Thursday, April 1, 2010

రాముడుద్భవించినాడు రఘుకులంబునా .....

రాముడుద్భవించినాడు రఘుకులంబునా .....
శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా .....
తామసులను దునిమి దివిజ సోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు
శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా .....

తనరు చైత్ర శుధ్ధ నవమి పునర్వసందునా
సరస కర్కాటక లగ్నమరయగ సురవరులెల విని కురియింపగ విరుల వాన
రాముడుద్భవించినాడు రఘుకులంబునా .....

దశరధుండు భూసురులకు ధనమొసంగగా
విసరె మలయ మారుతములు దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప
రాముడుద్భవించినాడు రఘుకులంబునా .....

ధరను కుడిమి లంక పురమును అరసి బ్రోవగా
కరుణతో శ్రీరంగదాసు మొరలిడగను కరుణుంచియు వరమివ్వగ స్థిరుడై

శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా .....
తామసులను దునిమి దివిజ సోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు
శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా .....

ప్రయాగ రంగదాసు వారి కృతి

డాక్టర్ మంగళంపల్లి బాలమురళి గొంతులో

3 comments:

Anonymous said...

చాలా బాగుంది రాగం జీ... ఈ 'ప్రయాగ రంగదాసు 'అనే కంపోజర్ పేరు మొదటిసారి వింటున్నాను. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అదే చేత్తో వీలైతే ఆడియో లింకు ఇవ్వరూ ..

ఆమ్రపాలి

Anonymous said...

Sorry nEnu krindi link mundu choodaledu. thanks for the link too..chaalaa baagundi.

Apaa

పద్మ said...

థాంక్స్ ఆపాజీ. రంగదాసు గారు రాసినవి చాలా తక్కువ అనుకుంటాను. చాలామంది ఈ కీర్తన రామదాసు రాసినది అనుకుంటారు ఎందుకనో. ఈ పాట పాడినవారు చాలా తక్కువమందే. నాకు ఇంకొక లింక్ దొరికింది. వారు పాడినది కూడా బావుంది కాని చివరి చరణం రికార్డింగ్ సరిగ్గా లేదు.