Friday, January 1, 2010

ఈ రోజు విశేషం (అంటే నిన్న) .....

హేమంత పౌర్ణమి. :) రాస్తున్నది ఈరోజైనా ఇంకా నడిరేయి కాబట్టి నిన్న అన్నట్టే కదా లెక్క. పుట్టినరోజంటే నా దృష్టిలో కొత్తసంవత్సరం అన్నట్టే. లెక్కన డిసెంబరు ముఫ్పై ఒకటిన హేమంత పౌర్ణమితో కొత్త సంవత్సరం మొదలైతే, వెనువెంటనే౨౦౧౦ సంవత్సరం కూడా మొదలైంది. ౨౦౧౦ నూతన సంవత్సరానికి ఇప్పుడే ఆర్భాటంగా ఆహ్వానం పలికి వచ్చాము. కొత్త సంవత్సర నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. సాధారణంగా న్యూఇయర్ రిజల్యూషన్స్ బ్రేక్ చెయ్యటానికే అంటారు కానీ నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. అవి బ్రేక్ చెయ్యకూడదన్నది ఇంకొక రిజల్యూషన్. ఇంక చూడాలి మరి. :)

12 comments:

నిషిగంధ said...

Same pimch!!! నేనూ నిన్న రాత్రి అంతా నిద్రోయాక ఆకాశం వంక చూస్తూ 'అర్రే, ఇది హేమంత పౌర్ణమి కదూ' అనుకున్నాను.. నీకు తెల్సు, హేమంతమనగానే నాకు నువ్వే గుర్తొస్తావు ;-) మనం మాట్లాడుకోవడం గురించి కూడా నీ రిజల్యూషన్స్ లిస్ట్ కి జత చెయ్యి ప్లీజ్.. wish you a very happy new year dear...

Bhadrasimha said...

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ -2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ

పద్మ said...

యాప్పీ యాప్పీ న్యూ ఇయర్ నీక్కూడా. :) సో, హేమంతం = నేను = హేమంతం అంటావు. :p

అసలెన్ని రోజులైంది కదా మనం మాట్లాడి. :( ఈ వీకెండ్ ఆరు నూరు అయినా, ఇటు వైపు భూకంపం వచ్చినా, అటు వైపు టోర్నడో వచ్చినా నేను నీకు కాల్ చేస్తాను. ఇదే మంగమ్మ శపథం.

Anonymous said...

hellO... inkaa resolutions vunnaayaa? :)
mangamma Sapatham neggindaa?

Sankar

పద్మ said...

రిజల్యూషన్స్ అలా అలా వేళ్ళాడుతున్నాయి శంకూ.

మంగమ్మా మజాకా? ఖచ్చితంగా నెరవేరుతుంది. :D

ఇంతకీ మీరేంటి బండ మీద అడుగు పెట్టకుండా ఎక్కడెక్కడో తిరిగేస్తున్నారు? మీరు ప్రెసిడెంటు పదవికి పోటీ చేస్తున్నట్టు మీకు తెలుసా? ;)

Anonymous said...

హయగ్రీవ మూర్తి , వినాయకం, సుబ్బు, నచకి , ఓం నమః శివాయ , బుజ్జి , శ్వేత స్నేహ(ఆమె శక్తి రూపాలు) , వాచస్పతి గార్లవంటి ఉద్ధండులు లేని బండ, ఓ జారుడుబండ. నేనధిరోహించలేను, నిర్మానుష్యమైన బండ ఓ గుదిబండ , నాకు అంటగడదామనే? ఒంటరిగా నాకు భయం - కుదరదు గాక కుదరదు.

'కత్తులును ఘంటములు కదను తొక్కిన వచట
అంగళ్ళ రతనాలు , అమ్మినారట ఇచట ' అది బండ పాస్ట్. మీరేమో చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ లా బర్మా పారిపోయి , బండ నేలుకోమని ఉదారంగా ఇచ్చేస్తున్నారాయె..
ఆ ప్రెసిడెంట్ కన్నా మాడిన పెసరట్టు నయ్యం! కాదా?! :))

ఈ మధ్య 'బ్లాగస సంచరరే .. కూడలి బ్లా..ఆ..గస సంచరరే ..'. - అదీ సంగతి!

Sankar

పద్మ said...

మాడిన పెసరట్టో, అడుగంటిన దిబ్బరొట్టో మీ ఉపమానాలు మాకనవసరం. అసలు బండ ఎన్నికల్లో పోటీ చెయ్యను అనటానికి మీకేం హక్కు ఉంది? అదీ ఆపా మీకు పోటీగా నుంచుంటానంటే ఒద్దనెయ్యటమే? కుదరదు గాక కుదరదు. మీరు నుంచోనంటే కీర్తిని తీసుకొచ్చి నించోబెట్టేస్తాం. :p

Anonymous said...

కీర్తా? ఎవరా భుజకీర్తి?

ఓ! గుర్తొచ్చింది, ఆ వాగుడు కాయ కడప రెడ్డమ్మ నా? :) మీకు కాంటాక్ట్ లో వుంటే ఓ సారి బండమీదకు ఆహ్వానించండి. నేను కూడా కీర్తి అభిమానిని. ఆ మధ్యకాలం బండకు ఓ స్వర్ణయుగం అనుకో...

శంకర్

Anonymous said...

అమ్మాయ్.. అచంచలమైన పట్టుదలతో, సాహసంతో అర్జునుడిలా ఇక్కడ సంచరించిన 'పందిని ' తరిమావు.
నేను మెచ్చితిని.. ;) అందుకో ఈ వీర తాడు. :)
విజయీభవ...

శంకర్ :)

Anonymous said...

కడప బాంబు కీర్తి తో నేను పోటీ చేయగలనా?! కీర్తి కి మద్దతుగా నేను పోటీ నుంచి విరమించుకున్నాననుకో.. :))
నిన్న రచ్చబండ మీద తొంగిచూశాను. నీతో బలవంతగా స్వచ్చంద రాజీనామా చేయించి, తాతగారిని బండ మీద గౌరవ అధ్యక్షుడిగా నియమించాలని అనిపించింది. :D :P
శంకర్

పద్మ said...

పంది కాదు శంకూ, దరిద్రపు నీచపు నికృష్టపు వెధవ సన్నాసి. ఇన్నిరోజులు నా బ్లాగ్ అంటే కొంచెం క్లాస్ వాళ్ళు మటుకే వస్తారని కొంచెం కళ్ళు పైకి ఎక్కడో ఉండేవి. అవి కొంచెం మామూలు ప్లేస్ లో కి వచ్చాయి ఇప్పుడు. :O వాడెవడో కానీ వాడికి తలంతా పేలు, ఒళ్ళంతా చీము పట్టాలి. x-(

పద్మ said...

మీరు శాస్త్రిగారిని తాతగారని ఎప్పటి నించి అంటున్నారబ్బా? :P అలా కీర్తి అనేది. :( ఎక్కడుందో కానీ ఐ మిస్ హర్. మేమిద్దరం భాస్కర్ గారిని భలే ఆడుకునేవాళ్ళం. :D ఇంతకీ బండ అనగానేమి? ప్రెసిడెంటనగానెవరు? :P