పెట్టుకునే తిరుగుతాను. :P

23 comments:

budugu said...

బాగా చెప్పారండీ. రామక్రిష్ణ పరమహంస ని ఎవరో ఇదే ప్రశ్న అడిగితే భగవంతుడు సముద్రం లాంటి వాడు. ఒక్కో చోట మంచుకొండగా, మరోచోట నల్లగా, ఉప్పగా, మరో చోట స్ఫటిక జలంలా కనిపించట్లేదూ.. ఏదైనా ఒక రూపాన్ని సభక్తికంగా కొలిచినపుడు ఆ రూపంలో కనిపించి తన నిరాకార స్వరూపాన్ని ఆవిష్కరిస్తాడు అని.

రామున్ని అంటే నాలుకచీరేస్తా అన్న అతివాదం కూడా మంచిదికాదండోయ్. ఇలాగే రామక్రిష్ణుల శిష్యుడు ఒకసారి పూరి వెళ్తే బ్రిటిష్ కాలంలో క్రైస్తవ మిషనరీలు జగన్నాథుని ఆలయం ముందర ప్రీచ్ చేస్తున్నారట. శిష్యుడు ఆవేశంగా వెళ్ళి హరిబోల్ హరిబోల్ అని భజన మొదలెట్టి ఆ సభని నిర్వీర్యం చేశాడట. రాత్రి రామక్రిష్ణుడు కలలో కనిపించి "వేరొకరి నమ్మకాన్ని కాదనడానికి నువ్వెవరు? వెళ్ళి ఆ క్రైస్తవున్ని క్షమాపణడగమని" పంపించారట. నీ దేవుడు అంత శక్తిమంతుడని విశ్వసించినప్పుడు, ఆయన తలచుకుంటే తన గుడి ముందర క్రైస్తవ ఉపన్యాసం ఆపలేడా? అని అడిగారుట.
అదీ సంగతి.

అసలు మనలాంటి కంప్యూటరు చదువులు చదివి లాజిక్‌తో దేవుణ్ణి గురించి ఆలోచించే భక్తులకు బోల్డన్ని చక్కని సలహాలుంటాయి. వీలైతే రామక్రిష్ణ కథామృతం (gospel of raakrishna)చదవండి.

-బు

తా.క. నాకూ రాముడంటే భలే ఇష్టం. (సీతను అలా అడవులపాల్జేసాడన్న కోపం మినహాయిస్తే)

కొత్త పాళీ said...

చాలా బాగా రాశారు.
ఈ పాట మా అమ్మకి కూడా చాలా ఇష్టమైనది. ఇదొకటీనూ, నీ కొండకు నీవే రప్పించుకో అనే పాటొకటీ.

పద్మ said...

థాంక్స్ బుడుగు గారు.

నాది అతివాదం కాదండోయ్. నన్ను అల్లాహో అక్బర్ అనమన్నా అంటాను కానీ నా దేవుడిని దూషిస్తే ఊరుకోను. ఎందుకంటే ఆయనైనా, ఈయనైనా ఒక్కరే కాబట్టి. నా కోపం అంతా నా దేవుడే గొప్ప అన్న వాదనతోనే. నువ్వు నీ దైవాన్ని కొలుచుకో నేను నా దైవాన్ని కొలుచుకుంటాను. ఇష్టం ఉంటే నా దైవానికి దణ్ణం పెట్టు లేదంటే మానేసెయ్యి. కానీ దూషణభూషణతిరస్కారాలు వద్దు. ఇదండీ నా పాలసీ. నా దైవం జోలికి రానంతవరకు నా అంత మంచి అమ్మాయ్ లేదు. :p

నా దైవం కొలువైన గుళ్ళో కూచుని జీసెస్ గురించి చెప్పినా శ్రధ్ధగా వింటాను కానీ జీసెస్ గొప్ప రాముడు దిబ్బ అంటే రామకృష్ణులవారి శిష్యుడు చేసిందే నేనూ చేస్తాను. :) అలా అని జీసెస్ ని ఏమీ అనను ఎందుకంటే జీసెస్ లో ఉన్నది నా రాముడేనని నా నమ్మకం కాబట్టి.

రామకృష్ణ కథామృతం పుస్తకాల సెట్ ఉందండి ఇండియాలో ఇంట్లో. అక్కడ ఉన్నప్పుడు అప్పుడప్పుడు లైబ్రరీ సద్దేటప్పుడు దులిపి పక్కనపెట్టటం తప్ప చదివిన పాపాన పోలేదు. :(

ఇక రాముడు సీతని అడవులపాల్జేసాడన్న విషయానికి వస్తే, ఎందుకండీ ఆ మహానుభావుడి మీద కోపం. ఆయన ఏం చేసినా ఒక రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు కానీ ఇష్టంగానా? పాపం సీతకి దూరం అవ్వాల్సివస్తుందని రాజ్యం వద్దు మొఱ్రో అన్నా విన్నవారున్నారా?

