Friday, January 1, 2010
ఈ రోజు విశేషం (అంటే నిన్న) .....
హేమంత పౌర్ణమి. :) రాస్తున్నది ఈరోజైనా ఇంకా నడిరేయి కాబట్టి నిన్న అన్నట్టే కదా లెక్క. పుట్టినరోజంటే నా దృష్టిలో కొత్తసంవత్సరం అన్నట్టే. ఈ లెక్కన డిసెంబరు ముఫ్పై ఒకటిన హేమంత పౌర్ణమితో కొత్త సంవత్సరం మొదలైతే, వెనువెంటనే౨౦౧౦ సంవత్సరం కూడా మొదలైంది. ౨౦౧౦ నూతన సంవత్సరానికి ఇప్పుడే ఆర్భాటంగా ఆహ్వానం పలికి వచ్చాము. ఈ కొత్త సంవత్సర నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. సాధారణంగా న్యూఇయర్ రిజల్యూషన్స్ బ్రేక్ చెయ్యటానికే అంటారు కానీ నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. అవి బ్రేక్ చెయ్యకూడదన్నది ఇంకొక రిజల్యూషన్. ఇంక చూడాలి మరి. :)
Tuesday, August 25, 2009
పురుషాకృతివో స్త్రీవో ..... ఎవరివో నీవెవరివో .....
తిరుమల మందిర సుందరా పాట నాకు, మా అమ్మకి చాలా ఇష్టమైన భక్తి పాటల్లో ఒకటి. రాగం, భావం అత్యద్భుతంగా ఉంటాయి ఈ పాటలో.
ఆ మధ్య ఈ పాట MP3 దొరక్క గిలగిలలాడిన నాకు తన దగ్గర ఉందని చెప్పి వెంటనే పంపించిన నిషికి బోలెడు థాంక్స్ చెప్పుకోవాలి.
తిరు వీధుల మెరిసే దేవదేవుడు అని అన్నమయ్య పాడారేమో కానీ ఇలాంటి భక్తి పాటలు వినిపించే ప్రతి ఇంట్లో పలికించే ప్రతి హృదిలో ఆ దేవదేవుడు మెరుస్తూనే ఉంటాడు.
పాలకడలిలో పవళించిన ఆ లక్ష్మీవిభుడివో తెలీదు, వెండికొండపై నిత్యం ధ్యానంలో ఉండే అర్థనారీశ్వరుడివో తెలీదు, ముగురమ్మల మూలపుటమ్మవైన త్రిజగన్మాతవో తెలీదు కానీ కాంతులు చిందిస్తూ అందర్నీ ఆకర్షించే నీ ముఖబింబము ఒక్క ఘడియ చూసినా అదే ఈ జన్మకి చాలు (అనుకుంటాం కానీ ఆయన రూపం అయస్కాంతం కాదూ, అక్కడ ఉన్న వాలంటీర్స్ తోసెయ్యకపోతే గోవింద నామస్మరణ చేస్తూ ఆ దేవదేవుడి దర్శనం చేసేవారెవరైనా అక్కడినించి కదులుతారా ఘడియలు దాటినా?) నీ గుడి వాకిట దీపమై వెలుగుతూ ఒక్క రాత్రి మనగలిగినా ఆ సేవ చాలు స్వామీ నీ పాదపద్మాలపై పువ్వునై ఒక్క క్షణం నిలిచినా నా జన్మ ధన్యత కాంచును దేవదేవా.
ఈ పాట వినప్పుడల్లా మా తాతగారు రాసిన దేవదేవ మోక్షపథము తెల్పవేమిరా అన్న పాట గుర్తొస్తుంది. ఆ పాట కూడా నీవరివో తెలీదు, అఖరికి పురుషాకృతివో, స్త్రీవో కూడా తెలీదు అని వస్తుంది. భగవంతుడు వైష్ణవుడు అనీ, శైవుడు అనీ, హిందువనీ, ముస్లిం అనీ నానా విధాలుగా తిట్టుకుంటాం కొట్టుకుంటాం. కానీ ఆఖరికి ఆ భగవత్‌స్వరూపం స్త్రీ రూపమో, పురుష రూపమో తెలీదు, ఆ స్వరూపానికి ఒక రూపం ఉందో లేదో తెలీదు కానీ నేను గొప్ప నా దేవుడు గొప్ప అని జుట్టు జుట్టు పట్టుకోటానికి తయారైపోతాము.
