Tuesday, January 10, 2012

విశేఖర్ గారూ, చప్పట్లు

చప్పట్లు విశేఖర్ గారూ చప్పట్లు. అఖరికి చేసేది ఏదీ లేక మరేమీ చెయ్యలేక ఇదన్నమాట మీరు చేసింది. ఇది ముందస్తుగా ఊహించినదే. మీతో ఇదివరకు వాదించిన బ్లాగ్మిత్రులు చెప్పిందే. సో వింతగా ఏమీ అనిపించలేదు. వాదన చెయ్యలేని భీరువులు చేసే పనే మీరూ చేశారు. అసలు మీ పచ్చ కాదు కాదు ఎఱ్ఱ కళ్ళద్దాలున్నాయి చూశారు. భలే కనిపిస్తుందండి మీకు ప్రపంచం అందులో నించి.

"ప్రవీణ్ గారు మీకెలుకుడిమిత్రుడి తల్లిగారిని లాగినందుకు మీరు మా తల్లిని చర్చలోకి లాగుతారా?"
-------------------------------------------

మీ తల్లిగారిని లాగటమా? మీ ఎఱ్ఱకళ్ళద్దాలకి అలా కనిపించిందా? ఒక వేళ లాగాలనుకుంటే ఇన్నిరోజులెందుకు ఆగటం ఎందుకు విశేఖర్ గారూ? చర్చ మొదలైన మొట్టమొదటిరోజు చేసుండేవాళ్ళమే?

"తప్పని ఒప్పుకుంటూనే, తప్పుని అక్కడికక్కడే సరిచేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా, బాధ్యత నా పైన మోపుతారా?"
------------------------------------------------------

ఏదండి తప్పు? మీ తల్లిగారిని చర్చలోకి అసలు లాగారా? ప్రస్తావన తీసుకొచ్చినందుకు, అది ఇంకెలా చెప్పాలో తెలీటంలేదు అని క్లియర్‌గా క్షమాపణ చెప్పానే. ఈ క్షణానికీ నేను దానికే కట్టుబడి ఉన్నాను. ఇద్దరు మనుష్యుల మధ్య గొడవ జరిగినప్పుడు ఆ ఇద్దరూ మాత్రమే ఉండాలి వారి కుటుంబ సభ్యులని లాగకూడదని మొదటినించి చెప్తూ వచ్చాను. తమరు చాలా కన్వీనియెంటుగా ప్రవీణ్‌ని తిట్టారు కాబట్టే అతనా పనిచేశాడు అయినా తిట్టటం తప్పే అని సమర్ధించుకొచ్చారు. పైగా ప్రత్యేకమైన పోస్ట్ వేశానని గొప్పలు చెప్పుకుంటున్నారే, అందులో ఎంత సమర్ధించుకుంటూ వచ్చారో ఎవరికి తెలీదు విశేఖర్ గారూ? అలాంటి మీకు తల్లిని దూషిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది అనుకోవటం అవివేకం. కానీ ఆ అవివేకమైన పని చేస్తూ వచ్చాను ఇన్ని రోజులు. ఆ ప్రయత్నంలో భాగంగానే మీ తల్లిగారిని అంటే ఎలా ఉంటుందో ఊహించుకోమన్నాను. మీ తల్లిగారిని నేనేమీ దుర్భాషలాడలేదే, మీ మితృడిలా? ఆవిడని ఒక్క మాట అనలేదే? ఇన్‌ఫాక్ట్ అలా పోల్చుకొమ్మన్నందుకే క్షమాపణ కూడా చెప్పానే? అబ్బే, అసలు పాయింటు మీకెందుకు కావాలి? మీ ఎఱ్ఱ కళ్ళద్దాలు ఏది చెప్తే అదే కావాలి. మాతృమూర్తికి ఏమయితేనే? ప్రవీణ్‌ని ఇతర బ్లాగర్లు అన్న మాటలనీ, ప్రవీణ్ ఇతర బ్లాగర్ల కుటుంబాన్ని బజారుకి లాగి తిట్టిన బూతులనీ ఒకే గాటన కట్టే ఈ విశేఖర్ లాంటి బ్లాగర్లందరికీ నా ప్రశ్న. మీ తల్లిగారినే ఆ స్థానంలో ఊహించుకోండి. అప్పుడు కూడా ఒకే గాటన కట్టగలరా? పాపం ఇన్నిరోజులు భరించి ఇప్పుడు మీ తల్లిగారిని అన్నాడులే అది తప్పే కానీ పాపం కారణం ఉన్నదీ అంటూ అవతలివారికి నీతులు చెప్తారా?

