Thursday, September 29, 2011

అందని ద్రాక్ష అప్రజాస్వామ్యమా?

దొరక్క దొరక్క కాస్త టైం దొరికితే అది కాస్తా నిన్న ఒక చెత్త పోస్ట్ చదవటం లో వేస్ట్ చేసుకున్నాను. టూకీగా ఆ పోస్ట్ విషయం ఏంటంటే  భారత దేశం తప్ప ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉండేవాళ్ళకి దేశభక్తి ఉండదు. వాళ్ళకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. ఇంకా స్పెసిఫిక్ గా భారతదేశానికి సంబంధించి ఏ విషయము మాట్లాడకూడదు. ఎందుకంటే పరాయి దేశంలో బతుకుతున్నారు కాబట్టి. కానీ ఆ రాసినాయన, ఇంకా ఇటువంటి 'భావజాలం' ఉన్నవాళ్ళు మటుకు పరాయి దేశం నించి ఎటువంటి సిధ్ధాంతాన్నైనా తెచ్చుకుని దాని గురించి పేజీలకి పేజీలు చెత్త రాయచ్చు. పిసరంత అయినా అర్థం ఉందనిపిస్తోందా? నాకనిపించలేదు. అక్కడే కామెంట్ రాద్దామనుకుంటే అదేదో వారి బ్లాగు వారిష్టం అన్నారు. అందుకని ఇక్కడ ఇలా.

వారా పోస్ట్ లో అన్నది, నాకు చిర్రెత్తుకొచ్చింది ఇండియాలో చదువుకుని, ఇండియా డబ్బులతో పెరిగి అమెరికాకి దాస్యం చేస్తూ అమెరికా పౌరసత్వం కోసం తహతహలాడుతూ వగైరా వగైరా ...... ఈ చెత్త చాలా మంది అనగా/రాయగా విన్నాను/చూశాను. ఎప్పుడూ ఒకటే సామెత గుర్తొస్తుంది. "ఆడలేక మద్దెల ఓడినట్టు." భారతంలో పుట్టి అక్కడ చదువుకుంటే ఇంక అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండాలా? అలా ఉంటేనే దేశానికి సేవ చేసినట్టా? భారతంలో బతుకుతూ ఈ దేశం నాకేమిచ్చింది అని దేశాన్ని తిట్టిపోసేవాళ్ళు, పరాయి దేశపు సిధ్ధాంతాలు మన దేశకాలమాన పరిస్థితులకి నప్పుతాయా లేదా అని కూడా ఆలోచించకుండా కబుర్లు చెప్పేవాళ్ళు సేవ చేసినట్టా లేక పరాయి దేశంలో ఉండి కూడా దేశానికి ఏదో రకంగా ఉపయోగపడాలని తపన పడేవాళ్ళకున్నట్టా దేశభక్తి? ఇదివరకు మా వాళ్ళ దగ్గర ఒక డ్రైవర్ ఉండేవాడు. వాడు పిల్లల్ని కనటం తప్ప ఇంకే పని లేనట్టు కనేసి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాకేం చేసిందమ్మా, నేనెందుకు ఓటెయ్యాలి. నా పిల్లల్ని పోషిస్తోందా అని అడిగేవాడు. ఇష్టం వచ్చినట్టు కనేసావు, నీ పిల్లల్ని నువ్వే కదా పోషించుకోవాలి అంటే  నన్ను నా పిల్లల్ని ఈ ప్రభుత్వమే పోషించాలి అని వాదించేవాడు. అలా ఉంది వీళ్ళ వాదన కూడా.

భారతంలో చదువుకుంటే అక్కడే ఉద్యోగం చెయ్యాలి. ఇంక వేరే దేశాల్లో ఊడిగాలు చెయ్యకూడదనుకుంటే మరి గాంధి, నెహ్రూ ఇంకా వీళ్ళు పూజించే ప్రముఖుల్ని చాలా మందినే నిలదీయాలి కదా. మరి వాళ్ళందరూ ఇతర దేశాల్లో చదువుకుని భారతానికి తిరిగొచ్చినవారే కదా. మరి వీరి లెక్కన ఆ దేశానికి సేవ చెయ్యాలి కదా అక్కడ చదువుకున్నందుకు? లేదా ప్రాధమిక విద్య భారతంలో చేశారు కాబట్టి వాళ్ళని రెండు ఖండాలుగా నరికి ఒక ఖండం ఒక దేశానికి ఇంకో ఖండం ఇంకో దేశానికి ఋణం తీర్చుకోటానికి పంపించాలంటారా?