మా అమ్మ చెప్పే మాట నాకెప్పుడు నచ్చుతుంది. ఒక ఆర్టిస్ట్ ని అందమైన అమ్మాయి బొమ్మ గీయమంటే తన దృష్టిలో అందమైన అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించి గీస్తాడు. అదే బొమ్మ ఇంకొక కళాకారుడిని గీయమంటే అతనూ అలానే ఊహించి గీస్తాడు. ఈ రెండు బొమ్మలు రెండు కళ్ళు ముక్కు నోరు ఉండటం తప్ప ఇంకెందులోనూ కలవవు. చూడకుండా ఊహించి గీసిన బొమ్మకి, చూడకుండా మనం ఊహించి మదిలో నిల్పుకుని పూజించే దేవుడికి తేడా ఉందా? నీళ్ళు గ్లాసులో పోస్తే అదే ఆకారాన్ని సంతరించుకుంటాయి. అవే నీళ్ళు గిన్నెలో పోస్తే గిన్నె ఆకారంలోనే కనిపిస్తాయి. అంతమాత్రం చేత అవి రెండు వేరే వేరే నీళ్ళు అనగలమా? గ్లాస్‌లో మినరల్ వాటర్ , గిన్నెలో టాప్ వాటర్ అని ఎవరైనా వితండవాదం చేస్తే ఎవరేం చెయ్యలేరనుకోండి. అది వేరే విషయం.
భగవంతుడు నిరాకరస్వరూపుడు అంటారు. కానీ మనం ధ్యానం కోసం వీలుగా ఆ దేవుడికి రూపం సృష్టించుకున్నాం. ఆ రూపాన్నే పూజిస్తున్నాం. కానీ అదే ఆయన శాశ్వత రూపం అని కనిపించే ఆయన ఇంకొక రూపాన్ని తిట్టిపోస్తాం. ఏంటో. ఇలా మాట్లాడానని నన్ను నాస్తికురాలిననో, కమ్యూనిస్ట్ టైపు ఆస్తికురాలిననో అనుకోకండి. నన్ను అల్లహ్ ఓ అక్బర్ అనమన్నా అంటాను కానీ నా రాముడిని పల్లెత్తు మాట అన్నా ఊరుకోను. ఆ నాలిక చీరెయ్యటానికి కత్తి పక్కన పెట్టుకునే తిరుగుతాను. :P

Sunday, July 19, 2009
తిరుమల మందిర సుందరా ..... సుమధుర కరుణాసాగరా .....
తిరుమల మందిర సుందరా .... సుమధుర కరుణాసాగరా .....
ఏ పేరున నిను పిలిచేనురా ..... ఏ రూపముగా కొలిచేనురా .....

పాలకడలిలో శేషశెయ్య పై పవళించిన శ్రీపతివో .....
వెండికొండపై నిండుమనముతో వెలిగే గౌరీపతివో .....
ముగురమ్మలకే మూలపుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తివో .....

కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును గడియైనా .....

నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలొక రేయైనా .....
నీ పదముల పై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైనా .....

సినిమా : సినిమా పాట కాదు. ప్రైవేట్ పాట
సాహిత్యం : దాశరధి గారు
గానం : ఘంటసాల గారు
ఆడియో : http://www.chimatamusic.com/search.php?st=tirumala+mandira

Tuesday, April 8, 2008
అవీ ..... ఇవీ ..... అన్నీ .....
మళ్ళీ బోల్డు రోజుల తర్వాత.
