Monday, November 29, 2010

నాన్న

అందరూ ఆడపిల్లలు బరువనుకునే రోజుల్లో ఆడపిల్ల కావాలి అని ఆరాటపడ్డ నాన్న .....
ఏ కాలమైనా ఆడపిల్లకి చదువు చాలా అవసరం అని నా ఉన్నత విద్య కోసం నా కన్నా ఎక్కువ శ్రమించిన నాన్న .....
ఆడపిల్లకి చదువెందుకు పెళ్ళి చేసి బరువు దించుకోక అన్న మాటల్ని ఖాతరు చెయ్యకుండా మగపిల్లలతో సమానంగా చదివించిన నాన్న .....
జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న నన్ను చూసి మురిసిపోయిన నాన్న .....

మా నాన్న ఇక లేరంటే మనసు నమ్మటం లేదు. ఏదో ఒక పక్క నించి అమ్మలూ అని పిలుస్తూ వస్తారనే నమ్ముతోంది.
కాలం స్థంభించింది అనిపిస్తుంటే ఎందుకు రోజులు ఆగకుండా గడిచిపోతున్నాయి? ఎందుకు కళ్ళల్లో నీళ్ళు ఇంకడం లేదు?
అందరూ ఇది పెద్ద నష్టం అంటున్నారు కానీ నష్టం అనే చిన్న పదం జీవితంలో ఏర్పడిన ఈ వెలితిని వివరించగలదా? ఊహూ, తెలుగు భాషలో ఈ బాధని వివరించగల పదం లేదు. ఏ భాషలోనూ ఏ పదానికి అంత శక్తి లేదు.

జీవితాన్నిచ్చిన నాన్న ఇంక జ్ఞాపకాల్లోనే ......

14 comments:

నిషిగంధ said...

I'm so sorry, raa :(((
ఆడపిల్లలకి నాన్నతో ఉండే అనుబంధం ఎంత ప్రత్యేకమైనదో కదా.. ఆ లోటుని భర్తీ చేశే శక్తి ఎలాంటి ఊరడింపు మాటలకీ లేదు.. కానీ, గుండె దిటవు చేసుకుని ఆయనని నీ జ్ఞాపకాల్లో చిరంజీవిగా నిలుపుకో.. నాన్నగారి ఆత్మకి సంపూర్ణ శాంతి కలగాలని కోరుకుంటున్నాను..

ఏకాంతపు దిలీప్ said...

:-(

Malakpet Rowdy said...

I know how tough it is to face it, but I hope you all recover from this pain soon

వేణూ శ్రీకాంత్ said...

>>"తెలుగు భాషలో ఈ బాధని వివరించగల పదం లేదు. ఏ భాషలోనూ ఏ పదానికి అంత శక్తి లేదు."<<
కరెక్ట్ గా చెప్పారండి. తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

చిలమకూరు విజయమోహన్ said...

భగవంతుడు నాన్న ఆత్మకు శాంతిని ప్రసాదించమని కోరుకుంటున్నాను.

ranjani said...

<-- this comment need not be published -->

మా నాన్న వెళ్ళిపోయి నిన్నటికి సరిగ్గా 15 సంవత్సరాలు..

కాలం ఒకే రీతిగా ఎప్పుడూ ఉండదు - మన అనుకున్న
వారు దూరం కాక తప్పదు - మనమూ వీడిపోక తప్పదు :(

Anonymous said...

Mee nannagari atma ki santi ni prasadinchamani aa bhagavantunni prarthistunnanu.

Bhagavantudu manaki kanipinchaka poyina manalni eppudu o kanta kanipettinatle, nannagaru kooda eppudu mimmalni choostoo untaru.

He just traveled to another dimension.

భాస్కర్ రామరాజు said...

ధైర్యంగా ఉండండి. కొన్ని కొన్ని తప్పవు.

Korivi Deyyam said...

My heartfelt condolences to you and your Mom raa :( May God give you both the strength to cope with the pain.

పద్మ said...

నిషి, దిలీప్, రౌడీగారు, వేణు గారు, విజయమోహన్ గారు, రంజని గారు, అజ్ఞాత గారు, భాస్కర రామరాజు గారు, శ్వేతా
You are all so kind.

@రంజని గారు,
మీరు కామెంట్ పబ్లిష్ చెయ్యనక్కరలేదన్నారు కాని క్షమించాలి, పబ్లిష్ చేశాను. దు:ఖం, బాధ పంచుకుంటేనే తగ్గుతుందని అనిపించటం వల్ల, ఆ వ్యాఖ్యలో వ్యక్తిగతమైనది ఉందని అనిపించకపోవటం వల్ల.

Anonymous said...

So sorry. Wish u all come back from this pain soon.

Anonymous said...

:( ప్చ్.. విచారకరమైన విషయం. జీర్ణమైన శరీరాన్ని వదలి కొత్త శరీరంతో మీ మధ్య రావడానికి చేసిన ప్రయత్నమేమో అని నా నమ్మకం. కొత్తముసుగులో కొత్తవారిగా నాన్న వస్తారేమో ఓ కంట కనిపెడుతూ వుండండి.:)
నాన్న చివర 'గారు ' లేని మీ మాటలు నాన్నతో ఇంటిమసీ ని సూచిస్తున్నాయి, గుడ్! మేమూ అంతే, నాన్నని నాన్నగారు అని అమ్మకన్నా దూరంగా పెట్టలేదు.

శంకర్

రమణి said...

అనుకోకుండా ఈరోజు చూశాను మీ బ్లాగు, నాన్న గురించి మీరు రాసింది చదివి ఎక్కడో మనసులోతుల్లో బాధ.. నాన్న విషయంలో నేను చాలా దురదృష్టవంతురాలిని (మీకన్నా/నాకన్నా అని అనను మీకు ఆయన సాంగత్యం తెలుసు కాబట్టి) నేను ఆరో మరి ఏడొ ఏటో ఉన్నప్పుడే నాకు నాన్నగారు దూరమయ్యారు. ఉన్న కొద్దిరోజులే ఎప్పటికి మరువలేని మధురమైన సాంగత్యాన్ని నా సొంతం చేసి వెళ్ళారు. ఎన్ని పదాలు, వాక్యాలు రాసిన నా భావాన్ని కరెక్ట్‌గా చెప్పలేను. మనం మిస్ అయిపోయాం అంతే.
http://sumamala.blogspot.com/2009/06/blog-post_21.html

మీకు వీలయినప్పుడు చదవండి

డేవిడ్ said...

గ్రేట్ ఫాదర్.....జ్ఞాపకం ఒక్కొసారి వేదన కలిగిస్తుంది...మరో సారి విచ్చుకునే మొగ్గవుతుంది...