దేశానికి సేవ అక్కడ ఉండే చెయ్యక్కరలేదు. నా చుట్టుపక్కలే, ఇక్కడ ఉన్నవాళ్ళని చూస్తే భారతానికి ఏదో రూపం లో సేవ చేస్తూనే ఉన్నారు.  నన్నే తీసుకుంటే, నేను భారతంలో ఆరుగురు ఆడపిల్లలని దత్తత తీసుకుని చదివిస్తున్నాను. వచ్చే ఏడాది ఇంకో ముగ్గురు అమ్మాయిలని దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. అక్కడ ఉన్న నా ప్రాపెర్టీస్ కి ప్రతి సంవత్సరం టాక్స్ కడుతున్నాను. అక్కడ కొన్ని శరణాలయాలకి ప్రతి సంవత్సరం డబ్బులు పంపిస్తున్నాను. ఈ సంపాదించిన డబ్బులకి ఇక్కడ టాక్స్ కడుతున్నాను. ఇక్కడ చాలా తరచుగా డొనేట్ చేస్తుంటాను. పెంచిన దేశానికి, ఉంటున్న దేశానికి కొద్దో గొప్పో సేవ చేస్తున్నట్టే అనుకుంటున్నాను. భారతంలో ఉండి కూడా ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యచ్చు కానీ ఇక్కడ ఉండటం మూలాన పరిధి చాలా పెరిగింది. ఒక మామూలు ఉద్యోగం చేస్తూ తొమ్మిదిమంది ఆడపిల్లలని దత్తత తీసుకుని చదివించటం భారతంలో సులభమా? ఇది ఒక రకంగా స్త్రీ జనోధ్ధరణ కాదా? లేక తనకన్నా పెద్దదైనా వదిన్ని జాలిపడి పెళ్ళి చేసుకున్న మరిది చేసేది స్త్రీ జనోధ్ధరణ? ఇంతకీ అమెరికన్ భారతీయులని తిట్టిపోస్తూ రాతలు  రాసిన శేఖర్ గారు దేశానికి ఏ రకమైన సేవ చేశారో కాస్త చెప్పగలరా? ఇలాంటి రాతలు రాయటం తక్క? పరాయి దేశం లో ఉన్నంత మాత్రాన కని పెంచిన దేశానికి పరాయి అయిపోరు. ఎక్కడ పుట్టినవారు అక్కడ ఉండే ఋణం తీర్చుకోవాలి అనుకుంటే ఇంక హైదరాబాదులో చదువుకున్నవాళ్ళు అక్కడే ఉద్యోగం చేసుకోవాలి. బెంగుళూరు లేదా మరో ఊరు వెళ్ళకూడదు. అమలాపురం లో చదువుకున్నవాడు అక్కడే ఉండాలి. వెరసి బావిలో కప్పకు మల్లే తయారవ్వాలి. ఈ రాసినాయన లాగా. కాస్త చుట్టూ ప్రపంచాన్ని చూడండి. పరాయి దేశం వెళ్ళినా అక్కడ తమదైన అస్థిత్వాన్ని నిలుపుకుని ఆ దేశానికి, పుట్టిన దేశానికి పేరు తెచ్చిన గొప్పవారిని కాస్త గమనించండి.

మీరనే ఈ పరాయి దేశం అమెరికాలో ఎన్ని భారతీయులు స్థాపించిన సంస్థలున్నాయో తెల్సా? అవన్నీ భారతీయులకి/భారతదేశానికి ఎంతెంత మద్దతు ఇస్తుంటాయో తెల్సా? ఎన్ని సేవా సంస్థలున్నాయో తెల్సా? ఇక్కడ మా హిందూ స్వయం సేవక సంఘాలు ఎన్నెన్ని ఉన్నాయో అవి ఏ రకంగా మన దేశ గౌరవాన్ని నిలుపుతూ ఇక్కడి వాళ్లకి మన గొప్పదనం చెప్తూ ఎన్ని రకాలుగా సేవలు చేస్తున్నాయో తెల్సా? బీచెస్ క్లీన్ చెయ్యటంలో కానీ,
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ వాళ్లకి తోచినట్టుగా సేవ చేస్తారు. కానీ అస్థిత్వాన్ని కోల్పోరు.