ఈ మధ్య రోజూ జల్సా పాటలు వింటున్నాను. మొదట విన్నప్పుడు, ఈ దేవిశ్రీప్రసాద్ ఆ బొమ్మరిల్లులో బందీ అయిపోయాడా, ఇంక బైటికి రాడా అని సందేహం వచ్చింది. ఒకే రకంగా అనిపించాయి పాటలు. తినగ తినగ వేము తీయగనుండు లాగా వినగా వినగా ఇప్పుడు ఓ మూడు పాటలు బానే ఉన్నాయనిపిస్తోంది. ఒక పాట మటుకు మొన్నటి వరకు 'హాంటింగ్' టైప్స్ లో వెంటాడింది. ఒక సందేహం అన్నమాట ఆ పాటలో. హీ ఈజ్ సైమన్ సునామీ అని పాట. అమెరికావాళ్ళు ఉప్పెనలకి కూడా అందమైన ఆడవాళ్ళ పేర్లు పెడుతుంటే మనవాళ్ళేంటి మగపేరు అదీ ఎంగిలిపీచు పేరు పెట్టారు సునామీకి అని డౌట్. సరే మనవాళ్ళకి అదో పిచ్చి అని డిసైడ్ అయ్యాను. మొన్నెందుకో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటే అర్థం అయింది. హీ ఈజ్ ఎ హ్యూమన్ సునామీట. :O ఈజ్, ఎ, హ్యూమన్ కలిప్పారేసరికి నాకట్టా వినిపించింది. :( ఈస్ అని పలికాడు పైగా. ఆ కలపటం, పలకటం వెరసి అయోమయం.
ఇలాంటిదే ఆ మధ్య ఇంకోటి.
పోకిరి సినిమాలో పాట ఇది. పెన్ దొరకగానే రారా అని పాడుతోంది పాడినావిడ. ఎన్ని సార్లు విన్నా పెన్ దొరగ్గానే రావటం ఏంటో ఒక పట్టాన అర్థం కాలేదు. సరే, దర్శక నిర్మాతలు ఎప్పుడూ చెప్తూండే ' సిట్యుయేషనల్ ' సాంగ్ అంటే ఇదేనేమో, హీరోయిన్ పెన్ పారేసుకుని, వెతికి కనబడగానే రమ్మని హీరోకి చెప్తూ పాడుతోందేమో అని ఊహించేసుకున్నాను (మన సినిమాల్లో ఇలాంటి సెన్స్ లెస్ సీన్లు చాలా మామూలు కదా అందుకే అలా ఊహించే ధైర్యం చేశా). తర్వాత అర్థం అయింది. 'పెందరకడనే రారా' అని.
వినికిడిలోపమా? ఏమో :(((((
పోకిరి అంటే ఇంకో పాట గుర్తొస్తోంది. జగడమే ..... సమరమే ట." ఆ దేవుడె దిగివస్తున్నా, ఆకసమే దిగిపడుతున్నా,బిన్ లాడెన్ ఎదుటే నిలుచున్నా " (ఇవి బానే వినిపించాయి, డౌట్లేమీ లేవు. :P కానీ .....) అర్థం ఉందా ఈ లైన్‌కి? దేవుడు దిగి రావటం, బిన్ లాడెన్ ఎదురుగా నించోవటం రెండూ ఒకటేనా? దేవుడు కనిపించకుండా సృష్టిని నడిపిస్తాడు. ఈ లాడెను ఎక్కడో దాక్కుని కనిపించకుండా అమాయకుల చేత విధ్వంసాలు చేయిస్తుంటాడు. కనిపించకపోవడం అన్నదే ఇద్దరి మధ్య కామను. అంతమాత్రాన ఈ దయ్యాన్ని తీసుకెళ్ళి దేవుడి గాటన కట్టేస్తారా? ఇద్దరూ సమానులే అన్న అర్థం వచ్చేలా రాస్తారా? నాకైతే అస్సలు నచ్చలేదు ఈ ముక్క.

