Friday, August 19, 2011

అందాల రాముడు ...... ఎందువలన దేవుడు?

ఇదిగో ఇందుకే ...... :)

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......
అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ...... ఎందువలన దేవుడు

తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను ......
తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేవుడు

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......

అంభవించదగిన వయసు అడవి పాలు చేసెను ......
అంభవించదగిన వయసు అడవి పాలు చేసెను
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి చేసెను
అందాల రాముడు అందువలన దేవుడు.

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......

ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను ......
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను
ధర్మం కాపాడుటకా సతినే విడనాడెను
అందాల రాముడు అందువలన దేవుడు.

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఇలలో మన దేవుడు ......

సినిమా : ఉయ్యాల జంపాల
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు గారు
సాహిత్యం : ఆరుద్ర
గానం : స్వర్ణలత

వీడియో : ఇక్కడ
ఆడియో : ఇక్కడ

"నన్నెందుకు వదిలేశావని ఆనాడే సీత రాముడిని అడిగుంటే" అని మైకుల ముందర అరిచే వాళ్ళందరు ఈ పాట వింటే బావుణ్ణు. బుధ్ధి వచ్చినా రాకపోయినా కాస్త పాపం అన్నా తగ్గుతుంది.

8 comments:

నందు said...

చాలా బాగుంది !

పద్మ said...

ధన్యవాదాలు నందు గారు.

manoj said...

పాట బాగుంది, అధ్బుతం గా రాసారు, పాట తరవాత మీ ముగింపు మాత్రం అసందర్భం అనిపించింది. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుకుందాం. వెయ్యేళ్ళ తరవాత హరీ పోట్టర్ గురించి కూడా ఇలాగే మాట్లాడుకుంటారు ఏమో.
"అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......
అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......"
అందాలు ఉంటే దేవుడైపోతే మహేష్ బాబు, అనుష్క కూడా దేవుల్లెనా. మన దేశం లో ఎన్నో కులాలు, కులం అన్న తర్వాత దానికి ప్రభ ని తెచ్చేవాడు ఒకడుంటాడు. కాబట్టి ఒకో కులానికి ఒకో దేవుడు ఉంటాడా, ఆ దేవుడికి ఓ గుడి ఉంటుందా? పెరుగుతున్న భూమి ధరలను అందుకోలేని కులాలు ప్రభుత్వమే తమ దేవుడికి గుడి కట్టాలని ధర్నాలు చేస్తాయి.
"తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను ......
తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేవుడు"
తండ్రి చెప్పింది తప్పా, ఒప్పా అని ఆలోచించనివాడు, పెద్దకొడుకు కే రాజ్యం దక్కాలన్న కనీస నీతిని మరిచిపోయి అడిగిన తండ్రి మాట మన్నించిన వాడు దేవుడా? తన తమ్ముడి కోసం తను బాధ పడితే దేవుడవుతాడా, ఎందుకు మనం త్యాగానికి, బాధకి ఇంత ప్రాముఖ్యతని ఇస్తాం? అయినా తన తమ్ముడెం బాగుపడ్డాడు? "అయ్యో మా అన్న నన్ను వదిలి వేల్లిపోయాడే" అని భోరున విలపించలేదా? లేదా తమ్ముడికి తనపై అంత ప్రేమ ఉన్నదని రాములవారు గ్రహించలేదా?
"అంభవించదగిన వయసు అడవి పాలు చేసెను ......
అంభవించదగిన వయసు అడవి పాలు చేసెను
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి చేసెను
అందాల రాముడు అందువలన దేవుడు. "
నిజమే అప్పట్లో కోర్ట్లు, విడాకులు లేవు కాబట్టి సీత తనతో చచ్చినట్టు అడవుల వెంట వస్తుందని ఊహించి ఆమెను అడవి పాలు చేసాడు. అడుగు పెట్టిన చోటల్లా అర్యభూమా, దొంగ చాటు గా చెట్టు చాటున నక్కి వాలిని చంపినపుడు చెట్టు వెనక పడిన అడుగులు ఆ చోటిని అర్యభూమి చేశాయా?
" ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను ......
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను
ధర్మం కాపాడుటకా సతినే విడనాడెను
అందాల రాముడు అందువలన దేవుడు. "
రావణుడిని చంపటం మంచి పనే, కాకపోతే ధర్మం కాపాడుతకి సతిని విడనాడేనా? ఏమిటా ధర్మం? చాకలి మాటలకి జ్ఞానోదయం అయి తెలుసుకున్న ధర్మం? అతగాడి నాన్నకి ముగ్గురు భార్యలు, అలాంటప్పుడు సీత రావనుడ్ని ఇష్టపడితే మాత్రం తప్పేంటో? మహిళలకి సమాన హక్కులు కావాలని మీరు అనుకోవటం లేదా?
వాస్తవానికి నాకీ పాట చాలా నచ్చింది. రింగా రింగా పాట నచ్చినట్టు, ఆ అంటే అమలాపురం నచ్చినట్టు. కాకపోతే మైకుల ముందు అరిచేవారికి పాపం అంటగడుతూ మీరు రాసిందే ఎక్కలేదు. రాముడి గురించి మీరు ఎంత డప్పు వాయిన్చుకున్నా నేనేమీ అనుకునేవాడ్ని కాదు. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉంది. కాకపోతే దైవాన్ని నమ్మనివారు, దేవుడి దివ్యత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు పాపులు అనటం సమంజసం కాదు.