ఒక్క విషయం గుర్తుంచుకోండి విశేఖర్ గారూ, రేపు ఇంకెవరన్నా మీ విషయంలో ప్రవీణ్ చేసిన పనే చేస్తే (ప్రవీణ్ చేసినా నేను ఆశ్చర్యపోను) మీకు నా మద్దతు ఉంటుంది. కెలుకుడు మితృడి తల్లికే కాదండి ఏ మాతృమూర్తికి అవమానం జరిగినా నేను ఖండిస్తాను.

"‘ప్రవీణ్ ఒకరి తల్లిగారిని తిడితే తప్పులేనపుడు, విశేఖర్ తల్లిగారి ప్రస్తావన తేవడం తప్పెలా అవుతుందిఅని విష ప్రచారం చేసుకోవడానికి మీరు జాగ్రత్తగా పాల్పడిన కుటిల ఎత్తుగడ ఇది. అందుకే మీరు చేసిన తప్పుని సవరించుకోగల అవకాశం మీకు వెంటనే ఉన్నా దాన్ని వినియోగించుకోవడానికి ముందుకు రాలేదు. "
--------------------------------------------------------

ఇది చదివి విపరీతమైన నవ్వొచ్చింది విశేఖర్ గారూ. మీ ఎఱ్ఱకళ్ళద్దాలు కాదు కానీ భలే ఊహించుకుంటారండీ. కంపారిజన్ మీలాంటివారే చెయ్యగలరు విశేఖర్ గారు. ఆ అవసరం నాకు లేదు. ఇన్‌ఫాక్ట్ అలాంటి ఆలోచనా నాకు రాలేదు. తప్పొప్పుల ప్రసక్తి మీరెత్తకుండా ఉంటేనే బావుంటుందేమో. సమస్య తీవ్రతని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోగా దాన్ని తెలివిగా ఇంకొకందుకు వాడుకుంటున్నారే, గురివింద గింజ నాకు గుర్తు రావటంలో దాని తప్పేమీ లేదు పాపం.

"కానీ సందర్భంగా గౌరవనీయ బ్లాగర్లు ముఖ్య విషయం గుర్తించాలి. మా అమ్మగారే కాదు, ఎవరి అమ్మగారిఅమ్మతనంఐనా ఒక్కరికెలుకుడికీ చెరిగిపోదు. ఒక్క కుసంస్కారి తిట్లకీ చెదిరిపోదు. ఒక్కరి కుటిల బుద్దులకూ బెదిరిపోదు. అలా చెరిగి, చెదిరి, బెదిరి పోయేదయితే ఆమెఅమ్మఎలా అవుతుంది? ఆమెదిఅమ్మతనంఎలా అవుతుంది. ‘అమ్మ ఎవరికైనా అమ్మేఅన్నది ప్రత్యక్షర సత్యం. ఎంతమంది కెలుకుడు గాళ్లు పూనుకుంటే సత్యం తుడిచిపెట్టుకు పోవాలి? అసలది తుడిచిపెట్టుకుపోయే సత్యమా? "
----------------------------------------------------------

