Monday, November 21, 2011

శ్రీకాళహస్తీశ్వర దండకం

జయజయ మహాదేవ శంభో హరా శంకరా సత్యశివసుందరా నిత్య గంగాధరా ......
బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ ...... దయాసాగరా ......
భీకారారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షిసంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్ ......
దివ్య జపహోమతపమంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్ ......
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్ ...... దుష్టాత్ముడన్ ......
విశ్వరూపా ...... మహా మేరుచాపా ...... జగత్‌సృష్టి సంరక్ష సంహార కార్యత్కలాపా ......
మహిన్ పంచభూతాత్మవీవే కదా ...... దేవ దేవా ...... శివా ......
పృధ్వి జలవాయురాకాశ తేజోవిలాసా ...... మహేశా ...... ప్రభో ......

రంగుబంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా ...... కాశీపురాధీశ విశ్వేశ్వరా ......
నీలి మేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వరా ..... శ్రీశైల మల్లేశ్వరా .....
కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా ...... శ్రీరామలింగేశ్వరా ......
నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా ...... భీమేశ్వరా ......
దివ్యఫలపుష్పసందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా ...... శ్రీకాళహస్తీశ్వరా ...... దేవ దేవా ......
నమస్తే నమస్తే నమస్తే నమ: ......

చిత్రం : కాళహస్తి మహత్యం
గానం : ఘంటసాల గారు
సంగీతం : సుదర్శనం గారు, గోవర్ధనం గారు
సాహిత్యం : తోలేటి వెంకటరెడ్డి గారు

కార్తీకమాసం సోమవారం సందర్భంగా ......
ఈ పాటని ఘంటసాల గారు పాడినట్టు ఎవరైనా పాడగలరా? అందుకే ఆయనది గంధర్వగానం అంటారేమో. :)



వీడియో : ఇక్కడ

4 comments:

Dr.Suryanarayana Vulimiri said...

పద్మ గారు, నమస్కారం. శివుని పై ఘంటసాల గారు అద్భుతంగా పాడిన చక్కని ఈ దండకం రచన తోలేటి వెంకట రెడ్డి; సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం. చితర్మ్ టైటిల్ లో "శ్రీ" లేదు. ఈ మధ్యనే ఈ దండకాన్ని నా "ఘంటసాల" బ్లాగులో పోస్టుచేసాను. దిగువ లంకెలో వివరాలు చూడగలరు. http://vulimirighantasala.blogspot.com/search/label/%E0%B0%A6%E0%B0%82%E0%B0%A1%E0%B0%95%E0%B0%82

sri said...

toleti vaari saahityam

పద్మ said...

ధన్యవాదాలు సూర్యనారాయణ గారూ, శ్రీ గారు. పోస్ట్ అప్‌డేట్ చేశాను. కాళహస్తి మహత్యంలో కొన్ని పాటలు తోలేటి వారు రాశారని తెలుసు కానీ ఈ పాట స్పెసిఫిక్‌గా ఆయనే రాశారన్నది తెలీదు.

నీహారిక said...

@Padma Gaaru,
I don't want to trouble Mr.Ramana Garu any more ,so I wrote in my google plus.

https://plus.google.com/u/0/103145057876600078379/posts