Saturday, March 31, 2012

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

శ్రీరామనవమి శుభాకాంక్షలతో ......

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
మధుర మధుర తర శుభనాముడు ...... గుణధాముడు ......
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

ఎరిగినవారికి ఎదలో ఉన్నాడు ...... ఎరుగనివారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడైనాడు .....
తలచినవారికి తారకనాముడు ...... పిలిచిన పలికే చెలికాడు సైదోడు ......
కొలువై ఉన్నాడూ కోదండరాముడు ...... మనతోడుగా నీడగా రఘురాముడు

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

కరకుబోయను ఆది కవిని చేసిన పేరు ...... గరళకంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపరసాధనకు ఇహమైన పేరు ......
శబరి ఎంగిలి గంగ తానమాడిన పేరు ...... హనుమ ఎదలో భక్తి ఇనుండించిన పేరు
రామ ...... రామ ...... అంటే కామితమే తీరు ...... కలకాలమూ మము కాపాడు పేరు

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
మధుర మధుర తర శుభనాముడు ...... గుణధాముడు ......
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

చిత్రం : పంతులమ్మ
సాహిత్యం : వేటూరి గారు
సంగీతం : రాజన్-నాగేంద్ర గార్లు
గానం : పి. సుశీల గారు

ఆడియో

Tuesday, January 10, 2012

విశేఖర్ గారూ, అనైతికతకి అర్థం చెప్పగలరా?

విశేఖర్ గారు అసభ్య వ్యాఖ్యలు ప్రచురించరట. మరి పెద్దలు బ్లాగ్మితృలు కాస్త ఈ కింద వ్యాఖ్యల్లో అసభ్యం ఏముందో వివరిస్తే అసభ్యం అన్న పదానికి అర్థం తెలుసుకోగలను.

---------------------------------------------------

మొదటి వ్యాఖ్య
----------------------------------
మీ వ్యాఖ్య అంగీకారం కొఱకు ఎదురుచూస్తున్నది

Padma
7:05 ఏ ఎమ్ వద్ద జనవరి 10, 2012
పద్మ గారి లాంటి వారు కూడా ప్రవీణ్ బూతుని విశేఖర్ కూడా ఉపసంహరించుకోవాలని కొరాడు గనక అది మద్దతుగా తెస్తూఎప్పుడు ఉపసంహరించుకుంటున్నావ్?’ అని ప్రవీణ్ ని కవ్వించడానికి ప్రయత్నించారే గాని, విశేఖర్ ని వ్యక్తిగతంగా దూషిస్తూ, ద్వేషిస్తూ దూషణల బ్లాగ్ తెరవడం సరికాదు అని ఒక్క మాట మర్యాదకైనా చెప్పలేకపోయారు.
——————————————————————————————–
విశేఖర్ గారూ, మిమ్మల్ని దూషిస్తూ ఒక బ్లాగ్ తెరిచారా? ఎక్కడ? ఒకవేళ మీరు ఆ మధ్య ఎప్పుడో పెట్టిన అబ్దుల్లా బ్లాగ్ గురించి అయితే సారీ, నేను అది కెబ్లాస వారిదంటే ఒప్పుకోలేను. కేవలం మిమ్మల్ని ఆ బ్లాగ్‌లో విమర్శించినంత మాత్రాన ఇక ఆ బ్లాగర్ కెబ్లాస సభ్యుడయిపోతారా? కెబ్లాస సభ్యులు తప్ప ఇంకెవరూ మిమ్మల్ని విమర్శించరు అని మీరనుకుంటున్నారా? అది తప్పకుందా ఒక భ్రమే విశేఖర్ గారు.

వీళ్లకి నచ్చిన భావాజాలాన్ని ఎవరూ విమర్శించరాదని వీరి అప్రకటిత రూలు. ”
—————————————————————————————————-
I am sorry to say Visekhar గారూ, మీరు కొంచెం ఎక్కువే ఊహించుకుంటున్నారు. ప్రకటిత రూల్సే లేవండి. ఇంక అప్రకటిత రూల్స్ ఎక్కడి నించి వస్తాయి? ప్రజాస్వామ్యాన్ని పాటిస్తే ఇదేనండి బాధ. అప్రకటిత రూల్ ప్రకటిద్దామన్నా ఉండదు. మీకు నచ్చని భావజాలాన్ని మీరు విమర్శించటంలేదా? అలాగే వారికీ ఆ హక్కు ఉండదా? సరే, ఉండకూడదు. ఆ భావజాలాన్నే విమర్శించాలి కానీ ఆ భావజాలం పైన ఒకరి అభిప్రాయాన్ని కాదంటారా? మరి అలాంటప్పుడు ప్రవీణ్ హిందుత్వమూ, హిందూ దేవుళ్ళు, వేదాలు వగైరా విషయాల మీద రాసిన ప్రతి బ్లాగ్‌లోకి వెళ్ళి అక్కడ ఎందుకండి విమర్శలు చేస్తాడు? అవి మీ కళ్ళకి కనబడవే?

పోనీ దీనికి జతగా ప్రవీణ్ అలా చేస్తే మేమూ ఉపసంహరించుకుంటాం అంటున్నారా? అదీ లేదు.
——————————————————————————————
భరద్వాజ మొన్న ఏమన్నారో మీరు చూడలేదనుకుంటాను. ఇది చూడండి.
http://malakpetrowdy.blogspot.com/2012/01/blog-post_06.html

దానికి ఎవరూ స్పందించలేదే?

పద్మ గారు కనీసం చిత్త శుద్ధిని కూడా కనపరచలేదు. పూర్తిగా ఏక పక్షం. ప్రవీణ్ ఊపసంహరించుకోవాలన్నదే ఆమే డిమాండ్. వారి గ్యాంగ్ పేర్లకింద బూతులు చూపండి అని తెలివిగా మాట్లాడడమే తప్ప బూతులు ఉండరాదన్న విషయంలో వారికి మాత్రం చిత్త శుద్ది కనిపించడం లేదు. ”
—————————————————————————————–
విశేఖర్ గారూ, మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రవీణ్ ఒక కుటుంబాన్ని లాగి కుటుంబ సభ్యులని బూతులు తిట్టినందుకు క్షమాపణ చెప్పాలని అడిగాను. ఉపసంహరించుకోవటం మాత్రమే కాదు. మీరు ఆ కామెంట్స్ డిలీట్ చెయ్యాలంటున్నారు. కానీ ఆ బూతు భరించలేని సభ్యసమాజంలో బ్రతికే మానవమాత్రుల కోసం ఆ బ్లాగ్ ఓనర్ ఆల్రెడీ డిలీట్ చేశారు. మీకు కావాలంటే స్క్రీన్‌షాట్స్ చూపగలరు. ఇక బ్లాగుల్లో బూతు ఉండరాదు అన్న విషయంలో నా చిత్తశుధ్ధి మీద మీకు చింత అనవసరం. మీరనే గాంగ్ పేర్ల కింద బూతులుంటే నేను వారిని అడగగలను. లేనప్పుడు ఎవరిని వెళ్ళి అడగమంటారు? ఎవరిని ఏకెయ్యమంటారు? నేను మీరనే “తెలివి”గా మాట్లాడింది మీకు అర్థం కాలేదని నాకు అర్థం అయింది సర్.

ఒత్తిడి తెచ్చి నాలాంటి వారి మద్దతు తీసుకుని ప్రవీణ్ ని రాక్షసీకరించాలన్న ప్రయత్నమే తప్ప ఇరు వైపులా బూతులు ఉండరాదు అన్న చిత్త శుద్ధి పద్మ గారు కూడా ప్రకటించలేకపోయరు. ఇది ఆమోదించలేని విషయం.”
———————————————————————————–
మీ మీద వత్తిడి తీసుకురావలసిన అవసరం ఏముందండి? మీ మీద ఒత్తిడి తీసుకువస్తే ఎవరికేం ఒరుగుతుంది? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కుటుంబాన్ని బైటికి లాగిన విషయంలో మీరు అవతలి గ్రూప్ వారు కూడా తప్పులు చేశారు అని ప్రూవ్ చెయ్యండి. నేను ఆ విషయంలో తప్పక మీకు మద్దతు ఇస్తాను. నేనేంటి, ఇప్పుడు విషయం ఇంత పెద్దది అయి ఇంతమంది ముందుకు వస్తున్నారుగా. అందరూ మీకు మద్దతిస్తారు.మునుపటి కామెంటులో చెప్పినట్టు మీరెంతసేపు అజ్ఞాత = కెబ్లాస అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారే కానీ ఆ అజ్ఞాతలు వేరే వారెందుకు కాకూడదు అని ఆలోచించరే? ఈ లెక్కన కెబ్లాసని తిట్టిన అజ్ఞాతలు ప్రవీణ్ లేక మీరు అని వాళ్ళనుకోవచ్చుగా? నేనెవరిని బూతు మాట్లాడవద్దని కోరాలంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అజ్ఞాతలనా? ఎలా అడగమంటారో కూడా చెప్పండి. తప్పకుండా బ్లాగ్లోకాన్ని కడిగేద్దాం. I am serious. At the same time, కెబ్లాస, ఇతర బ్లాగర్ల మీద అజ్ఞాతంగా వ్యాఖ్యలు రాసిన వారిని మీరు అడగండి. ఆ అజ్ఞాతలు వచ్చి క్షమాపణ చెప్పేలా చెయ్యండి. చెయ్యగలరా? కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని బాగు చేసుకుందామండి. ఊహాజనిత విషయాల మీద దృష్టి తర్వాత పెట్టవచ్చు.