Thursday, February 28, 2008
ఫెమినిస్టులు - పనికిమాలిన రాతలు
మొత్తానికి ఈరోజుకి తీరింది బ్లాగటానికి. ఇలా బ్లాగటం అంటుంటే వాగటం అన్నట్టు లేదు? రెంటికీ పెద్ద తేడా ఉన్నట్టు నాకైతే అనిపించదు. వాగుతున్నప్పుడు ఎదుట కూచున్న ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువమందో పాపం చెవులు మూసుకోలేక అదేదో సినిమాలో బ్రహ్మానందంలా దీనంగా మొహం పెట్టుకుని కూచునుంటారు. ఆ మొహాలు చూడలేక, చూసినా అమిత ఇష్టంగా ఇస్తున్న ఉపన్యాసరసధారని ఆపలేక వాగేవాళ్ళు కష్టాలు పడతారు. కొంతమంది ఆ మొహాలు చూసి ఆనందంతో వీరావేశంగా విజృంభిస్తారు. అది వేరే విషయం. కానీ బ్లాగేటప్పుడు ఆ కష్టాలు ఉండవు. ఇష్టం వచ్చినట్టు బ్లాగుకోవచ్చు. చదివేవాళ్ళు చదువుతారు. ఇష్టం లేనివాళ్ళు సింపుల్‌గా బ్రౌజర్ అనే పదార్ధాన్ని మూసేస్తారు. బోల్డుమంది చదివే ఉంటార్లే అన్న సంబరం బ్లాగరులదైతే, హమ్మయ్య తప్పించుకున్నాం అనే ఆనందం చదువరిది. కాకపోతే ఈ ఇష్టం వచ్చినట్టు అనే విషయం బ్లాగుల వరకే పరిమితం చేస్తే బానే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా బ్లాగ్స్ అనేవి వ్యక్తిగతమైనవి కాబట్టి. కానీ పబ్లిక్ సైట్స్ లో ఇష్టం వచ్చినట్టు రాసేసి నన్నెవ్వరూ ఏకకూడదో అంటే ఎలా కుదురుతుంది? ఈ మధ్య ఒక స్నేహితుడు చెప్తే ఎప్పుడు వెళ్ళే సైట్‌లోనే అంతగా ఎప్పుడూ వెళ్ళని ఆర్టికల్స్ సెక్షన్‌లో ఒక కవిత (అనబడే పనికిమాలిన రాత) చదివాను. కవయిత్రి అంతకుముందు రాసిన ఒక కవిత (అనబడే ఇంకో పనికిమాలిన రాత)కి వచ్చిన స్పందన భరించలేక తన ప్రతిస్పందన ఇంకో కవిత రూపంలో ఇచ్చిందన్నమాట.ఆవిడ బాధేంటంటే(లేదా గోల అనాలేమో) అసలీ భూమ్మీద ఆడదానికి వచ్చే కష్టాలన్నింటికీ కారణం మగవాడు అని. మగవాడన్న జీవి భూమ్మీద లేకపోతే స్త్రీ మహా సుఖంగా బతుకుతుంది అని ఆవిడ ఉవాచ. స్త్రీ స్వాభిమానానికి విలువ లేదని మహా దీనంగా చెప్పింది. అసలా కవితలో ఒక్క ముక్కన్నా అర్థవంతమైనది ఉంటుందేమో అని చాలా ఓపిగ్గా చివరివరకు చదివాను. చివరిలో ఆవిడ పేరు చూసి పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వచ్చింది. ఆ విషయం తర్వాత చెప్తాను. అసలు ఆవిడ వాదనలో రెండు పాయింట్లు ప్రస్ఫుటంగా కనిపించాయి.
1. స్త్రీల కష్టకారణం పురుషుడు.
2. స్త్రీ స్వాభిమానానికి విలువ లేదు.