నా ఈ పోస్ట్ చూడండి.

http://padma-theinvincible.blogspot.com/2007/11/blog-post_8963.html

పద్మ said...

థాంక్స్ కొత్తపాళి గారు.

నాకు మా అమ్మకి కూడా నీ కొండకు నీవే రప్పించుకో పాట చాలా ఇష్టం. తిరుపతి కొండ పైకి వెళ్ళేటప్పుడు తప్పకుండా పాడుకునే పాటల్లో ఇదొకటి. :)

నీ కొండకు నీవే రప్పించుకో .....
ఆపదమొక్కులు మాచే ఇప్పించుకో .....
నీ కొండకు నీవే రప్పించుకో .....
ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాసా .....

Anonymous said...

maavooLLO Train lO mushTivaaLLaku, bassulO kanipinchE guDDibichchagaaLLakoo ee paaTa atyanta preetikaramu.

పద్మ said...

కరెక్టే. పాపం ఏ జన్మలో ఏం చేసుకున్నారో ఈ జన్మలో అలాంటి పుట్టుక పుట్టి వచ్చే జన్మ ఇలాంటిది ఇవ్వద్దు దేవుడా అని పాడుకుంటూ ఉంటారు.

కొంతమంది పుణ్యాత్ములు గత జన్మే కాదు ఈ జన్మలో కూడా ఆ దేవుడి విలువ తెలుసుకుని నమ్మకంతో విశ్వాసంతో మెలగుతూ ఇంకా పుణ్యం సంపాదించుకుంటారు.

కొంతమంది అటూఇటూ కాని వారు ఉంటారు; మూడో ప్రకృతి టైపు. వారు పాపం ఈ జన్మే కాదు ఏ జన్మకైనా అంతే. అందుకే పాపం దేవుడు వాళ్ళకి కనీసం ఆ గుడ్డివాళ్ళు, బిచ్చగాళ్ళ లాగా అన్నా పాడుకునే అవకాశం ఇవ్వడు. :( ఏం చేస్తాం, ఆ మూడో జాతి గతి ఎప్పుడు అధోగతే. పాపం. ఈ విషయం మీకు బాగా తెలుసనుకుంటాను. :)

Anonymous said...

ఆవునండి, చాలాబాగా చెప్పారు. కొంతమంది పాపాలు చేసి ఇలా పాటపాడేసి, ఎంతో పుణ్యం మూటలు కట్టుకున్నామని, ఆ దేవుణ్ణి బురిడీ కొట్టించామని మురిసిపోతుంటారు. కాని, చేసిన పాపం అంత వీజీగా వదులుతుందా! అని నా అనుమానం.
కబీర్ అందుకే అన్నాడు:
"పాహన్ పూజే హరి మిలే
తోమే పూజూ పహాడ్
తతె తొ చాకి భలి
పీస్ ఖయె సన్సర్ "

అర్థాత్... మరదే ఏదో 108 మార్లు సంకీర్తన చేసి పాపం మటష్ అయ్యింది, కొత్త ఖాతా తెరిచి పాపం చేసేద్దామంటే కుదరదు గాక కుదరదు, అని! :)

Anonymous said...

అనామకా ( దాసూ.. అని గట్టిగా అన్నట్టు అనుకోవలసిందిగా మనవి :) )
( కాస్త నశ్యం దట్టిస్తూ.. )
"'శిసుర్వేత్తి పసుర్వేత్తి, వేత్తి గాన రసం ఫణిహీ అన్నారు, మరి మీ వూరి అంధ భిక్షువులే నచ్చినపుడు , నీకు నచ్చకపోతుందా? ఆఁ !

మోరా, ఇకపై నీవు 'కత్తి పద్మ 'గా ప్రసిద్ధి పొందువు గాక! నీ రామభక్తికి నే కడుంకఁడు సంతసించితిని. సదా హనుమద్కటాక్ష సిద్ధిరస్తు! :)

శంకర్

నేస్తం said...

అబ్బా భలే ఉంది అండి పొస్ట్ ..నాకు ,మా నాన్నగారికి ఓల్ మా ఫేమిలీ కి ఇష్టమైన సాంగ్ ఇది థేంక్స్:)

Kottapali said...