ఇక బ్లాగుల్లో బూతులు ఉండరాదు అన్న విషయానికి నా మద్దతు నూరు శాతం ఉంటుంది. కానీ అజ్ఞాతలుగా వచ్చేవారిని మీరు నేనూ కనిపెట్టలేం కదండి. కానీ, ఇక నించి ఏ బ్లాగ్‌లో అయినా సరే అజ్ఞాత వ్యాఖ్యలైనా సరే, బూతు మాట్లాడింది కెబ్లాస సభ్యులని అని మీరు నిరూపించగలిగితే (ప్రవీణ్ అసలే నెట్వర్కింగ్ లో ఉద్దండ పండితుడు కదా. ఇది నేను చాలా వ్యంగ్యంగానే అంటున్నాను.) నేను కెబ్లాస నించి తక్షణం తప్పుకుంటాను. మీకు సమ్మతమేనా?

రెండో వ్యాఖ్య
--------------------------------------------------------
మీ వ్యాఖ్య అంగీకారం కొఱకు ఎదురుచూస్తున్నది

Padma
8:58 ఏ ఎమ్ వద్ద జనవరి 10, 2012
నేనన్నది: “మీ ఆలోచనలనీ, అభిప్రాయాలని పంచుకోవడానికికెలుకుడు బ్లాగర్ల సంఘంపెట్టారా? నచ్చలేదని హాస్యంగా చెప్పడానికి కెలకాలా? ఏం వివరణ అండీ?” అని.మీరన్నదానికీ, మీరన్నారని నేను చెబుతున్నదీ పైన ఇచ్చాను. రెండింటికీ తేడా ఉందా?”
———————————————-

ఖచ్చితంగా ఉంది. వారి ఆలోచనలనీ, అభిప్రాయాలనీ పంచుకోటానికి కాదండి. ఎప్పుడైతే ఒకరి అభిప్రాయాలు వారు ప్రచురించుకుని దాని మీద వీళ్ళ అభిప్రాయాలని వెల్లడిస్తే, ఆయ్ తప్పు అని కళ్ళెర్రజేసి నోటి మీద వేలు పెట్టుకోవాలని శాసించినపుడు మాత్రమే, అదీ వ్యంగ్యంగా. పైగా ఎంత చర్చించినా తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళంటారు కొందరు. వారి కోసం.

నచ్చని అభిప్రాయాలు ఉంటె చర్చకు దిగుతారని మాత్రమే నాకు తెలుసు. కానివిష శేఖర్అని ద్వేష పూరితంగ కెలుకుతారని మీ ద్వారా తెలుసుకుంటున్నా.”
అందులో ఇప్పుడే పోస్టు చూసాను. (ఇంతకు ముందెప్పుడూ అది చదవలేదు) నా పేరునువిష శేఖర్గా ప్రస్తావించారు. ఇది హాస్యం అని నేను నమ్మాలా? త్రాష్టుడు నా పేరు మారిస్తే దాన్ని అరువు తెచ్చుకుని మీరు (మీ బ్యాచ్) ఉదహరిస్తే అది హాస్యం అని నేను నమ్మాలి. కదండీ పద్మ గారూ?
——————————————
విశేఖర్ గారూ,ఒక్కటి చెప్పండి సూటిగా. మీరు త్రాష్టుడు అని అవతలి గుంపులో ఒక వ్యక్తిని అన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనకూడదని ఎలా అనుకోగలరు? మీది బాధ కానీ అవతలి వాళ్ళ చర్మం మటుకు మందం. How is it fair?


నేను అమెరికానీ, దాని విదేశాంగ విధానాలనీ విమర్శిస్తాను. హిందూ, (ముస్లిం కూడా) మత దురహంకారాలని విమర్శిస్తాను. కాని వ్యక్తిగతంగా ఎవర్నీ విమర్శించను.
కెలుకుడు గ్యాంగేమో నాపైనే వ్యక్తిగత దాడి చేస్తారు. విశేఖర్ అయితేవిష శేఖర్అంటూ పచ్చి వ్యక్తిగత ద్వేషం వెళ్లగక్కుతారు.”
————————————————————————————–

వ్యక్తిగతంగా ఎవర్నీ విమర్శించరు. నమ్మమంటారా విశేఖర్ గారూ?? అలా అనుకుంటే, విదేశాల్లో ఉన్న భారతీయులు పచ్చి దుర్మార్గులు, దేశభక్తి లేని వారు, ఇక్కడి డబ్బుతో చదువుకుని దేశం వదిలి ఎగిరిపోతారు. దేశాన్ని పట్టించుకోరంటూ మీరు ఒక పెద్ద పోస్ట్ వేసారే? దాన్నేమందామండి? నేను అమెరికాలో ఉంటాను. కానీ నా దేశాన్ని నేను మర్చిపోలేదు. కానీ మీ వ్యాఖ్య నాకు వ్యక్తిగతంగా ఎంత బాధ కలిగిస్తుందనుకుంటున్నారు? అది వ్యక్తిగత దాడి కాదంటారా? మిమ్మల్ని విషశేఖర్ అన్నందుకే మీరంత బాధపడుతున్నారే, మరి మీరు విదేశాల్లో ఉండే భారతీయులందరూ “దేశద్రోహులు” అన్నట్టు మాట్లాడితే, అది ఇంకెంత తీవ్రమైన వ్యక్తిగత దాడి విశేఖర్ గారూ?

నేను అమెరికానీ, దాని విదేశాంగ విధానాలనీ విమర్శిస్తాను. హిందూ, (ముస్లిం కూడా) మత దురహంకారాలని విమర్శిస్తాను
——————————————————-

ప్రపంచంలో అమెరికా, ఇండియానే కాదండి. ఇంకా చాలా దేశాలున్నాయి. చైనా, రష్యా, క్యూబా ……. ఇంకా వేరే మతాలూ ఉన్నాయి. వాటిల్లోనూ దురహంకారాలే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. మరి వాటి గురించి రాయరే? నా ఇష్టం అంటారా? కరెక్టే మీ ఇష్టమే. కానీ చెడు ఎక్కడ ఉన్నా చెడేననీ. అది ఏ మతంలో ఉన్నా, ఏ దేశపు విధానాలలో ఉన్నా దానిని ఖండించాలనీ మీరు నమ్మకపోతే అది మీ ఇష్టం. కాకపోతే ఆ చిన్న డిస్క్లైమర్ పెట్టుకుంటే కేవలం అమెరికానో, హిందూ/ఇస్లాం మతాలనో తిడితే చదివి మురిసిపోదాం అనుకునే వారే వస్తారు. Trust me. మీరా డిస్క్లైమర్ పెట్టండి. మీ మీద ఇంకే రకంగా విష ప్రచారం జరుగుతుందో చూద్దాం. మీరు ఎగతాళి అని అనుకుంటారేమో. నేను సీరియస్‌గానే చెప్తున్నాను.

నేను ద్వేషం వద్దు. పద్ధతిగా, మర్యాదగా మాట్లాడండి అంటాను. విషయం చర్చించండి అంటాను.
అప్పుడు కెలుకుడు గ్యాంగ్ యాక్టివ్ గా రియాక్ట్ అవుతుంది. ఏమని? “మీకు ఇతరులని విమర్శించే హక్కు ఎలా ఉంటుందో, మాకు మిమ్మల్ని విమర్శించే హక్కు ఉంటుందిఅని. ఎవరైనానీకు నన్ను విమర్శించే హక్కు ఎలా ఉందో నాకూ నిన్ను విమర్శించే హక్కు ఉందిఅంటారు. వీళ్ళు మాత్రం ‘(మమ్మల్ని విమర్శించకపోయినా) అమెరికా విధానాల్ని, హిందూ మత దురహంకార విధానాల్ని విమర్శిస్తే మాకు నిన్ని ద్వేషిస్తూ దుష్ప్రచారం చేసే హక్కు ఆటోమెటిక్ గా వస్తుందిఅంటారు. కెలుకుడు గ్యాంగ్ కదా!
ఇది కెలుకుడు తెలివి. కెలుకుడు గ్యాంగు నాపైన ప్రయోగించిన నీచ నికృష్టకెలుకుడుతెలివి ఇది.”
——————————————————————————————————————

విశేఖర్ గారూ, మీరొక్కసారి ఈ కింద లింక్ చదవాలి. కామెంట్లతో సహా. ట్రాస్‌కాన్ విషయంలో మీ అభిప్రాయాన్ని అప్పుడు జరిగినదేంటో తెలుసుకుందామని ఉంది నాకు.
http://kalalaprapancham.wordpress.com/2012/01/08/%E0%B0%85%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82-%E0%B0%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AE%E0%B1%80/

నేను వ్యక్తిగతంగా ఏమీ రాయకపోయినా, మూకుమ్మడిగా నా పైన వ్యక్తిగత విద్వేషం వెళ్ళగక్కడం ప్రోయాక్టివ్ గా రాయడం కాదా? ”
—————————————————-

వ్యక్తిగతంగా ఏమీ రాయకపోయినా అన్నది పైన చూశాం కదండి. నేను ప్రత్యక్షంగా చూసిన చదివిన విషయం గురించే మాట్లాడుకుందాం. విదేశాల్లో నివసించే భారతీయులందరూ దేశద్రోహులు అని తేల్చేశారు. అది వ్యక్తిగతం కాదు. మీరంతటి తీవ్రమైన ఆరోపణలు చెయ్యటం తప్పు కాదు. కానీ అంతే తీవ్రమైన పదజాలంతో అవతలి వాళ్ళు మీ అభిప్రాయాలని (మీ అభిప్రాయాలని మాత్రమే) నిరశిస్తే అది వ్యక్తిగతం.