మొదటి పాయింటు నాకెప్పుడు అర్థం కాదు. ఎందుకు ఎప్పుడు ఆడవాళ్ళ కష్టాలకి మగవాళ్ళని కారణభూతం చేస్తారు? మగవాడేనా ఎప్పుడూ భూతం, దయ్యం? ఎంతమంది తాటకి, శూర్పణఖలు లేరు? ఒకప్పుడు స్త్రీ చదువుకి దూరంగా ఉండటం కానేమి కుటుంబ పరిస్థితులు కారణం కానేమి సమాజం పోకడలు కానివ్వండి ఆడది ఒక అడుగు వెనక్కే ఉండవలసి వచ్చింది. కానీ కాలం మారింది. కాలంతో పాటు సమాజమూ మారింది. సమాజంతో పాటు మనుషులు మారుతున్నారు. నేటి స్త్రీ అడుగు పెట్టని చోటేది? తన సత్తా చాటని రంగం ఏది? గగనాంగనాలింగనోత్సాహియై అన్నట్టు ఆకాశం అందుకోవటానికి ప్రయత్నిస్తున్న ఈరోజుల్లో కూడా ఇంకా ఆడది దీనావస్థలో ఉందని దానికి కారణం మగవాడని ఎందుకు పాడిందె పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు వల్లిస్తారు? స్త్రీ పరిస్థితి పూర్తిగా మారిందని నేనూ అనను. కానీ ఒకప్పుడు 70-30 ఉంటే ఇప్పుడు 30-70 అయింది. మారిన స్థితికి సంతోషిస్తూ మారని జీవితాలని మార్పు వైపుకి తీసుకెళ్ళే ప్రయత్నం చెయ్యాలి అంతే కానీ కారణాలు ఎంచుతూ కూచుంటే ఒరిగేది ఏదీ లేదు. తన కాళ్ళ మీద నిలబడగలిగి సాటి స్త్రీని కూడా పైకి తీసుకురావాలని ప్రతి స్త్రీ కోరుకుంటే ఏ మగవాడు ఏమీ చెయ్యలేడు సాయం తప్ప.
ఇక రెండో పాయింటు స్త్రీ స్వాభిమానం. :) ఈ కవితవిక రాసిన రచయిత్రి ఆఖరికి తన సొంతపేరు మీద కూడ మనగలననే నమ్మకం లేని ఆవిడ. పేరు ముందు శ్రీమతి, పేరు తర్వాత భర్త పేరు అలంకారంగా పెట్టుకున్న మహానుభావురాలు. మరి ఆవిడ స్త్రీ స్వాభిమానాన్ని గురించి ఎలా మాట్లాడగలుగుతోందో నాకైతే అర్థం కాలేదు. పెళ్ళి కావాలి. ఆ పెళ్ళితో పాటూ వచ్చే సాంఘిక భద్రత, గౌరవం కావాలి. కానీ ఆ మొగుడనే మగవాడు అక్కరలేదు. ఏంటో వీళ్ళ లెక్కలు. ఇన్ని లెక్చర్లు ఇస్తారు పోనీ ఏమైనా కాంక్రీటుగా వెలగబెడతారా అంటే ఊహూ. మిసెస్ శ్రీరాం అనో మిసెస్ గోపాల్ అనో పిలిపించుకుంటూ చీర నలక్కుండా మైకులు విరగ్గొడుతుంటారు, కలంలో సిరా అవగొడుతుంటారు లేదా కీబోర్డ్ కీస్ చెడగొడుతుంటారు. రావణాసురుడికన్నా, లంఖినికన్నా పెద్ద పిశాచాలు వీళ్ళే. ఎప్పటికి బాగుపడతారో. వీళ్ళ మీద ఉపయోగించటానికి రెయిడ్ లాంటిది ఏదైనా ఎవరైనా కనిపెడితే బావుంటుంది. సమాజం బోల్డు బోల్డు బాగుపడిపోతుంది.