 నిజమే ఇక్కడ గ్రీన్ కార్డ్ కోసం పౌరసత్వం కోసం తహతహలాడతారు. కొన్ని అదనపు సౌకర్యాలు సులభంగా దొరుకుతున్న చోట మనిషి ఆశ పడకుండా ఉంటాడా? అంత మాత్రాన దేశభక్తి లేనట్టా? భారతంలో మటుకు ఉన్న ఊళ్ళో కాక వేరే పెద్ద ఊళ్ళో జీతం, ఇంకొన్ని సౌకర్యాలు  ఎక్కువ ఇస్తారంటే వెళ్ళకుండానే ఉంటారా?

ఉన్న ఊరొదిలి ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైనా వెళ్ళేది పొట్టకూటి కోసం, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి మీద, ఏదో సాధించాలన్న తపన తీర్చుకోవటం కోసం.

అందని ద్రాక్ష పుల్లన. కరక్టే. కానీ అంత మాత్రాన భూమిలోంచి పుట్టిన తీగకి కాసిన పళ్ళు ఆ భూమికే అందనంత ఎత్తులో ఉన్నాయి అని తిట్టిపోయటం మూర్ఖత్వం. అంత ఎత్తున ఉన్నా ఆ పళ్ళు కిందకి భూమి వైపే వేళ్ళాడుతూ ఉంటాయి. వాటి వేళ్ళు అక్కడే ఉన్నాయని తెలుసు కాబట్టి, చాలామంది ఎన్.ఆర్.ఐల లాగా.

28 comments:

Indian Minerva said...

బాగుంది. నన్నడిగితే మనిషి తన దేశానికి సేవచేసేందుకుమాత్రమే పరిమితమైపోకూడదు. అదింకా విస్తృతమై మనిషిని మనిషిలా గుర్తించగలగాలి.

Anonymous said...

పద్మగారు,చాలా బాగా చెప్పారు...

ఈ మేతావులకు
కడుపులో ఉన్నోడే బిడ్డ,బయటికొస్తే బిడ్డకాదు అన్నట్లు...
పరాయి బిడ్డల దగ్గర తెచ్చుకున్న పైత్యపు రాతలు విషాన్ని అమ్మపై చిమ్మినా అమ్మదగ్గరున్నోడే అసలు బిడ్డంట....
బతుకుతెరువుకోసం బయటికెళ్ళినోడు చేశే సేవ సేవ కాదంట...
మూర్ఖులూంటే ఎవ్వరో కారు...సదూకున్నోళ్ళే....!!! ఓ మేధావుల్లారా....పచ్చటి కళ్ళద్దాలు కాస్త తీసి కొంచెం చూద్దురూ.....

said...

India can buy crude at ~100$ because we software guys are working day and night and sending dollars. and nobody in India feel that we are doing good for nation. they feel we are getting free money and we dont know how to spend...

Anonymous said...

Madam,
Looks like you are trying to convince readers that you went to US with a sole motto of adopting those 6 girls and to serve India ... if that is true, India desperately needs people like you to work here. But please don't try to bluff yourself and the readers !!

Anonymous said...

The crude you sofwarists are helping buy is, by and large, useful to your own lass. A farmer or a school teacher or a small clerk does not drive Swifts and Santros like you.

పద్మ said...

Indian Minerva గారు, దేశం మనిషి కన్నా పెద్దది కదండి. దేశసేవలో మనుషులు కూడా భాగమే. అయినా మన భారతీయులకి కసబ్ లాంటి రాక్షసుడినే మనిషిగా గుర్తించి దేవుడికి చేసే సేవ చేయటం అలవాటు. :) ఇంక మనుషులది ఏముంది. :)

పద్మ said...

Anon గారు, అబ్బే కళ్ళ డిఫెక్ట్ కి కళ్ళద్దాలేం చేస్తాయిలెండి. తీసినా ఉపయోగం ఉండదు.

karthik said...

పద్మ గారూ
దుమ్ము లేపారు కదా.. టోపీలు తీసితిమి :)

>>అమలాపురం లో చదువుకున్నవాడు అక్కడే ఉండాలి. వెరసి బావిలో కప్పకు మల్లే తయారవ్వాలి.
చెత్తలో పలు రాకాలు.. ఇదంతా సదరు పెద్దమనిషి పెరుగుతున్న మధ్యతరగతిని చూసి frustration లో రాసిన చెత్తగా గమనించాలి..