మీ లక్ష్యం ఒక భావాజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం. అందుకు మీరెంచుకున్న పద్ధతి కెలుకుడు. ”
———————————————————————–

ఒక్కటంటే ఒక్క పోస్ట్ మీరనే ఒక భావజాలానికి వ్యతిరేకంగా ప్రొయాక్టివ్‌గా పోస్ట్ చేశారో చూపించండి విశేఖర్ గారు. ఒక్కటి చాలు. అది రియాక్షన్ కాకుండా ప్రొయాక్టివ్‌గా చేసిందని చూపించండి.

"ఒక భావాజాలం వ్యక్తం చేస్తున్నందుకు, భావజాలం మీకు ఇష్టం లెనందుకు, మీ ఇష్టం లేని భావజాలం వ్యక్తం చేస్తున్న వారిపైన వ్యక్తిగతంగా చేస్తున్న కెలుకుడు."
———————————

ఇదే మాట మిమ్మల్ని అంటే ఏమంటారు విశేఖర్ గారూ? మీకు ఇష్టం లేని భావజాలానికి సంబంధించినవారు కాబట్టే కెబ్లాస వాళ్ళు ఏం చేసినా మీకు తప్పు గానే అనిపిస్తోందనీ, వాళ్ళ మీద దుష్ప్రచారం మీకు సబబుగా అనిపిస్తోందని అంటే మీ సమాధానం?
మీ భావజాలాన్నీ, మీవి కొన్ని (మీవి మాత్రమే) అయి (మీరు నిర్ణయించేసి ప్రజల మీదకి వదులుతున్న) అభిప్రాయాల మీద నిరసన వ్యక్తం చేసినవారికి త్రాష్టుడు, నికృష్టుడు అని బిరుదులివ్వడం మీరు పేరు పెట్టకుండా చేస్తున్న మీ స్టైల్ కెలుకుడు అంటే మీరేమంటారు?

ప్రవీణ్ బూతుల్ని ప్రశ్నిస్తున్నవారు ప్రవీణ్ అనుభవించిన మానసిక టార్చర్ ని కూడా చూడాలని కోరతాను. టార్చర్ గాళ్ళని, కెలుకుడు గాళ్లని వ్యతిరేకించకుండా ప్రవీణ్ బూతుల్ని వ్యతిరేకించడం సాధ్యంగాదని మాట సాయం చేస్తున్నా.”
————————————————————–

మీకు ముందటి కామెంటులో చెప్పాను. ప్రవీణ్ అనుభవించిన టార్చర్‌ని మాత్రమే చూసిన మీరు మీ దృష్టిని కాస్త పక్కకి తిప్పి చాలా ముందటి నించి ప్రవీణ్ టార్చర్ చేసిన వారిని కూడా చూడాలని కోరుతున్నాను.

మూడో వ్యాఖ్య
---------------------------------------
మీ వ్యాఖ్య అంగీకారం కొఱకు ఎదురుచూస్తున్నది

Padma
11:26 ఏ ఎమ్ వద్ద జనవరి 10, 2012
Btw, ఇందాక ఒకటి అడగటం మర్చిపోయాను విశేఖర్ గారూ. దయచేసి నేను కామెంట్ పెట్టినదాన్లో ఎక్కడ ఈ కింద విషయం అన్నానో కాస్త చూపించగలరు.
—————————————————-

మీరు మొత్తం సంఘంలో ఉన్నాక ఒకరి పోస్టులకు మరొకరు అటోమేటిక్ గా బాధ్యులవుతారు. ‘మేమంతా కెబ్లాసఅంటూనే ఒకరి పోస్టులకి మరొకరు బాధ్యత లేదని మీరు చెబుతున్నారు. అది సమంజసం కాదు. పైగా అందులో యాక్టివ్ గా భాగం కానందుకు ఇప్పుడు చింతిస్తున్నానని కూడా అంటున్నారు. సంఘంలో ఉంటూ అందులో ఒకరికొకరు బాధ్యత వహించకపోవడం ఏంటసలు? బ్లాగ్ లో రాసే ప్రతీ రాతా, సంఘంలో ఉండే ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. అలా బాధ్యత తీసుకోలేని పక్షంలో బైటికి వచ్చి సెపరేట్ బ్లాగ్ పెట్టుకోవచ్చు. అది చేయకుండానా బాధ్యత లేదుఅని మీరు అనలేరు. అది నైతికం కాదు.”
———————————————-

నేను యాక్టివ్‌గా పార్టిసిపేట్ చెయ్యలేదన్నాను కానీ ఒకరి పోస్టులకి మరొకరో, నేనో బాధ్యత తీసుకోమని ఎక్కడ చెప్పానండి? లేక ఇది కూడా మీరు మీ “దృష్టి కోణంలో” నించి అర్థం చేసుకున్నదా? నేను అనని మాటని నా నెత్తిన రుద్దేసి అనైతికత అంటగట్టేస్తున్నారే? భలేవాళ్ళండి.
-------------------------------------------------

చదువరులు కాస్త పై వ్యాఖ్యల్లో అసభ్యం ఎక్కడ ఉందో వివరిస్తే నా తెలుగుని సవరించుకుంటాను. వీలైతే శబ్దరత్నాకరం కూడా మార్చేద్దాం. ఏమంటారు?

విశేఖర్ గారూ,
చర్చని పక్కదోవ పట్టించాలని చాలా ప్రయత్నాలు చేశారు ఇన్నిరోజులు. అది కుదరలేదు. దానితో ఏకంగా "అమ్మతనాన్ని" ఉపయోగించుకుని చర్చని భూస్థాపితం చేశారు. కానీ సర్, ఈ వ్యాఖ్యలు ప్రచురించి చేసుంటే బావుండేదేమో. మీరు సమాధానాలు చెప్పాలని కాదులెండి. చెప్పలేకే కదా ఈ పని చేశారు. కానీ మీరు మోపిన అభియోగాలకి నా సమాధానాలు తెలియాలి కదండి. కానీ ఒకటి మీరు ప్రచురించి ఉంటే ఖచ్చితంగా అదొక ఫ్లాష్ న్యూస్ అయ్యేది మీ ప్రవర్తనకి భిన్నంగా వెళ్ళినందుకు. :)))

ఒక్క విషయం గుర్తుంచుకోండి విశేఖర్ గారూ. ఎదుటివారిని "అనైతికులు" అని "వ్యక్తిగత దాడి" చేసే ముందు, వారి నైతికతని ప్రశ్నిస్తూ వేలెత్తి చూపే ప్రయత్నం చేసేటప్పుడు మిగిలిన నాలుగు వేళ్ళూ మీవైపే చూపిస్తున్నాయని గ్రహించుకోండి. మీ నైతికతని పరీశీలించుకోండి.

విశేఖర్ గారూ, చప్పట్లు

చప్పట్లు విశేఖర్ గారూ చప్పట్లు. అఖరికి చేసేది ఏదీ లేక మరేమీ చెయ్యలేక ఇదన్నమాట మీరు చేసింది. ఇది ముందస్తుగా ఊహించినదే. మీతో ఇదివరకు వాదించిన బ్లాగ్మిత్రులు చెప్పిందే. సో వింతగా ఏమీ అనిపించలేదు. వాదన చెయ్యలేని భీరువులు చేసే పనే మీరూ చేశారు. అసలు మీ పచ్చ కాదు కాదు ఎఱ్ఱ కళ్ళద్దాలున్నాయి చూశారు. భలే కనిపిస్తుందండి మీకు ప్రపంచం అందులో నించి.

"ప్రవీణ్ గారు మీకెలుకుడిమిత్రుడి తల్లిగారిని లాగినందుకు మీరు మా తల్లిని చర్చలోకి లాగుతారా?"
-------------------------------------------

మీ తల్లిగారిని లాగటమా? మీ ఎఱ్ఱకళ్ళద్దాలకి అలా కనిపించిందా? ఒక వేళ లాగాలనుకుంటే ఇన్నిరోజులెందుకు ఆగటం ఎందుకు విశేఖర్ గారూ? చర్చ మొదలైన మొట్టమొదటిరోజు చేసుండేవాళ్ళమే?