Sunday, January 27, 2008
నీ ఎదుట నేను వారెదుట నీవు
తేనె మనసుల్లో నీ ఎదుట నేను వారెదుట నీవు పాట నాకు నచ్చిన పాటల్లో ఒకటి. కొన్ని చిన్నతనంలో విన్న పాటలైనా ఎందుకో మనసుకి హత్తుకుపోతాయి. ఈ పాట అలాంటిదే. ఈ పాట సంగీతం, సాహిత్యం రెండు మంచి ముత్యాలైతే సాహిత్యం వైపు ఇంకొంచెం ఎక్కువ మొగ్గుతాను. మొదటి లైన్‌లోనే చూస్తే "నీ ఎదుట నేను వారెదుట నీవు" - నీ ఎదుట నేను అని తన విషయంలో మొదటి స్థానం చందమామకి ఇచ్చినా కాబోయే భర్త విషయం వచ్చేసరికి వారెదుట నీవు అనే అంటుంది ఆ అమ్మాయి. వారి ఎదుట నీవు అంటుంది చందమామతో. వారెదుట వీరున్నా, వీరెదుట వారున్నా, రెండూ ఒకటే అయినా భర్తకి మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాతే ఇంకెవరైనా అన్న ఆలోచన సాహిత్యంలో అంత సున్నితంగా చెప్పటం చాలా నచ్చింది నాకు. అఫ్‌కోర్స్ ఎదురుగా ఉండటం అంటే ముందు ఉండటం కదా సో చంద్రుడికే మొదటి స్థానం ఇచ్చినట్టు కదా అనచ్చు. పర్సెప్షన్ :) :p
ఎప్పటి నించో ఈ పాట కోసం వెతుకుతున్నాను. మరెందుకు ఆంధ్రావిలాస్‌లో కనిపించలేదో నాకు. :O
ఈ సినిమాలో నచ్చే ఇంకో పాట దివి నుండి భువికి. ఆ పాట సంగీతపరంగా ఇష్టం.

చందమామా ..... అందాల మామా .....
చందమామా ..... అందాల మామా .....
నీ ఎదుట నేను ..... వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు .....
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు .....
పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా .....
పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలినా సిగ్గొచ్చింది
కన్నుల దాకా కన్నులు పోక
మగసిరి ఎడదనె చూశాను .....
మగసిరి ఎడదనె చూశాను
తల దాచుకొనుటకది చాలన్నాను .....
నీ ఎదుట నేను ..... వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు .....
పెళ్ళిచూపులలో బిగుసుకొని
పేరేమి చదువేమి
ప్రేమిస్తావా వయసెంతా .....
పెళ్ళిచూపులలో బిగుసుకొని
పేరేమి నీ చదువేమి నను ప్రేమిస్తావా వయసెంతా
అని అడిగారా ..... అసలొచ్చారా .....
నాలో వారు ఏం చూశారో నావారయ్యారు .....
నాలో వారు ఏం చూశారో నావారయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంటా .....
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు .....
చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరివంటారు .....
చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరివంటారు .....
ఆ వెన్నెలలోని వేడిగాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను .....
అనుభవించి అనమంటాను
వయసుకు వైరివి నీవంటాను
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు .....
చందమామా ..... అందాల మామా .....
సినిమా : తేనె మనసులు
సంగీతం : కె.వి.మహదేవన్ గారు
సాహిత్యం : ఆత్రేయ గారు
గానం : పి.సుశీల గారు
ఆడియో : http://www.andhravilas.com/moviedetail.asp?fid=%7C48%7C75%7C133

Tuesday, January 22, 2008
హేమంతపు పౌర్ణమి
ఈరోజు హేమంతపు పౌర్ణమి. చిన్నప్పటినించి ఈ రోజంటే మహా ఇష్టం. అసలు ఈ రోజు చంద్రుడు నిండుగా, తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. అనటం కాదు కానీ కార్తీక పౌర్ణమి కన్నా ఈ రోజే చంద్రుడు తెల్లగా ఉంటాడు. అన్ని ఋతువుల్లోకి హేమంతం నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా జనవరి నెల. కొత్త సంవత్సరంతో మొదలు సంక్రాంతి ఈ నెలలోనే వస్తుంది. ఎగ్జిబిషన్ ఈ నెలలోనే మొదలవుతుంది (చిన్నప్పుడు అదొక పిచ్చి. ఇప్పుడంటే బోలెడు మాల్స్ గట్రా వచ్చాయి, ఇంకా ప్రపంచమంతా ఒక చిన్న గ్లోబల్ విలేజ్ అయింది కానీ చిన్నప్పుడు ఎక్కడెక్కడివి చూడాలంటే ఎగ్జిబిషనే.) నాకిష్టమైన నేను పుట్టిన హేమంతపు పౌర్ణమి ఈ నెలలోనే వస్తుంది. అందుకే ఇంకా ఇంకా ఇష్టం. ఆ మధ్యెప్పుడో మా మావయ్య నా జాతకం చూస్తానని చెప్పి కిందా పైనా కాగితం తిరగేసి ఇంకే విషయం చెప్పలేదు కానీ నువ్వెందుకింత తెల్లగా ఉంటావో తెలిసిందే, పౌర్ణమి రోజు పుట్టావు కదూ అందుకు అన్నాడు. మరి అమావాస్య రోజు పుట్టినవాళ్ళందరు నల్లగా పుడతారా అని నాకొక అనుమానం తదనంతరం బోల్డు ఆవేశం కలిగాయి. మరి ఏదో భవిష్యత్తు చెప్పేస్తాడని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని గంటసేపటి నించి కూచునుంటే ఆ విషయమా చెప్పేది.