పద్మ said...

Karthik. :)

పద్మ said...

ఇద్దరు అజ్ఞాతల కామెంట్స్ ఎలాపబ్లిష్ అవలేదో తెలీదు. So, copy pasting them from my email.

Anonymous has left a new comment on your post "అందని ద్రాక్ష అప్రజాస్వామ్యమా?":

The crude you sofwarists are helping buy is, by and large, useful to your own lass. A farmer or a school teacher or a small clerk does not drive Swifts and Santros like you.

Anonymous has left a new comment on your post "అందని ద్రాక్ష అప్రజాస్వామ్యమా?":

Madam,
Looks like you are trying to convince readers that you went to US with a sole motto of adopting those 6 girls and to serve India ... if that is true, India desperately needs people like you to work here. But please don't try to bluff yourself and the readers !!

జేబి - JB said...

నాదీ మినర్వాగారి వ్యాఖ్యే!

పద్మ said...

well, the first Anon, how does the tractors run? and how does the small mopeds work? have a solar system?

second Anon,
మీ చిట్టి బుఱ్ఱకి అలా అర్థం అయిందా? లేక అలా అర్థం చేసుకోవాలని డిసైడ్ అయ్యారా?

First and foremost thing that you need to understand is that I wasn't trying to convince anybody. I don't have to convince anybody out here. I adopted 6 girls and will adopt few more in the future because I really liked the idea of girls below poverty line getting the education they need and I being a part of it. I don't need any one's approval nor do I need to convince any one for doing this.

Though that is personal I shared the information just because the knuckleheads out there understand that people living overseas do not abandon their country but do whatever they can do to serve their home country. Had he targeted an individual, it would have been a different case but he targeted the entire bunch who lives overseas.

Next thing, yes Bharat needs lots of resources be it man power or any other sort but it is not just folks who live overseas has this duty to build the inventory. I don't have to live in Bharat to do what I am already doing. So, instead of bitching like this, please get into the field and try to do whatever you could.

and being a knucklehead yourself, you should understand that I said the vicinity increases if the spending capacity increases.

పద్మ said...

@ JB, sure. :)

దేశ సేవ చేసేవాళ్ళు మనుషులని మనుషులుగానే చూడగలరనుకుంటున్నాను. కానీ దేశానికి, సాటి మనుషులకి కీడు చేసేవాళ్ళని, అర్థం పర్థం లేకుండా నోట్లో నాలుక, చేతిలో పెన్ను ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళని, రాసేవాళ్ళని మనుషులుగా గుర్తించనక్కరలేదనుకుంటాను. వారు రెండు కాళ్ళు, రెండు చేతులతో పుట్టినంత మాత్రాన మనుషులైపోరు కదా మరి. :)

Anonymous said...

పద్మగారూ,
మీ ఆవేశం అర్థంచేసుకోదగ్గదే. పరాయిగడ్డమీద ఉన్నంతమాత్రాన మాతృదేశం గురించి మాట్లాడొద్దు మీరు దేశద్రోహులు అంటే పడుండాల్సిన అవసరం లేదు. మీరన్నట్లు ఉద్యోగాలో వ్యాపారాలో ఎక్కడికెళ్ళినా తన మూలాన్ని మరువకుండా ఉంటే అదే పెద్ద దేశభక్తీ, దేశసేవానూ. మన దేశభక్తి నిరూపించుకుందామని ఇండియా వెళ్ళినా అక్కడ కనీసం మనని పట్టించుకునే నాథుడెవారూ ఉండరు. మనిషి ఙ్ఞాన సంపాదనకు దేశాటనం అత్యుత్తమ మార్గాలలో ఒకటి.

KumarN said...

Ha Ha Padmaji,
They got your attention, huh! Trust me, they aren't worthy enough for that.

Good for nothing folks. These guys are ideologues and far-left-wing zealots.

By the way, Congratulations on your good work, very inspiring. Good to know that.

Finally, I can personally vouch for what you wrote below. There are countless Indians/Indian-Americans in this country, doing just that. Everyone that I know contribute in varying degrees.