"తప్పని ఒప్పుకుంటూనే, తప్పుని అక్కడికక్కడే సరిచేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా, బాధ్యత నా పైన మోపుతారా?"
------------------------------------------------------

ఏదండి తప్పు? మీ తల్లిగారిని చర్చలోకి అసలు లాగారా? ప్రస్తావన తీసుకొచ్చినందుకు, అది ఇంకెలా చెప్పాలో తెలీటంలేదు అని క్లియర్‌గా క్షమాపణ చెప్పానే. ఈ క్షణానికీ నేను దానికే కట్టుబడి ఉన్నాను. ఇద్దరు మనుష్యుల మధ్య గొడవ జరిగినప్పుడు ఆ ఇద్దరూ మాత్రమే ఉండాలి వారి కుటుంబ సభ్యులని లాగకూడదని మొదటినించి చెప్తూ వచ్చాను. తమరు చాలా కన్వీనియెంటుగా ప్రవీణ్‌ని తిట్టారు కాబట్టే అతనా పనిచేశాడు అయినా తిట్టటం తప్పే అని సమర్ధించుకొచ్చారు. పైగా ప్రత్యేకమైన పోస్ట్ వేశానని గొప్పలు చెప్పుకుంటున్నారే, అందులో ఎంత సమర్ధించుకుంటూ వచ్చారో ఎవరికి తెలీదు విశేఖర్ గారూ? అలాంటి మీకు తల్లిని దూషిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది అనుకోవటం అవివేకం. కానీ ఆ అవివేకమైన పని చేస్తూ వచ్చాను ఇన్ని రోజులు. ఆ ప్రయత్నంలో భాగంగానే మీ తల్లిగారిని అంటే ఎలా ఉంటుందో ఊహించుకోమన్నాను. మీ తల్లిగారిని నేనేమీ దుర్భాషలాడలేదే, మీ మితృడిలా? ఆవిడని ఒక్క మాట అనలేదే? ఇన్‌ఫాక్ట్ అలా పోల్చుకొమ్మన్నందుకే క్షమాపణ కూడా చెప్పానే? అబ్బే, అసలు పాయింటు మీకెందుకు కావాలి? మీ ఎఱ్ఱ కళ్ళద్దాలు ఏది చెప్తే అదే కావాలి. మాతృమూర్తికి ఏమయితేనే? ప్రవీణ్‌ని ఇతర బ్లాగర్లు అన్న మాటలనీ, ప్రవీణ్ ఇతర బ్లాగర్ల కుటుంబాన్ని బజారుకి లాగి తిట్టిన బూతులనీ ఒకే గాటన కట్టే ఈ విశేఖర్ లాంటి బ్లాగర్లందరికీ నా ప్రశ్న. మీ తల్లిగారినే ఆ స్థానంలో ఊహించుకోండి. అప్పుడు కూడా ఒకే గాటన కట్టగలరా? పాపం ఇన్నిరోజులు భరించి ఇప్పుడు మీ తల్లిగారిని అన్నాడులే అది తప్పే కానీ పాపం కారణం ఉన్నదీ అంటూ అవతలివారికి నీతులు చెప్తారా?

ఒక్క విషయం గుర్తుంచుకోండి విశేఖర్ గారూ, రేపు ఇంకెవరన్నా మీ విషయంలో ప్రవీణ్ చేసిన పనే చేస్తే (ప్రవీణ్ చేసినా నేను ఆశ్చర్యపోను) మీకు నా మద్దతు ఉంటుంది. కెలుకుడు మితృడి తల్లికే కాదండి ఏ మాతృమూర్తికి అవమానం జరిగినా నేను ఖండిస్తాను.

"‘ప్రవీణ్ ఒకరి తల్లిగారిని తిడితే తప్పులేనపుడు, విశేఖర్ తల్లిగారి ప్రస్తావన తేవడం తప్పెలా అవుతుందిఅని విష ప్రచారం చేసుకోవడానికి మీరు జాగ్రత్తగా పాల్పడిన కుటిల ఎత్తుగడ ఇది. అందుకే మీరు చేసిన తప్పుని సవరించుకోగల అవకాశం మీకు వెంటనే ఉన్నా దాన్ని వినియోగించుకోవడానికి ముందుకు రాలేదు. "
--------------------------------------------------------

ఇది చదివి విపరీతమైన నవ్వొచ్చింది విశేఖర్ గారూ. మీ ఎఱ్ఱకళ్ళద్దాలు కాదు కానీ భలే ఊహించుకుంటారండీ. కంపారిజన్ మీలాంటివారే చెయ్యగలరు విశేఖర్ గారు. ఆ అవసరం నాకు లేదు. ఇన్‌ఫాక్ట్ అలాంటి ఆలోచనా నాకు రాలేదు. తప్పొప్పుల ప్రసక్తి మీరెత్తకుండా ఉంటేనే బావుంటుందేమో. సమస్య తీవ్రతని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోగా దాన్ని తెలివిగా ఇంకొకందుకు వాడుకుంటున్నారే, గురివింద గింజ నాకు గుర్తు రావటంలో దాని తప్పేమీ లేదు పాపం.

"కానీ సందర్భంగా గౌరవనీయ బ్లాగర్లు ముఖ్య విషయం గుర్తించాలి. మా అమ్మగారే కాదు, ఎవరి అమ్మగారిఅమ్మతనంఐనా ఒక్కరికెలుకుడికీ చెరిగిపోదు. ఒక్క కుసంస్కారి తిట్లకీ చెదిరిపోదు. ఒక్కరి కుటిల బుద్దులకూ బెదిరిపోదు. అలా చెరిగి, చెదిరి, బెదిరి పోయేదయితే ఆమెఅమ్మఎలా అవుతుంది? ఆమెదిఅమ్మతనంఎలా అవుతుంది. ‘అమ్మ ఎవరికైనా అమ్మేఅన్నది ప్రత్యక్షర సత్యం. ఎంతమంది కెలుకుడు గాళ్లు పూనుకుంటే సత్యం తుడిచిపెట్టుకు పోవాలి? అసలది తుడిచిపెట్టుకుపోయే సత్యమా? "
----------------------------------------------------------

అమ్మ గురించి అమ్మతనాన్ని గురించి మీరు మాట్లాడటం వింతగా ఉంది. ఒక పక్క ఒక తల్లిని తిట్టినవాడిని వెనక దాచిపెట్టుకుని వస్తూ, "అబ్బే నేను తిట్టేశాను. అయినా అతని తప్పేం ఉంది? అతన్ని తిడితే భరించలేక అతను అమ్మని తిట్టాడు. ఎవరి అమ్మ అయితేనే? అమ్మే కదా ఏ ఒక్క కుసంస్కారి తిట్లకీ చెదిరిపోదు. ఏ ఒక్కరి కుటిల బుద్దులకూ బెదిరిపోదు. చెరిగి, చెదిరి బెదిరి పోనిది ఒక్క అమ్మే కదా. అందుకని తిట్టాడు. ఎందుకు అతన్ని తిడతారు? తప్పు కదూ." అనే మీరు నీతులు వల్లించడం చాలా నవ్వొచ్చేట్టు ఉంది. కానీ కరెక్టే చెప్పారు. ఏ కుసంస్కారి తిట్లకీ తల్లి (ఎవరి తల్లి అయినా) చెదరదు. ఆ కుసంస్కారి, ఆ కుసంస్కారిని వెనకేసుకొచ్చే కుసంస్కారుల బుధ్ధులు బైటపడతాయి.

ఇంకో విషయం విశేఖర్ గారూ, సమాధానాలు చెప్పలేక ఏదో రకంగా చర్చని ముగించటానికి "అమ్మతనాన్ని" ఉపయోగించుకున్నారు చూశారూ. దానికి చాలా చప్పట్లు. మీకు ఇంక ఆ పై మాటలు అనటానికి గల అర్హతని ఒకసారి సమీక్షించుకోండి. శెలవ్.

Thursday, January 5, 2012

హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ......

శ్రీ విశ్వనాధ్ శుక్లాజీ రచించిన హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ పాట నేను మొదటిసారి చాణక్య సీరియల్లో విన్నాను. బాగా నచ్చేసిన పాట. నచ్చిన కారణం పాట కూర్చిన రాగం. కానీ తర్వాత్తర్వాత పాట భావం, అర్థం తెలిసిన తర్వాత మరింత ప్రియం అయింది పాట.

దేశమాతని తన, మన, ధన, ప్రాణాలతో ఆరాధిస్తాము
శ్రధ్ధగా, మనస్పూర్తిగా, నిశ్చలమైన మనస్సుతో తలవంచి అభివాదం చేస్తున్నాము
నవ్వులు చిందే బాల్యంతో, ఉత్సాహం పొంగిపొర్లే యౌవనంతో, అనుభవం అందించిన శక్తితో రాష్ట్ర మాతని అర్చిస్తాము
చరిత్ర పుటలని తిరగేసుకుంటూ, గతం నేర్పించిన పాఠాలని మననం చేసుకొంటూ, మన భవిష్యత్తుగా భావించి మన దేశం గురించి చింతిద్దాము (ఆలోచిద్దాము)
మా తల్లి సేవకి విపత్తులై, అడ్డంకులై నిలచిన ఎన్నో సంఘటనలు మాకింకా గుర్తున్నాయి
దేశాన్ని కబళించ చూసిన శత్రువులని చీల్చి చెండాడి రక్తంతో జననికి అభిషేకం చేశాము
మనమందించిన సంస్కృతి అనే ఉన్నతమైన సింహాసనం మీద కూచుని భరతమాత జగతిని పరిపాలించేది
కాలచక్రం గతి తప్పి సింహాసనం నేడు ముక్కలయింది
మన మనశ్శరీరధనప్రాణాలు అర్పించి సింహాసనం పునఃప్రతిష్టిద్దాము
మన రాష్ట్రాన్ని ఆరాధిద్దాము.