ఈరోజు సాయంత్రం కూడా నిండు చందమామని చూసి ఈ రోజే ఎక్కువ మెరుస్తున్నాడు అని కన్‌ఫర్మ్ చేసేసుకుని కాసేపు చంద్రుడితో కబుర్లు చెప్పి వచ్చాను. మరి చంద్రుడు నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కదా. :p

Tuesday, January 15, 2008
స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ .....
పాటలు వింటూ పడుకోవటం చాలా చెడ్డ అలవాటు. అదీ లాప్‌టాప్‌లో వింటూ పడుకోవటం చాలా చాలా చెడ్డ అలవాటు. :( లాప్‌టాప్ మానిటర్ విరక్కొట్టాక అయింది ఈ జ్ఞానోదయం. ఇంత సున్నితంగా ఉంటాయేంటో ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు. హు. మళ్ళీ ఖరీదు చూస్తే ఆకాశంలో విహారం.
పైకి కనిపించని పగులు, పోలీసు దెబ్బల్లా. :((( అసలా పగలటం కూడా కళాత్మకంగా పగిలింది. ఒక పక్క అంతా తెల్లగా మధ్యలో కోడిగుడ్డు ఆకారంలో నల్లగా ఆ నలుపు మధ్యలో పొడుగ్గా పెద్ద పగులు గీతలు కింద అడ్డంగా చిన్నవి. అచ్చం చిన్నప్పుడు టి.విలో స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ అంటూ పైనించి కిందకి దూకుతూ క్లోజప్పులో చూపించే మొహమే. (అంటే ఇప్పటి స్పైడర్ మాన్ మొహం అలా ఉండదా అంటే అలానే ఉంటుంది కానీ చిన్నప్పటి జ్ఞాపకాలే గుండెకి దగ్గర కదా సో టక్కున అవే గుర్తొస్తాయన్నమాట. ఇప్పుడు బాగా ఇష్టమైనది ఏది అంటే పిజ్జా విత్ అలపెన్యోస్ అని చెప్పే ఛాన్స్ తక్కువ కదా చిన్నప్పుడు తిన్న మినప రొట్టె విత్ ఆవకాయ అని చెప్పే కన్నా. అలాగన్నమాట.
ఏతావాతా విషయం ఏంటంటే ప్రస్తుతం స్క్రీన్‌కి ఒక పక్క ఏమవుతోందో మటుకే తెలుస్తోందన్నమాట. రెండోవైపంతా
స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ డస్ వాట్ ఎవర్ ఎ స్పైడర్ కాన్
స్పిన్స్ ఎ వెబ్, ఏని సైజ్ కాచెస్ థీవ్స్ జస్ట్ లైక్ ఫ్లైస్
లుక్ ఔట్ హియర్ కమ్స్ ద స్పైడర్ మాన్ .....

Subscribe to:
Posts (Atom)