"మీరనే ఈ పరాయి దేశం అమెరికాలో ఎన్ని భారతీయులు స్థాపించిన సంస్థలున్నాయో తెల్సా? అవన్నీ భారతీయులకి/భారతదేశానికి ఎంతెంత మద్దతు ఇస్తుంటాయో తెల్సా? ఎన్ని సేవా సంస్థలున్నాయో తెల్సా? ఇక్కడ మా హిందూ స్వయం సేవక సంఘాలు ఎన్నెన్ని ఉన్నాయో అవి ఏ రకంగా మన దేశ గౌరవాన్ని నిలుపుతూ ఇక్కడి వాళ్లకి మన గొప్పదనం చెప్తూ ఎన్ని రకాలుగా సేవలు చేస్తున్నాయో తెల్సా? బీచెస్ క్లీన్ చెయ్యటంలో కానీ,
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ వాళ్లకి తోచినట్టుగా సేవ చేస్తారు. కానీ అస్థిత్వాన్ని కోల్పోరు"

పద్మ said...

ఆచంగ గారు, జ్ఞానసముపార్జనకు దేశాటన ముఖ్యం అన్న మాట చాలా నిజం. బావిలో కప్పలకి సముద్రం ఉందన్న విషయం కూడా తెలీదు కదా. మనం గొప్పవాళ్ళమే కావచ్చు. కానీ మన గొప్పదనం తెలియాలంటే అవతలివాళ్ళు ఎందులో తక్కువో, ఎలా తక్కువో కూడా తెలియాలి కదా. తీపి విలువ తెలియాలంటే చేదు కూడా తెలిసుండాలి.

Rao S Lakkaraju said...

These guys are ideologues and far-left-wing zealots.
-------
And America haters, China Russia lovers.
దేశం లోనే ఉండి ఏమి మంచిపనులు చేసారో చెప్తే విని ఆనందించి మేము కూడా చెయ్యటానికి ప్రయత్నిస్తాము.

Malakpet Rowdy said...

LOL, what happened to you all of a sudden?

Anon,

Looks like you are trying to convince readers that you went to US with a sole motto of
_____________________________________________________

Thats what happens if you wear those friction red glasses all the time.


A farmer or a school teacher or a small clerk does not drive Swifts and Santros like you.
____________________________________________________

He drives vehicles that run on diesel not petrol, and diesel an kerosine (that he uses for cooking) are heavily subsidized. So the money these software guys earn from the US companies is being used for giving subsidies.

Pavani said...

....బాగా రాశారు. ఇండియా అంటే ఇప్పుడున్నంత ప్రేమ అక్కడున్నప్పుడెప్పుడూ లేదు. ఆ దేశం నాది కాదని అనిపించేది. నా చదువుకు విలువలేదు, నా కష్టానికి ఫలితం లేదు.నేనే రిజర్వేషన్ కిందకీ రాను, ఆగర్భ శ్రీమంతుడిని కాను, ఒక్క పని సమయానికి కాదు ఇలా...

నా మొత్తం సంపదలో సగం అక్కడే ఉంది. ఎందుకొన్నానో, కొంటున్నానో నాకే సరిగ్గా తెలియదు. పూర్తిగా ఆర్థిక కారణమైతే కాదు కాక కాదు. అంతే..అదో అర్థం కాని ప్రేమ, అనుబంధం.

అక్కడున్నప్పుడు పండగలంటే ఒచ్చేవి పొయ్యేవి..అంతే..ఇక్కడ. ఉగాదికి పిల్లల చేత ఏ ప్రొగ్రం ఇప్పించాలి, దివాలీకి ఇండియా నించి ఏ డ్రెస్స్ తెప్పించి ఏ పాటకి ఆడించాలి..ఈ సారి ఏ celebrity ni తీసుకో రావాలి ..ఎంత హడావిడి. కచ్చితంగా
I have never been so Indian as I am now. Our next three weekends are engaged with one daandiyaa and 4 diwaali celebrations! two more are coming in November.
As one gentleman from Andhra Pradesh has rightly observed..." telugu will survive only in villages of AP and in USA, but not in rest of the places in AP".

జయహొ said...