ఒక్క పాటలో దేశం మీద అభిమానము, అర్చన, ఆరాధన, భవిష్యత్తుని గురించిన ఆలోచన, వర్తమానాన్ని తలుచుకుని ఆవేదన, తిరిగి నా దేశాన్ని అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలనే ఆవేశము ఇన్ని కలగలిసిన గీతం జాతీయ గీతం అవలేకపోయింది కానీ ప్రతి పాఠశాలలో ప్రతిరోజు పిల్లల చేత పాడించి వాళ్ళల్లో ఆవేదన కలిగించి ఆలోచన కల్పించి ఆవేశం రగిలించి అనుభవంతో వెన్నంటి నడిపిస్తే మన దేశానికి పూర్వ వైభవం తీసుకురావటం అసాధ్యం ఎంత మాత్రము కాదు.

हम करें राष्ट्र आराधन - హమ్ కరే రాష్ట్ర ఆరాధన్

हम करें राष्ट्र आराधन ...... आराधन
हम करें राष्ट्र आराधन ...... आराधन
तन से, मन से, धन से ...... तन मन धन जीवन से ......
हम करें राष्ट्र आराधन ...... आराधन

अंतर से, मुख से, कृति से ...... निश्चल हो निर्मल मति से
श्रद्धा से मस्तक नत से ...... हम करें राष्ट्र अभिवादन ...... अभिवादन

हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ......
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ......
तन से, मन से, धन से ...... तन मन धन जीवन से ......
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... आराधन ...... करें राष्ट्र आराधन

अपने हँसते शैशव से ...... अपने खिलते यौवन से
अपने हँसते शैशव से ...... अपने खिलते यौवन से
प्रौढ़ता पूर्ण जीवन से ...... हम करें राष्ट्र का अर्चन
हम करें राष्ट्र का अर्चन
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... आराधन ...... करें राष्ट्र आराधन

अपने अतीत को पढ़कर ...... अपना इतिहास उलट कर
अपने अतीत को पढ़कर ...... अपना इतिहास उलट कर
अपना भवितव्य समझ कर ...... हम करें राष्ट्र का चिंतन
हम करें राष्ट्र का चिंतन
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... आराधन ...... करें राष्ट्र आराधन

है याद हमें युग युग की ...... जलती अनेक घटनायें,
जो माँ की सेवा पथ पर ...... आई बन कर विपदायें,
हमने अभिषेक किया था ...... जननी का अरि षोणित से,
हमने श्रिंगार किया था ...... माता का अरि-मुंडों से,
हमने ही उसे दिया था ...... सांस्कृतिक उच्च सिंहासन,
माँ जिस पर बैठी सुख से करती थी जग का शासन,
अब काल चक्र की गति से वह टूट गया सिंहासन,
अपना तन मन धन देकर ...... हम करें पुनः संस्थापन
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ......
तन से, मन से, धन से ...... तन मन धन जीवन से
हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... हम करें राष्ट्र आराधन ...... आराधन ...... करें राष्ट्र आराधन

హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ......
తన్‌సే మన్‌సే ధన్‌సే ...... తన్ మన్ ధన్ జీవన్‌సే ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ......
అంతర్‌సే ముఖ్‌సే కృతి్‌సే ...... నిశ్చల్ హో నిర్మల్ మతి్‌సే
శ్రధ్ధా సే మస్తక్ నత్‌సే
హమ్ కరే రాష్ట్ర అభివాదన్ ...... అభివాదన్ ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్
తన్‌సే మన్‌సే ధన్‌సే ...... తన్ మన్ ధన్ జీవన్‌సే ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ...... కరే రాష్ట్ర ఆరాధన్ ......
అంతర్‌సే ముఖ్‌సే కృతి్‌సే ...... నిశ్చల్ హో నిర్మల్ మతి్‌సే ......
అంతర్‌సే ముఖ్‌సే కృతి్‌సే ...... నిశ్చల్ హో నిర్మల్ మతి్‌సే ......
శ్రధ్ధా సే మస్తక్ నత్‌సే
హమ్ కరే రాష్ట్ర అభివాదన్ ......
హమ్ కరే రాష్ట్ర అభివాదన్ ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ...... కరే రాష్ట్ర ఆరాధన్ ......

అప్నే హస్తే శైశవ్‌సే ...... అప్నే ఖిల్తే యౌవన్‌సే ......
అప్నే హస్తే శైశవ్‌సే ...... అప్నే ఖిల్తే యౌవన్‌సే
ప్రౌఢతా పూర్ణ జీవన్‌సే ...... హమ్ కరే రాష్ట్ర కా అర్చన్
హమ్ కరే రాష్ట్ర కా అర్చన్
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ...... కరే రాష్ట్ర ఆరాధన్ ......

అప్నే అతీత్‌కో పఢ్‌కర్ ...... అప్నా ఇతిహాస్ ఉలట్ కర్ ......
అప్నే అతీత్‌కో పఢ్‌కర్ ...... అప్నా ఇతిహాస్ ఉలట్ కర్
అప్నా భవితవ్య సమఝ్‌కర్ ...... హమ్ కరే రాష్ట్ర కా చింతన్ ......
హమ్ కరే రాష్ట్ర కా చింతన్
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ...... కరే రాష్ట్ర ఆరాధన్ ......

హే యాద్ హమే యుగ్ యుగ్ కీ జల్తీ అనేక్ ఘట్‌నాయే
జో మా కీ సేవా పధ్ పర్ ఆయీ బన్ కర్ విప్‌దాయే
హమ్‌నే అభిషేక్ కియాథా జననికా అరి షోణిత్‌సే
హమ్‌నే శృంగార్ కియాథా మాతా కా అరి ముండోసే
హమ్‌నే హీ ఉసే దియా థా సాంస్కృతిక్ ఉఛ్ఛ్ సింఘాసన్
మా జిస్ పర్ బైఠీ సుఖ్‌సే కర్తీథి జగ్ కా శాసన్
అబ్ కాలచక్ర కీ గతిసే వహ్ టూట్‌గయా సింఘాసన్
అప్నా తన్ మన్ ధన్ దేకర్ హమ్ కరే పునఃసంస్థాపన్
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ......
తన్‌సే మన్‌సే ధన్‌సే ...... తన్ మన్ ధన్ జీవన్‌సే ......
హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... హమ్ కరే రాష్ట్ర ఆరాధన్ ...... ఆరాధన్ ...... కరే రాష్ట్ర ఆరాధన్ ......

చాణక్య వీడియో

సాహిత్యం : శ్రీ విశ్వనాధ్ శుక్లాజీ
సంగీతం : చాణక్య సీరియల్‌కి : ఆశిత్ దేశాయ్

Monday, December 26, 2011

నా ఒక్క పాయింటు ప్రశ్నకి నీహారిక గారిచ్చిన పది పాయింట్ల రిప్లై కి నా సమాధానం.

నీహారిక గారు రమణ గారి బ్లాగ్‌లో ఒక వర్ణం/వర్గం మీద కొన్ని అభియోగాలు మోపారు.

http://yaramana.blogspot.com/2011/12/blog-post_21.html

వాటి మీద నేనడిగిన కొన్ని ప్రశ్నలకి వారి గూగుల్ ప్లస్ లో సమాధానమిచ్చారు. కానీ నా దృష్టిలో ప్లస్‌లు, ఫేస్‌బుక్‌లు స్నేహితులతో మాత్రమే పంచుకోదగ్గవి కాబట్టి నాకు ఆవిడతో ఎటువంటి పరిచయం లేదు కాబట్టి, ఆవిడ లేవనెత్తిన విషయమూ, ఆవిడ చేసిన/మోపిన అభియోగాలు పబ్లిక్ డిస్కషన్‌కి తప్ప ఆవిడ పర్సనల్ స్పేస్ అయిన ప్లస్‌లో డిస్కస్ చేసేవి కాదు కాబట్టి నా బ్లాగ్‌లో సమాధానం ఇస్తున్నాను.

1. "రాజు గారి పెద్ద భార్య మంచిది అంటే మిగతా వాళ్ళు చెడ్డ వాళ్ళనా అర్ధం ?"
సందర్భాన్ని బట్టి తప్పకుండానూ. కాంక్రీట్‌గా ఇదీ అననప్పుడు, ఎవరైనా ఏదైనా ఊహించుకోవచ్చు. ఊహలల్లుకోవడనికి ఏముంది చెప్పండి. సీత ముమైత్ ఖాన్‌లా నవ్వబట్టే రావణాసురుడు సీతని ఎత్తుకెళ్ళాడు అని మీరు ఊహాలు/కథలు అల్లేశారు ఆ మధ్య. మీకు తెలియనిదా? :)

2. "పగ అన్నది ఎందుకు వాడానో తెలియాలంటే మీరు 100% లవ్ సినిమా చూడాలి. ఆ సినిమాలో ఒక రెండేళ్ళ పిల్లవాడు ముద్దుగా "రెండేళ్ళ పగక్కా" అని అంటాడు. ఆ సినిమా లో డైలాగ్స్ అవి... వాటికి ట్రూ మీనింగ్ తీసుకోనవసరం లేదు. పైన రెండు కమెంట్స్ రమణ గారికి.. మూడవది లేఖిని గారికి వ్రాసినది. నా నుండి జనాలు అటువంటి కమెంట్స్ ఆశిస్తారు కాబట్టి ఆ తరహా కమెంట్స్ చేయవలసి వచ్చింది. "

మీరో, మరొకరో, ఇంకొకరో ఏది ఎందుకు అన్నారో తెలుసుకోవటానికి రిలీజ్ అయిన అడ్డమైన సినిమా చూడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ట్రూ మీనింగ్ తీసుకోకూడదు అని మీరనుకున్నప్పుడు ఒక డిస్క్లైమర్ పెట్టాలి. ప్రతీ గడ్డీ గాదం సినిమాలు చూడని నాలాంటివాళ్ళకి కాస్త తెలుస్తుంది.
ఒక వర్ణాన్ని పట్టుకుని అంత తీవ్రంగా పగ తీర్చుకుంటాను, చిన్నపిల్లలు కూడా ఇలా పగ తీర్చుకోవచ్చు అని తెలుసుకునేలా పగ తీర్చుకుంటాను అని స్టేట్మెంట్స్ ఇచ్చి చివరికి అబ్బే తూచ్ జనాలు నా నించి అటువంటివి ఆశిస్తారు కాబట్టి ఆ తరహా కామెంట్స్ చేయవలసి వచ్చింది అని అనటం మీకు కరెక్ట్ అనిపిస్తోందా అసలు? మీ నించి అంత చీప్ కామెంట్స్ ఆశిస్తారా జనాలు? సీరియస్లీ?