ఎందుకో ? ఏమో ! said...

thanks

for sharing

pata undani telusu but vinalani kuthoohalam appatlo ledu

kani mee punya vasatthu ippudu poorthiga telusu kunnanu

mee blog nunchi samtrupthi tho velthunnanu

raamayanam saram oka pataga chinna chinna matltho chepparu

nice post

?!

http://paramapadasopanam.blogspot.com

ఎందుకో ? ఏమో ! said...

Mr.Manoj

Please note these points!!

1. Andam means adi saariraka andam kadu.

2. tappa oppa means: vichakshana leka kaadu naayana " aa kaalam lo vallu maanushya janma etthinadi prarabdham anubhavinchenduke ane siddhanthanni viswasinche varu. eeyana avtaarudu so aa kaaryam nimittham tana tandri mata anedi oka misha matrame

ఎందుకో ? ఏమో ! said...

for both 2&3 questions ki 2nd answer.

chudu naayana oka amsanni vimarsisthunnamante annitini (samayam, sandarbham) pariganaloki teesukovaali.

prasna adagatam goppa kaadu nee prasna nijam ayithe nuvvu samaadhanaanni rabatta galiginappude adi saraina vyakthi vesina saraina prasna avuthundi

niku veelu chikkithe

"raamayana kalpa vruksham"

ane mahattara grandham chudu.

appudu neeke telusthundi

nee chetha ilanti prasnalu veyinchinadi kudaa "aathmaaramude" ani

http://paramapadasopanam.blogspot.com

ఎందుకో ? ఏమో ! said...

Padma garu chorava teesukuni mee blog ni public forum chesanani anukokandi

chinnavadu teliyaka matladadu kada

adi chadivina vaaru kuda ade abhipraayaniki lonayye avakasam untundemo ani

naa aathmaraamude alaa palikaadu

inko vishayam emante

meekante manoj naa manasuki nacchadu

kurradi lo fire undi

ayithe correct way inka doriki nattu ledu

sare mari

ika selavu


sree raam jaya raam jai jai raam

?!

manoj said...

naaku kooda endhuko emo gaaru nacchaaru. mee peru ki thaggattu mee vyaakhya kooda undatame konchem baadhakaram.
meeru viswaasam gurinchi raasindhi mathram baagundhi. appati kaalaaniki aa viswaasam sari ayinade kaavacchu. kaani mana sangathi aenti? manam poorvapu viswaasalane inka paatisthunnama. pathi tho paatu chithi meedha koorchune bharyalu entha mandhi unnaaru ee kaalam lo? ae kaalam lo aina nyaayam, anyaayam ani untaayi. raasevaadini batti chadhivevaadiki konni paatralu unnatham gaa, inkonni heenam ga kanipisthaayi. oka paatra theeruthennulu prarabdham vallano vaari karma phalam vallano ani meeru anacchu. adhe nijam aithe manamendhuku kastapaduthunnaam, devude (mee bhashalo raamude) anni choosukuntaadu ga. anthaa mana moorkhatvam ani meeru anacchu. unnaado ledo, unte manchodo cheddodo theliyani devudini nammatam kante manassaakshi ni nammukotam moorkhatvamane rojulu inkaa nadusthunnaayaa?
ika prasna, samaadhanam gurinchi antaaraa mundhu gaa thelusukovalsindhi ae prasna adagaali ani. naa prasna okate. devudu ledu ani mikelu pattukuni maatlaadevaallu paapulaithe vaallani devudu shikshisthaadaa? okavela shikshinchakapothe vaalini chettu chaatununchi kottaakano leka sita ni vanavaasaaniki pampinappudo raamudu maaripoyi thappu thelsukunnaadani anukovacchaa? okavela shikshisthe, dhaanini bayataki cheppukuni, migathaa "kaaboye paapula"ki thana meedha nammakam kaligisthaadaa? ramudu maanaava avathaarudu kabatti maanavula lo unde lotupaatlanni aayanalo unnaayanukovacchunaa? alaa unte aayanani devudi kindha lekkeyocchunaa mari?

aakhari ga o maata: naa chetha ee prasnalu adiginchindhi mee aatmaaraamude, kaakapothe prathi manishilonu oke aatmaaraamudu undadu, chinnappudu chadhivina grandhaalanu batti, aerparachukunna abhipraayalanu batti okko aatmaraamudu udhbhavisthaadu. okaru aatmaraamudantaaru. okaru krishnudantaaru. okaru yaesantaaru. ae raayayithe aenti palloodagottukotaniki annattu.
nenu aham antaanu. "aham brahmasmi"