Thursday, December 6, 2007

నీ మౌనం

నీ మాటలతో పెదవులపై దరహాసం
నీ తలపులతో బుగ్గల్లో సిగ్గు దొంతరలు
నిన్ను చూడగానే నాలో కలిగే అలజడి
నీ మనసుకు ఇంకా అర్థం కానివా?
మరి ఎందుకు ఈ శీతకన్ను నేస్తం
నీ మౌనం నాకు మరణంతో సమానం

8 comments:

Anonymous said...

ee maunam ee biDiyam
idEnaa? , idEnaa !

S

పద్మ said...

కాదుగా. :) ఈ మౌనం మరణంతో సమానం అంటుంటే కానుక అంటారే? :p

Anonymous said...

" మౌనమే నీ బాధ ఓ మూగ మనసా...
తలపులో ఎన్నెన్నో కలలు కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు "

చాలాబావుంది, అమ్మీ ! ఇంత భావుకత ఎలా కలిగిందబ్బా!?! ;) :)

శంకర్

రాధిక said...

baagumdamDi.

Radhika said...

బావుంది మోహనగారూ,
సప్తపది ఇంకా నచ్చింది.

పద్మ said...

శంకూ :)

అలాంటి అనుమానాలకి తావు లేదు. దేవీలాల్ తావు కాదు తెలుగు తావు. :p

పద్మ said...
This comment has been removed by the author.
పద్మ said...

థాంక్స్ రాధికగారూ. :)

ఈ కవిత చివరి లైన్ బేస్ చేసుకుని రాశాను. "నీ మౌనం నాకు మరణంతో సమానం" ఈ భావన నచ్చింది. సో,గుర్రం నాడాలా అది పట్టుకుని మిగతాది అల్లేశాను. :p మొదటి మూడు లైన్స్ ఏదో రకంగా కవితల్లో చాలా కామన్ + రిపిటిటివ్ అనిపించింది కానీ అమెచ్యూర్నే కదా అని రాసేశాను. :D