అమ్మ గురించి అమ్మతనాన్ని గురించి మీరు మాట్లాడటం వింతగా ఉంది. ఒక పక్క ఒక తల్లిని తిట్టినవాడిని వెనక దాచిపెట్టుకుని వస్తూ, "అబ్బే నేను తిట్టేశాను. అయినా అతని తప్పేం ఉంది? అతన్ని తిడితే భరించలేక అతను అమ్మని తిట్టాడు. ఎవరి అమ్మ అయితేనే? అమ్మే కదా ఏ ఒక్క కుసంస్కారి తిట్లకీ చెదిరిపోదు. ఏ ఒక్కరి కుటిల బుద్దులకూ బెదిరిపోదు. చెరిగి, చెదిరి బెదిరి పోనిది ఒక్క అమ్మే కదా. అందుకని తిట్టాడు. ఎందుకు అతన్ని తిడతారు? తప్పు కదూ." అనే మీరు నీతులు వల్లించడం చాలా నవ్వొచ్చేట్టు ఉంది. కానీ కరెక్టే చెప్పారు. ఏ కుసంస్కారి తిట్లకీ తల్లి (ఎవరి తల్లి అయినా) చెదరదు. ఆ కుసంస్కారి, ఆ కుసంస్కారిని వెనకేసుకొచ్చే కుసంస్కారుల బుధ్ధులు బైటపడతాయి.

ఇంకో విషయం విశేఖర్ గారూ, సమాధానాలు చెప్పలేక ఏదో రకంగా చర్చని ముగించటానికి "అమ్మతనాన్ని" ఉపయోగించుకున్నారు చూశారూ. దానికి చాలా చప్పట్లు. మీకు ఇంక ఆ పై మాటలు అనటానికి గల అర్హతని ఒకసారి సమీక్షించుకోండి. శెలవ్.

9 comments:

Malakpet Rowdy said...

LOL. Poor Visekhar :))

kri said...
This comment has been removed by the author.
Anonymous said...

I asked Vishekar/Francis to let the people know who is he and what is he?

The reason for asking his info is:

His blog is intended for people's consumption. Once he said he is not asking anyone to read his blog. it's just illogical. If his blog is not for public use why should he be having a blog and in addition to that, adding his blog in any aggregator.

Blogs and aggregators are just for public consumption. No one can deny that. As Francis/ Vishekar is saying he is not asking anyone to read his blog, I suggest him to write his opinion on a paper and keep that in his pocket.

But once something is out everyone/everything is subjected to discussion. Needless to say no one can control it how things get unfold.

What does it takes to name a Name? say some x or y, does that matter? If Francis/ Vishekar is demanding the real names consistently on all the comments one is making anywhere on the web, is my arguments not valid for asking who is he and what is he as he is essaying his opinions on important matters that too in an objectionable manner to a large section of people due to which he was hated most in telugu blogs.

So let him say who is he and what is he. When he says this am open to say who am I while posting my comments.

Anonymous said...

I do not understand what vishekar wants to achieve by posting IP adresses. I came to know he wanted to share IPs so his totti friends can trace them their identities.

neevemee peekalevu IP lato.

Neeve IP pettukuntav.

KumarN said...

"ఒక్కసారి ఆలోచించండి విశేఖర్ గారు, నేను మిమ్మల్ని అన్నాను, మీరు నన్ను అన్నారు. నేను తిరిగి మిమ్మల్ని కాక మీ తల్లిగారిని అంటే మీకెలా అనిపిస్తుందండి? అనటం తప్పే కానీ ఎంత విసిగిపోతే అలా చేసుంటానో అని మీరనుకోగలరా? (మీరు నన్ను క్షమించాలి మీ తల్లిగారి ప్రస్తావన తెచ్చినందుకు. నాకు ఇంతకన్నా ఎలా తెలియచెప్పాలో అర్థం కాలేదు. మీరు ఇది తప్పు అని భావిస్తే ఆ వాక్యం తీసెయ్యండి. మరోసారి క్షమాపణ కోరుతున్నాను."
__________________

So he latched on these words and bent over backwards to interpret them, the way he wanted to interpret them.

ఆ వ్యాక్యాల్ని కూడా కావాలని మూతి మీద వేసుకొని కొట్టుకొని, బాబో నాకు రక్తం కారుతోంది అని అంత గోల చేసి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడా.