"3. నా తెలివితేటలు, ధైర్యం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నా కమెంట్స్, నా బ్లాగ్ చెపుతాయి, వీలుంటే చూడవచ్చు."

మీ కమెంట్స్ గురించి పైన ఆల్రెడీ నా అభిప్రాయం చెప్పాను. ఇక బ్లాగ్ అంటారా. I wish I could but I am sorryమీవి కొన్ని పోస్ట్శ్ చూశాక ఇంక చూడటం అనవసరం అనిపించింది. అయినా మీరు ప్రస్తుతం మాట్లాడే విధానాన్ని బట్టి మీ గురించి ఒక అభిప్రాయానికి రాగలను కానీ మీ కామెంట్స్, బ్లాగ్ ఫాలో అయి మీ గురించి తెలుసుకోవాలంటారా? ఎవరైనా ఒక పోస్ట్ వేసినా, కామెంట్ చేసినా దాని మీద నా కామెంట్ ఉంటుంది కానీ వారి గత పోస్టులు, కామెంట్స్‌ని బట్టి కాదు.

"4.నాకున్న పరిశీలన మరియు భగవద్గీత ఆధారంగా బ్రాహ్మణులకి గ్రహణశక్తి, ధారణా శక్తి, పునశ్చరణ శక్తి ఎక్కువ గా ఉన్నట్లు నేను గమనించాను. అంత మాత్రాన అందరూ అలా ఉండాలని రూలు లేదు. అమృతం అంతా దేవతలు తాగేస్తే రాక్షసులు ఏం చేసారు? వాళ్ళకున్న ఆలోచనా శక్తితో దేవతలతో రాక్షసులు వివాహం చేసుకుని చ్రొస్స్ బ్రీదింగ్ వల్ల కొందరు రాక్షసులు దేవతలు అయ్యారు. అలాగే ఈ బ్రాహ్మణులు కూడా సత్వ గుణం తోనే ఉండాలన్న రూల్ లేదు. "

"బ్రాహ్మణులు అందరూ సత్వగుణంతో ఉండాలన్న రూల్ లేదు." అసలలాంటి రూల్ ఉందని ఎవరన్నారు? ఇది కూడా మళ్ళీ మీ ఊహ? సత్వగుణమే కాదు వీరగుణం కూడా అదే పాళ్ళల్లో చూపించగలరు అవసరం వస్తే. బ్రాహ్మణులు కూడా రజస్తమో గుణాలకి అతీతులు కారు. నేను రమణ గారి బ్లాగ్‌లో చెప్పినట్టు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన, పొందే అర్హత కలిగిన కుటుంబంలో పుడితే ఆ జ్ఞానం వృద్ధిపొందే అవకాశం ఎక్కువ ఆ జ్ఞానానికి సంబంధించిన కొన్ని శక్తులు సహజంగా అలవడతాయి. పైన మీరు చెప్పారే అలాంటివి కొన్ని. ఉపయోగించుకున్నవారు బాగు పడతారు. లేదూ, షరా మామూలే. అంతే కానీ బ్రాహ్మణుడుగా పుట్టినవాడు బై డీఫాల్ట్ గొప్పవాడని ఎవరూ అనలేదు ఏ శాస్త్రమూ చెప్పలేదు.

"5.బ్రాహ్మణులు గొప్పవారని మమ్మల్ని తక్కువ గా చూస్తున్నారని ఇక్కడే ఉన్న దళితులు కొందరు వాదించటం నేను చూస్తున్నాను. నిజానికి కొందరు ముస్లింలు, కొందరు దళితులు అని చెప్పుకునే వారు ఎంతో చక్కటి తెలుగుతో చక్కగా వ్రాస్తారు. కానీ వాళ్ళంత గా వాళ్ళు చెప్పుకుంటేనే వాళ్ళు దళితులని మనకి తెలిసింది. వాళ్ళు చెప్పకపోతే మనకి తెలిసే అవకాశమే లేదు. అటువంటప్పుడు చిన్నచూపు ఎక్కడ ??"

కదా. ఇప్పుడు ఈ మాట అంటున్నారంటే అక్కడ రమణగారి బ్లాగ్‌లో బ్రాహ్మణుల మీద మీరు చేసిన వ్యాఖ్యని మీరే ఖండించుకున్నట్టు కదా?

"6.ఎదుటి మనిషి శత్రువైనా వాళ్ళ గొప్పతనం ఒప్పుకోవడం క్షత్రియ ధర్మం , మేము క్షత్రియులమైనప్పుడు ముందు క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించిన తరువాతనే బ్రాహ్మణ ధర్మానికి వెళ్ళగలుగుతాను కానీ ముందుగా వెళ్ళలేను. అందుకే మా ఆయనని కూడా ధ్యానం వద్దు రాజకీయం ముద్దు అని పోరుతున్నాను. "

మీరు చెప్పినది క్షత్రియధర్మం కాదండి. అది సనాతన ధర్మం. ఏ వర్ణానికి చెందినవాడైనా పాటించవలసిన ధర్మం. మీరు ప్రత్యేకంగా బ్రాహ్మణధర్మానికి వెళ్ళనక్కరలేదు. మీ క్షత్రియ ధర్మం సరిగ్గా నిర్వహిస్తే చాలు. ప్రజలని పాలించే అవకాశం ఉంటుందని రాజకీయాల్లోకి వెళ్ళటమే క్షత్రియ ధర్మం అని మీ ఉద్దేశమా? రాముడు రాజుగా లేకుండానే చాలా రాజధర్మాలు నిర్వహించాడు. రాముడితో పోలుస్తున్నాననుకుంటున్నారేమో. ఆ తప్పు నేనెప్పటికీ చెయ్యను. ఉదాహరణ చెప్తున్నానంతే. బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రాన బై డీఫాల్ట్ బ్రహ్మజ్ఞాని ఎలా అవరో క్షత్రియుడిగా పుట్టినంత మాత్రాన ఎవరూ రాజవరు. అవ్వాల్సిన అవసరమూ లేదు. ఆ ధర్మం నెరవేర్చాలంటే మీ చుట్టూ ఉన్నవారికి నాయకురాలవటానికి ప్రయత్నించండి. కష్మీర్లు, అయోధ్యలూ తర్వాత.

"7.నేను చెప్పింది నా ఫిలాసఫీ మాత్రమే !! సైన్స్ కాదు. సైన్స్ అయితే అందరూ ఆమోదించవలసి ఉంటుంది. ఇక్కడ నా అభిప్రాయంతో అందరూ ఏకీభవించనవసరం లేదు."

ఏకీభవించటం చాలా పై మాట. ముందు ఏకెయ్యకుండా ఉండే అభిప్రాయాలు వెలిబుచ్చండి. మీ అభిప్రాయం ఏదైనా మీరు ఒక పబ్లిక్ ప్లేస్‌లో బ్లాగ్ అవచ్చు మరోటి అవ్వచ్చు ఒక వ్యక్తిని కాక ఒక సమూహాన్ని ఒక వర్గాన్ని అనేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి. రాజు/నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఇది. మాట తూలకపోవటం.

"8.ఇస్లాం ఎడారుల్లో పుట్టింది అక్కడ ధాన్యం దొరకదు కాబట్టి జీవహింస చేయవచ్చు అన్నారు. బౌద్ధం పుట్టినచోట ధాన్యం దొరుకుతుంది కాబట్టి జీవహింస చేయరాదు అన్నారు. ఒక బ్రాహ్మణుడిని ఎడారిలోకి తీసుకెళ్ళిపోయామనుకోండి అక్కడ ఏమీ దొరక్క పోతే ఏం తింటాడు ? నేను బ్రాహ్మణుడిని కాబట్టి మాంసం తినను అంటాడా ? పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి. "

నిజంగా? పరిస్థితులని బట్టి సర్దుకుపోవాలా? శత్రువు కాలిని నాకితే ప్రాణభిక్ష పెడతాను అని పట్టుబడ్డ రాజుతో అంటే ఆ రాజేం చేస్తాడండి? శత్రువు కాళ్ళు నాకుతాడా? అదా "క్షత్రియ ధర్మం" ? నాకు తెలిసి ప్రాణం పోయినా దేశ మర్యాదనీ, పౌరుషాన్ని వదులుకోడు. క్షత్రియుల్లో కూడా రకాలున్నారా? బతికి బట్ట కడితే తర్వాత "పగ" తీర్చుకోవచ్చు అనుకుని ప్రాణం కోసం శత్రువు కాళ్ళు నాకేవాడు నా దృష్టిలో క్షత్రియుడు కాదు, నాయకుడు కాదు. కేవలం నక్కజిత్తుల వాడు. అలానే బతకటం కోసం మాత్రం ఇష్టం లేకపోయినా మాంసం తింటాను అనేవాడు బ్రాహ్మణుడు కాలేడు. బతికేది బ్రహ్మజ్ఞానం కోసమనీ, ఆ బతుకు బతకటానికి తింటాం తప్ప తినటానికి బ్రతకటం లేదని తెలియని వాడు బ్రాహ్మణుడే కాదు మనిషే కాదు.