*ఇంతకీ అమెరికన్ భారతీయులని తిట్టిపోస్తూ రాతలు రాసిన శేఖర్ గారు దేశానికి ఏ రకమైన సేవ చేశారో కాస్త చెప్పగలరా?*

శేఖర్ గారే కాదు, వారు అభిమానించే మార్క్స్ గారు కూడా పెద్దగా కార్య రంగంలోకి దిగి చేసింది ఎమీ లేదు. శేఖర్ గారికి ఆఫీసులో ప్రమోషన్ రాక బ్లాగుల మీద పడ్డారు. ప్రమోషన్ రావాలి, కేరీర్ లో పైకి పోవాలి అంటె చేసే రెగులర్ ఉద్యోగాన్ని, మరింత జాగ్రత్తగా చేస్తూ, ఎన్నో రోజులు వేచి చూడాలి. స్వతహగా పుస్తకాలు,సాహిత్యం చదివే అతని లాంటి వారికి ఊహలు ఎక్కువగా వుంటాయి. వాస్తవం లో రోజు చేసే ఆ రొడ్డుకొట్టుడు ఉద్యోగం ఎంతో బోర్ అనిపిస్తుంది. ఇంత ప్రపంచ జ్ణానం తెలిసిన నాకు చిన్న మేనేజర్ పదోన్నతి రావటానికి ఎన్నీ రోజులులు వేచి చూడాలి అని నిరుత్సాహ పడుతారు. నా మేనజెర్ గాడికి కనీసం మావో గురించి తెలియదు, చెగువేరా సంగతి అసలికి తెలియదు. అమేరికా ఎకనామి అప్పు చేసి పప్పు కూడు తింట్టుందని తెలియక పోగా, అదేదో చాలా అభివృద్ది చెందిన దేశం అని అనుకొంట్టుంటాడు. ఇటువంటి జనరల్ నాలేడ్జ్ లేని మేనజర్ కిందనా, నేను పని చేసేది అని నొచ్చుకొంట్టు, జీతపు రాళ్ళకొరకు ఉసురోమని పని చేస్తూ వుంటారు. విసుగెత్తిన వీరి లాంటి వారికి ఒకానొక రోజు వారి పైవారి జీవితాన్ని తన కోణం లో వీశ్లేషించటం మొదలు పేడతారు. వారు ఏ ప్రాంతం వారు? ఏ వర్గం వారు? ఎలా ప్రమోషన్ తెచ్చుకొన్నారు? ఎంతకాలం ఎలా ఆ స్థానం లో కొనసాగ గలుగుతున్నారు అని విశ్లేషించి, దీనిని ఇతరులకు అర్థమయ్యే లా ఏ కోణాం లో చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రశ్నించుకొని. సమయానుకూలంగా తన స్వార్థ కోణంలోనే చూస్తూ వుంటారు. బ్లాగులలో వారి విశ్లేషణలు రాసి వారి మానసిక పరిపక్వతను తెలియ అందరికి తెలియ జేస్తూ వుంటారు. వారి విషయం లో ఎంతో స్వార్థం గా ఆలోచించే వీరు, విదేశాలలో వుండే అగ్రవర్ణాల వారు, దేశం గురించి ఆలోచించటం లేదని, ఇండియాలో చదువుకుని, ఇండియా డబ్బులతో పెరిగి అమెరికాకి దాస్యం చేస్తూ అమెరికా పౌరసత్వం కోసం తహతహలాడుతూ వగైరా వగైరా ...... ఈ చెత్త రాస్తూ తాను దేశం కొరకు చాలా సేవ చేస్తున్నట్లు భావించుకొంట్టుటారు.

Continued ...

జయహొ said...

వారభిమానించే మార్క్స్ గారే పుస్తకాలు రాయటం, వీశ్లేషణలు చేయటం తప్పించి పెద్దగా చేసిన సేవ ఎమీ లేదు. మార్క్స్ గారి కాలం లో కార్య రంగలో దిగి ఉద్యమాలు చేసేవారు, ఎదుటి వర్గం లోని మాటలలో కూడా కొంత నిజం వుంది, వారి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి ,ఎవరైనా అంటె చాలు మార్క్స్ గారికి తిక్కరేగేది. వారు పుస్తకాల మీద పుస్తకాలు రాస్తూ పోయేవారు, అదే బాటలో మన బ్లాగు మిత్రుడు టపా మీద టపాలు రాస్తూ తనని ప్రశ్నిచిన వారిని వీదేశాలలో వున్నారు, మీకు దేశభక్తి అనేదే లేదు అని ఎగతాళి చేస్తూంటారు. అదే జ్యోతి బసు,కోబాడ్ గాంధి లండన్ లో చదివినా వారు మాత్రం గొప్ప దేశభక్తులు. వారు ఇండియాకి వచ్చి 30సం|| బెంగాల్ ను అభివృద్దిని తీరోగమన వైపుకు పురోగమించే టట్లు ఎంతో కృషి చేశారు.

http://en.wikipedia.org/wiki/Kobad_Ghandy

పద్మ said...