ALL LOSERS TRY HARD TO PLAY VICTIM CARD, IN THIS WORLD.

So, he is running with that card now. హ హ హ

Let him be on the run...

away from the history, away from society..all the way into an eternal oblivion, which is where his destiny is.

Poor guy

kri said...
This comment has been removed by the author.
Srikanth M said...

ఈ పోస్టు నేను ఎలా మిస్సయ్యానో అర్థం కావడం లేదు. చాలా బాగా రాశారు. మీరు రాసిన ఆ కేమెంటు నేను చదివాను. You nailed him right. అతను చెప్పే సుద్దులనూ, ఎంతో వినయంగా అతను రాసే రాతలను మీరు చాలా బాగా కడిగేశారు ఆకామెంటులో. మీదగ్గర ఆకామెంటు ఉండే పోస్టుగా పెట్టండి.

తరువాత అతను నా పోస్టును ఉటంకిస్తూ.. ఒక పోస్టు రాశాడు. అందులో చర్చ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అంటూ సుద్దులూ.. గట్రా ఉన్నాయి. నాకు రిప్లై కూడా ఇవ్వాలనిపించలేదు. ఎందుకంటే, చర్చలో పాల్గొనాలంటే ముందు చిత్తశుద్ది ఉండాలి. అది అతని లేదు. వినయం మాటున దాగిన .. నా వాదమే కరక్టు అన్న .. అహం తప్ప.

అయినా, మీరూ, శంకర్ గారూ అతనితో చేసిన చర్చలో ఒక్కో కామెంటు.. ఒక్కో పోస్టంత ఉంటుంది. ఎంతో ఓపిగ్గా అతనితో మీరు చేసిన చర్చ ఎలా ముగిసిందో..(ఆయన ఎలా ముగించాడో) తెలిసిన తరువాత మళ్ళీ, అతనితో చర్చకు దిగడానికి పిచ్చివాల్లెవరూ లేరు.

పద్మ said...

ఈ మధ్య బ్లాగ్ ఓపన్ చెయ్యకపోవటంతో మీ కామెంటు మిస్ అయ్యాను, పబ్లిష్ చెయ్యలేకపోయాను శ్రీకాంత్ గారూ. ఇప్పుడు చేశాను. Thanks Srikanth గారూ. :)

మాటలు చెప్పటానికేముందండి. ఎన్నైనా చెప్పచ్చు. చేతలంటూ ఉంటే కదా. చర్చ అన్నాక ఎవరికైనా మాట్లాడే అవకాశం ఉండాలి అన్న ఇంగితం లేని వ్యక్తి. కనీసం చర్చ ఎలా ముగించాలో తెలీని గొప్ప చర్చావాది. అసలు టాపిక్‌ని డైవర్ట్ చెయ్యటానికి నానా కష్టాలు పడ్డార్లెండి ఇద్దరూ. కానీ వల్ల కాకపోయేసరికి ఇదిగో బూతులు తిట్టిన "అమ్మ"ని ఉపయోగించుకునే అర్ధంతరంగా ఆపేశారు. ఊసరవెల్లి నిజం రంగు చూపించింది. అంతే. :)

చర్చించటం చేతకాని మనిషి చర్చ ఎలా సాగాలంటూ సుద్దులు చెప్పటం. జోక్ కదూ. :)))))))))))) ముందు ఆయన్ని ఆ సుద్దులు పాటించమనండి, తర్వాత మిగతావాళ్ళ సంగతి చూడచ్చు. అదేంటో ఈ భావజాల అభ్యుదయవాదులందరికీ నీతులు అవతలివాళ్ళకే మనకి కాదు, మనం వాటన్నింటికీ అతీతం అన్న భావన ఉంటుందెందుకో. సమసమాజ నిర్మాతలు ఆ సమాజంలో భాగం కారు కాబోలు.

SNKR said...

బాగుంది మీ వాదన, పీలర్‌తో పోటాటో తోలువలిచినంత తేలిగ్గా వుంది. :))