"9.ఎడారుల్లో యుద్ధాలు ఎక్కువ , మగవారు ఎక్కువ సంఖ్యలో మరణిస్తారు కాబట్టి... ఒక మగవాడు ఎందరు స్త్రీలనైనా వివాహమాడవచ్చు అని ఇస్లాం లో చెప్పారు. ఒక స్త్రీ ఒకరినే వివాహమాడాలని హిందూ మతం చెపుతుంది. ఇపుడు ఒక స్త్రీ కి ఎన్ని సార్లు అయినా ప్రేమ పుట్టవచ్చు, స్నేహం కాదు ప్రేమ కాదు, మరోకటేదో ఉందని ముందు చెప్పిన సిద్ధాంతం కాదన్నారనుకోండి వళ్ళు మండుతుంది. అపుడు మత ఘర్షణలు జరుగుతాయి. బలం, బలగం ఉన్నాయనుకోండి మసీదు కూల్చేస్తారు, మా మతమే గొప్ప అని అంటారు. రాముడు చేయనిది రాముడి పేరు మీద వీళ్ళు చేస్తారు. ఎవరు నష్టపోయేది ? "

మీ లాజిక్కులు చాలా బావున్నాయి, నవ్వుకోటానికి. :) హిందూ మతం గురించి ముందు మీరు కాస్త తెలుసుకోవాలి. హిందూ మతం ఎప్పుడూ ఇలా చెయ్యాలి అలానే చెయ్యాలి అని చెప్పదండి. ఏది ఎలా ఎందుకు చేస్తే మంచిదో చెప్తుంది. అంతే. హిందూ ధర్మాన్ని పాటించేవాడు ఆ రకంగా చేస్తారు అంతే. అలానే ఒకరినే వివాహమాడాలన్న విషయం కూడా. ఎందుకంటే అలా ఒకరికి ఒక్కరే అయినప్పుడు కుటుంబం స్థిరంగా ఉంటుంది. కుటుంబ స్థిరత్వం సమాజ స్థిరత్వానికి, శ్రేయస్సుకి దోహదం చేస్తుంది. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమైనప్పుడు దేశం ఎలా ఉంటుందో చూస్తున్నాం కదా?
అయినా స్త్రీ ఒకరినే వివాహమాడాలని. లేదంటే వళ్ళు మండి మతఘర్షణలు జరుగుతాయని ఏ రకంగా లింకు పెట్టారు మీరు. శోభాడే నాకు తెలిసి ముగ్గురిని పెళ్ళి చేసుకుంది. ఎన్ని మతఘర్షణలు జరిగాయండి? ఏవైనా రెండు విషయాలు ముడిపెడుతున్నప్పుడు ఆ రెంటికీ కాస్త సామ్యం ఉండాలని మీకనిపించటం లేదు?

"10.మార్పు ఎపుడు మొదలైనా కొత్త ఆలోచనలను హేళన చేయటం, హింసాత్మకంగా ఎదురు తిరగడం, తర్కరహితంగా ప్రశ్నించడం, చివరగా తప్పదు కాబట్టి అంగీకరించడం జరుగుతాయి. కులం, గుణం, మతం ప్రాతిపదికగా కాకుండా మనిషి ఎంత కష్టపడితే అంత సుఖాన్ని కోరుకోవాలి, ఒకరి స్వేచ్చని హరించే హక్కు ఎవరికీ లేదు. సమసమాజం అంటే పైనున్న వాళ్ళని క్రిందికి లాగడం కాదు, క్రింద నున్న వారిలో productivity ని పెంచడం."

ఇదసలు పాయింట్ ఆఫ్ డిస్కషన్‌కి ఏమాత్రం సంబంధించనిది. కానీ బానే చెప్పారు. కానీ ఎందుకు చెప్పారు? ఇవన్నీ మీ సొంత స్టేట్మెంట్స్ కావు కదా? సమసమాజం స్టేట్మెంట్ తక్క? ఇంతకీ కిందవారిలో productivity పెంచితే సమసమాజం వచ్చేస్తుందా? productivityతక్కువయి కిందన ఉన్నారంటారా? ఒకవేళ కొంతమందికి ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి రానట్టు కొంతమందికి ఎంత నేర్పినా పని రాదు, వాళ్ళ productivity పెరగదు. మరి అప్పుడు? సమసమాజం అనగా పైనా కిందా తారతమ్యం లేకుండా not based on the productivity ప్రతి ఒక్కరు సమాజంలో సమమైన స్థానాన్ని పొందటం.

ఇకనించి జనాలు మీ నించి ఎటువంటి కమెంట్స్ ఆశిస్తారు అని కాకుండా కాస్త జ్ఞానవంతమైన వ్యాఖ్యలు చెయ్యగలరని ఆశిస్తున్నాను. మనిషిగా పుట్టినందుకు (ఏ వర్ణమైనా) జ్ఞానసముపార్జన ముఖ్యం కదండి మరి. :)

ఇంతకీ మీరు రమణగారి బ్లాగ్‌లో కమెంట్స్ ఎందుకు తీసేశారు నీహారిక గారూ?

Monday, November 21, 2011

శ్రీకాళహస్తీశ్వర దండకం

జయజయ మహాదేవ శంభో హరా శంకరా సత్యశివసుందరా నిత్య గంగాధరా ......
బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ ...... దయాసాగరా ......
భీకారారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షిసంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్ ......
దివ్య జపహోమతపమంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్ ......
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్ ...... దుష్టాత్ముడన్ ......
విశ్వరూపా ...... మహా మేరుచాపా ...... జగత్‌సృష్టి సంరక్ష సంహార కార్యత్కలాపా ......
మహిన్ పంచభూతాత్మవీవే కదా ...... దేవ దేవా ...... శివా ......
పృధ్వి జలవాయురాకాశ తేజోవిలాసా ...... మహేశా ...... ప్రభో ......

రంగుబంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా ...... కాశీపురాధీశ విశ్వేశ్వరా ......
నీలి మేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వరా ..... శ్రీశైల మల్లేశ్వరా .....
కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా ...... శ్రీరామలింగేశ్వరా ......
నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా ...... భీమేశ్వరా ......
దివ్యఫలపుష్పసందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా ...... శ్రీకాళహస్తీశ్వరా ...... దేవ దేవా ......
నమస్తే నమస్తే నమస్తే నమ: ......

చిత్రం : కాళహస్తి మహత్యం
గానం : ఘంటసాల గారు
సంగీతం : సుదర్శనం గారు, గోవర్ధనం గారు
సాహిత్యం : తోలేటి వెంకటరెడ్డి గారు

కార్తీకమాసం సోమవారం సందర్భంగా ......
ఈ పాటని ఘంటసాల గారు పాడినట్టు ఎవరైనా పాడగలరా? అందుకే ఆయనది గంధర్వగానం అంటారేమో. :)



వీడియో : ఇక్కడ

Thursday, September 29, 2011

అందని ద్రాక్ష అప్రజాస్వామ్యమా?

దొరక్క దొరక్క కాస్త టైం దొరికితే అది కాస్తా నిన్న ఒక చెత్త పోస్ట్ చదవటం లో వేస్ట్ చేసుకున్నాను. టూకీగా ఆ పోస్ట్ విషయం ఏంటంటే  భారత దేశం తప్ప ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉండేవాళ్ళకి దేశభక్తి ఉండదు. వాళ్ళకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. ఇంకా స్పెసిఫిక్ గా భారతదేశానికి సంబంధించి ఏ విషయము మాట్లాడకూడదు. ఎందుకంటే పరాయి దేశంలో బతుకుతున్నారు కాబట్టి. కానీ ఆ రాసినాయన, ఇంకా ఇటువంటి 'భావజాలం' ఉన్నవాళ్ళు మటుకు పరాయి దేశం నించి ఎటువంటి సిధ్ధాంతాన్నైనా తెచ్చుకుని దాని గురించి పేజీలకి పేజీలు చెత్త రాయచ్చు. పిసరంత అయినా అర్థం ఉందనిపిస్తోందా? నాకనిపించలేదు. అక్కడే కామెంట్ రాద్దామనుకుంటే అదేదో వారి బ్లాగు వారిష్టం అన్నారు. అందుకని ఇక్కడ ఇలా.