యేవండీ, మీ మూలాలేవన్నా తెనాలి చుట్టుపక్కలనా?

పద్మ said...

శంకూ :)

థాంక్స్ నేస్తం గారు.

@కొత్తపాళి గారు, :) ఎలా అనిపించింది మీకు మాది తెనాలి అయి ఉండవచ్చునని?

Shashank said...

పద్మ బా చెప్పారండి. మీ పోస్టు చదువుతుంటే అన్నమయ్య సంకీర్తన గుర్తొచింది:

ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు
అంతరంతరములెంచి చూడ పిండంతే నిప్పట్టి అన్నట్టు

ఆ పిండంతే నిప్పట్టి అన్నది చూసారూ... ఆ మాట చాలండి. అసలు ఆ భగమంతుడ్ని మనం ఎలా భావించినా .. ఆ మాటకి భావించకపోయిన ఆయనకి ఒరిగేది ఏమి లేదు. ఎదో కాస్త ఆ ఈశ్వరుని జ్ఞానం కోసం మనం చేసే చిన్ని ప్రయత్నమే ఈ జీవిత పయనం అని మా గురువుగారు ఎప్పుడు చెప్తూంటారు.
ఇంతకి ఆ కీర్తన మీరు (పొరబాటున) వినకున్నట్టైతే ఇదిగోండి.. ఆ భగవత్ స్వరూపమే ఐన అమ్మ ఏం.ఏస్ వాయిస్ లో.. http://www.youtube.com/watch?v=sMVtJAy9ixQ

చివరున - ఇదియే పరతత్వము నాకు అన్నప్పుడు వినే నాకు పరతతవము వస్తుంది.

Anonymous said...

Hi Padma,
how are you? Long time no see!
How is TP Rachchabanda , President? No end to your rule?!Hanging-on like a dictator!!


Sankar :)

పద్మ said...

అల్లల్లో శంకూ, కుశలమా? చాలా రోజులైంది నేను బ్లాగి, మీరు కుశలాలు అడిగి. :) ఎలా ఉన్నారు?

టి.పి. అంటారా, నేను వెళ్ళే నాలుగు నెలలవుతోంది అనుకుంటా. :O :(

ఇంకా నయం. మీరు Hanging అనగానే Ghost/Devil అంటారనుకున్నా; Dictator అనేశారు. ఇది పర్లేదు. :D

ఇంక నేను రూల్ చెయ్యటం అంటారా, ఎవరూ అంత బాధ్యతాయుతమైన పనిని భుజాలకెత్తుకునేందుకు సిధ్ధపడనిదే? ఇంక తప్పక రచ్చబండ బండలు కాకుండా కాపాడటం కోసం నేనే ఏదో ఈ పసి భుజాల మీద ఆ బరువు గత మూడేళ్ళుగా మోస్తున్నాను. Appreciate చెయ్యటం మాని ఇలా నిందలు, నెపాలు పోటీ కట్టుకుని మోపుతూ Dictator అంటారా. నెక్స్ట్ ప్రెసిడెంటు మీరే అయి ఈ బాధ్యతని పదేళ్ళు నిర్విఘ్నంగా మోయాలని మర్రిచెట్టు మీద కూచున్న ఆపా సాక్షిగా శాపం ఇస్తున్నా, పొండు. ;)

పద్మ said...

@శశాంక్, నిజం చెప్పారు. భగవంతుడు నిరాకారుడే కాదు నిర్వికారుడు కూడా. మనం తిట్టినా, పొగిడినా చలించకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. స్థితప్రజ్ఞుడు. అన్నమయ్య అన్నట్టు తామరాకు మీద నీటిబొట్టు.

నేను ఈ పాట ఇప్పటిదాకా వినలేదు. అన్నమయ్య పాటలు నాకు బోల్డు వచ్చు అని తెగ అనుకునేదాన్ని. ఫ్రాంక్లీ, దెబ్బకి ఆ ఫీలింగ్ తగ్గింది. ఇంత మంచి పాట ఇన్నిరోజులు ఎలా వినలేదో నేను. మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

Anonymous said...

Ammees,

kuSalamaa anTE EdO Not bad!KCR telangaanaa 'ichchuDO, chachchuDO' annappaTinunDi A renDOdi jarigE Subha ghaDiyalakOsam ohaTE waitingu... , entakee pODE! adEdO AmaraNadeeksha ELLakoddee chEsE Teknikaalu vachchEsaayi , vaaDi mukku taragaa! :))

nEnu rachchabanDanu bharinchagalanaa?! EdO ennikallO paalgondaamanE (perugoo, nEyi kooDaa) saradaa maatramE! :P

ika pOtE...

