ఎక్కడో మైళ్ళ దూరంలో నువ్వు
అయినా నా మనసుకి నాకన్నా దగ్గర అనిపిస్తావు
నిరంతరం నిరీక్షణ
అనుక్షణం నీ ఆలోచన
ఈ భావనకి పేరేం పెట్టను?
ప్రేమ? మరీ సాధారణంగా లేదూ
ఆరాధనా? ఉహు సినిమా పేరు
భక్తి? ఊహూ పాతకాలం పేరు
ఈ భావనకి బీజం నాటిన నువ్వే పేరు కూడా పెట్టు
అది నాకు నచ్చుతుంది ఎందుకంటే
నా మనసుకి నా కన్నా నువ్వే కదా దగ్గర
Friday, November 30, 2007
అస్థిత్వం
నీ రుచులు, అభిరుచులు
నీ ఇష్టాలు, నీ కోపాలు
నీ ఆత్రాలు, ఆరాటాలు
కోరికలు, నీ ఉబలాటాలు
వీటి మధ్య నా అస్థిత్వం ..... ఒక ప్రశ్నార్థకం

Tuesday, November 20, 2007
నమ్మకం - విశ్వాసం
గొంతు తీగలా సాగింది అంటే ఏంటో ఈ పాట వింటే బాగా తెలుస్తుందేమో. లేరు లీలసుశీలకు సాటి సరి గాయనీమణులు ధారుణిలో అనవచ్చునేమో. :)
నాకు లవకుశలో ఇష్టమైన ఇంకో పాట. పసివాళ్ళైనా ఆ పిల్లలకి ఎంత నమ్మకం వారి మీద. తల్లి దీవెన ఉంటే ఎంతటి కష్టసాధ్యమైన పనైనా చెయ్యగలం అన్న నమ్మకం. పెద్దవారి దీవెనల మీద ఎంతమందికి ఆ నమ్మకం ఉంటుంది? ఇదివరకు ఏ పనికి బయలుదేరేముందైనా ఇంట్లో పెద్దవారికి నమస్కరించి వెళ్ళేవారట. వారి దీవెనలు ఉంటే బైల్దేరిన పని సవ్యంగా అవుతుందని నమ్మకం. ఆ నమ్మకంతోనే ఓటమెరుగని రవికులశేఖరుడిని ఓడించగలమనే విశ్వాసమేమో ఆ పసికూనలకి. పెద్దవాళ్ళ పాదాలకి నమస్కారం చెయ్యటం, అక్షింతలు వేయించుకోవటం వెనక పరమార్థం ఇదేనేమో. ఎవరి దీవెనలు ఎలా ఫలిస్తాయో, నమ్మకం ఉండాలి అంతే. :)

లేరు కుశలవుల సాటి .....
లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో .....

తల్లి దీవెన తాతయ కరుణ వెన్ను కాయగా వెరువగనేలా .....
తల్లి దీవెన తాతయ కరుణ వెన్ను కాయగా వెరువగనేలా
హయమును విడువుముగా .....
లేరు కుశలవుల సాటి .....
బీరములాడి రాముని తమ్ములు దురమున మాతో నిలువగలేక .....
బీరములాడి రాముని తమ్ములు దురమున మాతో నిలువగలేక
పరువము మాసిరిగా .....
పరువము మాసిరిగా .....
లేరు కుశలవుల సాటి .....
పరాజయమ్మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేమి .....
పరాజయమ్మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేమి
యశమిక మాదేగా .....
యశమిక మాదేగా .....
యశమిక మాదేగా
లేరు కుశలవుల సాటి ..... సరి వీరులు ధారుణిలో .....