వారా పోస్ట్ లో అన్నది, నాకు చిర్రెత్తుకొచ్చింది ఇండియాలో చదువుకుని, ఇండియా డబ్బులతో పెరిగి అమెరికాకి దాస్యం చేస్తూ అమెరికా పౌరసత్వం కోసం తహతహలాడుతూ వగైరా వగైరా ...... ఈ చెత్త చాలా మంది అనగా/రాయగా విన్నాను/చూశాను. ఎప్పుడూ ఒకటే సామెత గుర్తొస్తుంది. "ఆడలేక మద్దెల ఓడినట్టు." భారతంలో పుట్టి అక్కడ చదువుకుంటే ఇంక అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండాలా? అలా ఉంటేనే దేశానికి సేవ చేసినట్టా? భారతంలో బతుకుతూ ఈ దేశం నాకేమిచ్చింది అని దేశాన్ని తిట్టిపోసేవాళ్ళు, పరాయి దేశపు సిధ్ధాంతాలు మన దేశకాలమాన పరిస్థితులకి నప్పుతాయా లేదా అని కూడా ఆలోచించకుండా కబుర్లు చెప్పేవాళ్ళు సేవ చేసినట్టా లేక పరాయి దేశంలో ఉండి కూడా దేశానికి ఏదో రకంగా ఉపయోగపడాలని తపన పడేవాళ్ళకున్నట్టా దేశభక్తి? ఇదివరకు మా వాళ్ళ దగ్గర ఒక డ్రైవర్ ఉండేవాడు. వాడు పిల్లల్ని కనటం తప్ప ఇంకే పని లేనట్టు కనేసి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాకేం చేసిందమ్మా, నేనెందుకు ఓటెయ్యాలి. నా పిల్లల్ని పోషిస్తోందా అని అడిగేవాడు. ఇష్టం వచ్చినట్టు కనేసావు, నీ పిల్లల్ని నువ్వే కదా పోషించుకోవాలి అంటే  నన్ను నా పిల్లల్ని ఈ ప్రభుత్వమే పోషించాలి అని వాదించేవాడు. అలా ఉంది వీళ్ళ వాదన కూడా.

భారతంలో చదువుకుంటే అక్కడే ఉద్యోగం చెయ్యాలి. ఇంక వేరే దేశాల్లో ఊడిగాలు చెయ్యకూడదనుకుంటే మరి గాంధి, నెహ్రూ ఇంకా వీళ్ళు పూజించే ప్రముఖుల్ని చాలా మందినే నిలదీయాలి కదా. మరి వాళ్ళందరూ ఇతర దేశాల్లో చదువుకుని భారతానికి తిరిగొచ్చినవారే కదా. మరి వీరి లెక్కన ఆ దేశానికి సేవ చెయ్యాలి కదా అక్కడ చదువుకున్నందుకు? లేదా ప్రాధమిక విద్య భారతంలో చేశారు కాబట్టి వాళ్ళని రెండు ఖండాలుగా నరికి ఒక ఖండం ఒక దేశానికి ఇంకో ఖండం ఇంకో దేశానికి ఋణం తీర్చుకోటానికి పంపించాలంటారా?

దేశానికి సేవ అక్కడ ఉండే చెయ్యక్కరలేదు. నా చుట్టుపక్కలే, ఇక్కడ ఉన్నవాళ్ళని చూస్తే భారతానికి ఏదో రూపం లో సేవ చేస్తూనే ఉన్నారు.  నన్నే తీసుకుంటే, నేను భారతంలో ఆరుగురు ఆడపిల్లలని దత్తత తీసుకుని చదివిస్తున్నాను. వచ్చే ఏడాది ఇంకో ముగ్గురు అమ్మాయిలని దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. అక్కడ ఉన్న నా ప్రాపెర్టీస్ కి ప్రతి సంవత్సరం టాక్స్ కడుతున్నాను. అక్కడ కొన్ని శరణాలయాలకి ప్రతి సంవత్సరం డబ్బులు పంపిస్తున్నాను. ఈ సంపాదించిన డబ్బులకి ఇక్కడ టాక్స్ కడుతున్నాను. ఇక్కడ చాలా తరచుగా డొనేట్ చేస్తుంటాను. పెంచిన దేశానికి, ఉంటున్న దేశానికి కొద్దో గొప్పో సేవ చేస్తున్నట్టే అనుకుంటున్నాను. భారతంలో ఉండి కూడా ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యచ్చు కానీ ఇక్కడ ఉండటం మూలాన పరిధి చాలా పెరిగింది. ఒక మామూలు ఉద్యోగం చేస్తూ తొమ్మిదిమంది ఆడపిల్లలని దత్తత తీసుకుని చదివించటం భారతంలో సులభమా? ఇది ఒక రకంగా స్త్రీ జనోధ్ధరణ కాదా? లేక తనకన్నా పెద్దదైనా వదిన్ని జాలిపడి పెళ్ళి చేసుకున్న మరిది చేసేది స్త్రీ జనోధ్ధరణ? ఇంతకీ అమెరికన్ భారతీయులని తిట్టిపోస్తూ రాతలు  రాసిన శేఖర్ గారు దేశానికి ఏ రకమైన సేవ చేశారో కాస్త చెప్పగలరా? ఇలాంటి రాతలు రాయటం తక్క? పరాయి దేశం లో ఉన్నంత మాత్రాన కని పెంచిన దేశానికి పరాయి అయిపోరు. ఎక్కడ పుట్టినవారు అక్కడ ఉండే ఋణం తీర్చుకోవాలి అనుకుంటే ఇంక హైదరాబాదులో చదువుకున్నవాళ్ళు అక్కడే ఉద్యోగం చేసుకోవాలి. బెంగుళూరు లేదా మరో ఊరు వెళ్ళకూడదు. అమలాపురం లో చదువుకున్నవాడు అక్కడే ఉండాలి. వెరసి బావిలో కప్పకు మల్లే తయారవ్వాలి. ఈ రాసినాయన లాగా. కాస్త చుట్టూ ప్రపంచాన్ని చూడండి. పరాయి దేశం వెళ్ళినా అక్కడ తమదైన అస్థిత్వాన్ని నిలుపుకుని ఆ దేశానికి, పుట్టిన దేశానికి పేరు తెచ్చిన గొప్పవారిని కాస్త గమనించండి.

మీరనే ఈ పరాయి దేశం అమెరికాలో ఎన్ని భారతీయులు స్థాపించిన సంస్థలున్నాయో తెల్సా? అవన్నీ భారతీయులకి/భారతదేశానికి ఎంతెంత మద్దతు ఇస్తుంటాయో తెల్సా? ఎన్ని సేవా సంస్థలున్నాయో తెల్సా? ఇక్కడ మా హిందూ స్వయం సేవక సంఘాలు ఎన్నెన్ని ఉన్నాయో అవి ఏ రకంగా మన దేశ గౌరవాన్ని నిలుపుతూ ఇక్కడి వాళ్లకి మన గొప్పదనం చెప్తూ ఎన్ని రకాలుగా సేవలు చేస్తున్నాయో తెల్సా? బీచెస్ క్లీన్ చెయ్యటంలో కానీ,
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ వాళ్లకి తోచినట్టుగా సేవ చేస్తారు. కానీ అస్థిత్వాన్ని కోల్పోరు.

 నిజమే ఇక్కడ గ్రీన్ కార్డ్ కోసం పౌరసత్వం కోసం తహతహలాడతారు. కొన్ని అదనపు సౌకర్యాలు సులభంగా దొరుకుతున్న చోట మనిషి ఆశ పడకుండా ఉంటాడా? అంత మాత్రాన దేశభక్తి లేనట్టా? భారతంలో మటుకు ఉన్న ఊళ్ళో కాక వేరే పెద్ద ఊళ్ళో జీతం, ఇంకొన్ని సౌకర్యాలు  ఎక్కువ ఇస్తారంటే వెళ్ళకుండానే ఉంటారా?

ఉన్న ఊరొదిలి ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైనా వెళ్ళేది పొట్టకూటి కోసం, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి మీద, ఏదో సాధించాలన్న తపన తీర్చుకోవటం కోసం.

అందని ద్రాక్ష పుల్లన. కరక్టే. కానీ అంత మాత్రాన భూమిలోంచి పుట్టిన తీగకి కాసిన పళ్ళు ఆ భూమికే అందనంత ఎత్తులో ఉన్నాయి అని తిట్టిపోయటం మూర్ఖత్వం. అంత ఎత్తున ఉన్నా ఆ పళ్ళు కిందకి భూమి వైపే వేళ్ళాడుతూ ఉంటాయి. వాటి వేళ్ళు అక్కడే ఉన్నాయని తెలుసు కాబట్టి, చాలామంది ఎన్.ఆర్.ఐల లాగా.

Friday, August 19, 2011

అందాల రాముడు ...... ఎందువలన దేవుడు?

ఇదిగో ఇందుకే ...... :)

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......
అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ...... ఎందువలన దేవుడు

తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను ......
తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేవుడు

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......

అంభవించదగిన వయసు అడవి పాలు చేసెను ......
అంభవించదగిన వయసు అడవి పాలు చేసెను
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి చేసెను
అందాల రాముడు అందువలన దేవుడు.

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ......

ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను ......
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను
ధర్మం కాపాడుటకా సతినే విడనాడెను
అందాల రాముడు అందువలన దేవుడు.

అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఇలలో మన దేవుడు ......

సినిమా : ఉయ్యాల జంపాల
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు గారు
సాహిత్యం : ఆరుద్ర
గానం : స్వర్ణలత

వీడియో : ఇక్కడ
ఆడియో : ఇక్కడ

"నన్నెందుకు వదిలేశావని ఆనాడే సీత రాముడిని అడిగుంటే" అని మైకుల ముందర అరిచే వాళ్ళందరు ఈ పాట వింటే బావుణ్ణు. బుధ్ధి వచ్చినా రాకపోయినా కాస్త పాపం అన్నా తగ్గుతుంది.