Happy Happy New Year!

Sankar

పద్మ said...

వాడి ముక్కు ఒక్కటే ఎందుకు శంకూ, వాడినే ముక్కలు ముక్కలుగా నరికితే పీడా పోతుంది కదా?

ఏంటో హైదరాబాదు అభివృధ్ధికి బోల్డు ప్లాన్స్ ఉన్నాయట మరి మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడో? కరీం నగర్, నిజామాబాద్‌లని అభివృధ్ధి చెయ్యచ్చు కదా? హైదరాబాద్ మీద పడి ఏడవకపోతే?

అసలు ఎం.పి.గా ఉండి కరీం నగర్ కి ఇన్నిరోజులు ఏం చేశాడు?

ఓహో!!! ఎన్నికలలో పాల్గొనాలనా? :p చలో అయితే ఎన్నికలు పెట్టేద్దాం. మళ్ళీ బోల్డు బోల్డు మజా, మజా. :D

Thanks and a Very Happy New Year to You too Sankoo :)

cbrao said...

మీరు కత్తి పక్కన పెడితే రెండు ముక్కలు చెపుతా. నాస్తికులలో మీరు దైవత్వాన్ని చూడలేకపోతున్నారా? తత్వమసి! అందరిలో దేవుడున్నాడు. నాస్తికుడా, ఆస్తికుడా అన్నది కాదు ముఖ్యం. సన్మార్గము ప్రధానమయినది. రాముని నమ్మనివారిలో సన్మార్గులు ఉన్నారు, నమ్మేవారిలో దుర్మార్గులూ ఉన్నారు.
cbrao
Mountain View, CA.

Malakpet Rowdy said...

CB Rao garu,


ఇక్కడ ఇబ్బంది నమ్మనివారితో కాదండీ, దూషించేవారితో!

పద్మ said...

@CB Rao గారు,

నావరకు ప్రతి జీవిలోను దైవం ఉందండి. ఆ జీవి దైవాన్ని పూజిస్తాడా, లేదా, ఆస్తికుడా, నాస్తికుడా అన్న విషయం నాకు సంబంధించనిది. నా ఘోష అంతా కూడా నా దేవుడే గొప్ప మిగతా అందరు దిబ్బ అనే వాదనతోనండి.

Pranav Ainavolu said...

ఇప్పుడే మీ బ్లాగ్ లోకి అడుగుపెట్టాను. చాలా బాగుంది.

అన్నమాచార్యులవారు పాడినట్టు...
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు...

ఎలా పిలిచినా పలికినప్పుడు తులసీదళంతో పూజిస్తే ఏంటి? బిల్వపత్రాలతో అర్చిస్తే ఏంటి? శ్రీనివాసుడైతేనేమీ? కైలాసవాసుడైతేనేమీ?
హేమిటో... :)

పద్మ said...

క్షమించాలి ప్రణవ్ గారు. ఈ మధ్య నా బ్లాగ్ ఓపెన్ చేసి చాలా రోజులవుతోంది. దానితో మీ కామెంట్ పబ్లిష్ చెయ్యలేకపోయాను.

తులసి అయినా, బిల్వం అయినా ఆ దేవుడికి బేధభావం ఉండదేమో కానీ వీళ్ళకి చాలా ఉంటుందిలెండి. అదేంటో ఈ వైష్ణవులు లక్ష్మీ అష్టోత్తరం కూడా మార్చేశారట, అందులో శివ, దుర్గ నామాలు ఉన్నాయని. ఈ మధ్య సామవేదం షణ్ముఖశర్మ గారు అన్నారు. ఆప్పుడెప్పుడో తెలుగుపీపుల్.కాం లో ఇలానే ఒక వాదనలో శివుడు విష్ణువుకన్నా చాలా చాలా దిగువన ఎక్కడో ఉన్నాడు అని ఎవరో అంటే మరి రాముడు శివుడిని ఎందుకు ఆరాధించాడు అని అడిగితే ఇప్పటి దాకా సమాధానం ఇవ్వలేదు. :)

అన్నమయ్య ఎంత మాత్రమున ఎప్పటి నించో పోస్ట్ చేద్దామనుకుంటున్నాను. చేస్తాను త్వరలో. :)

K SURENDRA BABU said...

మేము చాల జాగ్రత్త గా ఉండాలి కాబోలు.రాముని బక్తి ఓకే కత్తి పట్టి నాలుకలు చేరేయదలే బాగోలేదు.