కుమార్ గారు. :) I usually don't value such posts nor do I value those folks but few statements he made in his post triggered it all. ufff. :p

Thanks. :) I am always for the girls education. So, few girls getting their education with my support makes me feel proud. :) The first time I saw a status report of one of the girls, I actually cried. I don't know if I would cry when I see my own child's school report. :) But it was indeed a great feeling. The girl is in 2nd class. She is from Mumbai slums. Her parents were very reluctant to send her to the school initially but when her school expenses were taken care of, they agreed to send her to the school. These girls also get a healthy meal at school. A very nice program.

పద్మ said...

@Rao గారు, దేశంలో ఉండి ఇలాంటి రాతలు రాస్తూ, పోస్టుతూ బాండ్ విడ్త్ వేస్ట్ చేస్తుంటారు. అదీ దేశసేవ అంటే. :)

పద్మ said...

@పావని గారు, ఇదివరకు ఒకావిడ అనేది ఈ దేశాలకి వస్తే దేశభక్తి, దైవభక్తి పెరుగుతాయని. అప్పుడు నవ్వుకున్నా ఇప్పుడు కరెక్ట్ అనే అనిపిస్తుంది. వస్తువు దూరమైనప్పుడే విలువా తెలుస్తుంది, ప్రేమా పెరుగుతుంది. ఏదో చెయ్యాలన్న తపనా కలుగుతుంది.

పద్మ said...

జయహో గారు :)

పద్మ said...

@Rowdy, that knucklehead rubbed me the wrong way. :D

manoj said...

ఆ రాసినాయన ఎవరో వీసా కోసం చెప్పులరిగేలా తిరిగి, అది రాకపోతే మతి భ్రమించి ఇలా రాసి ఉంటాడు. అయినా పన్ను ఊడగొట్టుకోటానికి ఏ రాయైతే ఏంటి అన్నట్టు దేశమో దేశమో అని పడి సచ్చిపోవటానికి ఎక్కడ ఉంటే ఏంటి? ఆయన రాసినదానికి మీరు కొంచెం ఎక్కువ గా స్పందించినట్టున్నారు. అసలు దేశభక్తి లేకపోవటం పెద్ద నేరమా, ఘోరమా. రోడ్ మీద నడుస్తూ మువ్వన్నెల జెండాకి సాల్యూట్ చేయకపోతే మనని క్రైం వాచ్ లో చూపిస్తారా? గురజాడ అన్నట్టు దేశమంటే మనుషులే అయితే మనం ఈ దేశాన్ని ప్రేమించటం ద్వారా ఎలాంటి మనుషులని ప్రేమిస్తున్నాం? ఇక్కడ అన్ని రకాల ఎదవలు ఉన్నారు, పుట్టలు పుట్టలు గా జనాలని కనటం వల్ల ప్రోబబిలిటీ ప్రకారం ఎక్కడో మంచోళ్ళు కూడా ఉండే ఉంటారు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా అనే బదులు నేను నా దేశం లో ఏ మూలనో ఉండే మంచి మనుషులని ప్రేమిస్తున్నా అంటే బెటర్ గా ఉంటుంది.
మీరు ఇక్కడ ఉండి జనాలని బాగు చేస్తేనే వాళ్ళు బాగు పడతారు అంటే వాళ్ళు బాగుపడటానికి అర్హులే కాదేమో. మన రాత మన చేతిలో ఉంటుంది కాని ఎక్కడో అమెరికా లో ఉన్న నా సాటి భారతీయిడు చేతిలో ఉండదు అని తెల్సుకున్నవాళ్ళకి మీతో పని లేదు. తెలుసుకోనివాళ్ళకి wordpress కొంచెం స్పేస్ ఇచ్చింది, అందులో పడి ఏడుస్తారు.

Anonymous said...

Hello,
I would like to know the address and so-called 'Tapaa' published by 'Sekhar'

Can some one help me out?

Btw, the comments I would like to post here, are surely generic in nature. Before that, I want to read the 'alleged' blog.

Please excuse me for being naive.

Santhosh