Sunday, November 11, 2007
ప్రేమ - స్వార్థం - అనుమానం
లవకుశలో సందేహించకుమమ్మా పాట అంటే నాకూ, మా అమ్మకి బాగా ఇష్టం. పాట సాహిత్యం, సంగీతం, ఘంటసాల గానం ఒక ఎత్తు అయితే ఆ పాటలో నమ్మకం, భక్తి ఇంకొక ఎత్తు. ఒక్కోసారి మనకి ఎదుటి మనిషి గురించి ఎంతో తెలుసు అనుకుంటాం కానీ కొన్ని సందర్భాలలో అసలు మనకేం తెలుసు అని మనలని మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఎంతో తెలిసిన మనిషిలోనే మనకి ఏమీ తెలియని మరో కోణం ఉండవచ్చు. మనం బాగా అర్థం చేసుకున్నాము అనుకున్న వ్యక్తి మనకి పూర్తిగా అర్థం కాకపోనూవచ్చు.
సీత రాముడికి అత్యంత సన్నిహితంగా మసిలిన వ్యక్తి. ఆయన సగభాగంగా ఆయన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. కానీ ఆవిడ కూడా లిప్తకాలం రాముడిని అనుమానించింది.
వాల్మీకి రాముడిని ఆయన ఊహాలోకంలో తప్ప చూడని వ్యక్తి. కానీ రాముడు ఎటువంటివాడో, ఆయన నమ్మకాలేమిటో, ఆయన వాటిని ఆచరణలో ఏ విధంగానూ తప్పడని పూర్తిగా నమ్మిన వ్యక్తి. రాముడు ఇచ్చిన మాట తప్పడనీ, ఒకసారి వదిలిన రామబాణానికి తిరుగులేదనీ, రాముడు పరస్త్రీని కన్నెత్తి చూడడనీ, ఆకాశం విరిగి మీద పడ్డా చలించడనీ, తన వ్రతానికి ఎట్టి పరిస్థితులలోనూ భంగం కలగనివ్వడనీ సంపూర్ణంగా నమ్మిన మనిషి. ఆ నమ్మకంతోనే రాముడు అశ్వమేథయాగం చేస్తున్నా ఏకపత్నీవ్రతభంగం కానివ్వడని నమ్మాడు.
కానీ సీత అనుమానించటంలో తప్పు లేదేమో. వాల్మీకికి రాముడి పట్ల ఉన్నది భక్తి, భక్తితో కలిగిన ప్రేమ. ఆ ప్రేమ విశ్వజనీనమైనది. రాముడు తనకొక్కడికే కాదు, పూర్తి జగత్తుకి చెందినవాడనీ, ఆయనని ప్రేమించే హక్కు, ఆయన ప్రేమ పొందే హక్కు అందరిదీ అని నమ్మినవాడు. కానీ సీతది విశ్వజనీనమైన ప్రేమ కాదు. ఒక భార్యగా తన భర్త తనకే సొంతం అన్న కోరిక, విశ్వాసం. స్వార్థమేనేమో కానీ భార్యభర్తల ప్రేమలో స్వార్థానికి చోటు ఉండటంలో తప్పు లేదేమో. భార్యగా, భర్తగా జీవితభాగస్వామి ప్రేమ పూర్తిగా తనకే చెందాలి అని స్వార్థపడటం తప్పు కాదేమో. ఆ స్వార్థంలో కించిత్ అనుమానం సహజమేనేమో. :)

సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....

సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా
సందేహించకుమమ్మా .....
ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ .....
ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా .....
మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా .....
సందేహించకుమమ్మా .....
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు .....
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా .....
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా

డెమోక్రసీ అంటే?
హ్మ్మ్మ్మ్మ్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. జరిగేది ఊహించటంలో సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే అసలు ముందు జరగబోయేది తెలిస్తే జీవితం రసవంతమనిపించుకుంటుందా? జరగబోయేవి అన్నీ మనిషి అధీనంలోనే ఉండిపోతాయి. చావుపుట్టుకలని కూడా మనిషే కంట్రోల్ చేస్తాడు. విధివిధానాలని కూడా మనిషే మార్చేస్తాడు. ఏదీ తన అధీనంలో లేనప్పుడే మనిషి బుధ్ధి వెర్రి తలలు వేస్తుంటే ఇక అన్నీ చెయ్యగలిగిననాడు మనిషి బుధ్ధి ఎటు మళ్ళుతుందో. అందుకే భగవంతుడు భవిష్యత్తుని ఎప్పుడు ఒక పజిల్‌లానే ఉంచాడు. గుప్పిట మూసి ఉన్నంతవరకే అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆత్రం, తపన, ఆరాటం, ప్రయత్నం. అదే గుప్పిట తెరిస్తే నిరాసక్తత, నిర్లిప్తత ..... ఇది కాదుగా జీవితం అంటే.
మనిషి ఎప్పుడు తను ఊహించినదే రైట్ అని, తను అనుకున్నవన్నీ జరగాలనుకుంటాడు. ఆశించినది జరగకపోతే నిరాశ చెంది తనకి అన్యాయం చేశాడని భగవంతుడిని వచ్చిన నాలుగు తిట్లు తిడతాడు. అన్యాయం చేశాడని, చేసిన పూజలకి ఫలితం దక్కలేదని బాధపడతాడు. ఒక కోర్ట్ కేస్‌లో వాది, ప్రతివాది ఇద్దరిలో ఒక్కరే కేస్ గెలవచ్చు. ఒకరి ఓటమి తప్పనిసరి. ఒకరికి మంచి అనిపించినది ఇంకొకరికి చెడు అనిపించవచ్చు. ఒకరికి సరి అయినది ఇంకొకరికి తప్పు కావచ్చు. ఏదో పాటలో అన్నట్టు ఒకరికి మోదం మరియొకరికి ఖేదం అని ఒకరికి ఆనందం కలిగించిన విషయమే మరియొకరికి దు:ఖాన్ని కలిగించవచ్చు. దానికి భగవంతుడిని నిందించటం న్యాయమా? భగవంతుడికి ప్రీతిపాత్రులు అంటూ ఉంటారా? ఆయనకి అందరూ ఒకటే. రాజధర్మం కూడా అదే చెప్తుంది. రాజుకి ఉండవలసిన ప్రథమ లక్షణం ఆశ్రిత పక్షపాతం లేకపోవటం. అందరినీ సమానంగా చూడటం. రాముడు చేసినది కూడ అదే. అందుకే అల్పుడైన చాకలివాడి మాటని కూడా మన్నించాడు. లక్ష్మణుడికి సరి అనిపించినది చాకలివాడికి అనిపించలేదు. కానీ లక్ష్మణుడు ఎలా సాకేతపురంలో పౌరుడో చాకలివాడు అంతే. అల్పుడైన చాకలివాడు, వాడి మాటకి విలువిచ్చేది ఏంటి అని రాముడు తీసిపారెయ్యలేదు. ఆ అల్పుడి మాటకి కూడా విలువనిచ్చాడు. మామూలు స్త్రీ మీద ఆ నింద వేసి ఉంటే ఆయన ఇంకోరకంగా ఆలోచించేవాడేమో కానీ ఆ నింద పడింది రాజ్యపు పట్టపురాణి మీద. రాముడు అప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఆయన పక్షపాతి అని ప్రజలు అనుమానం పడే అవకాశం ఉంది. రాజు నిర్ణయాల మీద విశ్వాసం తొలిగిపోయే అవకాశం ఉంది. అగ్నిపునీత సీత. ఆవిడ పాతివ్రత్యాన్ని ఇంకే రకంగా ఆయన నిరూపించగలడు? రాజుగా ఆ నిర్ణయం తీసుకోవటం తప్పనిసరి. అందుకే ఆయన రాజ్యం వద్దు, నా భార్యని తీసుకుని అడవులకి పోతానన్నా ఏ ఒక్కరు ఒప్పుకోలేదు. ఇంక రాజుగా ఆయన చేయగలిగింది ఏముంది? నాకు ఒక్కటే అర్థం కాదు. రాముడిని అంత తేలిగ్గా మాటలనేస్తారే, సీతని అడవులకి పంపించేసి ఆయన బాగుపడింది ఏముంది? ఇంకో పెళ్ళి చేసుకున్నాడా? సుఖంగా ఉన్నాడా? తను మాట ఇవ్వకపోయినా తన తండ్రి ఇచ్చిన మాట కోసం ఆ తండ్రి పోయినా అరణ్యవాసం చేసాడే. కొడుకంటే ఇలానే కదా ఉండాల్సింది. భార్యని అమితంగా ప్రేమించి ఆవిడని రావణాసురుడు ఎత్తుకుపోతే యుధ్ధం చేసి ఆవిడని చెరనించి విడిపించాడు. ఆవిడ అరణ్యవాసానికి వెళ్ళిపోయినా ఇంకొక స్త్రీ వంక కన్నెత్తి చూడలేదు. భర్త అంటే ఇంత ప్రేమానురాగాలతో ఉండాలనే కదా కోరుకునేది. రాజుగా ధర్మపాలన చేసి ఒక చాకలివాడి మాటకి కూడా విలువిచ్చి భార్యని దూరం చేసుకున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయాడు, నష్టపోయాడు. కానీ నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో చేసి చూపించాడు. రాజంటే ఇలా కాదూ ఉండాల్సింది? రాజ్యంలో ప్రతి ఒక్కరి మాటకి విలువ ఉందంటే, అదే కదా ప్రజారాజ్యం అంటే, ఇది కాదా డెమోక్రసీ అంటే?

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు .....

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు

కంచెయె నిజముగ చేను మేసినా కాదనువారెవరు
రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించువారెవరు

కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా
సాధ్వులకెపుడు వెతలేనా తీరని దు:ఖపు కథలేనా

ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా
వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా

ఎండ కన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు
తరచి చూచినా బోధపడవులే దైవచిద్విలాసాలు

అగ్నిపరీక్షకె నిల్చిన సాధ్విని అనుమానించుట న్యాయమా
అల్పుని మాటయె జనవాక్యమ్మని .....
అల్పుని మాటయె జనవాక్యమ్మని అనుసరించుటే ధర్మమా

ఎవరూహించెదరు .....

Friday, November 9, 2007
శ్రీరామ సుగుణధామా .....
రామ సుగుణధామా రఘువంశజలధిసోమా .....
శ్రీరామ సుగుణధామా .....సీతామనోభిరామా సాకేతసార్వభౌమా .....
శ్రీరామ సుగుణధామా .....
మందస్మిత సుందర వదనారవింద రామా
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా
మందార మరందోపమ మధురమధురనామా .....
మందార మరందోపమ మధురమధురనామా
శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా .....
శ్రీరామ సుగుణధామా .....
అవతారపురుష రావణాది దైత్యవిరామా
నవనీత హృదయ ధర్మనిరతరాజలలామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా .....
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా
శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా .....
సీతామనోభిరామా ..... సాకేతసార్వభౌమా .....
సీతామనోభిరామా .....

Subscribe to:
Posts (Atom)